గంటలలో చుక్కల లోకానికి...
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్త రూపొందించిన స్టార్ ట్రెక్ సినిమా తరహా వ్యోమనౌక డిజైన్ ఇది. ఇలాంటి నౌకను రూపొందిస్తే గనక.. కాంతికన్నా వేగంగా కొన్ని నిమిషాల్లో ఈ సౌరకుటుంబాన్నే దాటేసి జూమ్మంటూ దూసుకుపోవచ్చట. సుదూర తీరాల్లో ఉన్న గ్రహాలపైకి వెళ్లాలంటే వందల, వేల ఏళ్లు పడుతుంది. అందువల్ల కొన్ని రోజులు లేదా నెలల్లోనే అంతదూరాలకు ప్రయాణించాలంటే కాంతికన్నా వేగంగా ప్రయాణించే వ్యోమనౌకలు ఉంటే తప్ప సాధ్యం కాదు.
అందుకే అలాంటి నౌక తయారీకోసమని నాసా భౌతిక శాస్త్రవేత్త హరాల్డ్ వైట్.. ఆర్టిస్టు మార్క్ రేడ్‌మేకర్‌తో కలిసి ఈ డిజైన్‌ను రూపొందించారు. ‘ఐఎక్స్‌ఎస్ ఎంటర్‌ప్రైజ్’ అని పేరుపెట్టిన ఈ నౌక వాస్తవ రూపం దాలిస్తే.. భూమికి 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆల్ఫా సెంటారీ అనే నక్షత్రానికి రెండు వారాల్లోనే చేరుకోవచ్చట.