న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ ఫిర్యాదులు గణనీయంగా వస్తున్న నేపథ్యంలో సేవల నాణ్యత నిబంధనలను సమీక్షించడంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి పెట్టింది. ప్రస్తుతం టెలికం సర్కిల్ స్థాయిలో చేస్తున్న నెట్‌వర్క్ పనితీరు సమీక్షను జిల్లా స్థాయిలోనూ నిర్వహించాలని భావిస్తోంది. ఈ క్రమంలో సరీ్వసుల నాణ్యత నిబంధనల్లో కాల్ డ్రాప్ పరామితులు, కాల్ సక్సెస్ రేటు మొదలైనవి కఠినతరం చేయాలని ట్రాయ్ ప్రతిపాదించింది.
ఈ ప్రతిపాదనలపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను సెపె్టంబర్ 20లోగా, ముసాయిదా నిబంధనలపై అక్టోబర్ 5న కౌంటర్ కామెంట్లు దాఖలు చేయాలని ట్రాయ్ సూచించింది. మొబైల్ టెలికమ్యూనికేషన్స్‌లో సాంకేతికత ఎంతగానో పురోగమించినా వినియోగదారులకు నాణ్యమైన సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదని ట్రాయ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్ ఉన్నా, 5జీ సేవలు విస్తరిస్తున్నా కాల్ డ్రాప్స్, కాల్ వినబడకపోవడం, డేటా వేగం తగ్గిపోవడం వంటి అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయని తెలిపింది. ఇలాంటి అంశాల వల్ల నెట్‌వర్క్ సామర్థ్యాలపై సందేహాలు తలెత్తుతున్నాయని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment