Star Trek
-
అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్ రిపీట్..!
చిత్ర పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ రష్యా చిత్ర బృందం అక్టోబర్ 5 న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు అంతరిక్ష యాత్రకు సిధ్దమయ్యాడు. స్పేస్ టూరిజం పరుగులు..! పలు అంతరిక్ష సంస్థలు బ్లూ ఆరిజిన్, స్పేస్ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ స్పేస్టూరిజం కోసం అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్ సంస్థలు ప్రైవేటు వ్యక్తులతో అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. తాజాగా జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రెండో అంతరిక్ష యాత్రను త్వరలోనే చేపట్టనుంది. ఈ యాత్రలో ప్రముఖ హాలీవుడ్ నటుడు విలియమ్ షట్నర్ పాలుపంచుకొనున్నాడు. విలియమ్ షట్నర్ స్పందిస్తూ..ఈ అంతరిక్ష యాత్ర పట్ల ఎంతో థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాను. అంతేస్థాయిలో కొంచెం భయం కూడా వేస్తోందని విలియమ్ షట్నర్ పేర్కొన్నారు. ఈ అంతరిక్ష యాత్ర అక్టోబర్ 12 న జరగనుంది. చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1120కిమీ ప్రయాణం..! భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే.. స్టార్ ట్రెక్ సినిమాతో ఫేమస్...! స్టార్ ట్రెక్ సినిమాలో కెప్టెన్ జేమ్స్ టి. కిర్క్ పాత్రను విలియమ్ షట్నర్ పోషించాడు. అంతరిక్షానికి సంబంధించిన సినిమాలో స్టార్ ట్రెక్ అప్పట్లో గణనీయమైన విజయాన్ని సాధించింది. విలియమ్ షట్నర్ సినిమాలో పొందిన అనుభూతిని ఇప్పుడు నిజజీవితంలో అంతరిక్ష యాత్రను చేపట్టనున్నాడు. అతి పెద్ద వయస్కుడిగా రికార్డు...! ఒకవేళ బ్లూ ఆరిజిన్ చేపట్టనున్న ప్రయోగం విజయవంతమైతే రోదసీ యాత్రను చేపట్టిన అతి పెద్ద వయస్కుడిగా విలియమ్ షట్నర్ రికార్డును నెలకొల్పనున్నాడు. ప్రస్తుతం విలియమ్ షట్నర్ వయసు 90. గతంలో ఇదే సంస్థ నిర్వహించిన అంతరిక్షయాత్రలో పాల్గొన్న 82 ఏళ్ల వాలీ ఫంక్ అత్యంత పెద్ద వయసురాలిగా రికార్డును నమోదుచేసింది. We can’t wait for your mission to space on #NewShepard @williamshatner. See you at Launch Site One. https://t.co/4MLt2yaKh4 — Blue Origin (@blueorigin) October 5, 2021 చదవండి: ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు..! ఆ కంపెనీకి మాత్రం కాసుల వర్షమే..! -
అయాన్ల రాపిడితో ఎగిరే విమానం
బోస్టన్: పేద్ద రెక్కలు, భారీ ఆకారం, బరువైన ఇంజిన్, భరించలేని ధ్వని.. ఇవీ విమానం అంటే గుర్తొచ్చేవి. అమెరికా శాస్త్రీయ కాల్పనిక టీవీ సిరీస్ ‘స్టార్ ట్రెక్’లో కనిపించే విమానాన్ని చూశారా? భవిష్యత్తులో విమానయాన రంగాన్నే మార్చేస్తాయని భావిస్తున్న ‘స్టార్ ట్రెక్’ విమానాల గురించి తెలుసుకోవాల్సిందే. ఆ విమానం నుంచి స్ఫూర్తి పొందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మిట్) శాస్త్రవేత్తలు దహన ఉద్గారాలు వెదజల్లని, శబ్దం చేయని, తేలికైన విమానాన్ని రూపొందించి పరీక్షించారు. సాధారణ విమానం కదలడానికి దోహదపడే భాగాలు ఇందులో ఉండవు. కేవలం అయాన్ల చలనం ద్వారా కలిగే ఒత్తిడితోనే పైకి లేస్తుంది. రెక్కలకు ముందు 20 వేల పాజిటివ్ చార్జ్ కాపర్ తీగలుంటాయి. వెనక నెగటివ్ చార్జ్ తీగలుంటాయి. ఈ రెండింటి మధ్య చర్య జరిగి పాజిటివ్ చార్జ్ అయాన్లు విడుదలై నెగటివ్ చార్జ్ గల తీగలవైపు ఆకర్షితమవుతాయి. ఈ చర్యల్లో అయాన్లు గాలిలోని మరికొన్ని అణువులతో చర్య జరిపి విమానం ముందుకు కదలడానికి గల ఇంధన శక్తిని అందిస్తాయి. -
గంటలలో చుక్కల లోకానికి...
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్త రూపొందించిన స్టార్ ట్రెక్ సినిమా తరహా వ్యోమనౌక డిజైన్ ఇది. ఇలాంటి నౌకను రూపొందిస్తే గనక.. కాంతికన్నా వేగంగా కొన్ని నిమిషాల్లో ఈ సౌరకుటుంబాన్నే దాటేసి జూమ్మంటూ దూసుకుపోవచ్చట. సుదూర తీరాల్లో ఉన్న గ్రహాలపైకి వెళ్లాలంటే వందల, వేల ఏళ్లు పడుతుంది. అందువల్ల కొన్ని రోజులు లేదా నెలల్లోనే అంతదూరాలకు ప్రయాణించాలంటే కాంతికన్నా వేగంగా ప్రయాణించే వ్యోమనౌకలు ఉంటే తప్ప సాధ్యం కాదు. అందుకే అలాంటి నౌక తయారీకోసమని నాసా భౌతిక శాస్త్రవేత్త హరాల్డ్ వైట్.. ఆర్టిస్టు మార్క్ రేడ్మేకర్తో కలిసి ఈ డిజైన్‌ను రూపొందించారు. ‘ఐఎక్స్ఎస్ ఎంటర్ప్రైజ్’ అని పేరుపెట్టిన ఈ నౌక వాస్తవ రూపం దాలిస్తే.. భూమికి 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆల్ఫా సెంటారీ అనే నక్షత్రానికి రెండు వారాల్లోనే చేరుకోవచ్చట.