ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లలోకి సరికొత్త రెడ్‌మీ నోట్ 11టీ5జీ లాంచ్ చేసింది. గత నెలలో ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో విడుదలైంది. స్టార్‌డస్ట్ వైట్, అక్వామెరైన్ బ్లూ, మాటే బ్లాక్ కలర్ వేరియంట్స్‌తో రానుంది. 6జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్‌స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999 కాగా, 8జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నల్‌స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999గా ఉండనుంది. డిసెంబర్ 7 నుంచి కొనుగోలుదారులకు షావోమీ అధికారక వెబ్‌సైట్‌తో పాటుగా అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉండనుంది.
రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ఫీచర్స్
- 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే విత్ 90 గిగాహెట్జ్ రిఫ్రెష్ రేట్
- మీడియాటెక్ డైమెంసిటీ 810 ఎస్ఓసీ ప్రాసెసర్
- 8జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్
- 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
- 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
- 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్
- 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
- ఆండ్రాయిడ్ 11 ఆధారిత 12 ఎంఐయూఐ
- 5000ఎంఏహెచ్ బ్యాటరీ
- 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్
Comments
Please login to add a commentAdd a comment