మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్లు: సరసమైన ధరల్లో | Moto G6, Moto G6 Plus, Moto G6 Play Set to Launch Today | Sakshi
Sakshi News home page

మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్లు: సరసమైన ధరల్లో

Published Thu, Apr 19 2018 8:53 AM | Last Updated on Thu, Apr 19 2018 8:54 AM

Moto G6, Moto G6 Plus, Moto G6 Play Set to Launch Today - Sakshi

సాక్షి, ముంబై:  మోటరోలా  మూడు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయనుంది.  మోటో జీ6, మోటోజీ6 ప్లస్‌,  మోటో జీ6ప్లే అనే   డివైస్‌లను  నేడు( గురువారం) విడుదల చేయనుంది. జీ సిరీస్‌లో  తీసుకొస్తున్న ఈ  స్మార్ట్‌ఫోన్లను సరసమైన ధరల్లో కస్టమర్లకు అందించనుంది.  దాదాపు మూడు నెలల వెయింటింగ్‌  తర్వాత  బ్రెజిల్‌లోని సావో పోలోలో నిర్వహించే ఒక కార్యక్రమంలో వీటిని  ప్రారంభిస్తోంది. ఇటీవల లీక్‌ అయిన సమాచారం ప్రకారం ఈ మూడు ఫోన్లు బ్లాక్, గోల్డ్, ఇండిగో, రోజ్ గోల్డ్ సిల్వర్ కలర్  ఆప్షన్స్‌లో లభించనున్నాయి.  కొత్త "యానిమేటెడ్ ఫేస్‌ ఫిల్టర్లు" 'కట్అవుట్'  ఫీచర్,  ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌లు ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి.   ఈ మూడు డివైస్‌ల ధర, ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి.

మోటో జీ6 ధర,  ఫీచర్లు
ధర: సుమారు రూ .16,000
5.7 అంగుళాల మాక్స్ విజన్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
18: 9 కారక నిష్పత్తి, ఫుల్‌ హెచ్‌డీ రిజల్యూషన్‌   
4జీబీ ర్యామ్‌ 64 జీబీ స్టోరేజ్‌
128జీబీ వరకు  విస్తరించుకునే అవకాశం
12 +5 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

మోటో జీ6 ప్లస్ ధర,  ఫీచర్లు
ధర: ఇంకా  అందుబాటులోకి రాలేదు
5.93 అంగుళాల టచ్‌  స్క్రీన్‌ ప్యానెల్
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
6జీబీ ర్యామ్‌
64జీబీ స్టోరేజ్
256 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
12 మెగా పిక్సెల్ రియర్‌ కెమెరా
5 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా
3200 ఎంఏహెచ్‌  

మోటోజీ6 ప్లే  ధర, ఫీచర్లు
ధర: సుమారు రూ .13,000
5.7-అంగుళాల డిస్‌ప్లే  18: 9 కారక నిష్పత్తి
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
2జీబీ ర్యామ్‌16జీబీ స్టోరేజ్‌
256 జీబీ  దాకా విస్తరించుకునే అవకాశం
13 మెగాపిక్సెల్ రియర్‌ కెమెరా
8 మెగాపిక్సెల్   సెల్ఫీ  కెమెరా
4000ఎంఏహెచ్‌  బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement