సాక్షి, న్యూఢిల్లీ: పోకో ఎఫ్ సిరీస్‌లో సెకండ్ జనరేషన్ ఫోన్‌ను లాంచ్ చేసింది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి సబ్ బ్రాండ్ అయిన పోకో తన కొత్త ఫ్లాగ్‌షిప్ పోకో ఎఫ్ 1 ప్రారంభించిన రెండు సంవత్సరాల తరువాత పోకో ఎఫ్ 2 ప్రొ పేరుతో కొత్త మొబైల్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేసింది. (షావోమి ఎంఐ10 లాంచ్, ఫీచర్లు ఏంటంటే..)
పోకో ఎఫ్2 ప్రొ ఫీచర్లు
6.67అంగుళాల పూర్తి హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865
6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్
64 +13+5+2 ఎంపీ క్వాడ్ రియర్‌కెమెరా
20 ఎంపీ సెల్పీ పాప్ అప్ కెమెరా
4700 ఎంఏహెచ్ బ్యాటరీ
5 జీ కనెక్టివిటీ, వెనుక వైపున ఆప్టికల్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 , పాప్ అప్ సెల్పీ కెమెరా ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. 30వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో, బాక్స్ లోనే దీనికి సరిపడిన ఛార్జర్ తో వస్తుందనీ కేవలం 63 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.
నియాన్ బ్లూ, ఫాంటన్ వైట్, ఎలక్ట్రిక్ పర్పుల్, సైబర్ గ్రే నాలుగు రంగులలో లభ‍్యం.
ధర
రెండు వేరియంట్లలో ఇది లభ్యం కానుంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ. 41500
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ. 50 000
Comments
Please login to add a commentAdd a comment