నాసా మరో సంచలనం..! చంద్రుడిపై వైఫై నెట్‌ వర్క్‌ నేరుగా భూమిపైకే...! | NASA is studying how to build a Wi-Fi network on the moon | Sakshi
Sakshi News home page

NASA: మరో సంచలనం..చంద్రుడిపై వైఫై నెట్‌ వర్క్‌ ప్రయోగం

Published Mon, Oct 18 2021 5:42 PM | Last Updated on Mon, Oct 18 2021 6:47 PM

NASA is studying how to build a Wi-Fi network on the moon   - Sakshi

అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. చంద్రుడిపై వైఫై నెట్‌వర్క్‌ను నిర్మించే అంశంపై రీసెర్చ్‌ చేస్తున్నట్లు నాసా గ్లాన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ టెక్నాలజీ ఇంక్యేబేషన్‌ సెంటర్‌ డైరక్టర్‌ మ్యారి లోబో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి(అమెరికాలో) మీద తలెత్తే సమస్యల్ని పరిష్కరించేలా "ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుడిపైకి పంపడం' అనేది గొప్ప అవకాశం భావిస్తున్నట్లు తెలిపారు. 

ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌ 

నాసా చివరి సారిగా అపోలో17 ప్రాజెక్ట్‌ పేరుతో లూనార్ రోవింగ్ వాహనాన్ని ఉపయోగించి జియాలజిస్ట్‌ హారిసన్ ష్మిత్‌ను 1972 డిసెంబర్‌ నెలలో చంద్రుని ఉపరితలంపై (లూనార్‌ సర్ఫేజ్‌) పంపింది. ఆ సందర్భంగా హారిసన్‌ ష్మిత్‌ చంద్రుడిపై రాళ్లు,దూళిని భూమిపైకి తీసుకొచ్చారు. ఆ తరువాత చంద్రుడిపైకి ఎవరు వెళ‍్లలేదు. అయితే తాజాగా నాసా చంద్రడిపైకి మనుషుల్ని పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

గతేడాది ఆర్టెమిస్‌ పేరుతో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 2021లో చంద్రునిపైకి అన్‌క్రూయిడ్‌ మెషిన్‌(స్పేస్‌ క్రాఫ్ట్‌)లను పంపనుంది.2023లో ఆస్ట్రోనాట్స్‌ను తరువాత 2024లో లూనార్‌ ల్యాండింగ్ చేయనున్నారు. తద్వారా మానవులు, రోవర్లు, సైన్స్ ఇన్ట్రుమెంట్స్‌, మైనింగ్ ఎక్విమెంట్‌, చంద్రుడిపై ఉన్న ఆర్టెమిస్ బేస్‌క్యాంప్‌కు నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థను భూమిపైకి తీసుకొని వచ్చేలా ప్రయోగాలు చేస్తున్నట్లు నాసా కంపాస్ ల్యాబ్ లీడ్ స్టీవ్ ఒలెసన్ తెలిపారు. 

చంద్రుడి నుంచి అమెరికాకు వైఫై

నాసా ఇంక్యుబేషన్‌ సెంటర్‌ డైరెక్టర్‌ మ్యారి లోబో ప్రెస్‌ రిపోర్ట్‌లో..నేషనల్ డిజిటల్ ఇంక్లూజన్ అలయన్స్ నివేదిక ప్రకారం..'క్లీవ్‌ల్యాండ్‌'లో దాదాపు 31శాతం  కుటుంబాలకు ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ 'గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ పార్ట్‌నర్‌షిప్' భూమి మీద డిజిటల్ సమస్యకు పరిష్కరించేలా చంద్రుడిని ఉపయోగించుకునే అవకాశం ఉందో లేదో చూడాలంటూ  నాసాకి చెందిన గ్లెన్ రీసెర్చ్ సెంటర్‌ని సంప్రదించింది.


దీంతో నాసా గ్లెన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కంపాజ్‌ బృందం..చంద్రమండలంపై ఉన్న లూనార్‌ సర్ఫేస్‌ ఏరియా ప్రాంతంలోని వైఫ్‌ నెట్‌ వర్క్‌ నుంచి కింద ఉన్న క్లీవ్‌ల్యాండ్‌కు అందించేలా ఇక్కడి భూ వాతావరణం ఎంతమేరకు సహకరిస్తుందనే అంశంపై విశ్లేషణ జరిపినట్లు స్టీవ్ ఒలెసన్ వెల్లడించారు. ఒలేసన్ ప్రకారం, క్లీవ్‌ల్యాండ్‌లో వైఫై రూటర్ల నుంచి దాదాపు 20,000 విద్యుత్‌ స్తంబాలకు అటాచ్‌ చేయడం ద్వారా ఇంటర్నెట్‌ అందుతుందని గుర్తించారు. ఈ రూటర్లను 100 గజాల కంటే ఎక్కువ దూరం ఉంచడం ద్వారా నలుగురు కుటుంబసభ్యులు ఉండే ఇంటికి సెకనుకు 7.5 మెగాబిట్‌ల డౌన్‌లోడ్ స్పీడ్‌ను పొందుతుందని అన్నారు. దీంతో స్కూల్ వర్క్, బ్యాంక్, ఆన్‌ లైన్‌ షాపింగ్‌ చేసేందుకు ఇంటర్నెట్‌ ఉపయోగపడుతుందని,  4కే  వీడియో లేదా గేమింగ్‌ను ప్రసారం చేయడానికి సరిపోదు" అని ఒలేసన్ చెప్పారు. 

ఈ సందర్భంగా ఒలేసన్‌ మాట్లాడుతూ క్లీవ్‌ ల్యాండ్‌లో పరిసరాలకు తగ్గట్లు ఆర్టెమిస్ ప్రాజెక్ట్‌లో చంద్రుడి మీద నుంచి వైఫై సౌకర్యాన్ని అందించేలా బ్లూప్రింట్‌ తయారు చేస్తామని చెప్పారు. అదే సమయంలో చంద్రుడిపై ఉన్న హై టెంపరేచర్‌లో సైతం ఉష్ణోగ్రతలతో సైతం చంద్రుడి మీద నుంచి ధూళి, రాళ్లతో పాటు వైఫై నెట్‌ వర్క్‌లకు అక్కడి వాతావరణం అనుకూలిస్తుందా అనే విషయాలపై రీసెర్చ్‌ చేస్తామన్నారు.

చదవండి: చంద్రుడిపై రొమాన్స్‌.. రూ.158 కోట్లు నష్టం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement