6 వేలకే ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్ | Intex Cloud String HD With VoLTE Support Launched at Rs. 5,599 | Sakshi
Sakshi News home page

6 వేలకే ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్

Published Tue, May 24 2016 3:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM

6 వేలకే  ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్

6 వేలకే ఇంటెక్స్ స్మార్ట్ ఫోన్

 ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్‌ క్లౌడ్‌ స్ట్రింగ్‌ హెచ్‌డీ పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ని  భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఆన్‌లైన్‌ స్టోర్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. దీని ధర రూ.5,599  లుగా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్ అండ్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌కి  వీవో ఎల్‌టీఈ (వాయిస్  ఓవర్ )సపోర్ట్‌   కూడా ఉంది.

కాగా  ఇదే ఫీచర్స్ తో ఇంటెక్స్ , ఆక్వాసెక్యూర్  పేరుతో ఇటీవల ఓ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.   అయితే  మిర్రర్ గ్లాస్ సపోర్టు తో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అదనపు ఆకర్షణగా నిలవనుంది.

స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్
 720×1280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌
 ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం
డ్యూయల్ సిమ్ (4జీ + 4జీ)
 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
 1జీబీ ర్యామ్‌
 8జీబీ అంతర్గత మెమొరీ
 ఎస్డీ కార్డుతో మెమొరీని 32జీబీ వరకు పెంచుకునే సదుపాయం
 8 మెగాపిక్సల్‌ ఆటోఫోకస్‌ రేర్‌ కెమేరా
 ఎల్‌ఈడీ ఫ్లాష్‌
 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా
 2200 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement