![Motorola launches Moto G10, Moto G30 smartphones in India - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/9/motorola.jpg.webp?itok=C5R0UKsN)
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. మోటరోలా జీ సిరీస్‌లో మోటో జీ10పవర్, మోటో జీ 30పేర‍్లతో బడ్జెట్ ధరలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను మంగళవారం లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు స్టాక్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేస్తాయనికంపెనీ తెలిపింది.అలాగే మాలావేర్,, ఫిషింగ్ ఇతరసైబర్ దాడుల నుంచి వ్యక్తిగత డేటాను రక్షించే విషయంలో నాలుగు పొరల భద్రతను అందించే మొబైల్ టెక్నాలజీ కోసం థింక్‌షీల్డ్‌తో తీసుకొచ్చినట్టు మోటరోలా ప్రకటించింది. అలాగే బిగ్ డిస్‌ప్లే, బిగ్ బ్యాటరీ, క్వాడ్ రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మోటో జీ10 పవర్
6.5 అంగుళాల మాక్స్ విజన్ హెచ్‌డీ + డిస్‌ప్లే.
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ఆక్టా-కోర్ ప్రాసెసర్
720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్
48+ 8+ 2+2 రియర్ క్వాడ్ కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
1 టీబీ జీబీ వరకు విస్తరించుకునేఅవకాశం
6000 ఎంఏహెచ్ బ్యాటరీ
మోటో జీ 30
6.5 అంగుళాల మ్యాక్స్ విజన్ డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ఆక్టా-కోర్ ప్రాసెసర్
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
1 టీబీ జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
64+8+2+2ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా
13 ఎంపీ సెల్ఫీకెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధరలు, లభ్యత
మోటో జీ 10 పవర్ మార్చి 16, మధ్యాహ్నం 12 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకం.
అరోరా గ్రే, బ్రీజ్ బ్లూ కలర్లలో లభ్యం. ధర రూ. 9,999.
మోటో జీ 30 మార్చి 17, మధ్యాహ్నం 12 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. డార్క్ పెర్ల్, పాస్టల్ స్కై కలర్లలో లభ్యం. ధర రూ. 10,999
Comments
Please login to add a commentAdd a comment