Space agency NASA
-
సరికొత్త స్పేస్ సూట్
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’అర్టిమిస్–3 ప్రయోగం కోసం సన్నద్ధమవుతోంది. చందమామ ఉపరితలంపైకి వ్యోమగాములను పంపించడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగానికి ప్రాడా కంపెనీ తన వంతు సాయం అందిస్తోంది. చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాముల కోసం అత్యాధునిక స్పేస్ సూట్‌ను(అక్సియోమ్ ఎక్స్ట్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్–ఏఎక్స్ఈఎంయూ) అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఏరోసేŠస్స్ అండ్ ఫ్యాషన్, అక్సియోమ్ స్పేస్ సంస్థల సహకారం తీసుకుంది. ఇటలీలోని మిలన్ నగరంలో ఇంటర్నేషనల్ అస్ట్రోనాటికల్ కాంగ్రెస్‌లో ఈ స్పేస్ సూట్‌ను ప్రదర్శించింది. మిగిలి ఉన్న కొన్ని పరీక్షల్లో సైతం ఈ స్పేస్‌సూట్ నెగ్గితే చంద్రుడిపైకి వెళ్లే నాసా వ్యోమగాములు ఇదే ధరించబోతున్నారు. ఇప్పటిదాకా అందుబాటులో ఉన్నవాటితో పోలిస్తే ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ప్రాడా కంపెనీ చెబుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకొని, దీర్ఘకాలం మన్నికగా ఉండేలా ఈ స్పేస్‌సూట్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రాడా కంపెనీ చీఫ్ మార్కెటింగ్ అధికారి లోరెంజో బెర్టిలీ చెప్పారు. దృఢత్వం, భద్రతా ప్రమాణాల విషయంలో దీనికి తిరుగులేదని అన్నారు. ఇప్పటిదాకా జరిగిన పరీక్షల్లో ప్రాడా స్పేస్‌సూట్ నెగ్గింది. 2025లో తుది పరీక్షలు జరుగబోతున్నాయి. వివిధ రకాల వ్రస్తాల ఉత్పత్తిలో ప్రాడాకు మంచి పేరుంది. -
Sunita Williams: రోదసి యాత్రకు మరో ముహూర్తం ఖరారు
తల్లాహస్సీ: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధం అయ్యారు. ఈస్టర్న్ డే టైమ్ (EDT) ప్రకారం ఈ నెల 17న సాయంత్రం 6.16 గంటలకు(భారత కాలమానం ప్రకారం 18వ తేదీ తెల్లవారుజామున 3:46 గంటలకు) ప్రయోగం నిర్వహించనున్నారు.అయితే, నిన్న(మే 7న) తలపెట్టిన ఈ యాత్ర ఆగిపోయిన విషయం తెలిసిందే. సాంకేతిక కారణాల దృష్ట్యా రోదసీ యాత్ర ఆగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎక్స్ ద్వారా తెలిపింది. కాగా, మరమ్మతుల కోసం అట్లాస్-5 రాకెట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. తల భాగంలో బోయింగ్ ‘స్టార్ లైనర్’ వ్యోమనౌకను అమర్చిన ఈ రాకెట్ ప్రయాణానికి సిద్ధంగా ఇప్పటివరకు ఫ్లోరిడాలో కేప్ కెనెవరాల్ ల్యాంచ్ పాడ్ మీద నిలిచివుంది. .@NASA’s Boeing Crew Flight Test now is targeted to launch no earlier than 6:16 p.m. EDT Friday, May 17, to the @Space_Station. Following a thorough data review completed on Tuesday, ULA (United Launch Alliance) decided to replace a pressure regulation valve on the liquid oxygen… pic.twitter.com/Bh6bOHzgJt— NASA Space Operations (@NASASpaceOps) May 8, 2024 రాకెట్ సెంటార్ అప్పర్ స్టేజిలోని ఆక్సిజన్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ పాడైపోవటంతో ప్రయోగం చివరి నిమిషంలో వాయిదాపడింది. వాల్వును మార్చడానికి అట్లాస్-5ను వర్టికల్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీకి తరలిస్తారు. అనంతరం, ఈస్టర్న్ డే టైమ్ (EDT) ప్రకారం ఈ నెల 17న సాయంత్రం 6.16 గంటలకు(భారత కాలమానం ప్రకారం 18వ తేదీ తెల్లవారుజామున 3:46 గంటలకు) ప్రయోగం నిర్వహించనున్నారు.ఇక, ఈ మిషన్ ప్రకారం.. వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వారం పాటు బసచేస్తారు. వాస్తవానికి స్టార్‌లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్ఎస్కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ప్రస్తుతం ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక ఈ తరహా సేవలు అందిస్తోంది. స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి. -
Giant Magellan Telescope: పేద్ద టెలిస్కోప్
ఈ అనంత విశ్వంలో మనం ఒంటరి జీవులమేనా? లేక ఇతర గ్రహాల్లోనో, లేదంటే విశ్వాంతరాల్లో సుదూరాల్లోనో మరెక్కడైనా జీవముందా? ఉంటే వాళ్లు మనలాంటి ప్రాణులేనా? మనిషిని ఎంతోకాలంగా వెంటాడుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టే ప్రయత్నాలకు మరోసారి తెర లేచింది. ఇందుకోసం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆప్టికల్ టెలీస్కోప్ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆధ్వర్యంలో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది..! ఏమిటీ జీఏంటీ? విశ్వంలో సుదూరంలో ఉన్న నక్షత్రాలు తదితరాల రసాయన విశ్లేషణ ద్వారా వాటి లోగుట్టును కనిపెట్టేందుకు అత్యధిక సామర్థ్యంతో కూడిన ఈ టెలీస్కోప్ నాసా ఆధ్వర్యంలో సిద్ధమవుతోంది... జయింట్ మగలాన్ టెలీస్కోప్ (జీఏంటీ) ► దీని ఉపరితలం వైశాల్యమే ఏకంగా 368 చదరపు మీటర్లు! ► జీఏంటీకు ఏడు అతి పెద్ద పట్టకాల సమూహాన్ని బిగిస్తున్నారు. వీటి పొడవు 24.5 మీటర్లు. ► వీటిలో కీలకమైన చివరి, ఏడో ప్రాథమిక పట్టకం పాలిషింగ్ పని చివర్లో ఉందిప్పుడు. జీవం ఉనికిని గుర్తించడంలో కీలకం... సుదూరాల్లోని గ్రహాలు, శకలాలు తదితర గోళాల్లో ఉపరితలాలను ముందెన్నడూ లేనంత స్పష్టంగా పరిశీలించేందుకు జీఏంటీ తోడ్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘ముఖ్యంగా భూమి మాదిరిగానే వాటిమీద పర్వతమయ ప్రాంతాలు ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. తద్వారా వాటిమీద జీవం ఉనికి తాలూకు జాడ కూడా చిక్కుతుంది‘ అని వారు అంటున్నారు. 20 టన్నుల ఆప్టికల్ గ్లాస్! ► జీఏంటీ తాలూకు పట్టకాల తయారీ పని అరిజోనా యూనివర్సిటీలోని రిచర్డ్ ఎఫ్.కారిస్ మిర్రర్ ల్యాబ్‌లో పెద్ద ఎత్తున జరుగుతోంది. ► ఇందుకోసం ఏకంగా 20 టన్నుల అత్యంత శుద్ధమైన ఆప్టికల్ గ్లాస్‌ను వాడుతున్నారు. ► దాన్ని 1,185 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తున్నారు. ► ఈ గ్లాస్ కరిగిన కొద్దీ బయటి కొసవైపు కుంభాకారపు పట్టకంగా రూపుదాలుస్తుంది. ► తర్వాత దాన్ని 3 నెలల పాటు చల్లబరుస్తారు. ► అనంతరం పాలిíÙంగ్ చేస్తారు. ► చివరగా ఏడు అద్దాలనూ కలగలిపి ఒకే పెద్ద పట్టకంగా బిగిస్తారు. ► అప్పుడిక ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక టెలీస్కోప్లన్నింటి కంటే జీఏంటీ కనీసం 4 రెట్లు హెచ్చు రిజల్యూషన్, 200 రెట్లు అధిక సున్నితత్వంతో పనిచేసే టెలిస్కోప్‌గా మారుతుంది. ► జేమ్స్వెబ్తో సహా ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న ఏ టెలీస్కోప్‌కూ ఇంత పెద్ద పట్టకం లేదు. అయితే ఇన్ ఫ్రారెడ్ కాంతిలో విశ్వాన్ని పరిశీలించే శక్తి ఇప్పుడు తయారవుతున్న జీఏంటీతో సహా ఏ టెలీస్కోప్‌కూ లేదు. ఆ సామర్థ్యం ఇప్పటిదాకా జేమ్స్ వెబ్ కు మాత్రమే సొంతం. ► జీఏంటీ పొడవు 39 మీటర్లు. దీని తయారీకి 2,100 టన్నుల స్టీలు వాడుతున్నారు! కొసమెరుపు: ఈ జీఏంటీ టెలీస్కోప్ పూర్తిగా తయారై అందుబాటులోకి రావడానికి కనీసం మరో ఆరేళ్లన్నా పట్టొచ్చట. అంటే, దశాబ్దాంతం దాకా వేచి చూడాల్సిందే! నేషనల్ డెస్క్, సాక్షి -
అంతరిక్షంలో పెట్రోల్ బంకులు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాసా
పెట్రోల్ బంకులు భూమి మీదే కాదు ఇకపై అంతరిక్షంలో ఏర్పాటు కానున్నాయి. భూమి మీద వాహనదారులు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ కొట్టించుకొని ప్రయాణం చేస్తుంటే.. అదే మానవుడు (ఆస్ట్రోనాట్స్) అంతరిక్షంలో ఇంధనంతో స్పేస్‌లో ప్రయాణించనున్నాడు. గత కొంత కాలంగా స్పేస్‌లో దేశాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల రష్యా అంతరిక్షంలో బాధతారాహిత్యంగా ప్రవర్తించింది. యాంటీ శాటిలైట్ మిస్సైల్ పరీక్షలో భాగంగా తన సొంత శాటిలైట్‌ను పేల్చేసింది. దీంతో శాటిలైట్‌కు చెందిన 1,500కు పైగా ఉపగ్రహ శకలాలు 2000 కి.మీ ఎత్తు లేదా అంతకన్నా తక్కువ ఎత్తులో ఉండే భూ కక్ష్య లో (ఎల్ఈఓ)లో తిరుగుతున్నాయి. రష్యా తీరుపై అగ్రరాజ్యం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా మతిలేని చర్యల వల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని సిబ్బంది ప్రాణ భయంతో ఐఎస్ఎస్ క్యాప్సూల్స్‌లో దాక్కోవాల్సి వచ్చినట్లు ద్వజమెత్తింది. అయితే ఇలా శాటిలైట్లను పేల్చడంతో పాటు ఇతర శకలాల వల్ల ఉపగ్రహాలకు నష్టం వాటిల్లనుంది. అందుకే పలు దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు..ఆ శకలాలు ఉపగ్రహాలపై నిలిపేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన న్యూమన్ స్పేస్ సంస్థ 'ఇన్ స్పేస్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్' పేరుతో కాలం చెల్లిన ఉగప్రహాల శకలాలు, రాకెట్ల విడిబాగాలతో అంతరిక్షంలో థ్రస్ట్ పుట్టుకొచ్చేలా ప్రయోగాలు ప్రారంభించింది. అంటే అంతరిక్షంలో రాకెట్లు ముందుకు ప్రయాణించడానికి ఈ థ్రస్ట్ ఉపయోగపడుతుంది. థ్రస్ట్ రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. అలా థస్ట్ రావాలంటే ఇంధనం అవసరం. అందుకే థస్ట్ల కోసం స్పేస్‌లోనే శకలాలతో ఇంధనం తయారు చేయనున్నారు. ఒకరకంగా దీన్ని అంతరిక్షంలో పెట్రోల్ బంక్‌లను ఏర్పాటు చేయడం అన్నమాటే. భవిష్యత్ అవసరాలకోసం నాసా ప్రయోగాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో న్యూమన్ స్పేస్ సంస్థ ప్రయోగాలు చేస్తుంది. ప్రయోగాలు పూర్తయితే అక్కడ కూడా ఇంధనం దొరకనుంది. -
నాసా మరో సంచలనం..! చంద్రుడిపై వైఫై నెట్ వర్క్ నేరుగా భూమిపైకే...!
అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. చంద్రుడిపై వైఫై నెట్‌వర్క్‌ను నిర్మించే అంశంపై రీసెర్చ్ చేస్తున్నట్లు నాసా గ్లాన్ రీసెర్చ్ సెంటర్ టెక్నాలజీ ఇంక్యేబేషన్ సెంటర్ డైరక్టర్ మ్యారి లోబో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి(అమెరికాలో) మీద తలెత్తే సమస్యల్ని పరిష్కరించేలా "ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుడిపైకి పంపడం' అనేది గొప్ప అవకాశం భావిస్తున్నట్లు తెలిపారు. ఆర్టెమిస్ ప్రోగ్రామ్ నాసా చివరి సారిగా అపోలో17 ప్రాజెక్ట్ పేరుతో లూనార్ రోవింగ్ వాహనాన్ని ఉపయోగించి జియాలజిస్ట్ హారిసన్ ష్మిత్‌ను 1972 డిసెంబర్ నెలలో చంద్రుని ఉపరితలంపై (లూనార్ సర్ఫేజ్) పంపింది. ఆ సందర్భంగా హారిసన్ ష్మిత్ చంద్రుడిపై రాళ్లు,దూళిని భూమిపైకి తీసుకొచ్చారు. ఆ తరువాత చంద్రుడిపైకి ఎవరు వెళ్లలేదు. అయితే తాజాగా నాసా చంద్రడిపైకి మనుషుల్ని పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. The Human Exploration and Operations team continues to persevere, hitting critical hardware milestones and contract awards for the #Artemis program. Our plan to land the first woman and next man on the Moon in 2024 is on track! https://t.co/8lFHpoWY0l — Kathy Lueders (@KathyLueders) September 21, 2020 గతేడాది ఆర్టెమిస్ పేరుతో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 2021లో చంద్రునిపైకి అన్క్రూయిడ్ మెషిన్(స్పేస్ క్రాఫ్ట్)లను పంపనుంది.2023లో ఆస్ట్రోనాట్స్‌ను తరువాత 2024లో లూనార్ ల్యాండింగ్ చేయనున్నారు. తద్వారా మానవులు, రోవర్లు, సైన్స్ ఇన్ట్రుమెంట్స్, మైనింగ్ ఎక్విమెంట్, చంద్రుడిపై ఉన్న ఆర్టెమిస్ బేస్‌క్యాంప్‌కు నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థను భూమిపైకి తీసుకొని వచ్చేలా ప్రయోగాలు చేస్తున్నట్లు నాసా కంపాస్ ల్యాబ్ లీడ్ స్టీవ్ ఒలెసన్ తెలిపారు. చంద్రుడి నుంచి అమెరికాకు వైఫై నాసా ఇంక్యుబేషన్ సెంటర్ డైరెక్టర్ మ్యారి లోబో ప్రెస్ రిపోర్ట్‌లో..నేషనల్ డిజిటల్ ఇంక్లూజన్ అలయన్స్ నివేదిక ప్రకారం..'క్లీవ్‌ల్యాండ్'లో దాదాపు 31శాతం కుటుంబాలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం ఎకనమిక్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 'గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ పార్ట్నర్షిప్' భూమి మీద డిజిటల్ సమస్యకు పరిష్కరించేలా చంద్రుడిని ఉపయోగించుకునే అవకాశం ఉందో లేదో చూడాలంటూ నాసాకి చెందిన గ్లెన్ రీసెర్చ్ సెంటర్‌ని సంప్రదించింది. దీంతో నాసా గ్లెన్ రీసెర్చ్ సెంటర్ కంపాజ్ బృందం..చంద్రమండలంపై ఉన్న లూనార్ సర్ఫేస్ ఏరియా ప్రాంతంలోని వైఫ్ నెట్ వర్క్ నుంచి కింద ఉన్న క్లీవ్‌ల్యాండ్‌కు అందించేలా ఇక్కడి భూ వాతావరణం ఎంతమేరకు సహకరిస్తుందనే అంశంపై విశ్లేషణ జరిపినట్లు స్టీవ్ ఒలెసన్ వెల్లడించారు. ఒలేసన్ ప్రకారం, క్లీవ్‌ల్యాండ్‌లో వైఫై రూటర్ల నుంచి దాదాపు 20,000 విద్యుత్ స్తంబాలకు అటాచ్ చేయడం ద్వారా ఇంటర్నెట్ అందుతుందని గుర్తించారు. ఈ రూటర్లను 100 గజాల కంటే ఎక్కువ దూరం ఉంచడం ద్వారా నలుగురు కుటుంబసభ్యులు ఉండే ఇంటికి సెకనుకు 7.5 మెగాబిట్ల డౌన్లోడ్ స్పీడ్‌ను పొందుతుందని అన్నారు. దీంతో స్కూల్ వర్క్, బ్యాంక్, ఆన్ లైన్ షాపింగ్ చేసేందుకు ఇంటర్నెట్ ఉపయోగపడుతుందని, 4కే వీడియో లేదా గేమింగ్‌ను ప్రసారం చేయడానికి సరిపోదు" అని ఒలేసన్ చెప్పారు. ఈ సందర్భంగా ఒలేసన్ మాట్లాడుతూ క్లీవ్ ల్యాండ్‌లో పరిసరాలకు తగ్గట్లు ఆర్టెమిస్ ప్రాజెక్ట్‌లో చంద్రుడి మీద నుంచి వైఫై సౌకర్యాన్ని అందించేలా బ్లూప్రింట్ తయారు చేస్తామని చెప్పారు. అదే సమయంలో చంద్రుడిపై ఉన్న హై టెంపరేచర్లో సైతం ఉష్ణోగ్రతలతో సైతం చంద్రుడి మీద నుంచి ధూళి, రాళ్లతో పాటు వైఫై నెట్ వర్క్‌లకు అక్కడి వాతావరణం అనుకూలిస్తుందా అనే విషయాలపై రీసెర్చ్ చేస్తామన్నారు. చదవండి: చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! -
చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం!
స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ పుణ్యమా అంటూ ప్రస్తుతం స్పేస్, మార్స్, శాటిలైట్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. అందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వార్త ఇలాగే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 2002 నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ 'నాసా'లో జరిగిన ఓ సంఘటన తాజాగా జరిగినట్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడం ఆసక్తికరంగా మారింది. అమెరికాకు చెందిన థాడ్ రాబర్ట్స్ చంద్ర మండలంపై కాలు మోపి, అక్కడ ప్రయోగాలు చేయాలనే కోరిక ఉండేది. కోరికకు తగ్గట్లు అదృష్టం వరించింది. నాసా లూనార్ ల్యాబ్‌లో శిక్షణ పొందే అవకాశం లభించింది. అక్కడ వ్యోమగాములుగా శిక్షణ పొందితే ఏదో ఒకరోజు స్పేస్‌లో అడుగపెట్టే అవకాశం లభిస్తుంది. కానీ థాడ్లోని సె**కోరికలు ఆ అవకాశాన్ని దూరం చేశాయి. నాసాలో ట్రైనింగ్ తీసుకుంటుండగా.. అదే ల్యాబ్‌లో పనిచేసే ప్రియురాలు 'టిఫనీ ఫౌలర్'తో ఏకంగా చంద్రుడి మీద తన 'కోరిక' తీర్చుకోవాలని అనుకున్నాడు. కానీ అందుకు నాసా అంగీకరించదు? మరేం ఏం చేయాలి? అని అనుకున్నాడు. అప్పుడే థాడ్లో దుర్భుద్ది పుట్టింది. 101 గ్రాముల రాళ్లు, దూళిపై.. ఆ దుర్భుద్ది మనసును తొలిచేస్తున్నా నాసా ఇచ్చే ట్రైనింగ్‌లో పాల్గొనేవాడు. అదే సమయంలో నాసా చంద్ర మండలం నుంచి 101 గ్రాముల రాళ్లు, దూళిని కిందకు తెచ్చిందని, వాటిని అమ్మితే కోటీశ్వరులు కావొచ్చని తెలుసుకున్నాడు. అంతే చంద్రమండలంలో తన కోరికను తీర్చుకోలేడు కాబట్టి.. నాసా కేంద్రంలో ఉన్న రాళ్లు, దూళిని దొంగిలించి వాటిపై శృంగారం చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా తన ప్లాన్‌ను తన ప్రియురాలికి చెప్పడంతో ఆమెకూడా అందుకు అంగీకరించింది. పనిలో పనిగా రాళ్లను, దూళిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు బెల్జియంకు చెందిన సైంటిస్ట్‌తో తనని తాను ఆర్బ్ రాబిన్సన్గా పరిచయం చేసుకున్నాడు. చంద్రుడి రాళ్లను అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గ్రాముకు రూ.5 వేల డాలర్లు భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.3.70 లక్షలు చెల్లించేందుకు ఆ శాస్త్రవేత్త అంగీకరించాడు. ‘సె** ఆన్ ది మూన్’.. తన ప్లాన్‌లో భాగంగా చంద్రుడి రాళ్లను నాసా కేంద్రంలో ఎక్కడ భద్రపరిచారో తెలుసుకున్నాడు. వాటిని దొంగిలించేందుకు తన స్నేహితులు సాయం తీసుకున్నాడు. అనుకున్న ప్రకారం సేఫ్టీ లాకర్‌ను బద్దలు కొట్టి అందులో ఉన్న రాళ్లను, దూళిని దొంగిలించాడు. చివరికి ‘సె** ఆన్ ది మూన్’ పేరుతో ఓ హోటల్లో తన ప్రియురాలితో కోరిక తీర్చుకున్నాడు. అనంతరం రాళ్లు, దూళి బరువు ఎక్కువగా ఉంటే డబ్బు ఎక్కువగా వస్తుందని.. వాటిని కల్తీ చేశాడు. నాసాకు కోట్లలో నష్టం.. అనంతరం ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సైంటిస్ట్‌కు అమ్మేందుకు ఓ ప్రాంతానికి వచ్చాడు. అప్పటికే థాడ్ రాబర్ట్స్ చేసిన దొంగతనం గురించి సమాచారం అందుకున్న ఫెడర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. థాడ్ రాబర్ట్స్ చేసిన చెత్త పనివల్ల నాసా రూ.157 కోట్లు విలువ చేసే చంద్రుడి దూళిని కోల్పోయింది. ఈ దొంగతనంపై విచారణ చేపట్టిన కోర్టు నిందితుడికి 8ఏళ్లు జైలు శిక్ష విధించడంతో చివరికి కటకటాల పాలయ్యాడు. చదవండి: Moon Rover Motorcycle: చంద్రుడిపై నడిచే బైక్...! ఓ లుక్కేయండి...! -
'దేవుని చేయి' చిత్రాన్ని పోస్ట్ చేసిన నాసా
ఈ అంతరిక్షం ఎన్నో అద్భుతాలతో నిండి ఉంది. దీని అందం అసమానమైనది. కొన్నిసార్లు అంతరిక్షంలో జరిగే సంఘటనలతో మనం ఆశ్చర్యపోతుంటాం. తాజాగా అలాంటి సంఘటన మరోసారి అంతరిక్షంలో చోటు చేసుకుంది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ఇటీవల ఒక చిత్రాన్ని షేర్ చేసింది. దాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా షేర్ చేసిన ఈ చిత్రానికి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ అని పేరు పెట్టింది. ఈ చిత్రాన్ని వేలాది మంది లైక్ చేస్తున్నారు. ఈ ఫోటో ఒక చేతిని పోలి ఉంది. చేతి వేళ్ళ మధ్యలో ఎలాగైతే కొంచెం ఖాళీ స్థలం ఉంటుందో అలాగే ఈ ఫోటోలో నలుపుగా ఉండి మిగతా మొత్తం బంగారు వర్ణంలో కనిపిస్తుంది. ఇది నిజంగానే 'దేవుని చేయి' లేదా మరేదైనా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నక్షత్రంలోంచి పుట్టుకొచ్చినట్టున్న ఈ చేయి ఆకారానికి ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’గా పిలుస్తున్నారు. ఒక అత్యున్నత శక్తి ఆశీర్వాదాలను ఇస్తున్నట్లు ఇందులో కనిపిస్తోంది. బాహ్య అంతరిక్ష సౌందర్యాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు. ఈ బంగారు నిర్మాణం అయస్కాంతీకరణ శక్తి వల్ల విడుదలయ్యే శక్తి కణాలతో కూడిన నిహారిక అని నాసా తెలిపింది. ఒక నక్షత్రం పేలిన తర్వాత ఇలాంటి పల్సర్లు మిగిలిపోతాయి.(చదవండి: ఎస్బీఐ కార్డ్ యూజర్లకు బంపర్ ఆఫర్!) View this post on Instagram A post shared by NASA Chandra X-ray Observatory (@nasachandraxray) ఈ పల్సర్‌ను పిఎస్ఆర్ బి1509-58 అని పిలుస్తారు. ఇది 19 కిలోమీటర్ల పరిది వరకు విస్తరించి ఉంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇది సెకనుకు 7 సార్లు తన చుట్టూ తిరుగుతోంది. ఇది భూమికి 17,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. నెటిజన్లు ఈ చిత్రాలను చూసి ఆశ్చర్యపడుతున్నారు. "దీనిని "మిడాస్ చేయి" అని పిలవాలి!" అని ఒక వినియోగదారుడు కామెంట్ చేస్తే, మరొకరు "నాకు ఇది శివుడి మూడవ కంటి నుండి అగ్నిలా కనిపిస్తుంది, అతని చెవిరింగు అతని కేశాలంకరణలో ఉన్న గంగా లాగా" కనిపిస్తున్నట్లు పేర్కొన్నాడు. మీరు ఏమని భావిస్తున్నారో క్రింద కామెంట్ చేయండి. -
ఖర్చు ఎక్కువైనా సరే అనుకునేవారు ఓసారి ట్రై చేయొచ్చు
అంతరిక్షంలో సరికొత్త రేస్ మొదలైంది. గగన వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టే రోజు వచ్చేస్తోంది. ఆదివారం వర్జిన్ గెలాక్టిక్ సంస్థ.. 20న బ్లూఆరిజిన్ కంపెనీ తమ స్పేస్ ఫ్లైట్లను పంపుతున్నాయి. స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్ష యాత్రలకు సిద్ధమవుతోంది. ఖర్చు కాస్త ఎక్కువైనా సరే.. ఓసారి అంతరిక్ష ప్రయాణం చేయాలనుకునే వారు ఓసారి ట్రై చేయొచ్చు. ఈ స్పేస్ టూరిజం విశేషాలు తెలుసుకుందామా? –సాక్షి సెంట్రల్ డెస్క్ ఇన్నాళ్లూ స్పేస్.. ప్రయోగాలకే.. వాణిజ్యపరంగా అంతరిక్ష యాత్రలు నిర్వహించేందుకు పలు దేశాలు, కొన్ని సంస్థలు చాలా ఏళ్ల కిందే ప్రయత్నా లు మొదలుపెట్టాయి. స్పేస్ టెక్నాలజీ చాలా క్లిష్టమైనది. రాకెట్లు, స్పేస్ షటిల్స్, ఇతర పరికరాలకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. దీంతో పెద్ద దేశాలకు చెందిన ప్రభుత్వ అంతరిక్ష సంస్థలు మాత్రమే అంతరిక్ష యాత్రలు చేపట్టగలిగాయి. అవి కూడా అన్వేషణలు, ప్రయోగాలకే పరిమితం అయ్యాయి. అయితే 2001 ఏప్రిల్ 30న రష్యా తొలిసారిగా శాస్త్రవేత్తలు కాకుండా సాధారణ వ్యక్తిని వాణిజ్యపరంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. రష్యాకు చెందిన సోయూజ్ రాకెట్ ద్వారా ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)’కు వెళ్లిన అమెరికన్ వ్యాపారవేత్త డెన్నిస్ టిటో తొలి అంతరిక్ష యాత్రికుడిగా నిలిచాడు. ఏడు రోజులు అంతరిక్షంలో ఉన్నందుకు 2కోట్ల డాలర్లు (ఇప్పుడు మన కరెన్సీలో రూ.147 కోట్లు) చార్జిగా చెల్లించాడు. తర్వాత మరికొందరు మా త్రమే అంతరిక్ష యాత్రలకు వెళ్లగలిగారు. విపరీతమైన ఖర్చు, స్పేస్‌లోకి వెళ్లేందుకు అవకాశాలు తక్కువగా ఉండటమే దీనికి కారణం. ప్రైవేటు కంపెనీల రాకతో.. డెన్నిస్ టిటో ఘటన తర్వాత అంతరిక్ష యాత్రలకు వెళ్లాలనుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే పలు ప్రైవేటు కంపెనీలు తెరపైకి వచ్చా యి. ధనిక వ్యాపారవేత్తలు రిచర్డ్ బ్రాస్నన్ వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ, అమెజాన్ యజమాని జెఫ్ బెజోస్ బ్లూఆరిజిన్ కంపెనీని, టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీని స్థాపించి ప్రయోగాలు మొదలుపెట్టారు. అవన్నీ ఇటీవలే ఓ కొలిక్కి వచ్చాయి. మనుషులను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లి, తిరిగి సురక్షితంగా ల్యాండ్ అయ్యే స్పేస్ షటిల్స్‌ను వారు అభివృద్ధి చేశారు. ఇద్దరూ సొంత స్పేస్ ఫ్లైట్లలో.. ఆదివారం జరిగే అంతరిక్ష యాత్ర లో వర్జిన్ గెలాక్టిక్ యజమాని రిచర్డ్ బ్రాస్నన్, కొందరు కంపెనీ ఉద్యోగులు స్పేస్‌లోకి వెళ్తున్నారు. 20న బ్లూఆరిజిన్ నిర్వహించనున్న యాత్రలో జెఫ్ బెజోస్, మరికొందరు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి రానున్నారు. ఇద్దరూ కూడా తమ సొంత కంపెనీల స్పేస్ ఫ్లైట్ల గగన విహారానికి వెళ్తుండటం గమనార్హం. ఈ యాత్రలతో అంతరిక్ష పర్యాటకానికి దారులు తెరుచుకున్నట్టేనని నిపుణులు చెప్తున్నారు. స్పేస్ కంపెనీల మధ్య పోటీ పెరుగుతుండటంతో టూర్ వ్యయం కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఏయే కంపెనీలు.. ఎప్పుడెప్పుడు? స్పేస్ ఎక్స్ ఈ సంస్థ తమ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ‘ది క్రూ డ్రాగన్’ స్పేస్ షటిల్‌ను ఇప్పటికే విజయవంతంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం నాసా శాస్త్రవేత్తలను, పరికరాలను ఐఎస్ఎస్కు తీసుకెళ్లడానికి, తిరిగి తీసుకురావడానికి వినియోగిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ‘ఇన్స్పిరేషన్4’ పేరిట తొలి వాణిజ్య యాత్ర చేపట్టనున్నారు. అందులో నలుగురు ప్యాసింజర్లు స్పేస్ టూర్‌కు వెళ్తున్నారు. అయితే దీనికి అయ్యే చార్జీలను బయటపెట్టలేదు. ఇదే సంస్థ భవిష్యత్తులో విస్తృతంగా అంతరిక్ష యాత్రలు చేపట్టేందుకు ‘స్టార్ షిప్’ స్పేస్ ఫ్లైట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా 2023లో చంద్రుడిపైకి యాత్ర చేపడతామని ప్రకటించింది. జపాన్‌కు చెందిన యుసకు మెజవా అనే వ్యాపారవేత్త అందులో ఇప్పటికే సీటు బుక్ చేసుకున్నారు. ఆక్సిమ్ స్పేస్ స్పేస్ ఎక్స్, నాసా సంస్థలతో కలిసి ఆక్సిమ్ స్పేస్ సంస్థ అంతరిక్ష యాత్రలకు ప్లాన్ చేస్తోంది. 2022 జనవరిలో నలుగురు ఎనిమిది రోజుల స్పేస్ టూర్‌కు వెళ్లనున్నారు. దీనికి ఒక్కొక్కరు 5.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) చెల్లిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన రాకెట్, స్పేష్ షటిల్‌ను ఈ యాత్రలకు వినియోగించనున్నారు. బ్లూ ఆరిజిన్ ఈ సంస్థ తమ న్యూషెపర్డ్ పునర్వినియోగ రాకెట్ ద్వారా ఇప్పటికే పలు ప్రయోగాలు నిర్వహించింది. ఈ నెల 20న జెఫ్ బెజోస్, మరో ఐదుగురు సిబ్బంది, శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ద్వారా కాసేపు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి రానున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి వాణిజ్య యాత్రలను ప్రారంభిస్తామని బ్లూఆరిజిన్ ప్రకటించింది. వర్జిన్ గెలాక్టిక్ వీఎస్ఎస్ యూనిటీ ప్రత్యేక విమానం ద్వారా ‘స్పేస్ షిప్ టూ’ స్పేస్ వెహికల్‌ను భూమికి 10 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి అంతరిక్షంలోకి స్పేస్ షటిల్‌ను ప్రయోగించడం ఈ సంస్థ ప్రత్యేకత. ఇప్పటికే పలుమార్లు విజయవంతంగా ప్రయోగించింది. తాజాగా ఆదివారం తొలి ఫ్లైట్ జరగనుంది. వచ్చే ఏడాది నుంచి వాణిజ్యపరంగా అంతరిక్ష యాత్రలను మొదలుపెట్టనుంది. కొద్ది నిమిషాల్లోనే ముగిసే ఈ టూర్ల కోసం ఇప్పటికే 600 మంది టికెట్లు బుక్ చేసుకున్నట్టు ప్రకటించింది. ఒక్కొక్కరికి 2.5 లక్షల డాలర్లు (రూ.18.5 కోట్లు) చార్జిగా నిర్ణయించింది. ఇదే వరుసలో మరిన్ని కంపెనీలు కూడా.. రష్యా స్పేస్ ఏజెన్సీ తమ సోయూజ్ రాకెట్ ద్వారా ఇప్పటికే అంతరిక్ష యాత్రలు నిర్వహిస్తుండగా.. బోయింగ్ కంపెనీ స్పేస్ టూరిజం కోసం స్టార్‌లైనర్ స్పేస్ ఫ్లైట్‌ను అభివృద్ధి చేస్తోంది. ది డ్రీమ్ ఆఫ్ గేట్‌వే ఫౌండేషన్ భూమి చుట్టూ తిరుగుతూ ఉండే అంతరిక్ష హోటల్ ‘వోయేజర్ స్టేషన్’ను ప్లాన్ చేస్తోంది. దానికి సంబంధించి పనులు జరుగుతున్నాయి. కొన్ని నిమిషాల నుంచి... కొన్ని రోజుల దాకా.. అంతరిక్ష యాత్రలు అంటే.. కొన్ని నిమిషాలు గడిపి తిరిగిరావడం నుంచి కొద్దిరోజులు ఐఎస్ఎస్లో ఉండటం దాకా వేర్వేరుగా ఉంటాయి. అంతరిక్షంలోకి వెళ్లి గుండ్రంగా ఉన్న భూమిని, కాస్త దగ్గరగా చంద్రుడిని, సువిశాల విశ్వాన్ని వీక్షించడానికి చేసే సాధారణ స్పేస్ ఫ్లైట్లు అరగంట నుంచి గంటలో ముగుస్తాయి. వీటికి ఒక స్థాయి ధనికులు కూడా భరించే స్థాయిలో కొన్ని లక్షల నుంచి ఒకట్రెండు కోట్ల వరకు చార్జీలు ఉంటాయి. ఐఎస్ఎస్లో కొద్దిరోజులు గడపడం, భూమి చుట్టూ పరిభ్రమించడం సుదీర్ఘ యాత్రల కిందికి వస్తాయి. వీటికి పదుల కోట్లలో ఖర్చు అవుతుంది. నాసా కూడా రంగంలోకి.. అంతరిక్ష రంగంలో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా స్పేస్ టూరిజంపై దృష్టి పెట్టింది. భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్ను) ప్రైవేటుకు అప్పగించి.. తాము అందులో ఓ వినియోగదారుడిగా కొనసాగాలని భావిస్తోంది. ఇప్పటికే నాసాకు చెందిన వ్యోమగాములు, పరికరాలను ఐఎస్ఎస్కు తీసుకెళ్లేందుకు స్పేస్ ఎక్స్, బోయింగ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నేళ్లలో అంతరిక్ష యాత్రలు చేపడతామని, వెళ్లి రావడానికి అయ్యే ఖర్చును నిర్ధారించాల్సి ఉందని నాసా ఇప్పటికే పేర్కొంది. ఐఎస్ఎస్లో గడిపితే ఒక్కో టూరిస్టు రోజుకు 35 వేల డాలర్లు (రూ.11 లక్షలు) చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. -
ఈ రోబోలు ఏం చేస్తాయంటే..
వాషింగ్టన్ : శాటిలైట్లను రిపేర్ చేయడంతో పాటు అంతరిక్ష యుద్ధాలు తలెత్తితే శత్రు స్పేస్‌క్రాఫ్ట్‌లను ధ్వంసం చేయగల అత్యాధునిక రోబోల తయారీకి అమెరికా సంసిద్ధమైంది. ఈ మేరకు అమెరికన్ డిఫెన్స్ రీసెర్చి ఏజెన్సీతో నాసా చేతులు కలిపింది. ‘సర్వీస్ స్టేషన్స్ ఇన్ ఆర్బిట్’ గా వ్యవహరించే ఈ రోబోటిక్ శాటిలైట్స్ ఉపగ్రహాల జీవితకాలాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ఉపగ్రహాలకు చిన్నపాటి మరమ్మత్తులు చేసి వాటిని నిర్వహించే సామర్ధ్యం ఉండేలా రోబోలను అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం అంతరిక్షంలో ఉపగ్రహాల్లో లోపాలు తలెత్తితే రిపేర్ చేయడం అసాధ్యం. వాటిని రీప్లేస్ చేయడం అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో నెక్ట్స్‌జెన్ రోబోలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నాసా చెబుతోంది. -
గంటలలో చుక్కల లోకానికి...
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్త రూపొందించిన స్టార్ ట్రెక్ సినిమా తరహా వ్యోమనౌక డిజైన్ ఇది. ఇలాంటి నౌకను రూపొందిస్తే గనక.. కాంతికన్నా వేగంగా కొన్ని నిమిషాల్లో ఈ సౌరకుటుంబాన్నే దాటేసి జూమ్మంటూ దూసుకుపోవచ్చట. సుదూర తీరాల్లో ఉన్న గ్రహాలపైకి వెళ్లాలంటే వందల, వేల ఏళ్లు పడుతుంది. అందువల్ల కొన్ని రోజులు లేదా నెలల్లోనే అంతదూరాలకు ప్రయాణించాలంటే కాంతికన్నా వేగంగా ప్రయాణించే వ్యోమనౌకలు ఉంటే తప్ప సాధ్యం కాదు. అందుకే అలాంటి నౌక తయారీకోసమని నాసా భౌతిక శాస్త్రవేత్త హరాల్డ్ వైట్.. ఆర్టిస్టు మార్క్ రేడ్మేకర్తో కలిసి ఈ డిజైన్‌ను రూపొందించారు. ‘ఐఎక్స్ఎస్ ఎంటర్ప్రైజ్’ అని పేరుపెట్టిన ఈ నౌక వాస్తవ రూపం దాలిస్తే.. భూమికి 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆల్ఫా సెంటారీ అనే నక్షత్రానికి రెండు వారాల్లోనే చేరుకోవచ్చట.