ఎల్ జీ 'స్టైలస్ 2' స్మార్ట్ ఫోన్
ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్ జీ స్టైలస్ 2 అనే స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.20,500గా ఉండనున్నట్టు కంపెనీ చెప్పింది. 4జీ ఎల్ టీఈ సపోర్టుతో పాటు వాయిస్ ఓవర్ ఎల్ టీఈ సపోర్టు కూడా ఈ ఫోన్ కు ప్రత్యేక ఫీచర్ గా కంపెనీ చెప్పింది. దక్షిణ కొరియాలో జరిగిన ఎమ్ డబ్ల్యూసీ 2016 ట్రేడ్ షోలో ఎల్ జీ ఈ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. తర్వాత కొద్ది సమయానికే ఈ స్మార్ట్ ఫోన్ ఆ దేశీయ మార్కెట్లోకి ఎల్ జీ తీసుకెళ్లింది. అయితే దక్షిణ కొరియాలో ఈ హ్యాండ్ సెట్ ధర రూ.22,000గా ఉండేది.
ఎల్ జీ అంతకు ముందు రబ్బర్ టిప్డ్ పెన్ సీన్ తో తీసుకొచ్చిన ఎల్ జీ జీ4 స్టైలస్ మాదిరిగా కాకుండా, కచ్చితత్వం కోసం నానో కోటెడ్ టిప్ తో ఈ హ్యాండ్ సెట్ ను తీసుకొచ్చింది. స్టైలస్ ను తొలగిస్తున్నప్పుడు పాప్ అప్ మెనూ కనిపించేలా పెన్ పాప్ నూ ఈ ఫోన్ కలిగి ఉంటుంది.. పాప్ మెను, పాప్ స్కానర్ షార్ట్ కట్ లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది. పెన్ కీపర్ కూడా ఈ ఫోన్ కు ప్రత్యేక ఫీచరే.
ఎల్ స్టైలస్ 2 ప్రత్యేకతలు....
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
5.7 అంగుళాల ఇన్-సెల్ డిస్ ప్లే, స్ర్కీన్ రెసుల్యూషన్ 720x1280 పిక్సెల్స్
1.2జీహెచ్ జెడ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్
2జీబీ ఎల్ పీడీడీఆర్3 ర్యామ్
16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
సీఎమ్ఓఎస్ సెన్సార్ తో 13మెగా పిక్సెల్ వెనుక కెమెరా
8 మెగాపిక్సెల్ ముందు కెమెరా
4జీ ఎల్ టీతోపాటు వాయిస్ ఓవర్ ఎల్ టీఈ
3000 ఎంఏహెచ్
3జీ, 2జీ కనెక్టివిటీ ఆప్షన్లు
డ్యుయల్ సిమ్ రెండూ మైక్రో సిమ్ లే
బ్రౌన్, టైటాన్ కలర్ లలో లభ్యం