అదిరిపోయే ప్రాసెసర్‌తో విడుదలైన మోటరోలా ఎడ్జ్ 30 ప్రో మొబైల్..! | Motorola Edge 30 Pro Launched With Snapdragon 8 Gen 1 SoC in India | Sakshi
Sakshi News home page

అదిరిపోయే ప్రాసెసర్‌తో విడుదలైన మోటరోలా ఎడ్జ్ 30 ప్రో మొబైల్..!

Published Thu, Feb 24 2022 9:16 PM | Last Updated on Thu, Feb 24 2022 9:19 PM

Motorola Edge 30 Pro Launched With Snapdragon 8 Gen 1 SoC in India - Sakshi

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటరోలా తన ప్రీమియం ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను నేడు(ఫిబ్రవరి 24) మన దేశంలో విడుదల చేసింది. ఈ కొత్త మోటరోలా ఫోన్ గత ఏడాది తీసుకొచ్చిన మోటరోలా ఎడ్జ్ 20ప్రోకు కొనసాగింపుగా తీసుకొని వచ్చారు. ఈ మోటరోలా ఎడ్జ్ 30 ప్రో  మొబైల్144హెర్ట్జ్ పివోఎల్ఈడి డిస్ ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 68డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్'కి కూడా సపోర్ట్ చేస్తుంది. విండోస్ 11లో వీడియో కాన్ఫరెన్స్ కోసం దీనిని వెబ్ క్యామ్'గా వాడుకోవచ్చు. మోటరోలా ఎడ్జ్ 30ప్రో అసుస్ రోగ్ ఫోన్ 5, వివో ఎక్స్70 ప్రో, ఐక్యూ 9 సిరీస్ వంటి వాటికి పోటీనిస్తుంది.

మోటరోలా ఎడ్జ్ 30 ప్రో ధర: 
మోటరోలా ఎడ్జ్ 30 ప్రో 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.49,999 ధరకు విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఫ్లిప్ కార్ట్, ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఎస్బిఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు మోటరోలా ఎడ్జ్ 30 ప్రోపై రూ. 5,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా జియో వినియోగదారులకు రూ.10,000 విలువైన ప్రయోజనాలు కూడా ఉంటాయి. 

మోటరోలా ఎడ్జ్ 30 ప్రో ఫీచర్స్:

  • 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ OLED డిస్‌ప్లే
  • ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12పై రన్ అవుతుంది 
  • ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఉంది.
  • మూడు బ్యాక్(50 ఎంపీ + 50 ఎంపీ + 2 ఎంపీ) కెమెరాలు ఉన్నాయి. 
  • ఇందులో 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
  • ఎడ్జ్ 30 ప్రోలో 4,800 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంది.
  • 68 డబ్ల్యు టర్బోపవర్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్'కి సపోర్ట్ చేస్తుంది.

(చదవండి: ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్ చేయండిలా..!) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement