![Motorola announces Moto G72 in India - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/5/Moto%20G72%20in%20India.jpg.webp?itok=NZVeJpXm)
న్యూఢిల్లీ: మోటరోలా ‘మోటో జీ72’ పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను ముందుగా భారత మార్కెట్లో ఆవిష్కరించడం గమనార్హం. ఇది 10 బిట్, 6.6 అంగుళాల 120 గిగాహెర్జ్ పీవోఎల్‌ఈడీ డిస్‌ప్లే, 576 హెర్జ్ శాంప్లింగ్ రేటు, 1.07 బిలియన్ షేడ్స్ కలర్‌తో వచ్చిన తొలి ఫోన్. దీన్ని ప్రీమియం డిస్ ప్లేగా చెప్పుకోవాలి. వెనుక భాగంలో 108 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది.
5జీ టెక్నాలజీ విస్తరణకు ఇంకా సమయం ఉన్నందున, 4జీ కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రీమియం ఫీచర్లతో జీ72 ఫోన్‌ను అందుబాటు ధరకే అందిస్తున్నట్టు మోటరోలా ఎలిపింది.
ఈ ఫోన్ 7.99 ఎంఎం మందంతో, 166 గ్రాముల బరువు ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ99 6 ఎన్‌ఎం చిప్‌సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ టర్బోపవర్ చార్జర్‌తో వస్తుంది. దీని ధర రూ.18,999. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1,000 డిస్కౌంట్‌కు తోడు, ఫోన్ ఎక్సేంజ్‌పై రూ.3000 అదనపు డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment