ఫ్లిప్‌కార్ట్‌లో మరో షాపింగ్ ఫెస్టివల్ | Flipkart Electronics Sale to Start From December 26 | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌లో మరో షాపింగ్ ఫెస్టివల్

Published Fri, Dec 25 2020 3:19 PM | Last Updated on Fri, Dec 25 2020 3:27 PM

Flipkart Electronics Sale to Start From December 26 - Sakshi

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ లవర్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ మరో షాపింగ్ ఫెస్టివల్‌తో ముందుకు వచ్చింది. ఈ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. ఈ సేల్ డిసెంబర్ 26 నుండి డిసెంబర్ 28 వరకు కొనసాగుతుంది. ఎలక్ట్రానిక్స్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో సహా ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్లను అందించనుంది. స్మార్ట్‌ఫోన్‌ ఒప్పందాలు ఇప్పటికే మొబైల్స్ కి సంబందించిన ప్రత్యేక పేజీలో కనిపిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుదారులకు ప్రత్యేక తగ్గింపులను కూడా అందిస్తోంది. ఐసీఐసీఐ వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.(చదవండి: శాంసంగ్ గెలాక్సీ ఏ72 స్పెసిఫికేషన్స్ లీక్)  

  • ఐఫోన్ ఎస్ఈ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ 6,901 రూపాయల ధర తగ్గింపుతో 32,999 రూపాయలకు లభిస్తుంది.
  • ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 10,000 రూపాయల ధర తగ్గింపుతో 38,999 రూపాయలకు లభిస్తుంది. 
  • ఐఫోన్ 11 ప్రో ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ 20,000 రూపాయల ధర తగ్గింపుతో 79,999 రూపాయలకు లభిస్తుంది.
  • ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ సందర్భంగా రియల్‌మీ ఎక్స్‌ 3 సూపర్‌జూమ్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 6,000 రూపాయల ధర తగ్గింపుతో 23,999 రూపాయలకు లభిస్తుంది. 
  • కొన్ని రోజుల క్రితం లాంచ్ అయిన మోటో జీ 5జీ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఈ సేల్‌లో 4,000 రూపాయల ధర తగ్గింపుతో 20,999 రూపాయలకు లభిస్తుంది. 
  • ఈ సేల్‌లో గత నెలలో విడుదల అయిన మోటో జీ 9పవర్ ‌4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ 4,000 రూపాయల ధర తగ్గింపుతో 11,999 రూపాయలకు లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement