
వాషింగ్టన్ : శాటిలైట్లను రిపేర్ చేయడంతో పాటు అంతరిక్ష యుద్ధాలు తలెత్తితే శత్రు స్పేస్‌క్రాఫ్ట్‌లను ధ్వంసం చేయగల అత్యాధునిక రోబోల తయారీకి అమెరికా సంసిద్ధమైంది. ఈ మేరకు అమెరికన్ డిఫెన్స్ రీసెర్చి ఏజెన్సీతో నాసా చేతులు కలిపింది. ‘సర్వీస్ స్టేషన్స్ ఇన్ ఆర్బిట్’ గా వ్యవహరించే ఈ రోబోటిక్ శాటిలైట్స్ ఉపగ్రహాల జీవితకాలాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.
ఉపగ్రహాలకు చిన్నపాటి మరమ్మత్తులు చేసి వాటిని నిర్వహించే సామర్ధ్యం ఉండేలా రోబోలను అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం అంతరిక్షంలో ఉపగ్రహాల్లో లోపాలు తలెత్తితే రిపేర్ చేయడం అసాధ్యం. వాటిని రీప్లేస్ చేయడం అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో నెక్ట్స్‌జెన్ రోబోలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నాసా చెబుతోంది.