Tele scopes
-
Giant Magellan Telescope: పేద్ద టెలిస్కోప్
ఈ అనంత విశ్వంలో మనం ఒంటరి జీవులమేనా? లేక ఇతర గ్రహాల్లోనో, లేదంటే విశ్వాంతరాల్లో సుదూరాల్లోనో మరెక్కడైనా జీవముందా? ఉంటే వాళ్లు మనలాంటి ప్రాణులేనా? మనిషిని ఎంతోకాలంగా వెంటాడుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టే ప్రయత్నాలకు మరోసారి తెర లేచింది. ఇందుకోసం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆప్టికల్ టెలీస్కోప్ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆధ్వర్యంలో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది..! ఏమిటీ జీఏంటీ? విశ్వంలో సుదూరంలో ఉన్న నక్షత్రాలు తదితరాల రసాయన విశ్లేషణ ద్వారా వాటి లోగుట్టును కనిపెట్టేందుకు అత్యధిక సామర్థ్యంతో కూడిన ఈ టెలీస్కోప్ నాసా ఆధ్వర్యంలో సిద్ధమవుతోంది... జయింట్ మగలాన్ టెలీస్కోప్ (జీఏంటీ) ► దీని ఉపరితలం వైశాల్యమే ఏకంగా 368 చదరపు మీటర్లు! ► జీఏంటీకు ఏడు అతి పెద్ద పట్టకాల సమూహాన్ని బిగిస్తున్నారు. వీటి పొడవు 24.5 మీటర్లు. ► వీటిలో కీలకమైన చివరి, ఏడో ప్రాథమిక పట్టకం పాలిషింగ్ పని చివర్లో ఉందిప్పుడు. జీవం ఉనికిని గుర్తించడంలో కీలకం... సుదూరాల్లోని గ్రహాలు, శకలాలు తదితర గోళాల్లో ఉపరితలాలను ముందెన్నడూ లేనంత స్పష్టంగా పరిశీలించేందుకు జీఏంటీ తోడ్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ‘ముఖ్యంగా భూమి మాదిరిగానే వాటిమీద పర్వతమయ ప్రాంతాలు ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. తద్వారా వాటిమీద జీవం ఉనికి తాలూకు జాడ కూడా చిక్కుతుంది‘ అని వారు అంటున్నారు. 20 టన్నుల ఆప్టికల్ గ్లాస్! ► జీఏంటీ తాలూకు పట్టకాల తయారీ పని అరిజోనా యూనివర్సిటీలోని రిచర్డ్ ఎఫ్.కారిస్ మిర్రర్ ల్యాబ్‌లో పెద్ద ఎత్తున జరుగుతోంది. ► ఇందుకోసం ఏకంగా 20 టన్నుల అత్యంత శుద్ధమైన ఆప్టికల్ గ్లాస్‌ను వాడుతున్నారు. ► దాన్ని 1,185 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తున్నారు. ► ఈ గ్లాస్ కరిగిన కొద్దీ బయటి కొసవైపు కుంభాకారపు పట్టకంగా రూపుదాలుస్తుంది. ► తర్వాత దాన్ని 3 నెలల పాటు చల్లబరుస్తారు. ► అనంతరం పాలిíÙంగ్ చేస్తారు. ► చివరగా ఏడు అద్దాలనూ కలగలిపి ఒకే పెద్ద పట్టకంగా బిగిస్తారు. ► అప్పుడిక ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక టెలీస్కోప్లన్నింటి కంటే జీఏంటీ కనీసం 4 రెట్లు హెచ్చు రిజల్యూషన్, 200 రెట్లు అధిక సున్నితత్వంతో పనిచేసే టెలిస్కోప్‌గా మారుతుంది. ► జేమ్స్వెబ్తో సహా ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న ఏ టెలీస్కోప్‌కూ ఇంత పెద్ద పట్టకం లేదు. అయితే ఇన్ ఫ్రారెడ్ కాంతిలో విశ్వాన్ని పరిశీలించే శక్తి ఇప్పుడు తయారవుతున్న జీఏంటీతో సహా ఏ టెలీస్కోప్‌కూ లేదు. ఆ సామర్థ్యం ఇప్పటిదాకా జేమ్స్ వెబ్ కు మాత్రమే సొంతం. ► జీఏంటీ పొడవు 39 మీటర్లు. దీని తయారీకి 2,100 టన్నుల స్టీలు వాడుతున్నారు! కొసమెరుపు: ఈ జీఏంటీ టెలీస్కోప్ పూర్తిగా తయారై అందుబాటులోకి రావడానికి కనీసం మరో ఆరేళ్లన్నా పట్టొచ్చట. అంటే, దశాబ్దాంతం దాకా వేచి చూడాల్సిందే! నేషనల్ డెస్క్, సాక్షి -
త్రీమకీస్ -69
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 69 - మల్లాది వెంకటకృష్ణమూర్తి ‘‘అర్థమైందా?’’ నాయకుడు అడిగాడు. ‘‘అయింది.’’ వానర్ ఓసారి కాలర్ సర్దుకుని తలుపు వైపు నడిచాడు. ‘‘మేము గమనిస్తూనే ఉంటాం. జాగ్రత్త’’ నాయకుడు హెచ్చరించాడు. వానర్ బయటకి నడిచి చేతులు పెకైత్తి గట్టిగా అరిచాడు - ‘‘కాల్చకండి. నేను దొంగల్లో ఒకర్ని కాదు.’’ చుట్టూ చూశాడు. ఆ వీధిలో కొన్ని పోలీస్వేన్లు, ఓ బస్ అటు, ఇటు నిలబడి ఆ రోడ్ని రెండుపక్కలా మూసేశాయి. నాలుగైదు పోలీస్కార్లు ఎదురుగా ఆగి ఉన్నాయి. వాటి వెనక దాక్కున్న పోలీసుల చేతుల్లోని తుపాకీ గొట్టాలు వానర్ వైపు గురిపెట్టి ఉన్నాయి. అంతా తన వంకే చూస్తున్నారని వానర్ గ్రహించాడు. చుట్టుపక్కల మేడల మీద టెలిస్కోప్స్ అమర్చిన గన్స్‌తో పోలీసులు ఉన్నారని కూడా గ్రహించాడు. రెండు అంబులెన్స్‌లు, పక్కనే తెల్ల కోట్లు ధరించిన వైద్యులు కనిపించారు. ఓ పోలీస్ అధికారి అతన్నే జాగ్రత్తగా గమనిస్తున్నాడు. వానర్ బేంక్‌లోని దొంగలతో చెప్పాడు - ‘‘మీరూ కాల్చకండి. మీ డిమాండ్స్ గురించి మాట్లాడాలిగా!’’ ‘‘నువ్వెవరు?’’ లౌడ్ స్పీకర్లోంచి పోలీస్ అధికారి కంఠం వినిపించింది. ‘‘నేను మనిషిని.’’ ‘‘కన్ఫ్యూజ్ అవక. భయపడక. నేనడిగింది నువ్వు బేంక్ కస్టమర్‌వా లేక ఉద్యోగివా అని’’ మళ్ళీ వినపడింది. ‘‘ఆ రెండూ కాదనుకుంటా.’’ ‘‘సరే. నీ పేరు?’’ ‘‘వార్. ఆంగ్లో ఇండియన్ని.’’ కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత అదే కంఠం స్పీకర్లోంచి వినిపించింది - ‘‘లోపల ఎలా ఉంది?’’ ‘‘అంతా బావుంది. తుపాకీ గుళ్ళతో లోపల రంధ్రాలు పడి కొన్ని పెచ్చులు నేల మీద పడ్డాయి. తర్వాత స్వచ్ఛభారత్ వాలంటీర్లని పిలిపించండి.’’ ‘‘ఎవరికైనా హాని జరిగిందా?’’ ‘‘లేదు. వీళ్ళు అహింసా సిద్ధాంతం గల దొంగలు.’’ ‘‘కాదని చెప్పు’’ లోపల నించి అతనికి వినిపించింది. ‘‘ముందు అందరి మానసిక వత్తిడిని తగ్గించాలని, అది ముఖ్యం అని అలా చెప్పాను. ఇంత దాకా మీరు ఎవరికీ హాని చేయలేదని వాళ్ళకి తెలిస్తే మీ మీద గౌరవం కలుగుతుంది’’ వానర్ చెప్పాడు. దొంగలు ఒకరితో మరొకరు చర్చించుకున్నాక నాయకుడు కసిరాడు - ‘‘పెరగాల్సింది గౌరవం కాదు. భయం’’ అని! ‘‘లోపల అసలేం జరిగింది?’’ పోలీస్ ఆఫీసర్ అడిగాడు. ‘‘నేను ఇప్పుడే లోపలకి వచ్చాను. కాబట్టి నాకు తెలీదు.’’ ‘‘ఇప్పుడే వచ్చావా వార్? బేంకులోకి దొంగలు ప్రవేశించిన రెండున్నర గంటల నించి నువ్వు అక్కడ ఉన్నావు.’’ ‘‘అవునవును. రెండున్నర గంటలూ రెండున్నర నిమిషాల్లా గడిచిపోయాయని చెప్పదలచుకున్నాను’’ వానర్ చెప్పాడు. ‘‘చేతులు దించి మా వైపు రా. మేం కాల్చం.’’ వానర్ చేతులు దింపి చెప్పాడు. ‘‘నొప్పిగా ఉంటే దింపా తప్ప మీరు దింపమన్నందుకు కాదు. నేను పేవ్మెంట్ దిగితే దొంగలు నన్ను కాల్చేస్తారు. వీరు అహింసావాదులు కారు. హింసావాదులు అని చెప్పమన్నారు.’’ ‘‘ఇక్కడ బేంక్ ఉద్యోగస్థులు, కస్టమర్ల బంధుమిత్రులు ఆదుర్దాగా ఉన్నారు. లోపల ఏం జరిగిందో తెలుసుకోవాలి. కాబట్టి వారి అనుమతి తీసుకుని ఇక్కడికి రా. మళ్ళీ వెనక్కి వెళ్ళచ్చు.’’ దొంగలు మళ్ళీ ఒకళ్ళని మరొకరు సంప్రదించుకున్నారు ‘‘వార్! వార్!’’ లోపల నించి వినిపించింది. ‘‘ఏమిటి?’’ వెనక్కి తిరిగి అడిగాడు. ‘‘వాళ్ళెవరు - చేతులు దింపమనడానికి? చేతులు పెకైత్తే ఉంచు. లేదా...’’ వెంటనే వానర్ చేతులు పెకైత్తి చెప్పాడు - ‘‘ఎత్తకపోతే దొంగలు కాల్చేస్తామంటున్నారు. వాళ్ళు హింసావాదులు.’’ ‘‘నీకు చెవుడా, ఇందాకటి నించి పిలుస్తూంటే? ఇంకోసారి మేం చెప్పింది నీకు వినపడకపోతే నీ కాళ్ళ మీద కాలుస్తాం. నువ్వు రోడ్డు మీద పడిపోయి రక్తం కారుతూ మా డిమాండ్స్ చెప్తావో లేక నించుని చెప్తావో నీ ఇష్టం’’ లోపల నించి నాయకుడు అరిచాడు. వెంటనే వెనక్కి తిరిగి తలుపు వైపు అడుగులు వేసి చెప్పాడు. ‘‘సారీ! వినపడలేదు. మీరు కూడా ఇక్కడికి వచ్చి నిలబడితే నా పరిస్థితి అర్థం అవుతుంది. వాళ్ళలా లౌడ్ స్పీకర్లో చెప్తారా? అది మీ డిమాండ్ అని అడగనా?’’ ‘‘ముందు చేతులు పెకైత్తు.’’ ‘‘ఓ! సారీ. మరిచాను.’’ వెంటనే రోడ్డు అవతల గుమిగూడిన వారి నించి ప్రశ్నలు గట్టిగా వినపడ్డాయి - ‘‘మా వారెలా ఉన్నారు?... మా కూతురు ఎలా ఉంది?... ఎర్ర షర్ట్‌లోని బట్టతలాయనకి ఇంకా ఏం కాలేదుగా?’’ (దొంగలు పెట్టిన డిమాండ్స్...?)