ఈ అనంత విశ్వంలో మనం ఒంటరి జీవులమేనా? లేక ఇతర గ్రహాల్లోనో, లేదంటే విశ్వాంతరాల్లో సుదూరాల్లోనో మరెక్కడైనా జీవముందా? ఉంటే వాళ్లు మనలాంటి ప్రాణులేనా? మనిషిని ఎంతోకాలంగా వెంటాడుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టే ప్రయత్నాలకు మరోసారి తెర లేచింది. ఇందుకోసం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆప్టికల్ టెలీస్కోప్ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆధ్వర్యంలో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది..!
ఏమిటీ జీఏంటీ?
విశ్వంలో సుదూరంలో ఉన్న నక్షత్రాలు తదితరాల రసాయన విశ్లేషణ ద్వారా వాటి లోగుట్టును కనిపెట్టేందుకు అత్యధిక సామర్థ్యంతో కూడిన ఈ టెలీస్కోప్ నాసా ఆధ్వర్యంలో సిద్ధమవుతోంది...
జయింట్ మగలాన్ టెలీస్కోప్ (జీఏంటీ)
► దీని ఉపరితలం వైశాల్యమే ఏకంగా 368 చదరపు మీటర్లు!
► జీఏంటీకు ఏడు అతి పెద్ద పట్టకాల సమూహాన్ని బిగిస్తున్నారు. వీటి పొడవు 24.5 మీటర్లు.
► వీటిలో కీలకమైన చివరి, ఏడో ప్రాథమిక పట్టకం పాలిషింగ్ పని చివర్లో ఉందిప్పుడు.
జీవం ఉనికిని గుర్తించడంలో కీలకం...
సుదూరాల్లోని గ్రహాలు, శకలాలు తదితర గోళాల్లో ఉపరితలాలను ముందెన్నడూ లేనంత స్పష్టంగా పరిశీలించేందుకు జీఏంటీ తోడ్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘ముఖ్యంగా భూమి మాదిరిగానే వాటిమీద పర్వతమయ ప్రాంతాలు ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. తద్వారా వాటిమీద జీవం ఉనికి తాలూకు జాడ కూడా చిక్కుతుంది‘ అని వారు అంటున్నారు.
20 టన్నుల ఆప్టికల్ గ్లాస్!
► జీఏంటీ తాలూకు పట్టకాల తయారీ పని అరిజోనా యూనివర్సిటీలోని రిచర్డ్ ఎఫ్.కారిస్ మిర్రర్ ల్యాబ్‌లో పెద్ద ఎత్తున జరుగుతోంది.
► ఇందుకోసం ఏకంగా 20 టన్నుల అత్యంత శుద్ధమైన ఆప్టికల్ గ్లాస్‌ను వాడుతున్నారు.
► దాన్ని 1,185 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తున్నారు.
► ఈ గ్లాస్ కరిగిన కొద్దీ బయటి కొసవైపు కుంభాకారపు పట్టకంగా రూపుదాలుస్తుంది.
► తర్వాత దాన్ని 3 నెలల పాటు చల్లబరుస్తారు.
► అనంతరం పాలిíÙంగ్ చేస్తారు.
► చివరగా ఏడు అద్దాలనూ కలగలిపి ఒకే పెద్ద పట్టకంగా బిగిస్తారు.
► అప్పుడిక ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక టెలీస్కోప్‌లన్నింటి కంటే జీఏంటీ కనీసం 4 రెట్లు హెచ్చు రిజల్యూషన్, 200 రెట్లు అధిక సున్నితత్వంతో పనిచేసే టెలిస్కోప్‌గా మారుతుంది.
► జేమ్స్‌వెబ్‌తో సహా ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న ఏ టెలీస్కోప్‌కూ ఇంత పెద్ద పట్టకం లేదు. అయితే ఇన్ ఫ్రారెడ్ కాంతిలో విశ్వాన్ని పరిశీలించే శక్తి ఇప్పుడు తయారవుతున్న జీఏంటీతో సహా ఏ టెలీస్కోప్‌కూ లేదు. ఆ సామర్థ్యం ఇప్పటిదాకా జేమ్స్ వెబ్ కు మాత్రమే సొంతం.
► జీఏంటీ పొడవు 39 మీటర్లు. దీని తయారీకి 2,100 టన్నుల స్టీలు వాడుతున్నారు!
కొసమెరుపు:
ఈ జీఏంటీ టెలీస్కోప్ పూర్తిగా తయారై అందుబాటులోకి రావడానికి కనీసం మరో ఆరేళ్లన్నా పట్టొచ్చట. అంటే, దశాబ్దాంతం దాకా వేచి చూడాల్సిందే!
నేషనల్ డెస్క్, సాక్షి
Giant Magellan Telescope: పేద్ద టెలిస్కోప్
Published Sat, Sep 30 2023 5:15 AM | Last Updated on Sat, Sep 30 2023 6:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment