మీరు ఓ కాల్ మాట్లాడుతున్నప్పుడు సడన్‌గా కాల్ డిస్‌కనెక్ట్ ఐతే హాలో..హాలో అంటూ...గొంతు చించుకుంటాం. కొన్ని సార్లు ఐతే మరీను..ఏదైనా ముఖ్యమైన విషయంపై మాట్లాడుతుంటే సడన్‌గా కాల్ డిస్‌కనెక్ట్ ఐతే అబ్బా ఏం నెట్‌వర్క్ రా బాబు..! అంటూ మన టెలికాం ఆపరేటర్‌ను తిట్టుకుంటాం.కాల్‌డ్రాపింగ్ సమస్యలను మనలో చాలా మంది ఎదుర్కొన్నవాళ్లమే..! కాల్‌డ్రాపింగ్ అవ్వకుండా ఉండే ఉపాయాల గురించి తెలుసుకుందాం....
ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో కాల్ డ్రాపింగ్ భారీగానే ఉంటుంది. రెడ్‌మ్యాగో అనాలిటిక్స్ ప్రకారం...గ్లోబల్ కాల్ డ్రాపింగ్ రేట్ 3 శాతం ఉండగా..భారత్‌లో అది 4.73గా ఉంది. నెట్‌వర్క్ సమస్యలు, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫ్లాక్చూవేషన్స్ వల్ల ఎక్కువగా కాల్ డ్రాపింగ్స్ జరుగుతుంటాయి. నెట్‌వర్క్ లేని ప్రదేశాల్లో ఎలాంటి కాల్ డ్రాప్స్‌లేకుండా వైఫై కాలింగ్‌ను ఉపయోగించి కాల్స్‌ను చేసుకోవచ్చును.
చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..!
అసలు ఏంటి వైఫై కాలింగ్...!
బలహీనమైన సిగ్నల్, నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో వైఫై కాలింగ్ సహాయంతో రెగ్యులర్ కాల్స్ చేయవచ్చును. మనం వాడే టెలికాం ఆపరేటర్ వైఫై కాలింగ్‌కు మద్దతు ఇస్తే , దాంతోపాటుగా బలమైన వైఫై కనెక్షన్ ఉన్నట్లయితే వైఫై కాలింగ్‌ను వాడవచ్చును. వైఫై కాలింగ్ ఎలా అంటే..వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేంజర్ ఇతర యాప్స్‌నుపయోగించి చేసే వాయిస్ ఒవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ మాదిరిగానే వైఫై కాలింగ్ చేయవచ్చును.
వైఫై నుపయోగించుకొని పలు టెలికాం ఆపరేటర్లు కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తాయి. వైఫై కాలింగ్ సేవలను ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో , వొడాఫోన్ ఐడియాతో సహా చాలా టెలికాం ఆపరేటర్లు వై-ఫై కాలింగ్ సపోర్ట్ అందిస్తున్నాయి. టెలికాం ఆపరేటర్లు వైఫై కాలింగ్‌పై ఎలాంటి అదనపు ఛార్జీలను విధించరు. వైఫై కాలింగ్‌లో కాల్ డ్రాపింగ్ అసలు ఉండదు. వైఫై కాలింగ్‌లో సేవ VoLTE (వాయిస్ ఓవర్ LTE) నెట్‌వర్క్‌కు బదులుగా VoIP (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్) ద్వారా కాల్స్ చేస్తుంది.
మీ ఆండ్రాయిడ్‌ఫోన్లలో వైఫై కాలింగ్‌ను ఇలా పొందండి.
- మీ స్మార్ట్‌ఫోన్‌లో ముందుగా సెట్టింగ్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేయండి
- సెట్టింగ్స్‌లో మొబైల్ నెట్‌వర్క్‌పై క్లిక్ చేయండి.
- మొబైల్ నెట్‌వర్క్స్‌లో మీ టెలికాం నెట్‌వర్క్స్‌కు సంబంధించిన ఆపరేటర్‌పై క్లిక్ చేయండి.
- టెలికాం ఆపరేటర్‌పై క్లిక్ చేయగానే కిందికి స్క్రోల్ చేయగానే ‘మేక్ కాల్స్ యూజింగ్ వైఫై’ క్లిక్ చేస్తే సరిపోతుంది. నెట్‌వర్క్ సరిగ్గా లేని ప్రాంతాల్లో, వైఫై అందుబాటులో ఉన్నప్పుడు కాల్ డ్రాపింగ్‌లేకుండా మీకు నచ్చిన వ్యక్తులకు కాల్స్‌చేసుకోవచ్చును.
గమనిక: ఈ సెట్టింగ్ ఆయా స్మార్ట్‌ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్‌ను బట్టి మారుతూ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment