న్యూఢిల్లీ: మోటరోలా కంపెనీ వేగవంతమైన ఇంటర్నెట్ కోసం అత్యాధునిక మెష్ సిస్టమ్ ‘ఎంహెచ్7020’ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీన్ని హోల్ హోమ్ వైఫై సిస్టమ్‌గా కంపెనీ పేర్కొంది.
వైఫై రూటర్, వైఫై శాటిలైట్, పవర్ అడాప్టర్లతో ఈ ప్యాక్‌లు లభిస్తాయి. 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇంటిలో అన్ని ప్రాంతాలకు వైఫై కవరేజీ వేగవంతంగా, నాణ్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. దీనికితోడు అధిక భద్రత కూడా లభిస్తుందని పేర్కొంది. ఒక మెష్‌రెడీ రూటర్, ఒక అడాప్టర్, ఎథర్నెట్ కేబుల్, క్విక్‌స్టార్ట్ ఫ్లయర్, మోటోమ్యానేజ్ యాప్ ప్యాక్ ధర రూ.7,999గా నిర్ణయించింది.
ఒక హోల్‌హోమ్ వైఫై రూటర్, ఒక వైఫై శాటిలైట్, రెండు పవర్ అడాప్టర్లు, రెండు ఎథర్నెట్ కేబుళ్లతో కూడిన ప్యాక్ రూ.13,999గాను, ఒక హోల్‌హోమ్ వైఫై రూటర్, 2 శాటిలైట్లు, మూడు పవర్ అడాప్టర్లు, మూడు ఎథర్నెట్ కేబుళ్ల ప్యాక్ ధర రూ.19,999గా నిర్ణయించింది.
చదవండి: రికార్డు సృష్టించిన స్టార్‌లింక్ ఇంటర్నెట్..! స్పీడ్ ఎంతంటే..
Comments
Please login to add a commentAdd a comment