VoLTE Support
-
సడన్‌గా కాల్ డిస్కనెక్ట్ అవుతోందా..! ఇలా చేయండి..!
మీరు ఓ కాల్ మాట్లాడుతున్నప్పుడు సడన్‌గా కాల్ డిస్కనెక్ట్ ఐతే హాలో..హాలో అంటూ...గొంతు చించుకుంటాం. కొన్ని సార్లు ఐతే మరీను..ఏదైనా ముఖ్యమైన విషయంపై మాట్లాడుతుంటే సడన్‌గా కాల్ డిస్కనెక్ట్ ఐతే అబ్బా ఏం నెట్వర్క్ రా బాబు..! అంటూ మన టెలికాం ఆపరేటర్‌ను తిట్టుకుంటాం.కాల్డ్రాపింగ్ సమస్యలను మనలో చాలా మంది ఎదుర్కొన్నవాళ్లమే..! కాల్డ్రాపింగ్ అవ్వకుండా ఉండే ఉపాయాల గురించి తెలుసుకుందాం.... ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో కాల్ డ్రాపింగ్ భారీగానే ఉంటుంది. రెడ్మ్యాగో అనాలిటిక్స్ ప్రకారం...గ్లోబల్ కాల్ డ్రాపింగ్ రేట్ 3 శాతం ఉండగా..భారత్‌లో అది 4.73గా ఉంది. నెట్వర్క్ సమస్యలు, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫ్లాక్చూవేషన్స్ వల్ల ఎక్కువగా కాల్ డ్రాపింగ్స్ జరుగుతుంటాయి. నెట్వర్క్ లేని ప్రదేశాల్లో ఎలాంటి కాల్ డ్రాప్స్లేకుండా వైఫై కాలింగ్‌ను ఉపయోగించి కాల్స్‌ను చేసుకోవచ్చును. చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..! అసలు ఏంటి వైఫై కాలింగ్...! బలహీనమైన సిగ్నల్, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో వైఫై కాలింగ్ సహాయంతో రెగ్యులర్ కాల్స్ చేయవచ్చును. మనం వాడే టెలికాం ఆపరేటర్ వైఫై కాలింగ్‌కు మద్దతు ఇస్తే , దాంతోపాటుగా బలమైన వైఫై కనెక్షన్ ఉన్నట్లయితే వైఫై కాలింగ్‌ను వాడవచ్చును. వైఫై కాలింగ్ ఎలా అంటే..వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్ ఇతర యాప్స్‌నుపయోగించి చేసే వాయిస్ ఒవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ మాదిరిగానే వైఫై కాలింగ్ చేయవచ్చును. వైఫై నుపయోగించుకొని పలు టెలికాం ఆపరేటర్లు కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తాయి. వైఫై కాలింగ్ సేవలను ఎయిర్టెల్, రిలయన్స్ జియో , వొడాఫోన్ ఐడియాతో సహా చాలా టెలికాం ఆపరేటర్లు వై-ఫై కాలింగ్ సపోర్ట్ అందిస్తున్నాయి. టెలికాం ఆపరేటర్లు వైఫై కాలింగ్‌పై ఎలాంటి అదనపు ఛార్జీలను విధించరు. వైఫై కాలింగ్‌లో కాల్ డ్రాపింగ్ అసలు ఉండదు. వైఫై కాలింగ్‌లో సేవ VoLTE (వాయిస్ ఓవర్ LTE) నెట్‌వర్క్‌కు బదులుగా VoIP (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్) ద్వారా కాల్స్ చేస్తుంది. మీ ఆండ్రాయిడ్ఫోన్లలో వైఫై కాలింగ్‌ను ఇలా పొందండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ముందుగా సెట్టింగ్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేయండి సెట్టింగ్స్‌లో మొబైల్ నెట్‌వర్క్‌పై క్లిక్ చేయండి. మొబైల్ నెట్‌వర్క్స్‌లో మీ టెలికాం నెట్వర్క్స్కు సంబంధించిన ఆపరేటర్‌పై క్లిక్ చేయండి. టెలికాం ఆపరేటర్‌పై క్లిక్ చేయగానే కిందికి స్క్రోల్ చేయగానే ‘మేక్ కాల్స్ యూజింగ్ వైఫై’ క్లిక్ చేస్తే సరిపోతుంది. నెట్వర్క్ సరిగ్గా లేని ప్రాంతాల్లో, వైఫై అందుబాటులో ఉన్నప్పుడు కాల్ డ్రాపింగ్లేకుండా మీకు నచ్చిన వ్యక్తులకు కాల్స్చేసుకోవచ్చును. గమనిక: ఈ సెట్టింగ్ ఆయా స్మార్ట్ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్‌ను బట్టి మారుతూ ఉంటుంది. చదవండి: చుక్కలు చూసొచ్చారట! మనం ఓ లుక్కేద్దాం -
ఇంటెక్స్ న్యూ ఫోన్... టార్గెట్ వారే!
ఐపీఎల్ ఆడియన్స్‌ను టార్గెట్‌గా చేసుకుని ఇంటెక్స్ ఓ కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.5499కు ఇంటెక్స్ ఆక్వా లయన్స్ 4జీ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. షాంపైన్, గ్రే కలర్స్‌లో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐపీఎల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసుకుని, పాక్షికంగా ఆ ఫోన్ ఫీచరింగ్ గుజరాత్ లయన్స్ బ్రాండింగ్‌ను కలిగి ఉండేలా దీన్ని ప్రవేశపెట్టింది. ఇంటెక్స్ ఆక్వా లయన్స్ 4జీ ఫీచర్స్.... ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాల్ 5 అంగుళాల ఎఫ్డబ్ల్యూవీజీఏ డిస్ప్లే 1.3గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ 1 జీబీ ర్యామ్ 8జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 64జీబీ వరకు విస్తరణ మెమరీ 2000ఎంఏహెచ్ బ్యాటరీ 5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 2 మెగాపిక్సెల్ ఫ్లాష్ కెమెరా -
జియో.. యూజర్లకు పెద్ద తలనొప్పి!
రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ జియో సర్వీస్ అంటూ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించారు. తక్కువ రోజుల్లోనే కోట్లమంది జియో సిమ్ యూజర్లను సంపాదించుకున్నారు. టెల్కోలు గగ్గోలు పెడుతున్నా తన పంథాను ఏ మాత్రం మార్చుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ఆగస్టులో జియో సర్వీస్ తీసుకొచ్చినా.. సెప్టెంబర్ 5నుంచి అధికారికంగా ఈ జియో సిమ్ సర్వీస్ లాంచ్ చేశారు. ఈ డిసెంబర్ 31వరకూ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, డాటా బ్రౌజింగ్, డౌన్ లోడ్ సర్వీసులు అంటూ మార్కెట్లోకి దూసుకొచ్చారు. అయితే ఈ విషయం తెలిసిన కస్టమర్లు తొలుత జియో సిమ్స్ అంటూ రిలయన్స్ డిజిటల్స్, రిలయన్స్ మినీ స్టోర్స్ ముందు క్యూ కట్టేవారు ప్రస్తుతం ఇతర నెట్ వర్క్ యూజర్స్ నెట్ వర్క్ పోర్టబిలిటీ ద్వారా నంబర్ మార్చే అవసరం లేకుండా జియోకు మారిపోతున్నారు. అధికారికంగా 50లక్షల మంది జియో యూజర్లు నమోదైనట్లు సమాచారం. ఇక జియో అధినేత అంచనా ప్రకారం వీరి సంఖ్య 10కోట్లకు చేరితే ఆపై ఈ సమస్య తీవ్రత ఎలా ఉంటుందో కూడా అంచనా వేయడం కష్టం. జియో వచ్చిన తొలి రోజుల్లో కేవలం కొద్దిమందికి మాత్రమే జియో వెలకం ఆఫర్ తెలుసు కాబట్టి.. ఫ్రీ సిమ్ పొంది హాయిగా నెట్ వాడేశారు. కానీ, సెప్టెంబర్ 5తర్వాత జియో ప్రభంజనం మొదలైంది. యూజర్ల కష్టాలు రెట్టింపయ్యాయి. అందులో ముఖ్యమైన సమస్యలు ఇవే.. వాయిస్ కాల్స్ ఫెయిల్యూర్ ఎలాంటి రీచార్జ్ చేయకుండానే నెట్ సౌకర్యం ద్వారా వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయం ఉన్నా, ఇతర నెట్ వర్క్ వారు జియో యూజర్లకు ఇంటర్ కాల్స్ కనెక్షన్ సౌకర్యం కల్పించకపోవడంతో గతవారం వరకూ 15 కోట్ల వాయిస్ కాల్స్ చేయగా అందులో దాదాపు 12 కోట్ల కాల్స్ ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. జియో ఉన్నా, ఎమర్జెన్సీ కాల్స్ కోసం ఇతర నెటవర్క్ సిమ్ లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుందని యూజర్లు వాపోతున్నారు. తగ్గిన ఇంటర్ నెట్ స్పీడ్ జియో వచ్చిన తొలిరోజుల్లో దాదాపు చాలా ప్రాంతాల్లో 40ఎంబీపీఎస్ స్పీడ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో 5ఎంబీపీఎస్ లోపే ఉండగా, కొన్ని నగరాలలో 6-10 వేగంతో నెట్ వస్తుందని చెబుతున్నారు. మూవీ చూస్తే కనీసం ఒక్కసారి కూడా బఫర్ కాని పరిస్థితి నుంచి చిన్న వీడియో చూసినా చాలా సమయం తీసుకుంటుంది. జియో యాప్స్ తో సమస్యలు జియో యాప్స్ లో ఏ ఒక్కటి స్మార్ట్ ఫోన్లో లేకున్నా.. ఇతర యాప్స్ పై ఆ ప్రభావం కనిపిస్తుంది. జియో 4జీ వాయిస్ చాలా సందర్భాలలో ఆఫ్ లైన్ అని వస్తుంది. ఆ సమయంలో మనం డాటా వాడుకోవచ్చు కానీ, వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవడానికి వీలుండదు. జియో టీవీ యాప్ క్రాష్ అయితే, తిరిగి టీవీ ఆన్ చేయడానికి చాలా సమయం వృథా చేసుకోకతప్పదు. వీఓఎల్టీఈ సపోర్ట్ లేదు 4జీ సౌకర్యం ఉన్న చాలా రకాల స్మార్ట్ ఫోన్లలో ఎల్టీఈ మాత్రమే ఉంది. VOLTE సపోర్ట్ చేయని యూజర్లకు ఈ కష్టాలు కాస్త ఎక్కువ. జియో 4జీ వాయిస్ వారికి నెట్ అందుబాటులో ఉన్నా సౌకర్యాన్ని వాడుకోలేరు. ఇప్పటివరకూ మార్కెట్లో ఉన్న ఫోన్లలో 3జీ మొబైల్స్ వాడుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. బ్యాటరీని తోడేస్తుంది రిలయన్స్ జియో తమ సర్వీస్ లను 4జీ పై అందిస్తున్నాయి. 2జీ, 3జీ సపోర్టెట్ మొబైల్స్ కంటే 4జీ మొబైల్స్ వేగంగా పనిచేయడంతో తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ తీసుకుంటుంది. కొన్ని కంపెనీలు 4జీ సర్వీసులు అందిస్తున్నా, బ్యాటరీ విషయంలో కనీసం 3వేల ఎంఏహెచ్ సామర్థ్యాన్ని కూడా అందించడం లేదు. నెట్ వినియోగించి తరచూ వీడియోలు వీక్షించే యూజర్లు ఎక్కువగా తమ ఫోన్ ను చార్జింగ్ కు కనెక్ట్ చేసి ఉంటున్న విషయం తెలిసిందే. -
రిలయన్స్ ఎల్వైఎఫ్ విండ్ 2 ఫాబ్లెట్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ లైఫ్ (ఎల్వైఎఫ్) సిరీస్ లో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లో విడుదల చేసింది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించిన రిలయన్స్ రీటైల్ ..వినియోగదారులకు బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లు అందిస్తోంది. లైఫ్ బ్రాండ్‌తో ఇప్పటికే పలు బడ్జెట్ ఫోన్లను విడుదల చేసిన రిలయన్స్ ఇపుడు తాజాగా లైఫ్ విండ్ 2 పేరుతో సరికొత్త ఫాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 8,299గా కంపెనీ నిర్ణయించింది. ఒక సిమ్‌కార్డ్ స్లాట్ మాత్రమే ఒక సమయంలో 4జీ నెట్వర్క్ కోసం ఉపయోగించాలని కంపెనీ తెలిపింది. 6 ఇంచెస్ డిస్ప్లే, 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ ఇందులో ప్రత్యేకం. లైఫ్ విండ్ 2 స్పెసిఫికేషన్స్: 6 అంగుళాల డిస్ప్లే 720x1280 ఎంపీ 1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ డ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్ 2 జీబీ రామ్ 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ 32జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా డ్యుయల్ సిమ్ సదుపాయం, 4జీ సపోర్టింగ్ 2850 ఎంఏహెచ్ బ్యాటరీ, (నాన్ రిమూవబుల్ బ్యాటరీ) -
6 వేలకే ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ క్లౌడ్ స్ట్రింగ్ హెచ్డీ పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆన్లైన్ స్టోర్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.5,599 లుగా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌కి వీవో ఎల్టీఈ (వాయిస్ ఓవర్ )సపోర్ట్ కూడా ఉంది. కాగా ఇదే ఫీచర్స్ తో ఇంటెక్స్ , ఆక్వాసెక్యూర్ పేరుతో ఇటీవల ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అయితే మిర్రర్ గ్లాస్ సపోర్టు తో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అదనపు ఆకర్షణగా నిలవనుంది. స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. 5 అంగుళాల హెచ్డీ స్క్రీన్ 720×1280 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం డ్యూయల్ సిమ్ (4జీ + 4జీ) 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1జీబీ ర్యామ్ 8జీబీ అంతర్గత మెమొరీ ఎస్డీ కార్డుతో మెమొరీని 32జీబీ వరకు పెంచుకునే సదుపాయం 8 మెగాపిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమేరా ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమేరా 2200 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఎల్ జీ 'స్టైలస్ 2' స్మార్ట్ ఫోన్
ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్ జీ స్టైలస్ 2 అనే స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.20,500గా ఉండనున్నట్టు కంపెనీ చెప్పింది. 4జీ ఎల్ టీఈ సపోర్టుతో పాటు వాయిస్ ఓవర్ ఎల్ టీఈ సపోర్టు కూడా ఈ ఫోన్ కు ప్రత్యేక ఫీచర్ గా కంపెనీ చెప్పింది. దక్షిణ కొరియాలో జరిగిన ఎమ్ డబ్ల్యూసీ 2016 ట్రేడ్ షోలో ఎల్ జీ ఈ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. తర్వాత కొద్ది సమయానికే ఈ స్మార్ట్ ఫోన్ ఆ దేశీయ మార్కెట్లోకి ఎల్ జీ తీసుకెళ్లింది. అయితే దక్షిణ కొరియాలో ఈ హ్యాండ్ సెట్ ధర రూ.22,000గా ఉండేది. ఎల్ జీ అంతకు ముందు రబ్బర్ టిప్డ్ పెన్ సీన్ తో తీసుకొచ్చిన ఎల్ జీ జీ4 స్టైలస్ మాదిరిగా కాకుండా, కచ్చితత్వం కోసం నానో కోటెడ్ టిప్ తో ఈ హ్యాండ్ సెట్ ను తీసుకొచ్చింది. స్టైలస్ ను తొలగిస్తున్నప్పుడు పాప్ అప్ మెనూ కనిపించేలా పెన్ పాప్ నూ ఈ ఫోన్ కలిగి ఉంటుంది.. పాప్ మెను, పాప్ స్కానర్ షార్ట్ కట్ లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. పెన్ కీపర్ కూడా ఈ ఫోన్ కు ప్రత్యేక ఫీచరే. ఎల్ స్టైలస్ 2 ప్రత్యేకతలు.... ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో 5.7 అంగుళాల ఇన్-సెల్ డిస్ ప్లే, స్ర్కీన్ రెసుల్యూషన్ 720x1280 పిక్సెల్స్ 1.2జీహెచ్ జెడ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ 2జీబీ ఎల్ పీడీడీఆర్3 ర్యామ్ 16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ సీఎమ్ఓఎస్ సెన్సార్ తో 13మెగా పిక్సెల్ వెనుక కెమెరా 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా 4జీ ఎల్ టీతోపాటు వాయిస్ ఓవర్ ఎల్ టీఈ 3000 ఎంఏహెచ్ 3జీ, 2జీ కనెక్టివిటీ ఆప్షన్లు డ్యుయల్ సిమ్ రెండూ మైక్రో సిమ్ లే బ్రౌన్, టైటాన్ కలర్ లలో లభ్యం