Motorola Phones
-
మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్‌కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే!
Motorola Edge 40: ఈ ఏడాది తమ మొదటి ఫ్లాగ్షిప్ ఫోన్ మోటరోలా ఎడ్జ్ 40 (Motorola Edge 40)ని మోటరోలా కంపెనీ మే 23న భారత్‌లో లాంచ్ చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను తాజాగా వెల్లడించింది. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. లాంచ్‌కు ముందే మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్‌ను వెల్లడిస్తూ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో తన అధికారిక పేజీని కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది. ఇందులో ఫాక్స్ లెదర్ లాంటి కవర్‌తో ఉన్న గ్రీన్ వేరియంట్ దర్శనమిస్తోంది. అలాగే బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్ గత సంవత్సరం మార్కెట్లోకి వచ్చిన మోటరోలా ఎడ్జ్ 30 ప్రో, ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఫోన్లకు కాస్త అటూఇటుగా ఉంటుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్‌తో 6.5 అంగుళాల కర్వ్డ్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, HDR10+ సపోర్ట్‌తో POLED ప్యానెల్ మీడియాటెక్ (MediaTek) డైమెన్సిటీ 8020 SoC 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టేరేజ్ 50 ఎంపీ రియర్ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4,440mAh బ్యాటరీ, 68 వాట్ల వైర్డు ఛార్జింగ్, 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, త్వరలో ఆండ్రాయిడ్ 14 స్పెసిఫికేషన్ల ఆధారంగా ఫోన్ ధర సుమారు రూ. 45,000 ఉంటుందని అంచనా ఇటీవల విడుదలైన మరిన్ని ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల గురించిన సమాచారం కోసం సాక్షి బిజినెస్ పేజీని చూడండి. -
మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ బ్రాండ్ మోటరోలా తాజాగా ఎడ్జ్ 30 ఫ్యూజన్ స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచంలో తొలిసారిగా వివా మజెంటా రంగులో ఈ 5జీ ఫోన్‌ను రూపొందించింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888ప్లస్ చిప్సెట్, 6.55 అంగుళాల 144 హెట్జ్, 10–బిట్ పాలిమర్ ఆర్గానిక్ ఎల్ఈడీ (పోలెడ్) డిస్ప్లే, 13 ఎంపీ అల్ట్రావైడ్ ప్లస్ మాక్రో షూటర్‌తో 50 ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మెయిన్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 68 వాట్ టర్బోపవర్ చార్జర్‌తో 4400 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. 13 రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ప్రారంభ ఆఫర్ ధర రూ.39,999. -
Motorola Moto G72: అదిరిపోయే ఫీచర్లతో మోటరోలా జీ72
న్యూఢిల్లీ: మోటరోలా ‘మోటో జీ72’ పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను ముందుగా భారత మార్కెట్లో ఆవిష్కరించడం గమనార్హం. ఇది 10 బిట్, 6.6 అంగుళాల 120 గిగాహెర్జ్ పీవోఎల్ఈడీ డిస్ప్లే, 576 హెర్జ్ శాంప్లింగ్ రేటు, 1.07 బిలియన్ షేడ్స్ కలర్‌తో వచ్చిన తొలి ఫోన్. దీన్ని ప్రీమియం డిస్ ప్లేగా చెప్పుకోవాలి. వెనుక భాగంలో 108 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. 5జీ టెక్నాలజీ విస్తరణకు ఇంకా సమయం ఉన్నందున, 4జీ కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రీమియం ఫీచర్లతో జీ72 ఫోన్‌ను అందుబాటు ధరకే అందిస్తున్నట్టు మోటరోలా ఎలిపింది. ఈ ఫోన్ 7.99 ఎంఎం మందంతో, 166 గ్రాముల బరువు ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ99 6 ఎన్ఎం చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ టర్బోపవర్ చార్జర్‌తో వస్తుంది. దీని ధర రూ.18,999. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1,000 డిస్కౌంట్‌కు తోడు, ఫోన్ ఎక్సేంజ్‌పై రూ.3000 అదనపు డిస్కౌంట్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. -
అదిరిపోయే ప్రాసెసర్‌తో విడుదలైన మోటరోలా ఎడ్జ్ 30 ప్రో మొబైల్..!
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటరోలా తన ప్రీమియం ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను నేడు(ఫిబ్రవరి 24) మన దేశంలో విడుదల చేసింది. ఈ కొత్త మోటరోలా ఫోన్ గత ఏడాది తీసుకొచ్చిన మోటరోలా ఎడ్జ్ 20ప్రోకు కొనసాగింపుగా తీసుకొని వచ్చారు. ఈ మోటరోలా ఎడ్జ్ 30 ప్రో మొబైల్144హెర్ట్జ్ పివోఎల్ఈడి డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 68డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్'కి కూడా సపోర్ట్ చేస్తుంది. విండోస్ 11లో వీడియో కాన్ఫరెన్స్ కోసం దీనిని వెబ్ క్యామ్'గా వాడుకోవచ్చు. మోటరోలా ఎడ్జ్ 30ప్రో అసుస్ రోగ్ ఫోన్ 5, వివో ఎక్స్70 ప్రో, ఐక్యూ 9 సిరీస్ వంటి వాటికి పోటీనిస్తుంది. మోటరోలా ఎడ్జ్ 30 ప్రో ధర: మోటరోలా ఎడ్జ్ 30 ప్రో 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.49,999 ధరకు విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఫ్లిప్ కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఎస్బిఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు మోటరోలా ఎడ్జ్ 30 ప్రోపై రూ. 5,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా జియో వినియోగదారులకు రూ.10,000 విలువైన ప్రయోజనాలు కూడా ఉంటాయి. మోటరోలా ఎడ్జ్ 30 ప్రో ఫీచర్స్: 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ OLED డిస్ప్లే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఉంది. మూడు బ్యాక్(50 ఎంపీ + 50 ఎంపీ + 2 ఎంపీ) కెమెరాలు ఉన్నాయి. ఇందులో 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఎడ్జ్ 30 ప్రోలో 4,800 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది. 68 డబ్ల్యు టర్బోపవర్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్'కి సపోర్ట్ చేస్తుంది. (చదవండి: ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్ చేయండిలా..!) -
194 ఎంపీ కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో మోటోరోలా నుంచి సూపర్ ఫ్లాగ్షిప్ మొబైల్..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా సరికొత్త ఫ్లాగ్షిప్ మొబైల్ ను లాంచ్ చేయనుంది. మోటోరోలా ఫ్రంటియర్ (Motorola Frontier) పేరుతో రానున్న ఈ మొబైల్‌కు సంబంధించిన పలు ఫీచర్స్ లీకయ్యాయి. మోటోరోలా ఫ్రంటియర్ మొబైల్ 194 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో రానునుట్లు సమాచారం. తొలుత 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుందని ముందుగా అంచనాలు వచ్చాయి. అలాగే 144హెట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో రానుంది. ఈ మొబైల్‌కు సంబంధించిన వివరాలను టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ వెల్లడించారు. Motorola Frontier స్పెసిఫికేషన్లు (అంచనా) 6.67 ఇంచుల ఫుల్ హెచ్డీ+ OLED డిస్ప్లే విత్ 144 హెట్జ్ రిఫ్రెష్ రేట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 అప్‌గ్రేడెడ్ వెర్షన్ చిప్సెట్ LPDDR5 12జీబీ ర్యామ్ 194 ఎంపీ+50 ఎంపీ +12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 60 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4500mAh బ్యాటరీ 125వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ 50 వాట్ల వైర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు వైఫై 6ఈ యూఎస్బీ టైప్-సీ బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ -
ఈ మొబైల్ ఫోన్‌పై ఏకంగా రూ. 60 వేలు తగ్గింపు
ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్షిప్ ఫెస్ట్ పేరుతో మే 10 నుంచి మే 14 వరకు ఒక ప్రత్యేక సేల్ ను నిర్వహిస్తుంది. ఈ సేల్ లో ఫ్లాగ్ షిప్ మొబైల్స్ తక్కువ ధరకు లభిస్తాయి. అందులో భాగంగానే మోటొరోలా రేజర్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లాగ్షిప్ ఫెస్ట్‌లో భారీ డిస్కౌంట్ కంపెనీ అందించింది. ఇందులో ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ ప్లేను తీసుకొచ్చారు. ఇందులో ఉన్న రెట్రో మోడ్ ద్వారా పాత రేజర్ సిరీస్ ఫోన్లను ఉపయోగించిన అనుభూతిని పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ అసలు ధర రూ.1,49,999 కాగా దీన్ని రూ.89,999కే విక్రయిస్తున్నారు. అంటే ఏకంగా రూ.60 వేల తగ్గింపు ఈ ఫోన్‌పై లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ప్రస్తుతం ఇందులో అందుబాటులో ఉంది. మోటొరోలా రేజర్ స్పెసిఫికేషన్లు 6.2 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ హెచ్ డీ+ డిస్ ప్లే క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 2800 ఎంఏహెచ్ బ్యాటరీ 5జీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15 వేలకే ఆపిల్ ఐఫోన్ -
మోటోరోలా ఎడ్జ్ ఎస్‌లో అదిరిపోయే ఫీచర్స్
మోటొరోలా తన కొత్త ఫోన్ ఎడ్జ్ ఎస్ మొబైల్ ను చైనాలో లాంచ్ చేసింది. ఇందులో గత వారం క్వాల్కామ్ కంపెనీ తీసుకొచ్చిన స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ను తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ తో విడుదలైన మొట్టమొదటి మొబైల్ ఇదే. మోటరోలా ఎడ్జ్ ఎస్‌లో డ్యూయల్ హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్, గ్రేడియంట్ బ్యాక్ ఫినిష్ ఉన్నాయి. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు, ముందువైపు రెండు కెమెరాలను తీసుకొచ్చారు. ఎడ్జ్ ఎస్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.(చదవండి: పోకో ఎం3 వచ్చేది ఎప్పుడంటే?) మోటరోలా ఎడ్జ్ ఎస్ ఫీచర్స్: డ్యూయల్ సిమ్(నానో) మోటరోలా ఎడ్జ్ ఎస్ ఆండ్రాయిడ్ 11లో మైయుఐ మీద నడుస్తుంది. దీని యాస్పెక్ట్ రేషియో 21:9గా ఉంది. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, అడ్రినో 650 జీపీయును తీసుకొచ్చారు. 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ(యుఎఫ్ఎస్ 3.1) వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. ఇది క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఎడ్జ్ ఎస్‌లో 64 మెగాపిక్సెల్(ఎఫ్/1.7) ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.(చదవండి: టిక్‌టాక్ ఉద్యోగుల తొలగింపు) వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం ఇందులో 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఎన్ఎఫ్సి, యుఎస్బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. మోటరోలా 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చారు. దీని బరువు 215 గ్రాములు. మోటరోలా ఎడ్జ్ ఎస్ ధర: మోటరోలా ఎడ్జ్ ఎస్ 6జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర సిఎన్‌వై 1,999(సుమారు రూ.22,600), 8జీబీ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర సిఎన్‌వై 2,399(సుమారు రూ.27,000)గా నిర్ణయించారు. టాప్-ఆఫ్-ది-లైన్ 8జీబీ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర సిఎన్‌వై 2,799(సుమారు రూ.31,600)గా ఉంది. ఫోన్ ఎమరాల్డ్ లైట్, స్నో, మిస్ట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. -
మోటోరోలా నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్
ప్రపంచంలో మొట్టమొదటి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి మార్కెట్లో రేసు కొనసాగుతోంది. ఇప్పటికే షియోమీ, రియల్మీ, శామ్సంగ్ కంపెనీలు స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో మొబైల్‌ని తీసుకొస్తునట్టు ప్రకటించాయి. తాజాగా మోటరోలా కూడా అతి త్వరలో రంగంలోకి దిగబోతున్నట్లు కనిపిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో మోటోరోలా తీసుకురాబోయే మొబైల్ గురుంచి సమాచారం చాలా తక్కువగా ఉంది. లెనోవా ఎగ్జిక్యూటివ్ చెన్ జిన్ తెలిపిన పోస్ట్ ప్రకారం కొత్తగా తీసుకురాబోయే మొబైల్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో పని చేయవచ్చు.(చదవండి: 9 ఏళ్లలో శామ్సంగ్ కి ఇదే మొదటి సారి) మోటరోలా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎడ్జ్ ప్లస్‌తో ఫ్లాగ్షిప్ స్థాయి ఫోన్‌ను ప్రవేశపెట్టింది. 5జీ-ఎనేబుల్డ్ ఎడ్జ్ ప్లస్ ఆన్లైన్లో సుమారు రూ.65,000కు లభిస్తుంది. ఈ ఫోన్లో 12 జీబీ ర్యామ్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రాబోయే మొబైల్స్ 2021 ప్రారంభంలో తీసుకురానున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం మొట్ట మొదటిగా షియోమీ రేపు(డిసెంబర్ 28) విడుదల చేసే ఎంఐ 11 స్మార్ట్‌ఫోన్ సిరీస్ లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకురానున్నట్లు సమాచారం. ఎంఐ 11 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ క్వాడ్ హెచ్డి + డిస్ప్లేతో రానుంది. 4,780 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుందని చెబుతున్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో మరో షాపింగ్ ఫెస్టివల్
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ లవర్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ మరో షాపింగ్ ఫెస్టివల్‌తో ముందుకు వచ్చింది. ఈ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. ఈ సేల్ డిసెంబర్ 26 నుండి డిసెంబర్ 28 వరకు కొనసాగుతుంది. ఎలక్ట్రానిక్స్ సేల్‌లో స్మార్ట్ఫోన్లతో సహా ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లను అందించనుంది. స్మార్ట్‌ఫోన్ ఒప్పందాలు ఇప్పటికే మొబైల్స్ కి సంబందించిన ప్రత్యేక పేజీలో కనిపిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుదారులకు ప్రత్యేక తగ్గింపులను కూడా అందిస్తోంది. ఐసీఐసీఐ వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.(చదవండి: శాంసంగ్ గెలాక్సీ ఏ72 స్పెసిఫికేషన్స్ లీక్) ఐఫోన్ ఎస్ఈ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 6,901 రూపాయల ధర తగ్గింపుతో 32,999 రూపాయలకు లభిస్తుంది. ఐఫోన్ ఎక్స్ఆర్ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 10,000 రూపాయల ధర తగ్గింపుతో 38,999 రూపాయలకు లభిస్తుంది. ఐఫోన్ 11 ప్రో ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 20,000 రూపాయల ధర తగ్గింపుతో 79,999 రూపాయలకు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ సందర్భంగా రియల్మీ ఎక్స్ 3 సూపర్‌జూమ్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 6,000 రూపాయల ధర తగ్గింపుతో 23,999 రూపాయలకు లభిస్తుంది. కొన్ని రోజుల క్రితం లాంచ్ అయిన మోటో జీ 5జీ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఈ సేల్‌లో 4,000 రూపాయల ధర తగ్గింపుతో 20,999 రూపాయలకు లభిస్తుంది. ఈ సేల్‌లో గత నెలలో విడుదల అయిన మోటో జీ 9పవర్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 4,000 రూపాయల ధర తగ్గింపుతో 11,999 రూపాయలకు లభిస్తుంది. -
లెనోవో K12 స్మార్ట్ ఫోన్- త్వరలో విడుదల!
ముంబై: చైనీస్ టెక్ దిగ్గజం లెనోవో.. కే12 బ్రాండుతో దేశీయంగా స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన మోటో ఈ7 మోడల్ మొబైల్‌ను ఆధునీకరించి కే12గా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కే12ను యూరోపియన్ మార్కెట్లలో లెనోవో విడుదల చేసింది. చైనాలో ఇప్పటికే కే12 స్మార్ట్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. అయితే చైనీస్ మార్కెట్లో విడుదలైన ఫోన్ గతంలో విడుదలైన మోటో ఈ7 ప్లస్‌కు ఆధునిక వెర్షన్‌గా టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. గత మోటో ఈ7 మోడల్‌ను ఆధునీకరించి విడుదల చేయనున్న కే12 ఫోన్ దేశీ మార్కెట్లలో 120 యూరోలు(సుమారు రూ. 10,550)గా ఉండవచ్చని అంచనా. ఫోన్‌కు సంబంధించిన ఇతర టెక్నికల్ వివరాల అంచనాలు చూద్దాం.. (గత నెల అమ్మకాలలో టాప్-3 కార్లు) 6.5 అంగుళాల తెర లెనోవో కే12 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల హెచ్‌డీప్లస్ టచ్ స్ర్నీన్‌ను కలిగి ఉంటుంది. వెనుక 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు.. 2 ఎంపీ మాక్రో స్నాపర్, 5 ఎంపీ షూటర్‌తో వెలువడనుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 5 ఎంపీ షూటర్(కెమెరా)ను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియోస్ జీ25 చిప్సెట్తో పనిచేయనుంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీతోపాటు.. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 వెర్షన్లో లభించవచ్చని అంచనా. (ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బుకింగ్ షురూ) -
మోటరోలా కొత్త స్మార్ట్ఫోన్లు: సరసమైన ధరల్లో
సాక్షి, ముంబై: మోటరోలా మూడు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. మోటో జీ6, మోటోజీ6 ప్లస్, మోటో జీ6ప్లే అనే డివైస్‌లను నేడు( గురువారం) విడుదల చేయనుంది. జీ సిరీస్‌లో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ఫోన్లను సరసమైన ధరల్లో కస్టమర్లకు అందించనుంది. దాదాపు మూడు నెలల వెయింటింగ్ తర్వాత బ్రెజిల్‌లోని సావో పోలోలో నిర్వహించే ఒక కార్యక్రమంలో వీటిని ప్రారంభిస్తోంది. ఇటీవల లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ మూడు ఫోన్లు బ్లాక్, గోల్డ్, ఇండిగో, రోజ్ గోల్డ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్‌లో లభించనున్నాయి. కొత్త "యానిమేటెడ్ ఫేస్ ఫిల్టర్లు" 'కట్అవుట్' ఫీచర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. ఈ మూడు డివైస్ల ధర, ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. మోటో జీ6 ధర, ఫీచర్లు ధర: సుమారు రూ .16,000 5.7 అంగుళాల మాక్స్ విజన్ డిస్ప్లే ఆండ్రాయిడ్ ఓరియో 8.0 18: 9 కారక నిష్పత్తి, ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 128జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 12 +5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ మోటో జీ6 ప్లస్ ధర, ఫీచర్లు ధర: ఇంకా అందుబాటులోకి రాలేదు 5.93 అంగుళాల టచ్ స్క్రీన్ ప్యానెల్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 6జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 12 మెగా పిక్సెల్ రియర్ కెమెరా 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3200 ఎంఏహెచ్ మోటోజీ6 ప్లే ధర, ఫీచర్లు ధర: సుమారు రూ .13,000 5.7-అంగుళాల డిస్ప్లే 18: 9 కారక నిష్పత్తి ఆండ్రాయిడ్ ఓరియో 8.0 2జీబీ ర్యామ్16జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆఫ్‌లైన్ విపణిలోకి మోటరోలా..
♦ తక్కువ లాభం తీసుకునే వ్యాపారులతో జోడి ♦ మోటరోలా మొబిలిటీ జీఎం అమిత్ బోని హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు ఆన్‌లైన్‌కే పరిమితమైన మోటరోలా ఫోన్లు రిటైల్ దుకాణాల్లో కూడా దర్శనమీయనున్నాయి. భారత్‌లో 2014 మార్చి నుంచి డిసెంబర్ మధ్య కంపెనీ 30 లక్షల ఫోన్లను విక్రయించింది. 2015లో కూడా అంచనాలను మించి అమ్మకాలు నమోదు చేస్తోంది. ఇదే ఊపుతో ఇప్పుడు కొత్త విక్రయ వేదికలనూ వెతుకుతోంది. ప్రస్తుతం ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత్‌లో తన ఉత్పత్తులను అమ్ముతోంది. తక్కువ లాభం తీసుకుని ఫోన్లను విక్రయించే రిటైల్ వ్యాపారులతో భాగస్వామ్యానికి సిద్ధమని మోటరోలా ఇండియా మొబిలిటీ జీఎం అమిత్ బోని సాక్షి బిజినెస్ బ్యూరోకు సోమవారమిక్కడ తెలిపారు. ‘కస్టమర్లకు ఆధునిక ఫోన్లు అందుబాటు ధరలో లభించాలన్నది మా ల క్ష్యం. ఆన్‌లైన్‌తో పోలిస్తే రిటైల్‌లో ఒక ఫోన్ ధర రూ.3 వేల దాకా అధికంగా ఉంటోంది. అందుకే ఆన్‌లైన్‌కు పరిమితమయ్యాం’ అని తెలిపారు. ఒక మోడల్‌కు దేశవ్యాప్తంగా ఒకే ధర ఉండాలన్నది తమ ధ్యేయమని చెప్పారు. ఇంటి వద్దకే సర్వీసు.. మోటరోలా కేర్ ఆన్ వీల్స్ పేరుతో ఢిల్లీలో ప్రయోగాత్మకంగా సేవలను ప్రారంభించింది. ఫోన్లో సాంకేతిక సమస్య తలెత్తితే కంపెనీకి ఫోన్ చేస్తే చాలు. కస్టమర్ వద్దకే వచ్చి రిపేర్ చేస్తారు. హైదరాబాద్‌తోసహా 10 నగరాల్లో కేర్ ఆన్ వీల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. కంపెనీ దేశవ్యాప్తంగా 160 సర్వీసు కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇందులో 4 హైదరాబాద్‌లో ఉన్నాయి. అయితే గతేడాది విక్రయించిన 30 లక్షల యూనిట్లలో మోటో-ఇ, మోటో-జి మోడళ్ల వాటా 80 శాతం ఉంది. మోటో-ఇ మోడల్‌ను ప్రపంచంలో తొలిసారిగా భారత్‌లో ఆవిష్కరించారు. కంపెనీకి అత్యంత ప్రాధాన్య మార్కెట్లలో భారత్ కూడా ఉండడంతో రాబోయే రోజుల్లో మరిన్ని మోడళ్లు తొలిసారిగా ఇక్కడ అడుగు పెట్టే అవకాశం ఉంది. చెన్నై ప్లాంటు పునరుద్ధరణ.. కంపెనీ 2013లో చెన్నై ప్లాంటును మూసివేసింది. దేశీయంగా మొబైల్స్ తయారీని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో ప్లాంటు పునరుద్ధరణ విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. మోటరోలాను కొనుగోలు చేసిన లెనోవో ఇందుకు సంసిద్ధంగా ఉంది. అయితే ఎప్పుడు పునరుద్ధరణ చేస్తారో తానిప్పుడే చెప్పలేనని అమిత్ తెలిపారు. ఉత్పత్తుల ధర పెరగకుండా ఉండేందుకు ఏ విధానం ఉత్తమంగా ఉంటోందో దానిని అనుసరిస్తామని చెప్పారు. కాగా, ఎయిర్‌టెల్‌తో కలసి కొద్ది రోజుల్లో ప్రత్యేక ఆఫర్‌ను కంపెనీ ప్రకటించనుంది.