Redmi Note 10S 8GB RAM Storage Option Launched in India- Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ ర్యామ్‌తో రెడ్‌మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌..! ధర ఎంతంటే..!

Published Thu, Dec 2 2021 6:13 PM | Last Updated on Thu, Dec 2 2021 6:22 PM

Redmi Note 10S 8GB RAM Storage Option Launched in India - Sakshi

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లలోకి రెడ్‌మీ నోట్‌ 10 సిరీస్‌లో భాగంగా మరింత పవర్‌ఫుల్‌ స్టోరేజ్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ నోట్‌ 10ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ఫుల్‌ ర్యామ్‌ను అమర్చారు. 8జీబీ ర్యామ్‌+128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో రానుంది.  రెడ్‌మీ నోట్‌ 10ఎస్‌ 6జీబీ ర్యామ్‌+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ను ఎప్పుడో లాంచ్‌ చేసింది.

8జీబీ ర్యామ్‌  రెడ్‌మీ నోట్‌ 10ఎస్‌ వేరియంట్‌ కొనుగోలుదారులకు డిసెంబర్‌ 3 నుంచి అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ. 17,499గా ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ఎంఐ. కామ్‌, అమెజాన్‌, ఎంఐ హోమ్స్‌ స్టోర్స్‌ కొనుగోలు చేయవచ్చును.  ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు లేదా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు తక్షణ డిస్కౌంట్‌ లాంచింగ్‌ ఆఫర్‌ను అందిస్తోంది.  
చదవండి: శాంసంగ్‌ నుంచి చౌవకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌..!

రెడ్‌మీ నోట్‌10ఎస్‌ ఫీచర్స్‌

  • 6.43-అంగుళాల పూర్తి-హెచ్‌డీప్లస్‌ అమ్లోడ్‌ డిస్‌ప్లే
  • మీడియాటెక్‌ హెలియో జీ95 ప్రాసెసర్స్‌
  • 8జీబీ ర్యామ్‌+128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ
  • 64 ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమెరా
  • 13ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
  •  5,000mAh బ్యాటరీ
  •  33W ఫాస్ట్ ఛార్జింగ్‌  

చదవండి: ఇది స్మార్ట్‌ఫోనా..ల్యాప్‌ట్యాపా...! వివో నుంచి కళ్లుచెదిరే గాడ్జెట్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement