Wifi technology
-
కొత్త టెక్నాలజీ గురూ..! కిలో మీటర్ దూరంలో ఉన్నా వైఫైని వినియోగించుకోవచ్చు..!
టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్ది మానవుని జీవన విధానం మరింత సులభతరం అయ్యింది. ఇప్పటికే డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్' వంటి టెక్నాలజీలు వర్క్ కల్చర్‌ను పూర్తిగా మార్చేయగా..ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) అదే దారిలో పయనిస్తుంది. తాజాగా ఐఓటీ టెక్నాలజీతో మీరు కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే డివైజ్‌లను వినియోగించుకునేందుకు ఈ 'వైఫై హాలో'(wifi halow) ఉపయోగపడనుంది. 'వైఫై హాలో' అంటే? 'వైఫై హాలో' అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంట్లో ఉండే ఐఓటీ ప్రొడక్ట్‌లు స్మార్ట్ స్పీకర్స్, స్మార్ట్ ఎయిర్ కండీషనర్స్ తో పాటు స్మార్ట్ హోం సెక్యూరిటీ సిస్టం, వేరబుల్ హెల్త్ మానిటర్స్, బయో మెట్రిక్ సైబర్ సెక్యూరిటీ స్కానర్స్'ను కిలోమీటర్ దూరంలో ఉన్నా వైఫై ద్వారా ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు ఉపయోగపడుతుందని ప్రపంచ వ్యాప్తంగా వైఫై నెట్ వర్క్‌లను అందించే 'వైఫై అలయన్స్' సంస్థ తెలిపింది. పరిమిత సంఖ్యలో వైఫై కొత్త టెక్నాలజీ అందుబాటులో ఉన్న స్మార్ట్ డివైజెస్‌లో పనిచేస్తుందని చెప్పింది. వైఫై టెక్నాలజీ కోసం కొత్త ఎక్విప్మెంట్ అవసరం లేదని,ప్రస్తుతం మన రోజూ వారి జీవితంలో భాగమైన వైఫై సెటప్‌తోనే ఈ వైఫై హాలో పనిచేస్తుందని వెల్లడించింది. ఏ అప్లికేషన్లలో వైఫై హాలోని వినియోగించుకోవచ్చు? వైఫై హాలో'ని ఇళ్లు, సంస్థల్లో ఉండే స్మార్ట్ పరికరాలను కనెక్ట్ చేయడంతో పాటు వివిధ రకాలైన అప్లికేషన్లలో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ మానిటర్లు, వ్యవసాయ క్షేత్రాల్లో (స్మార్ట్ అగ్రికల్చర్)సెన్సార్లను కనెక్ట్ చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. తద్వారా టెక్నాలజీ పరంగా మరింత అప్ డేట్ కావొచ్చని నిపుణులు చెబుతుండగా.. తక్కువ సమయంలో పెద్దమొత్తంలో ఉన్న డేటాను ట్రాన్స్ఫర్ చేసేందుకు ఉపయోగడపడే వైఫై నెట్ వర్క్‌కు ప్రత్యామ్నాయం కాదని అంటున్నారు. 'వైఫై హాలో'ఎలా పని చేస్తుంది? వైఫై హాలో టెక్నాలజీ ఇళ్లులో, లేదంటే రైల్వే స్టేషన్లలో వినియోగించే వైఫై కంటే ఫాస్ట్‌గా పనిచేస్తుంది. సాధారణ వైఫై నెట్‌వర్క్‌లు వినియోగించడం వల్ల ఖర్చయ్యే కరెంట్ కంటే..తక్కువ స్థాయిలో కరెంట్ వినియోగంతో దూరంలో ఉన్నా సరే ఎక్కువ మంది ఉపయోగించుకునేందుకు సాయపడుతుంది. బ్యాండ్ విడ్త్ పరంగా వైఫై హాలో సాధారణ వైఫై బ్యాండ్ విడ్త్ 2.4జీహెచ్‌జెడ్ నుండి 5జీహెచ్‌జెడ్'ల కంటే తక్కువ స్థాయిలో అంటే కేవలం 1జిహెచ్‌జెడ్ తో పనిచేసేలా డెవలప్ చేస్తున్నట్లు వైఫై అలయన్స్ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. చదవండి: నాసా మరో సంచలనం..! చంద్రుడిపై వైఫై నెట్ వర్క్ నేరుగా భూమిపైకే...! -
నాసా మరో సంచలనం..! చంద్రుడిపై వైఫై నెట్ వర్క్ నేరుగా భూమిపైకే...!
అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. చంద్రుడిపై వైఫై నెట్‌వర్క్‌ను నిర్మించే అంశంపై రీసెర్చ్ చేస్తున్నట్లు నాసా గ్లాన్ రీసెర్చ్ సెంటర్ టెక్నాలజీ ఇంక్యేబేషన్ సెంటర్ డైరక్టర్ మ్యారి లోబో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి(అమెరికాలో) మీద తలెత్తే సమస్యల్ని పరిష్కరించేలా "ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుడిపైకి పంపడం' అనేది గొప్ప అవకాశం భావిస్తున్నట్లు తెలిపారు. ఆర్టెమిస్ ప్రోగ్రామ్ నాసా చివరి సారిగా అపోలో17 ప్రాజెక్ట్ పేరుతో లూనార్ రోవింగ్ వాహనాన్ని ఉపయోగించి జియాలజిస్ట్ హారిసన్ ష్మిత్‌ను 1972 డిసెంబర్ నెలలో చంద్రుని ఉపరితలంపై (లూనార్ సర్ఫేజ్) పంపింది. ఆ సందర్భంగా హారిసన్ ష్మిత్ చంద్రుడిపై రాళ్లు,దూళిని భూమిపైకి తీసుకొచ్చారు. ఆ తరువాత చంద్రుడిపైకి ఎవరు వెళ్లలేదు. అయితే తాజాగా నాసా చంద్రడిపైకి మనుషుల్ని పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. The Human Exploration and Operations team continues to persevere, hitting critical hardware milestones and contract awards for the #Artemis program. Our plan to land the first woman and next man on the Moon in 2024 is on track! https://t.co/8lFHpoWY0l — Kathy Lueders (@KathyLueders) September 21, 2020 గతేడాది ఆర్టెమిస్ పేరుతో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 2021లో చంద్రునిపైకి అన్క్రూయిడ్ మెషిన్(స్పేస్ క్రాఫ్ట్)లను పంపనుంది.2023లో ఆస్ట్రోనాట్స్‌ను తరువాత 2024లో లూనార్ ల్యాండింగ్ చేయనున్నారు. తద్వారా మానవులు, రోవర్లు, సైన్స్ ఇన్ట్రుమెంట్స్, మైనింగ్ ఎక్విమెంట్, చంద్రుడిపై ఉన్న ఆర్టెమిస్ బేస్‌క్యాంప్‌కు నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థను భూమిపైకి తీసుకొని వచ్చేలా ప్రయోగాలు చేస్తున్నట్లు నాసా కంపాస్ ల్యాబ్ లీడ్ స్టీవ్ ఒలెసన్ తెలిపారు. చంద్రుడి నుంచి అమెరికాకు వైఫై నాసా ఇంక్యుబేషన్ సెంటర్ డైరెక్టర్ మ్యారి లోబో ప్రెస్ రిపోర్ట్‌లో..నేషనల్ డిజిటల్ ఇంక్లూజన్ అలయన్స్ నివేదిక ప్రకారం..'క్లీవ్‌ల్యాండ్'లో దాదాపు 31శాతం కుటుంబాలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం ఎకనమిక్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 'గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ పార్ట్నర్షిప్' భూమి మీద డిజిటల్ సమస్యకు పరిష్కరించేలా చంద్రుడిని ఉపయోగించుకునే అవకాశం ఉందో లేదో చూడాలంటూ నాసాకి చెందిన గ్లెన్ రీసెర్చ్ సెంటర్‌ని సంప్రదించింది. దీంతో నాసా గ్లెన్ రీసెర్చ్ సెంటర్ కంపాజ్ బృందం..చంద్రమండలంపై ఉన్న లూనార్ సర్ఫేస్ ఏరియా ప్రాంతంలోని వైఫ్ నెట్ వర్క్ నుంచి కింద ఉన్న క్లీవ్‌ల్యాండ్‌కు అందించేలా ఇక్కడి భూ వాతావరణం ఎంతమేరకు సహకరిస్తుందనే అంశంపై విశ్లేషణ జరిపినట్లు స్టీవ్ ఒలెసన్ వెల్లడించారు. ఒలేసన్ ప్రకారం, క్లీవ్‌ల్యాండ్‌లో వైఫై రూటర్ల నుంచి దాదాపు 20,000 విద్యుత్ స్తంబాలకు అటాచ్ చేయడం ద్వారా ఇంటర్నెట్ అందుతుందని గుర్తించారు. ఈ రూటర్లను 100 గజాల కంటే ఎక్కువ దూరం ఉంచడం ద్వారా నలుగురు కుటుంబసభ్యులు ఉండే ఇంటికి సెకనుకు 7.5 మెగాబిట్ల డౌన్లోడ్ స్పీడ్‌ను పొందుతుందని అన్నారు. దీంతో స్కూల్ వర్క్, బ్యాంక్, ఆన్ లైన్ షాపింగ్ చేసేందుకు ఇంటర్నెట్ ఉపయోగపడుతుందని, 4కే వీడియో లేదా గేమింగ్‌ను ప్రసారం చేయడానికి సరిపోదు" అని ఒలేసన్ చెప్పారు. ఈ సందర్భంగా ఒలేసన్ మాట్లాడుతూ క్లీవ్ ల్యాండ్‌లో పరిసరాలకు తగ్గట్లు ఆర్టెమిస్ ప్రాజెక్ట్‌లో చంద్రుడి మీద నుంచి వైఫై సౌకర్యాన్ని అందించేలా బ్లూప్రింట్ తయారు చేస్తామని చెప్పారు. అదే సమయంలో చంద్రుడిపై ఉన్న హై టెంపరేచర్లో సైతం ఉష్ణోగ్రతలతో సైతం చంద్రుడి మీద నుంచి ధూళి, రాళ్లతో పాటు వైఫై నెట్ వర్క్‌లకు అక్కడి వాతావరణం అనుకూలిస్తుందా అనే విషయాలపై రీసెర్చ్ చేస్తామన్నారు. చదవండి: చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! -
సడన్‌గా కాల్ డిస్కనెక్ట్ అవుతోందా..! ఇలా చేయండి..!
మీరు ఓ కాల్ మాట్లాడుతున్నప్పుడు సడన్‌గా కాల్ డిస్కనెక్ట్ ఐతే హాలో..హాలో అంటూ...గొంతు చించుకుంటాం. కొన్ని సార్లు ఐతే మరీను..ఏదైనా ముఖ్యమైన విషయంపై మాట్లాడుతుంటే సడన్‌గా కాల్ డిస్కనెక్ట్ ఐతే అబ్బా ఏం నెట్వర్క్ రా బాబు..! అంటూ మన టెలికాం ఆపరేటర్‌ను తిట్టుకుంటాం.కాల్డ్రాపింగ్ సమస్యలను మనలో చాలా మంది ఎదుర్కొన్నవాళ్లమే..! కాల్డ్రాపింగ్ అవ్వకుండా ఉండే ఉపాయాల గురించి తెలుసుకుందాం.... ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో కాల్ డ్రాపింగ్ భారీగానే ఉంటుంది. రెడ్మ్యాగో అనాలిటిక్స్ ప్రకారం...గ్లోబల్ కాల్ డ్రాపింగ్ రేట్ 3 శాతం ఉండగా..భారత్‌లో అది 4.73గా ఉంది. నెట్వర్క్ సమస్యలు, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫ్లాక్చూవేషన్స్ వల్ల ఎక్కువగా కాల్ డ్రాపింగ్స్ జరుగుతుంటాయి. నెట్వర్క్ లేని ప్రదేశాల్లో ఎలాంటి కాల్ డ్రాప్స్లేకుండా వైఫై కాలింగ్‌ను ఉపయోగించి కాల్స్‌ను చేసుకోవచ్చును. చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..! అసలు ఏంటి వైఫై కాలింగ్...! బలహీనమైన సిగ్నల్, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో వైఫై కాలింగ్ సహాయంతో రెగ్యులర్ కాల్స్ చేయవచ్చును. మనం వాడే టెలికాం ఆపరేటర్ వైఫై కాలింగ్‌కు మద్దతు ఇస్తే , దాంతోపాటుగా బలమైన వైఫై కనెక్షన్ ఉన్నట్లయితే వైఫై కాలింగ్‌ను వాడవచ్చును. వైఫై కాలింగ్ ఎలా అంటే..వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్ ఇతర యాప్స్‌నుపయోగించి చేసే వాయిస్ ఒవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ మాదిరిగానే వైఫై కాలింగ్ చేయవచ్చును. వైఫై నుపయోగించుకొని పలు టెలికాం ఆపరేటర్లు కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తాయి. వైఫై కాలింగ్ సేవలను ఎయిర్టెల్, రిలయన్స్ జియో , వొడాఫోన్ ఐడియాతో సహా చాలా టెలికాం ఆపరేటర్లు వై-ఫై కాలింగ్ సపోర్ట్ అందిస్తున్నాయి. టెలికాం ఆపరేటర్లు వైఫై కాలింగ్‌పై ఎలాంటి అదనపు ఛార్జీలను విధించరు. వైఫై కాలింగ్‌లో కాల్ డ్రాపింగ్ అసలు ఉండదు. వైఫై కాలింగ్‌లో సేవ VoLTE (వాయిస్ ఓవర్ LTE) నెట్‌వర్క్‌కు బదులుగా VoIP (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్) ద్వారా కాల్స్ చేస్తుంది. మీ ఆండ్రాయిడ్ఫోన్లలో వైఫై కాలింగ్‌ను ఇలా పొందండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ముందుగా సెట్టింగ్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేయండి సెట్టింగ్స్‌లో మొబైల్ నెట్‌వర్క్‌పై క్లిక్ చేయండి. మొబైల్ నెట్‌వర్క్స్‌లో మీ టెలికాం నెట్వర్క్స్కు సంబంధించిన ఆపరేటర్‌పై క్లిక్ చేయండి. టెలికాం ఆపరేటర్‌పై క్లిక్ చేయగానే కిందికి స్క్రోల్ చేయగానే ‘మేక్ కాల్స్ యూజింగ్ వైఫై’ క్లిక్ చేస్తే సరిపోతుంది. నెట్వర్క్ సరిగ్గా లేని ప్రాంతాల్లో, వైఫై అందుబాటులో ఉన్నప్పుడు కాల్ డ్రాపింగ్లేకుండా మీకు నచ్చిన వ్యక్తులకు కాల్స్చేసుకోవచ్చును. గమనిక: ఈ సెట్టింగ్ ఆయా స్మార్ట్ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్‌ను బట్టి మారుతూ ఉంటుంది. చదవండి: చుక్కలు చూసొచ్చారట! మనం ఓ లుక్కేద్దాం -
ఇంట్లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే?
న్యూఢిల్లీ: మోటరోలా కంపెనీ వేగవంతమైన ఇంటర్నెట్ కోసం అత్యాధునిక మెష్ సిస్టమ్ ‘ఎంహెచ్7020’ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీన్ని హోల్ హోమ్ వైఫై సిస్టమ్‌గా కంపెనీ పేర్కొంది. వైఫై రూటర్, వైఫై శాటిలైట్, పవర్ అడాప్టర్లతో ఈ ప్యాక్‌లు లభిస్తాయి. 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇంటిలో అన్ని ప్రాంతాలకు వైఫై కవరేజీ వేగవంతంగా, నాణ్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. దీనికితోడు అధిక భద్రత కూడా లభిస్తుందని పేర్కొంది. ఒక మెష్రెడీ రూటర్, ఒక అడాప్టర్, ఎథర్నెట్ కేబుల్, క్విక్స్టార్ట్ ఫ్లయర్, మోటోమ్యానేజ్ యాప్ ప్యాక్ ధర రూ.7,999గా నిర్ణయించింది. ఒక హోల్హోమ్ వైఫై రూటర్, ఒక వైఫై శాటిలైట్, రెండు పవర్ అడాప్టర్లు, రెండు ఎథర్నెట్ కేబుళ్లతో కూడిన ప్యాక్ రూ.13,999గాను, ఒక హోల్హోమ్ వైఫై రూటర్, 2 శాటిలైట్లు, మూడు పవర్ అడాప్టర్లు, మూడు ఎథర్నెట్ కేబుళ్ల ప్యాక్ ధర రూ.19,999గా నిర్ణయించింది. చదవండి: రికార్డు సృష్టించిన స్టార్‌లింక్ ఇంటర్నెట్..! స్పీడ్ ఎంతంటే.. -
మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?
ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ యుగంలో వై-ఫై అంటే తెలియని వాళ్లు చాలా కొద్దీ మాత్రమే ఉంటారు. ప్రస్తుత కరోనా కాలంలో గతంలో వై-ఫై ఉపయోగించని వారు కూడా ఇప్పుడు ఉపయోగించాల్సి వస్తుంది. దీనికి తోడు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసుల పుణ్యమా అని గతం కంటే ఎక్కువగా వై-ఫైలు వాడకం బాగా పెరిగిపోయింది. లాక్ డౌన్ తర్వాత మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వై-ఫై వాడకం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. వైఫై కనెక్షన్ కోసం మీరు మంచి బ్రాడ్ బ్యాండ్ ని ఎంచుకొని ఉన్న కొన్ని సార్లు సమస్యలు ఎదుర్కొంటారు కొందరు. దానికి ప్రధాన కారణం వారు చేసే చిన్న తప్పులే. అయితే ఇప్పుడు మీ వై-ఫై వేగాన్ని పెంచే కొన్ని మార్గాలను మనం తెలుసుకుందాం. (చదవండి: గూగుల్ డ్యుయో సేవలు నిలిపివేత!) వై-ఫై వేగాన్ని పెంచడానికి ఈ టిప్స్ పాటించండి: మొదటగా మీరు మీ ఇంట్లో వై-ఫై అవసరం లేకపోయినా దానికి కనెక్ట్ చేయబడిన ఎలక్ట్రానిక్ పరికరాలను ముందుగా డిస్ కనెక్ట్ చేయండి. కొన్ని సార్లు మీరు వై-ఫై రూటర్ ప్రక్కన నిలబడితే మాత్రమే వై-ఫై సిగ్నల్ వస్తుంటే ముందుగా మీ వై-ఫై రూటర్ స్థానాన్ని మార్చండి. అది కూడా మీ గదిలో మధ్యలో ఉండే విదంగా చూసుకోండి. అలాగే దాని పక్కన ఎలాంటి ఎలక్ట్రానిక్, ఐరన్ వంటివి లేకుండా చూసుకోండి. అలాగే ముందుగా మీ ఇంటి యొక్క అవసరాలను గుర్తించండి. చాలా మంది వారి ఇంటిలో ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్న తక్కువ స్పీడ్ గల వై-ఫై కనెక్షన్ తీసుకోవడానికి ఇష్టపడుతారు. దీని వల్ల కొన్ని సార్లు మనకు అత్యవసర సమయంలో వై-ఫై సిగ్నల్ తగ్గిపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ 2.4గిగాహెర్ట్జ్ నుంచి 5గిగాహెర్ట్జ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ గల రూటర్ ని మీ అవసరాని బట్టి ఎంచుకోవాలి. మీ వై-ఫై వేగాన్ని పరిశీలించండి. ఒక్కోసారి మీరు వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరంలో ఏదైనా సమస్యలు ఉంటే తక్కువ స్పీడ్ వచ్చే అవకాశం ఉంది. ఇతర పరికరాలలో కూడా ఒక సారి వైఫై వేగాన్ని కొలవండి. దీని కోసం fast.com ను ఉపయోగించవచ్చు. ఒకవేల ఏదైనా సమస్య ఉన్నట్లు అయితే ముందుగా మీ పరికరంలో నెట్ వర్క్ సెట్టింగ్స్ చేయండి. మీరు ఎక్కువ మంది నివసించే ప్రాంతాలలో ఉంటే మాత్రం ఇతర నెట్ వర్క్, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే సిగ్నల్ మీకు కనెక్ట్ కావడానికి మీ రూటర్ పై ప్రభావం చూపుతుంది. అందువల్ల మీ రూటర్ లో ఛానల్ ఎంపిక మోడ్ సెట్ చేసుకోవాలి లేదా మీకు నచ్చిన ఛానెల్ ని మీరు స్వయంగా ఎంచుకోవచ్చు. కొన్ని సార్లు వై-ఫై తగ్గిపోవడానికి రూటర్ యాంటెన్నా కూడా కారణం కావచ్చు. అందుకని ఒకసారి మీ రూటర్ యాంటెన్నాల పోజిషన్ ను మార్చి చూడండి. అలాగే, ఒకసారి వై-ఫై రూటర్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయండి. ఇప్పటికి కూడా మీ వై-ఫై వేగం పెరగకపోతే రూటర్ లేదా వై-ఫై కనెక్షన్ సేవలను మార్చి చూడండి. అంటే వేరే రూటర్ తీసుకోవడం లేదా వేరే వైఫై కనెక్షన్ తీసుకోవడం మంచిది. -
వాట్సాప్‌తో బీఎస్ఎన్ఎల్ పోటీ!
ముంబై: ప్రైవేట్ టెల్కోల రాకతో వెనుకబడిన ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) జోరు పెంచుతోంది. తాజాగా వాట్సాప్ వంటి ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సంస్థలతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. వైఫై ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టే యత్నాల్లో ఉంది. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్డ్ వాయిస్ ఓవర్ వైఫై (వీవోవైఫై) సర్వీసులను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. అత్యుత్తమ టెక్నాలజీతో అత్యంత నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంపిక చేసిన కొన్ని సర్కిల్స్‌లో ప్రస్తుతం వీటిని పరీక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా అన్ని సర్కిల్స్‌లోనూ ఈ సేవలు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నా.. ముందుగా మాత్రం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, స్పెక్ట్రం అంతగా అందుబాటులో ఉండని మారుమూల ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తేవాలని బీఎస్ఎన్ఎల్ యోచిస్తోంది. ప్రత్యర్థి సంస్థలతోనూ పోటీ.. ప్రస్తుతం ప్రైవేట్ టెల్కోలైన భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (ఆర్‌జియో) తదితర సంస్థలు కూడా వీవోవైఫై సర్వీసులను పరీక్షిస్తున్నా యి. ఇవి తుది దశలో ఉండగా త్వరలోనే సేవలు అందుబాటులోకి తేవాలని ఆయా సంస్థలు యోచి స్తున్నాయి. అయితే, వాటికన్నా ముందే రంగంలోకి దిగాలని, మార్కెట్‌ను దక్కించుకోవాలని బీఎస్ఎన్ఎల్ చకచకా పావులు కదుపుతోంది. బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌లో మార్పులు.. రిలయన్స్ జియో కొత్తగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఈ విభాగంలో ముందే పట్టు సాధించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలోభాగంగా భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ చార్జీలను సవరించింది. నెలకు 500 జీబీ డేటా ఆఫర్ చేసే రూ. 777 ప్లాన్‌ను సవరించి రూ. 849కి మార్చింది. దీని కింద 50 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటాను 600 జీబీకి పెంచింది. అలాగే అన్లిమిటెడ్ కాల్స్ కూడా అందిస్తోంది. మరోవైపు, రోజుకు 50 జీబీ డేటా అందించే రూ. 3,999 ప్లాన్‌ని కూడా సవరించి రూ. 4,499కి మార్చింది. ఈ ప్లాన్ కింద ఇకపై 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రోజూ 55 జీబీ డేటా లభిస్తుంది. వీవోవైఫై అంటే .. మొబైల్ సిగ్నల్ లేకపోయినా యూజర్లకు కనెక్టివిటీ దెబ్బతినకుండా చూసే అత్యుత్తమ టెక్నాలజీగా వీవోవైఫైకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ (వైఫై) ద్వారా కాల్స్ చేయడం, రిసీవ్ చేసుకోవడాన్ని సాధారణంగా వైఫై కాలింగ్గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం వాట్సాప్, స్కైప్, హైక్, ఫేస్బుక్, గూగుల్ వంటి ఓటీటీ సంస్థలు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి. అయితే, టెల్కోల్లాగా లైసెన్సు బాదరబందీ లేని ఈ సంస్థలు తమ వాయిస్ సేవల విభాగం ఆదాయానికి గండి కొడుతున్నాయంటూ టెలికం సంస్థలు చాన్నాళ్లుగా గగ్గోలు పెడుతున్నాయి. ఓటీటీ సంస్థలు కూడా తమలాగా కాలింగ్, మెసేజింగ్ సర్వీసులను అందిస్తున్నాయి కాబట్టి వాటిని సైతం లైసెన్సింగ్ పరిధిలోకి తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. -
ఇక కిరాణా షాపుల్లోనూ వైఫై సేవలు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో దుకాణాదారులు, రెస్టారెంట్లు మొదలైనవి కూడా వైఫై సేవలను విక్రయించే వెసులుబాటు తేవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. గతకాలపు పబ్లిక్ ఫోన్ బూత్‌ల (పీసీవో) తరహాలో ఈ వైఫై సర్వీసులు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా వైఫై హాట్‌స్పాట్స్‌ను పెంచే క్రమంలో పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీవో)ల పేరిట వీటిని ఏర్పాటు చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) సూచించింది. అయితే, టెలికం సేవల సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో గతంలో దాన్ని పక్కన పెట్టారు. అయితే, ఏదో ఒక రూపంలో పీడీవో తరహా విధానాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. ప్రస్తుత సైబర్ కేఫ్‌ల నిబంధనలకు లోబడి.. పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు (పీడీవోఏ) గతకాలపు పీసీవో తరహా సెటప్‌లో ఇంటర్నెట్ సర్వీసులు విక్రయించే అంశం పరిశీలించవచ్చని ట్రాయ్ సిఫార్సు చేసింది. కానీ, ఇప్పటికే తీవ్ర రుణభారంలో ఉన్న పరిశ్రమపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని, జాతీయ భద్రతకు కూడా ప్రమాదకరమని టెలికం ఆపరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
వైఫైతో గోడల్లోంచీ చూడొచ్చు!
వాషింగ్టన్: ఉగ్రవాదులు ఒక భవనంలో దాక్కున్నారు.. చుట్టూ పోలీసులు మోహరించారు. కానీ లోపల ఎంత మంది ఉన్నారు? ఆయుధాలేమున్నాయి? అసలు లోపల గదులు, వస్తువులు ఏమున్నాయో తెలియదు.. పోలీసులు వెంటనే ఒక రోబోను రంగంలోకి దించారు. ఆ భవనాన్ని స్కాన్ చేసిన ఆ రోబో.. గోడల అవతల ఏముందో, ఎక్కడెక్కడ మనుషులున్నారో చూపించేసింది.. అంతే పోలీసులకు తమ పని సులువైపోయింది. అమెరికాకు చెందిన కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన సరికొత్త టెక్నాలజీ మహిమ ఇది. అసలు ఇలా గోడల అవతల ఏముందో స్కాన్ చేసి గుర్తించేందుకు ఉపయోగించేదేమిటో తెలుసా?.. ‘వైఫై’ టెక్నాలజీ. అదేనండీ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లన్నింటిలోనూ ఉండే టెక్నాలజీయే! రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నళ్ల ఆధారంగా గోడల అవతల ఉన్న వస్తువులు, మనుషులను ఇది గుర్తిస్తుంది. అంతేకాదు కలపతో చేసిన ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, లోహపు వస్తువులు ఇలా ఏ తరహాకు చెందినవో గుర్తించడంతోపాటు... గోడ అవతల ఎక్కడ, ఎంత దూరంలో ఉన్నాయో కూడా చెప్పేస్తుంది. మరో విశేషం ఏమిటంటే ఈ టెక్నాలజీని కేవలం రోబోలతో మాత్రమే కాకుండా... వైఫైతో పనిచేసే ఇతర పరికరాల్లోనూ వినియోగించుకోవడానికి అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులను గుర్తించడానికి ఈ టెక్నాలజీ ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొంటున్నారు.