ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ ఫెస్ట్ పేరుతో మే 10 నుంచి మే 14 వరకు ఒక ప్రత్యేక సేల్ ను నిర్వహిస్తుంది. ఈ సేల్ లో ఫ్లాగ్ షిప్ మొబైల్స్ తక్కువ ధరకు లభిస్తాయి. అందులో భాగంగానే మోటొరోలా రేజర్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లాగ్‌షిప్ ఫెస్ట్‌లో భారీ డిస్కౌంట్ కంపెనీ అందించింది. ఇందులో ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ ప్లేను తీసుకొచ్చారు. ఇందులో ఉన్న రెట్రో మోడ్ ద్వారా పాత రేజర్ సిరీస్ ఫోన్లను ఉపయోగించిన అనుభూతిని పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ అసలు ధర రూ.1,49,999 కాగా దీన్ని రూ.89,999కే విక్రయిస్తున్నారు. అంటే ఏకంగా రూ.60 వేల తగ్గింపు ఈ ఫోన్‌పై లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ప్రస్తుతం ఇందులో అందుబాటులో ఉంది.
మోటొరోలా రేజర్ స్పెసిఫికేషన్లు
- 6.2 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ హెచ్ డీ+ డిస్ ప్లే
- క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765 ప్రాసెసర్
- ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం
- 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
- 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా
- 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
- 2800 ఎంఏహెచ్ బ్యాటరీ
- 5జీ, 4జీ ఎల్టీఈ సపోర్ట్
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment