Xiaomi 11 Lite 5G NE To Launch In India - Sakshi
Sakshi News home page

Xiaomi: షావోమీ 11 లైట్‌ ఎన్‌ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌..ధర ఏంతంటే...!

Published Thu, Sep 30 2021 9:27 PM | Last Updated on Fri, Oct 1 2021 8:04 PM

Xiaomi 11 Lite 5G NE To Launch In India Today - Sakshi

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. షావోమీ 11 లైట్‌ ఎన్‌ఈ 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను బుధవారం లాంచ్‌ చేసింది. షావోమీ ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు షావోమీ బియర్డ్‌ ట్రిమర్‌ 2ను కూడా రిలీజ్‌ చేసింది. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ 6జీబీ+128 స్టోరేజ్‌ జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ రూ. 26,999, 8జీబీ+128జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ రూ. 28,999కి అందుబాటులో ఉంది. షావోమి ప్రారంభ ధరలో భాగంగా రూ. 2000తో పాటు దీపావళి డిస్కౌంట్‌లో భాగంగా రూ. 1500 అందించనున్నారు.

షావోమీ 11 లైట్‌ ఎన్‌ఈ 5జీ ఫీచర్స్‌

  • 6.55 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
  • క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 778జీ 5జీ  ప్రాసెసర్‌
  • 8 జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌
  • 64 మెగా పిక్సెల్‌ రియర్‌ కెమెరా
  • 20 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
  • 33 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌
  • 4,250ఎమ్‌ ఏహెచ్‌ బ్యాటరీ
  • యూఎస్‌బీ టైప్‌సీ సపోర్ట్‌
  • సైడ్‌  మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింటర్‌

చదవండి: ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై ఐదు సంవత్సరాల వారంటీ...!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement