అయాన్ల రాపిడితో ఎగిరే విమానం
బోస్టన్: పేద్ద రెక్కలు, భారీ ఆకారం, బరువైన ఇంజిన్, భరించలేని ధ్వని.. ఇవీ విమానం అంటే గుర్తొచ్చేవి. అమెరికా శాస్త్రీయ కాల్పనిక టీవీ సిరీస్ ‘స్టార్ ట్రెక్’లో కనిపించే విమానాన్ని చూశారా? భవిష్యత్తులో విమానయాన రంగాన్నే మార్చేస్తాయని భావిస్తున్న ‘స్టార్ ట్రెక్’ విమానాల గురించి తెలుసుకోవాల్సిందే. ఆ విమానం నుంచి స్ఫూర్తి పొందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మిట్) శాస్త్రవేత్తలు దహన ఉద్గారాలు వెదజల్లని, శబ్దం చేయని, తేలికైన విమానాన్ని రూపొందించి పరీక్షించారు.
సాధారణ విమానం కదలడానికి దోహదపడే భాగాలు ఇందులో ఉండవు. కేవలం అయాన్ల చలనం ద్వారా కలిగే ఒత్తిడితోనే పైకి లేస్తుంది. రెక్కలకు ముందు 20 వేల పాజిటివ్ చార్జ్ కాపర్ తీగలుంటాయి. వెనక నెగటివ్ చార్జ్ తీగలుంటాయి. ఈ రెండింటి మధ్య చర్య జరిగి పాజిటివ్ చార్జ్ అయాన్లు విడుదలై నెగటివ్ చార్జ్ గల తీగలవైపు ఆకర్షితమవుతాయి. ఈ చర్యల్లో అయాన్లు గాలిలోని మరికొన్ని అణువులతో చర్య జరిపి విమానం ముందుకు కదలడానికి గల ఇంధన శక్తిని అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment