district level
-
ఏటా 2 లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ
మాదాపూర్ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లను అభివృద్ధి చేయనున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో శుక్రవారం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి న్యాక్ ప్రతినిధులతో కలసి సంస్థలో కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్‌లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్టు వివరించారు. మండల, జిల్లా స్థాయిలో ఒక్కో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి అనంతరం వాటిని విస్తరిస్తామని వివరించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి సంబంధించిన న్యాక్ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.భిక్షపతి, న్యాక్ వైస్ చైర్మన్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. -
టెలికం సేవల నాణ్యత నిబంధనలు కఠినతరం
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ ఫిర్యాదులు గణనీయంగా వస్తున్న నేపథ్యంలో సేవల నాణ్యత నిబంధనలను సమీక్షించడంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి పెట్టింది. ప్రస్తుతం టెలికం సర్కిల్ స్థాయిలో చేస్తున్న నెట్వర్క్ పనితీరు సమీక్షను జిల్లా స్థాయిలోనూ నిర్వహించాలని భావిస్తోంది. ఈ క్రమంలో సరీ్వసుల నాణ్యత నిబంధనల్లో కాల్ డ్రాప్ పరామితులు, కాల్ సక్సెస్ రేటు మొదలైనవి కఠినతరం చేయాలని ట్రాయ్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను సెపె్టంబర్ 20లోగా, ముసాయిదా నిబంధనలపై అక్టోబర్ 5న కౌంటర్ కామెంట్లు దాఖలు చేయాలని ట్రాయ్ సూచించింది. మొబైల్ టెలికమ్యూనికేషన్స్‌లో సాంకేతికత ఎంతగానో పురోగమించినా వినియోగదారులకు నాణ్యమైన సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదని ట్రాయ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా 4జీ నెట్వర్క్ ఉన్నా, 5జీ సేవలు విస్తరిస్తున్నా కాల్ డ్రాప్స్, కాల్ వినబడకపోవడం, డేటా వేగం తగ్గిపోవడం వంటి అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయని తెలిపింది. ఇలాంటి అంశాల వల్ల నెట్వర్క్ సామర్థ్యాలపై సందేహాలు తలెత్తుతున్నాయని వివరించింది. -
ఎంపీల చేతికి ‘పవర్’!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ కోసం స్థానిక ఎంపీ నేతృత్వంలో జిల్లా స్థాయి విద్యుత్ కమిటీలను ఏర్పాటు చేయా లని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో అత్యంత సీనియర్ ఎంపీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో కో–చైర్మన్లుగా జిల్లా లోని ఇతర ఎంపీలు, సభ్యకార్యదర్శులుగా జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, సభ్యులుగా జడ్పీచైర్మన్, ఎమ్మెల్యేలను నియమించాలని సూచించింది. కనీసం 3 నెలలకోసారి ఈ కమిటీ సమావేశాన్ని నిర్వహించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు కేంద్రం అప్పగించింది. విద్యుత్ రంగంలో కేంద్ర సంస్కరణలు, పథకాల అమలు తీరుపై ఈ కమిటీ సమీక్ష జరుపుతుంది. ఈ కమిటీ ఏర్పాటుతో జిల్లా స్థాయిలో సీనియర్ ఎంపీలు ‘పవర్ ఫుల్’గా మారనున్నారు. కేంద్ర పథకాల అమలు, శాఖ పనితీరు, రైతులు, వినియోగదారుల సమస్యలు వంటి అంశాలపై జిల్లా విద్యుత్ అధికారులు ఈ కమిటీకి నిత్యం సమాధానం ఇచ్చుకునే పరిస్థితి రానుంది. కొత్త సంస్కరణల అమలుకే.. దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం ఇటీవల కేంద్రం రూ.3 లక్షల కోట్లతో కొత్త పథకాన్ని ప్రకటించింది. జిల్లా స్థాయిలో ఈ పథకం అమలుపై నిరంతర పర్యవేక్షణకు సీనియర్ ఎంపీల నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద నిర్ధేశించిన సంస్కరణలను అమలు చేస్తేనే డిస్కంలకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందనుంది. ప్రధానంగా నష్టాలను తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలతో డిస్కంలు ప్రణాళికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే కేంద్రం నుంచి ఈ పథకం కింద నిధులు రానున్నాయి. దేశ వ్యాప్తంగా 25 కోట్ల స్మార్ట్ మీటర్లను బిగించడానికి కేంద్రం ఈ పథకం కింద తన వాటాగా రూ.22,500 కోట్లు కేటాయించింది. ఇతర సంస్కరణల అమలుకు రానున్న ఐదేళ్లలో కేంద్ర వాటాగా రూ.97,631 కోట్లను డిస్కంలకు అందజేయనుంది. ఈ పథకంతో పాటు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన, ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం, కుసుమ్ వంటి కేంద్ర పథకాల అమలును ఈ కమిటీ పర్యవేక్షించనుంది. -
చీకటిని జయించిన రాజు
సాధించాలన్న తపన ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. అందుకు వయస్సు, అంగ వైకల్యం అడ్డురాదు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఆ కళ్లే లేకుంటే ప్రపంచమే అంధకారం. కాని చూపు లేకున్నా తాను ఎవ్వరికీ ఎందులోనూ తీసిపోనని నిరూపించారు పుష్పరాజ్. చిన్నప్పుడే కంటి చూపుకోల్పోయినా ఉన్నత చదువులు చదివి ప్రధానోపాధ్యాయుడి స్థాయికి చేరుకున్నారు. మరో వైపు క్రికెట్లో రాణిస్తూ ఎన్నో పతకాలను కైవసం చేసుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. సాక్షి, కర్నూలు : కర్నూలు నగరానికి చెందిన సిమ్మన్స్, రాజేశ్వరి దంపతులకు పుష్పరాజ్, అశోక్ సంతానం. ఇందులో పెద్ద కుమారుడు పుష్పరాజ్.. చిన్న వయస్సులోనే కంటి చూపును కోల్పోయారు. అతనికి ఏడవ ఏటవచ్చే సరికి తండ్రి చనిపోయారు. తల్లి రాజేశ్వరి అధైర్యపడకుండా కర్నూల్లోని ఓ ప్రవేయిటు పాఠశాల్లో ఆయాగా చేరారు. పేదరికంలో ఉన్నప్పటికీ కుమారుడు పుష్పరాజ్‌కు కంటి చూపును తెచ్చుకోపవడానికి ప్రయత్నించారు. అప్పుచేసి ఎనిమిది సార్లు శస్త్ర చికిత్సలు చేయించారు. అయానా ఫలితం దక్కలేదు. పుష్పరాజ్‌ను ఉన్నత చదువులను చదివించాలని భావించి హైదరాబాద్‌లో ఉన్న దేవనగర్ అంధుల పాఠశాల్లో చేర్పించారు. అక్కడ 10వ తరగతి పూర్తిచేశారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో 490 మార్కులను సాధించి అప్పటి రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన రంగరాజన్ చేతులమీదుగా ఉత్తమ విద్యార్థిగా పురస్కారాన్ని అందుకున్నారు. పాఠశాల స్థాయిలో క్రికెట్లో మెలకువలు నేర్చుకున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మంచి బ్యాట్స్‌మెన్‌గా రాణించారు. సంరక్షుడి నుంచి ఉపాధ్యాయుడిగా.. పదో తరగతి అనంతరం పుష్పరాజ్.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో హెచ్ఈసీ గ్రూపు తీసుకున్నారు. నిజాం కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్‌లోనే వసతి గృహంలో ఉంటూ బీఈడీను పూర్తి చేశారు. క్రికెట్లోనూ రాణిస్తూ అందరి మన్ననలు అందుకున్నారు. భారత అంధుల క్రికెట్ జట్టుకు సేవలు అందించారు. వసతి గృహ సంరక్షుడి ఉద్యోగానికి ఎంపికై మద్దికెరలో రెండేళ్లు పనిచేశారు. విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను 2007లో ఉత్తమ వసతి గృహ సంరక్షుడి ఆవార్డు వరించింది. అదే ఏడాదిలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్మానం అందుకున్నారు. క్రికెట్లో రాణించినందుకు 2012లో అప్పటి సీఎం కిరుణ్కుమార్రెడ్డి చేత సన్మానాన్ని పొందారు. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం రావడంతో వసతి గృహ సంరక్షుడి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆలూరు బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి పనిచేస్తున్నారు. మారుతున్న కాలంతోపాటు సాంకేతికతను పుష్పరాజ్ అందిపుచ్చుకున్నారు. తన ల్యాప్‌టాప్ ద్వారా ఆన్లైన్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించడంలో పుష్పరాజ్ దిట్ట. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సైతం ఈయన కైవసం చేసుకున్నారు. ధైర్యమే నా ఆయుధం.. వైకల్యం ఉందని బాధపడితే నేను ఈ స్థాయిలో ఉండేవాన్ని కాదు. ధైర్యమే ఆయుధంగా ముందుకు సాగాను. ప్రస్తుతం ఆలూరు ప్రభుత్వ బాలుర పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాను. నా విజయానికి కృషి, పట్టుదల, క్రమశిక్షణే కారనం. కంటిచూపు లేదని నేను ఎన్నడూ బాధపడలేదు. అమ్మ ప్రోత్సాహంతో ఈస్థితికి చేరుకున్నాను. ప్రతి ఒక్కరిలో ఏదో రకమైన ప్రతిభ దాగి ఉంటుంది, దానిని వెలికి తీసినప్పుడు విజయం తప్పక వరిస్తుంది. – పుష్పరాజ్ -
ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు
-
క్రీడలతోనే మానసికోల్లాసం
ఆత్మకూరు : క్రీడలు మానసికోల్లాసాన్ని కలుగచేస్తాయని ఆత్మకూరు ఎస్ఐ దిలీప్‌కుమార్ తెలిపారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లాస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. అక్కమ్మగార్ల పరుష సందర్భంగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. టోర్నీ 8వ తేదీ వరకు ఉంటుందని, విన్నర్స్‌కు రూ.10 వేలు కప్పు, రన్నర్స్‌కు రూ.5 వేలు, కప్పు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏïడీïఏఫ్ఏ సభ్యులు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఏడీఎఫ్‌ఏ జిల్లా సెక్రటరీ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, ట్రెజరీ భాస్కర్, పీఈటీలు జగదీష్, జగదీశ్వరరెడ్డి, ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ బాషా, ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఏటా జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్లు
కస్తూర్బా బాలికా విద్యాలయాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : సర్వశిక్షా అభియా¯ŒS పీఓ గంగవరం (రంపచోడవరం) : జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ది చేస్తామని జిల్లా సర్వశిక్షా అభియా¯ŒS పీఓ శేషగిరిరావు పేర్కొన్నారు. కొత్తాడ కస్తూర్బా గాం«ధీ బాలికా విద్యాలయం క్రీడా మైదానంలో రెండోరోజులుగా నిర్వహిస్తున్న కేజీబీవీ జిల్లా స్పోర్ట్స్ మీట్ గురువారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారిణి కె.పద్మావతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో 12 కస్తూర్బా విద్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. క్రీడల్లో నైపుణ్యం పెంపొందించాలనే యోచనతో పరీక్షల సమయమైనా క్రీడా పోటీలు నిర్వహించామన్నారు. రన్నింగ్, త్రోబాల్, కబడ్డీ, ఖోఖో, లాంగ్‌జంప్, చదరంగం, టెన్నికాయిట్, షాట్‌ఫుట్ వంటి పోటీలు నిర్వహించారు. వీటిలో కొత్తాడ కేజీబీవీ బాలికలు స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో, వ్యక్తిగత చాంపియన్, ఆల్ రౌండ్ చాంపియ¯ŒS షిప్‌లు సాధించారు. విజేతలకు పీఓ శేషగిరిరావు బహుమతులు అందించి అభినందించారు. ఎస్ఎస్ఏ ఎఫ్ఏఓ నాగమణి, ఏఎంఓలు వెంకట్రావ్, దేవుడు, నాగేశ్వరరావు, శ్రీనివాస్, మండల విద్యాశాఖా«ధికారి మల్లేశ్వరరావు, యూటీఎఫ్ కార్యదర్శి కె.కృష్ణ, ఏజెన్సీ పీఈటీల సంఘం అధ్యక్షులు కె.పోతురాజుదొర, పీడీలు తిరుపతిరావ్, చిన్నారావు, సుదర్శ¯ŒSరావు, బాబూరావు, రాజేశేఖర్, వివిధ పాఠశాలలకు చెందిన పీఈటీలు అరుణకుమారి, జానకీ తదితరులు పాల్గొన్నారు. 12 కేజీబీవీలకు చెందిన ప్రత్యేకాధికారులు , సిబ్బంది పాల్గొన్నారు. బాలికలు ఆలపించన గీతాలు, నృత్యాలు సభికులను ఎంతో ఆకట్టుకున్నాయి. -
వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానం
జీలుగుమిల్లి: ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఏలూరులో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం హైస్కూల్ విద్యార్థులు అండర్-19 విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. వీళ్లంతా ఈ నెల 26 నుంచి 28 వరకు విజయనగరంలో జరిగే రాష్ట్ర స్ధాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని పీఈటీ నాయక్ తెలిపారు. విజేతలకు ఎంపీడీవో కొండలరావు, ఎంఈవో కె.శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. -
28న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీ
ఆత్మకూరు (రాప్తాడు) : రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం పి.యాలేరు గ్రామంలో ఈ నెల 28 నుంచి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఎన్‌వైకే బృందం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ టోర్నీ ఉంటుందన్నారు. విజేత జట్టుకు రూ. 8వేలు, రన్నర్స్ జట్టుకు రూ.5వేలు, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 97012 29767, 99668 02067, 98853 32097లో సంప్రదించాలని కోరారు. -
18, 19న జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు ఈ నెల 18, 19 తేదీలలో స్థానిక ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో అసోసియేష¯ŒS అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు. ఈ టోర్నీలో సబ్–జూనియర్, క్యాడెట్, జూనియర్స్, సీనియర్స్ బాల, బాలికల విభాగాల్లో ఓపె¯ŒS టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ పేర్లను ఆయా కోచ్‌ల వద్ద ఈ నెల 14 లోపు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 7382440946 నంబర్లో సంప్రదించాలన్నారు. -
హాకీ జిల్లా స్థాయి సీనియర్ జట్టు ఎంపిక
అనంతపురం సప్తగిరిసర్కిల్ : హాకీ జిల్లా స్థాయి సీనియర్ జట్టును బుధవారం ఎంపిక చేసినట్లు హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి విజయ్‌బాబు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28 నుంచి 31 వరకు విశాఖపట్టణంలో జరిగే సీనియర్ రాష్ట్ర చాంపియన్‌షిప్ టోర్నీలో పాల్గొంటారన్నారు. క్రీడాకారులకు అనంత క్రీడా గ్రామంలో ఆర్డీటీ సహకారంతో డచ్ శిక్షకులతో తర్ఫీదు ఇచ్చినట్లు వివరించారు. శిక్షణ ముగింపు శిబిరానికి డచ్ హాకీ క్రీడాకారులు కొస్పల్, రోడ్రిక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి క్రీడాకారుడు తన ఫిట్నెస్ను నిలుపుకునేందుకు కృషి చేయాలని సూచించారు. అప్పుడే రాణించగలరన్నారు. జట్టుకు కోచ్‌గా బాబయ్య, మేనేజర్‌గా ఓబులేసు వ్యవహరిస్తారు. ఎంపికైన క్రీడాకారులు వీరే గంగాధర్, హరీశ్, ఎర్రిస్వామి, లోక్‌నాథ్, శివానందరెడ్డి, అమర్, శివ, సాయికిరణ్, మహబూబ్‌బాషా, అక్రంబాషా, బాబ్జాన్, భగత్ బాబు, వెంకటేశ్, హర్షవర్దన్, నల్లప్పరెడ్డి, సంతోశ్, మహబూబ్‌బాషా. -
జిల్లా స్థాయి క్రికెట్ విజేత గుంతకల్లు
ఉరవకొండ : స్థానిక మహాత్మ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంటర్ క్రికెట్ పోటీల్లో భాగంగా బుధవారం గుంతకల్లు, ఉరవకొండ మహత్మ కళాశాల జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. జిల్లావ్యాప్తంగా 10 జట్లు పాల్గొన్న ఈ టోర్నిలో విజేతగా గుంతకల్లు నిలిచింది. ఉదయం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఉరవకొండ మహాత్మ జట్టు నిర్ణీత 15 ఓవర్లకు 94 పరుగులు చేసింది. ఈ మేరకు బ్యాటింగ్‌కు దిగిన గుంతకల్లు జట్టు 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదిచింది. ఈ సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవ వేడుకల్లో గవిమఠం ఉత్తరాధికారి శ్రీకరిబసవరాజేంద్ర స్వామి హాజరై మాట్లాడారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించినపుడే, భవిష్యత్‌లో క్రీడలతో పాటు జీవితంలో కూడా రాణిస్తారని చెప్పారు. కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు కెకె ప్రసాద్, మహాత్మ విద్యాసంస్థల గౌరవ సలహదారులు షాషావలి, డైరెక్టర్ గౌస్‌మోదీన్, ప్రిన్సిపాళ్లు బసవరాజు, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఖేల్ ఇండియా షెడ్యూల్ విడుదల
ఏలూరు రూరల్ : క్రీడాకారుల్లో నైపుణ్యానికి పదును పెట్టేందుకు ఖేల్ ఇండియా ఆటల పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నోడల్ అధికారి ఎంహెచ్ షరీఫ్ అన్నారు. మంగళవారం ఏలూరు బిశ్వనాథ్ భర్తియా స్విమ్మింగ్ పూల్ ఆవరణలో వ్యాయామ ఉపాధ్యాయులకు ఖేల్ ఇండియా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ క్రీడాకారులే కాకుండా ఆటలు తిలకించే పిల్లలు సైతం స్ఫూర్తి పొంది ఆటలు సాధన చేసేలా పోటీలు నిర్వహించాలన్నారు. 14, 17 ఏళ్ల విభాగంలో నిర్వహించే ఈ పోటీలను విజయవంతం చేయాలన్నారు. గ్రామస్థాయిలో పోటీలు నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు పిల్లలకు అవకాశం ఇవ్వడం లేదని పలువురు పీఈటీలు ఏజేసీకి వివరించారు. డీఈవో ద్వారా ఆదేశాలు జారీ చేసేలా చర్యల తీసుకోవాలన్నారు. మండల స్థాయి పోటీలకు మంజూరైన నిధులు ఎంపీడీవోలు సక్రమంగా ఖర్చు చేసేలా చూడాలన్నారు. గత ప్రభుత్వం విజేతలకు ప్రకటించిన నగదు బహుమతులు నేటికీ అందలేదని పలువురు వాపోయారు. దీనిపై స్పందించిన షరీఫ్ అక్రమాలకు పాల్పడే వారిపై కలెక్టర్ సీరియస్‌గా వ్యవహరిస్తారని హెచ్చరించారు. డీఎస్డీవో ఎస్ఏ అజీజ్ మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీల్లో మండలస్థాయి చేపట్టాలన్నారు. ఇందులో 3 క్రీడాంశాలు, 2 వ్యక్తిగత అంశాలు ఉండాలన్నారు. దీనికి ముందు ప్రతి గ్రామంలో పోటీలు నిర్వహించి ఒక్కొక్క గ్రామం నుంచి 15 బాలురు, 15 మంది బాలికలను మండల స్థాయి పోటీలకు తీసుకురావాలన్నారు. ఈ పోటీల నిర్వహణ కోసం ఒక్కొక్క మండలానికి రూ.30 వేల మంజూరు చేశామన్నారు. మండలంలో ప్రతిభ చాటిన 120 బాలురు, 120 మంది బాలికలను నియోజకవర్గ స్థాయి పోటీలకు తీసుకురావాలన్నారు. అలాగే 25, 26న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలన్నారు. 10 క్రీడాంశాల్లో(ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, తైక్వాండ్, వెయిట్ లిఫ్టింగ్, కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్, హాకీ, వాలీబాల్)జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో ప్రతిభ చాటిన వారిని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. 31–12–2016 నాటికి 14, 17 ఏళ్లు నిండని వారే ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఈ సమావేశంలో సాయ్ సెంటర్ ఇన్ చార్జి కె.కొండలరావు తదితరులు పాల్గొన్నారు. -
బాలల మేధకు ప్రతిబింబంగా..
ప్రారంభమైన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన భానుగుడి (కాకినాడ) : పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఉపకరణాలు, ఆదర్శ గ్రామాలు, స్వచ్ఛభారత్, నూతన సాగు పద్ధతులు, రీసైక్లింగ్ ప్రాసెస్.. ఇలా వినూత్న వైజ్ఞానిక ఆవిష్కరణలకు జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన (ఇ¯ŒSస్పైర్–2016) వేదికగా నిలిచింది. కాకినాడ ఏఎంజీ పాఠశాలలో ఇన్స్పైర్–2016ను ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబులు గురువారం ప్రారంభించారు. అనంతరం ఇన్స్పైర్ లోగోను, పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న ప్రపంచ స్థితిగతులను అంచనా వేస్తూ నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేలా విద్యార్థుల ఆలోచనలకు ఉపాధ్యాయులు పదును పెట్టాలని అన్నారు. తొలుత జిల్లా ఖ్యాతిని కీర్తిస్తూ కళా ఉత్సవ్‌కు ఎంపికైన ఎంఎస్ఎ¯ŒS ఛార్టీస్ ఎయిడెడ్ పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యరూపకం, గాంధీనగర్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు చేసిన కోలాటం, గీతం శాంతినికేతన్, ఎస్ఆర్ ఉన్నత పాఠశాల విద్యార్థుల శాస్త్రవేత్తల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. 25 మండలాల నుంచి 560 ప్రాజెక్టులు ఈ ప్రదర్శనకు వచ్చాయి. సోలార్ సిస్టమ్స్‌పై నమూనాలను ఎక్కువమంది విద్యార్థులు ప్రదర్శించారు. ప్రతి ప్రాజెక్టూ విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టేలా ఉంది. రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం ఈ ప్రాజెక్టులకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 14 కమిటీల సభ్యులు ఈ ప్రాజెక్టులను స్క్రూట్నీ చేశారు. కార్యక్రమంలో డీఈవో ఆర్.నరసింహరావు, ఆర్జేడీ భార్గవ్, డీసీఎంఎస్ చైర్మ¯ŒS సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వసతులు లేక విలవిల ఈ కార్యక్రమంలో వసతుల లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది.తొలిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకూ విద్యార్థులకు భోజనాలు వడ్డిస్తూనే ఉన్నారు. ఆలస్యంతోపాటు, అన్నం ఉడకకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై వారివెంట ఉన్న ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. బాత్రూములు దుర్వాసన రావడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా బాత్రూములు కేటాయించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రాజెక్టుల ప్రదర్శనకు విద్యార్థులకు గదుల కేటాయింపులో కూడా తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ప్రాజెక్టులతో విద్యార్థులు గంటల తరబడి గదుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కానీ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో ప్రదర్శనకు రాలేదు. రాత్రి బస కోసం కేటాయించిన గదుల్లో దోమలు అధికంగా ఉండడం, ఎక్కువమందికి ఒకే గదిని కేటాయించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలు తెలిసి కూడా తెలియనట్టుగా అధికారులు వదిలేయడంపై పలువురు ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేశారు. -
సృజనకు వేళాయె!
– నేడు జిల్లాస్థాయి ‘ఇన్స్పైర్’ ప్రారంభం – చర్చి స్కూల్లో ఏర్పాట్లు సిద్ధం అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాస్థాయి ఇన్స్పైర్–16 బుధవారం ప్రారంభం కానుంది. ఇందుకోసం విద్యాశాఖ స్థానిక రెవిన్యూ కాలనీలోని చర్చి పాఠశాలలో అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేసింది. అవార్డు మొత్తం రూ.5 వేలు జమ అయిన 170 మంది విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం నుంచే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో అనంతపురం విద్యా డివిజన్ నుంచి 26 మంది, గుత్తి నుంచి 52, ధర్మవరం నుంచి 62, పెనుకొండ నుంచి 30 మంది విద్యార్థులు ఉన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కోన శశిధర్, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్ లక్ష్మీవాట్స్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 170 ప్రదర్శనలతోనే సరిపుచ్చుకోవాల్సిన దుస్థితి ఈ విద్యా సంవత్సరం (2016–17) ఇన్స్పైర్ అవార్డులకు జిల్లాలోని వివిధ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి మొత్తం 2,256 మంది విద్యార్థులు ఆన్లైన్లో రిజిష్టర్ చేసుకున్నారు. అయితే వీరిలో 833 మందిని జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపిక చేశారు. వీరందరూ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి వివరాలను అధికారులకు పంపారు. ఒక్కొక్కరికి రూ.5 వేలు ప్రకారం రూ.41.65 లక్షలు నిధులు కేటాయించాల్సిన ప్రభుత్వం కేవలం 170 మంది విద్యార్థుల అకౌంట్లలో ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున రూ.8.5 లక్షలు జమ చేసింది. తక్కిన విద్యార్థులకు మొండి చేయి చూపింది. -
ఉత్కంఠగా బాస్కెట్ బాల్ పోటీలు
గుంటూరు స్పోర్ట్స్: జాగర్లమూడి నరేంద్రనాథ్ మెమోరియల్ జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ శనివారం జేకేసీ కళాశాలలో ప్రారంభమైంది. బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో బాలికల, పురుషుల విభాగంలో పోటీలు నిర్వహించారు. టోర్నమెంట్లో 12 బాలబాలికల స్కూల్ జట్లు, 15 పురుషుల కాలేజి జట్లు పాల్గొన్నాయి. జేకేసీ కళాశాల కార్యదర్శి జాగర్లమూడి మురళిమోహన్ ముఖ్యఅతిథిగా హాజరై బాస్కెట్ బాల్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో శాప్ ఓఎస్డీ పి.రామకృష్ణ, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, జేకేసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగేశ్వరరావు, లయోలా స్కూల్ ప్రిన్సిపాల్ అంతోనీ, ఏ.పీ బాస్కెట్ బాల్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి పి.రాఘవయ్య, పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ఫలితాలు... కళాశాల పురుషుల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో ఏసీ కళాశాల జట్టు 40–20 స్కోర్‌తో ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కళాశాల జట్టుపై విజయం సాధించింది. కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు 36–17 స్కోర్‌తో నర్సరావుపేట ఎన్ఈసీ ఇంజినీరింగ్ జట్టుపై, వీవీఐటీ జట్టు 46–23 స్కోర్‌తో ఆర్విఆర్ కళాశాల జట్లపై విజయం సాధించాయి. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుందని టోర్నమెంట్ నిర్వాహకుడు హరగోపాల్ వెల్లడించారు. -
జిల్లా స్థాయి రామాయణ పరీక్షకు సన్నాహాలు
అమలాపురం టౌన్ : ఇంటింటా రామాయణం ఉండాలని అమలాపురం గోశాల ఇప్పటికే ప్రత్యేకించి మహిళలకు, డివిజన్ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు రమణీయ కావ్యం– రస రమ్య రామాయణం పేరుతో వాల్మీకి రామాయణంపై పరీక్షలు నిర్వహించింది. ఈసారి ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులై ఆపై విద్యార్థులు ఐదు వేల మందితో జిల్లా స్థాయిలో రామాయణంపై పరీక్ష నిర్వహించేందుకు గోశాల సన్నహాలు చేస్తోంది. గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు, టీఎల్పీ పబ్లిషర్స్ జిల్లా ప్రతినిధి చెరుకూరి రాంబాబు, పరమేశ్వర సేవా సమితి సభ్యులు సీతానగరంలో చిట్టి బాబాజీ సంస్థానం వ్యవస్థాపకుడు జగ్గుబాబు, ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాíస్త్రి కుమారుడు వర్ధమాన సినీ సంగీత దర్శకుడు యోగీశ్వరవర్మతో గురువారం సమావేశమై ఈ చర్చించారు. రామాయణంలోని పాత్రలపై పరీక్ష నిర్వహిస్తున్నట్లు పోతురాజు రామకృష్ణారావు తెలిపారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వెయ్యి మంది విద్యార్థులకు ఒక రోజు పాజిటివ్ థింకింగ్‌పై శిక్షణ తరగతి నిర్వహిస్తామన్నారు. తనతో పాటు తన తండ్రి సీతారామశాస్త్రి కూడా జిల్లా స్థాయి రామాయణ పరీక్షకు హాజరవుతామని సంగీత దర్శకుడు యోగీశ్వరశర్మ అన్నారు. ఈ పరీక్ష కోసం సూచనలు, సలహాలు అందించేందుకు 9248135777, 9248135999 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని గోశాల ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. -
జిల్లాస్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక
కారంపూడి: స్థానిక గురుకుల పాఠశాల కళాశాలలో బుధవారం 19 సంవత్సరాల లోపు బాలబాలికల రెజ్లింగ్ (కుస్తీ) జిల్లా స్థాయి జట్ల ఎంపికలు జరిగాయి. బాలికల ఫ్రీ సై్టల్ విభాగంలో విజయపురి సౌత్ విద్యార్థులు వై.కవిత, ఎం.జీవిత, బి.సంధ్య, పి.శిరీష, ఎం. రూత్‌రాణి, జి.శ్రావణి, బాలుర ప్రీ సై్టల్ విభాగంలో స్థానిక గురుకుల విద్యార్థులు సీహెచ్ కోటేశ్వరరావు, జి.అరవింద్, ఒ.వెంకటేశ్వర్లు, కె.సుమన్, ఇ.తరుణ్ అచ్చెంపేట గురుకుల విద్యార్థులు ఎం.శివనాగేంద్రప్రసాద్, ఎన్.సత్యానాయక్, కేఆర్ కాలేజ్ నరసరావుపేటకు చెందిన డి.నవీన్, స్థానిక సాయికృష్ణ జూనియర్ కాలేజ్ విద్యార్థి ఎస్డీ ఖలీల్ ఎంపికయ్యారు. బాలుర గ్రీకో రోమన్ స్టెల్ విభాగంలో స్థానిక గురుకుల పాఠశాలకు చెందిన జి.మరియరాజు, ఎస్.శామ్యూలు, ఎ.వెంకటేష్, బి.నరేంద్ర, జి.కిరణ్‌కుమార్, కె.అజయ్, ఎం.విజయ్, డి.బాలకృష్ణ, తెనాలి ఎన్ఆర్ఐ కాలేజీకి చెందిన జి.అరుణ్ ఎంపికయ్యారని జిల్లా అండర్ 19, స్కూల్ గేమ్స్ కార్యదర్శి టీటీకే ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కళాశాల రెజ్లింగ్ అసోషియేషన్ కార్యదర్శి జి.భూషణం, వీపీ సౌత్ గురుకుల పాఠశాల పీడీ కోటేశ్వరి, అచ్చంపేట గురుకుల పీడీ డి.విజయశేఖర్ పాల్గొన్నారు. పోటీలను ప్రిన్సిపాల్ సుధాకర్ ప్రారంభించారు. 23న సీనియర్స్ ఎంపికలు.. ఈ నెల 23న స్థానిక గురుకుల పాఠశాలలో సీనియర్ మెన్, ఉమెన్ రెజ్లింగ్ జిల్లా జట్ల ఎంపికలు జరుగుతాయని జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గుడిపూడి భూషణం తెలిపారు. ఎంపికకు హాజరు కానున్న క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్, టెన్త్ మార్కుల జాబితా జిరాక్స్‌లతో హాజరు కావాలని ఆయన కోరారు. వివరాలకు 94419 36823 నంబరును సంప్రదించాలని కోరారు. -
జిల్లాస్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక
మెదక్: జిల్లాస్థాయి ఫుట్‌బాల్ సెలెక్షన్స్ బుధవారం మెదక్ పట్టణంలో జరిగాయి. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెలెక్షన్స్‌లో జహీరాబాద్, సంగారెడ్డి, బీహెచ్ఈఎల్, రామాయంపేట, మెదక్, నర్సాపూర్‌ల నుంచి 72మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 5న మెదక్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పి.శ్రీనివాస్‌రెడ్డి, పీఈటీలు నాగరాజు, మధు, శ్రీనివాస్, గోపాల్, సభ్యులు గోపాల్‌గౌడ్, శ్రీనివాస్, అనంద్ తదితరులు పాల్గొన్నారు. -
19న జిల్లా స్థాయి హిందీ వ్యాసరచన పోటీలు
తాడిపత్రి టౌన్ : అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 19న హిందీ సేవా సదన్, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లా స్థాయి హిందీ వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు హిందీ సేవా సదన్ కో–అర్టినేటర్, హిందీ ప్రచార సభ రాయలసీమ, కోస్తా జిల్లాల కో–కన్వీనర్ హాజీవలి తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రికలకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూనియర్స్ విభాగంలో 6, 7, 8 తరగతుల విద్యార్థులు, సీనియర్స్ విభాగంలో 9, 10 తరగతుల వారికి పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 18లోగా సెల్: 9032323570 నంబర్‌కు ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
హిందీ దివస్ జిల్లాస్థాయి పోటీలు
కాకినాడ కల్చరల్ : హిందీ దివస్ పురస్కరించుకొని రాషీ్ట్రయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ‘హిందీ దివస్’ అంశంపై జిల్లా స్థాయి వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిర్వహించారు. అ««ధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారు. న్యాయనిర్ణేతలుగా పరిషత్ అధ్యక్షుడు దాడి చంద్రశేఖర్, కార్యదర్శి ఏఏవీఎస్ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కె.రాధాకృష్ణ, పరిషత్ మహిళా కార్యదర్శి ఎ.స్వర్ణమంజుల, గౌరవ అధ్యక్షుడు వి.పళ్లంరాజు వ్యహరించారు. వ్యాస రచన పోటీలలో సీనియర్ విభాగంలో ఎన్.ప్రశాంత్( జెడ్పీ పాఠశాల, గైగోలుపాడు), జూనియర్ విభాగంలో ఆర్.బిందు (మార్గదర్శి హైస్కూల్, తాళ్లరేవు), వక్తృత్వపోటీలలో ఎం.అనూష ( పగడాలపేట మున్సిపల్ ఉన్నతపాఠశాల, కాకినాడ) విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని న్యాయనిర్ణేతలు తెలిపారు. వీరు హిందీ దివస్ (సెప్టెంబర్14) నాడు ఏలూరులోని యంగ్‌మెన్ హిందూ అసోసియేసన్లో జరిగే రాష్ట్రాస్థాయి పోటీల్లో పాల్గొంటారని పరిషత్ అధ్యక్షుడు దాడి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా ప్రతాలు, బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట సత్యం, హిందీ సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. -
3న జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ సెలక్షన్స్
వరంగల్: హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సెప్టెంబర్ 3న జిల్లా స్థాయి సీనియర్స్ సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి టి.రాజేందర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు సెప్టెంబర్ 9 నుంచి నల్గొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
మిర్యాలగూడ టౌన్ : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని స్నేహా భావాన్ని పెంపొందిస్తాయని నాగార్జున డిగ్రీ, పీజీ కళాశాల కరస్పాండెంట్ అనుముల నర్సింహ్మరెడ్డి, రాష్ట్ర ప్రిన్సిపాళ్ల సంఘం ప్రధాన కార్యదర్శి మందడి నర్సిరెడ్డిలు అన్నారు. సోమవారం స్థానిక నాగార్జున డిగ్రీ, పీజీ కళాశాలలో ఇంటర్మీడీయేట్ జిల్లా స్థాయి కబడ్డీ, షూటింగ్ బాల్ జట్ల ఎంపిక ప్రక్రియ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో పట్టుదల, కృషి ఉంటే దేనినైనా సాధించవచ్చన్నారు. క్రీడల వలన శారీరక దార్యుడంతో పాటు స్నేహాభావాన్ని పెంపొందించవచ్చన్నారు. క్రీడల ద్వారా సమాజంలో మంచి గుర్తింపు క్రీడాకారుడికి ఉంటుందన్నారు. సెప్టెంబరు 10, 11, 12వ తేదిలలో మిర్యాలగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ, షూటింగ్‌బాల్ పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు అండర్–19 జిల్లా స్థాయి బాలబాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అనుముల మధుసూధన్‌రెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శాగంటి శ్రీనివాస్, అశోక్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు హెమ్లానాయక్, గేమ్స్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి, పీడీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ దయాకర్‌రెడ్డి, పీడీలు సోమ నర్సింహరెడ్డి, పి.అప్పారావు, బీఎల్ రావు, రిటైర్డ్ ఫీజికల్ డైరెక్టర్ రమేష్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జి. మల్లయ్య తదితరులున్నారు. -
27 నుంచి జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ సెలెక్షన్స్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ నెల 27 నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లాస్థాయి సెలెక్షన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి నారాయణ తెలిపారు. సెలెక్షన్ షెడ్యూల్ క్యాలెండర్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య విడుదల చేశారు. 2002 జనవరి 1 తరువాత జన్మించిన వారు (6–8 తరగతులు చదువుతున్న వారు) అండర్–14కు, 1999 జనవరి 1లోపు పుట్టిన వారు (9–10 తరగతులు చదువుతున్న వారు) అండర్–17కు అర్హులన్నారు. వీరు ఆయా పాఠశాలల నుంచి జనన ధ్రువీకరణ పత్రాలను తీసుకుని సెలెక్షన్ షెడ్యూల్‌కు అనుగుణంగా హాజరు కావాలన్నారు. సెలెక్షన్స్ షెడ్యూల్ ఇదే.. సెలెక్షన్ ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 23 వర కు కొనసాగుతాయన్నారు. 27న కబడ్డీ, 30న లాన్ టెన్నిస్, ఫెన్సింగ్, 31న బ్యాడ్మింటన్, సెప్టెంబర్ 1న బాస్కెట్‌బాల్, రెజ్లింగ్, ఆర్చరీ, బాక్సింగ్, రైఫిల్ షూటింగ్, 2న హ్యాండ్‌బాల్, చెస్, 3న జూడో, 6, 7, 8 తేదీల్లో క్రికెట్, జిమ్నాస్టిక్, వెయిట్ లిఫ్టింగ్, 19న కబడ్డీ, సైక్లింగ్, 20న ఖోఖో, 21న తైక్వాండో, 22న ఫుట్‌బాల్, 23న వాలీబాల్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మరిన్ని వివరాలకు 94411 64789 నంబరుకు సంప్రదించాలన్నారు. -
విద్యార్థులు పట్టుదలతో క్రికెట్ ఆడాలి
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు పట్టుదలతో క్రికెట్ ఆడాలని వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ అన్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి స్కూల్ లెవల్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఆదివారం స్కూల్ స్థాయి లీగ్ మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల క్రికెట్లో రాణించడానికి దోహదపడతాయన్నారు. క్రీడాకారులు క్రికెట్లో మెలకువలు నేర్చుకుంటే క్రీడా పోటీల్లో విజయం సులువవుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, టోర్నమెంట్ కన్వీనర్ ఎస్డీ. అమీనోద్దీన్, ప్రసన్న, ఎండీ.అలీ తదితరులు పాల్గొన్నారు. -
23న జిల్లా సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ నెల 23న ఆర్డీటీ స్టేడియంలో జిల్లా సాఫ్ట్‌బాల్ పురుషుల, మహిళల జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు సాఫ్ట్‌బాల్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, వెంకటేశులు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు ఆర్డీటీ ఆధ్వర్యంలో కోచింగ్ క్యాంపు నిర్వహిస్తామన్నారు. అనంతరం జిల్లా జట్లు గుంటూరు, మాచెర్ల జిల్లాలో జరుగు అంతర జిల్లాల పోటీలలో పాల్గోంటాయని పేర్కొన్నారు. ప్రతిభ కనబరచిన క్రీడాకారులను రాష్ట్ర సాఫ్ట్‌బాల్ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 3 నుంచి 8 వరకు అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని వెల్లడించారు. -
వచ్చే నెల 22న జిల్లాస్థాయి కళా పోటీలు
అనంతపురం ఎడ్యుకేషన్ : కళా ఉత్సవ్–2016ను పురస్కరించుకుని విద్యాశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22న స్థానిక సైన్స్ సెంటర్లో వివిధ అంశాల్లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 9–12 తరగతులు చదువుతున్న విద్యార్థులు బృందాలుగా ఏర్పడి ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు. వ్యక్తిగతంగా పోటీ పడే అవకాశం లేదని స్పష్టం చేశారు. బృందాల వివరాలను ఈ నెల 30లోగా 94400 88488, 94925 83514, 83413 88693 నంబర్లకు ఫోన్‌చేసి తెలియజేయాలని సూచించారు. పాల్గొనే అంశం, విద్యార్థుల సంఖ్యను కచ్చితంగా తెలియజే యాలని పేర్కొన్నారు. సంగీతానికి సంబంధించి 6–10 తరగతుల విద్యార్థులు ఒక బృందంగా, నాట్యం 8–10 మంది విద్యార్థులు, రంగస్థలం 8–12 మంది, దృశ్య కళలు 4–6 మంది విద్యార్థులు ఒక బృందంగా ఉండాలని తెలియజేశారు. -
జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు
సింహాచలం : క్రీడలు శారీరక,మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని సింహాచలం దేవస్థానం ఏఈవో మోర్తా వెంకట కష్ణమాచార్యులు తెలిపారు. సింహాచలంలోని మహాత్మాజ్యోతీబాఫూలే ఏపీ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు అండర్–17, అండర్–14 హ్యాండ్‌బాల్ టోర్నీ నిర్వహించారు. రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనే విద్యార్థుల జట్లను ఎంపిక చేసేందుకు నిర్వహించిన ఈటోర్నీ ప్రారంభ కార్యక్రమంలో కష్ణమాచార్యులు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోను విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించాలన్నారు. క్రీడల ద్వారా అత్యున్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. ఈసందర్భంగా పాఠాశాల పీడీ కె.సుధారాణి టోర్నీలో పాల్గొనే విద్యార్థులను పరి^è యం చేశారు. టోర్నీలో జిల్లావ్యాప్తంగా 20 పాఠశాలల నుంచి మొత్తం 36 జట్లు పాల్గొన్నాయి. వీటిలో అండర్–17 సంబంధించి 10 బాలల జట్లు, 8 బాలికల జట్లు, అండర్–14కి సంబంధించి 10 బాలల జట్లు, 8 బాలికల జట్లు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.సత్యవతి, ఉపాధ్యాయులు కష్ణ, వెంకటరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్, పీఈటీలు రఘు, శ్రీనివాస్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బాలికల విభాగంలో విజేతలు వీరే.... అండర్–14 బాలికల విభాగంలో స్టీల్‌ప్లాంట్‌లోని శ్రీచైతన్య పబ్లిక్ స్కూల్ టీం ప్రథమస్థానంలోను, పోర్టు హైస్కూల్ టీం ద్వితీయ స్థానంలో నిలిచింది. అలాగే అడర్–17 విభాగంగా పోర్టు హైస్కూల్ టీం ప్రథమ స్థానంలోను, స్టీల్‌ప్లాంట్ శ్రీచైతన్య పబ్లిక్ స్కూల్ ద్వితీయస్థానంలోను నిలిచింది. బాలుర విబాగంలో ఫైనల్స్ ఇంకా జరగాల్సి ఉంది. అన్ని జట్ల నుంచి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులను రాష్ట్రస్థాయి టోర్నీలకు పంపిస్తామని ఈసందర్భంగా పాఠశాల పిడి సుధారాణి తెలిపారు. -
జిల్లాస్థాయి త్రోబాల్ క్రీడాకారుల ఎంపిక
కీసర: నాగారం గ్రామంలోని విజ్ఞాన్ బోట్రి పాఠశాల ఆవరణలో గురువారం జిల్లా త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి కొమ్ము వెంకట్ ఆద్వర్యంలో జిల్లా త్రోబాల్ క్రీడాకారుల ఎంపికను నిర్వహించారు. పురుషుల విభాగంలో కెప్టెన్‌గా నిఖిల్, వైస్ కెప్టెన్‌గా హరీష్, సభ్యులుగా దుర్గా, సాయిజేత, రాకేష్, వంశి, జీవన్, హరికృష్ణ, భార్గవ్, సాయి, కీర్తిరామ్, నితిన్, భార్గవ్, బిము, సాయిచరణ్, కోచ్‌లుగా నానాజీ, మనేందర్, సుభాన్లు ఎంపికయ్యారు. మహిళల విభాగం కెప్టెన్‌గా దీపిక, వైస్ కెప్టెన్‌గా అనిశా, సభ్యులుగా శ్రీలత, మమత, శ్రీలేఖ, శృతి, సరిత, రజిని, హేమ, శ్వేత, హర్షిత, రేవతి, మేద, శృతి, కోచ్‌లుగా జాన్‌రెడ్డి, మనేందర్లు ఎంపికయ్యారు. కాగా నేటినుంచి నగరంలోని అల్వాల్‌లో జరిగే రాష్ర్ట స్థాయి త్రోబాల్ పోటీల్లో జిల్లా తరపున ఈ రెండు జట్లు పాల్గొననున్నట్లు జిల్లా త్రోబాల్ అసోసియేషన్ కార్యదర్శి కొమ్ము వెంకట్ తెలిపారు. క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంలో విజ్ఞాన్ బోట్రి పాఠశాల ఏఓ నాగేంద్ర, ప్రిన్సిపాల్ కవిత, సెలక్షన్స్ కమిటీ చైర్మన్ రేవంత్, పాఠశాల పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 7 నుంచి ‘కళా ఉత్సవ్’
విద్యారణ్యపురి : ఆర్‌ఎంఎస్‌ఏ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో ‘కళా ఉత్సవ్’ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 7,8,9 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీని నిర్వహణకు డీఈఓ కన్వీనర్‌గా, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. మ్యూజిక్, డ్యాన్స్, థియేటర్ ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చర్, క్రాఫ్ట్ విభాగాల్లో విద్యార్థులు జట్లుగా పోటీల్లో పాల్గొనాలన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, పాఠశాలలు, కళాశాలలకు చెందిన 9,10, ఇంటర్మీడియట్ విద్యార్థినీ,విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనొచ్చన్నారు. వీటిలో రాణించిన వారిని వచ్చే నెల 27,28 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తారన్నారు. అక్కడ కూడా ఎంపికైతే నవంబర్ 15 నుంచి 19 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారన్నారు. జాతీయ స్థాయి విజేతలకు మొదటి బహుమతిగా రూ.1.25 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.75వేలు, తృతీయ బహుమతిగా రూ.50వేలు అందజేస్తారన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. -
20న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్
పాపన్నపేట: ఈనెల 20వ తేదిన సంగారెడ్డిలో జరుగనున్న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్‌కు ప్రతి మండలం నుంచి 10 మంది విద్యార్థులు, ఒక గైడ్ టీచర్‌ను ఎంపిక చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి నజిమొద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు సంగారెడ్డిలోని విద్యాశాఖాధికారి కార్యాలయంలో మద్యాహ్నం 1.30 గంటలకు ‘ఆహార భద్రత కోసం పప్పుదినుసుల ఆవశ్యకత, ప్రస్తుత సమస్యలు’ అనే అంశంపై సెమినార్ ఉంటుందన్నారు. పాల్గొనదలచినవారు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో రావాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఎంపికైనవారు రాష్ట్రస్థాయి సెమినార్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. -
ముగిసిన జిల్లాస్థాయి జానపద నృత్యపోటీలు
తిమ్మాపూర్ : ఎల్ఎండీ కాలనీలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో నిర్వహించిన జిల్లా స్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలు మంగళవారం ముగిశాయి. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు నిర్వహించిన రోల్ ప్లే, జానపద నృత్యపోటీలకు జిల్లా నుంచి 12 బృందాలు పాల్గొన్నట్లు డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి తెలిపారు. ఇందులో రోల్‌ప్లేలో శంకరపట్నం మండలం కన్నాపూర్ పాఠశాల మొదటి, బెజ్జంకి మోడల్ స్కూల్ ద్వితీయ, వెల్గటూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తృతీయ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. జానపద నృత్య పోటీల్లో లంబాడిపల్లె ప్రాథమికోన్నత పాఠశాల ప్రథమ, తిమ్మాపూర్ కేజీబీవీ ద్వితీయ, తాటిపెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తృతీయ స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన బృందాలు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు. డైట్లో న్యాయ నిర్ణేతలుగా లెక్చరర్లు మహేశ్వర్‌రెడ్డి, మంజుల, శ్రీనివాసరెడ్డి వ్యవహరించగా.. సమన్వయకర్తగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మొండయ్య వ్యవహరించారు. విజేతలకు ప్రిన్సిపాల్ నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆగస్టు 5న డైట్లో జిల్లాస్థాయి పోటీలు
మెదక్: మెదక్ మండలం హవేళి ఘణాపూర్‌లో గల డైట్లో ఆగస్టు 5న విద్యార్థులకు నాటకీకరణ, జానపద నృత్యాలపై జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ రమేష్‌బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లాపరిషత్, కేజీబీవీ, గురుకులం, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ తమ పాఠశాలల విద్యార్థులను ఎంపికచేసి ఈ పోటీలకు పంపించాలన్నారు. గెలుపొందిన వారికి నగదు పురస్కారాలు అందిస్తామన్నారు. వీరు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల పేర్లను ఇతర సమాచారాన్ని ఆగస్టు 3లోగా 88016 84241కు ఫోన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. -
8 నుంచి పాఠశాలల క్రికెట్ పోటీలు
హన్మకొండ : పాఠశాలల జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ఆగస్టు 8 నుంచి ప్రారంభమవుతాయని ది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ తాళ్లపల్లి జయపాల్ తెలిపారు. సోమవారం హన్మకొండ స్నేహనగర్‌లోని ఓరుగల్లు జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. ప్రథమ స్థానంలో నిలిచే జట్టుకు రూ.10 వేల నగదు పారితోషికాన్ని అందజేస్తామన్నారు. మ్యాచ్‌లు మ్యాట్‌పై జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే పాఠశాలల జట్లు హన్మకొండ స్నేహనగర్‌లోని ఓరుగల్లు జూనియర్ కాలేజీలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. సెమీస్‌కు చేరే నాలుగు జట్లను హైదరాబాద్‌లో జరుగనున్న క్రికెట్ పోటీల్లో ఇతర జిల్లాల జట్లతో ఆడించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ తమ స్కూల్ డ్రెస్‌లతో మ్యాచ్‌లలో ఆడాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 97006 85123, 98666 08130, 98494 40721 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
జిల్లా స్థాయి ఉద్యోగాల భర్తీపై ఫోకస్
- తక్షణ అవసరమున్న పోస్టులకు నోటిఫికేషన్లు - విద్య, వైద్యం, పోలీసు, పురపాలక, పంచాయతీరాజ్‌లకు మొదటి ప్రాధాన్యం - రెండో దశలో జోనల్, మల్టీ జోనల్ నియామకాలు - ఖాళీలు, భర్తీ ప్రక్రియపై సీఎస్ సమీక్ష - 3 రోజుల్లోగా సమగ్ర నివేదికలివ్వాలని ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: తొలి విడతగా జిల్లా స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. రెండో దశలో జోనల్, మల్టీ జోనల్ పోస్టుల నోటిఫికేషన్లు జారీ చేయాలని యోచిస్తోంది. ఇరు రాష్ట్రాలకు ఉద్యోగాల విభజన పూర్తయ్యే వరకు రాష్ట్ర స్థాయి పోస్టుల నియామకాలను పెండింగ్‌లో పెట్టాలని నిర్ణయించింది. జూలై నుంచి నోటిఫికేషన్ల జారీకి కసరత్తును వేగిరం చేసింది. విద్య, వైద్యం, పురపాలక, పంచాయతీరాజ్, హోం శాఖల్లోని ఖాళీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఆయా విభాగాల్లో ఉన్న జిల్లాస్థాయి పోస్టులెన్ని.. అందులో మొదటి విడతగా భర్తీ చేయాల్సినవి ఎన్ని.. తదితర వివరాలతో సమగ్ర నివేదికను రెండు మూడు రోజుల్లో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్‌శర్మ సంబంధిత కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం 5 విభాగాల కార్యదర్శులతో పాటు ఆర్థిక శాఖ అధికారులతో సీఎస్ సమావేశం ఏర్పాటు చేశారు. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల ఖాళీల వివరాలనూ విడిగా అందించాలని సూచించారు. విద్యాశాఖలో రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికి పైగా ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సి ఉంది. పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ కారణంగా ఈ నియామకాలు ఆలస్యమవనున్నాయి. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న మిగతా పోస్టుల వివరాలు సేకరిస్తున్నారు. అత్యధికంగా పోలీసు విభాగంలో 12 వేలకు పైగా ఖాళీలున్నాయి. కానిస్టేబుల్ మొదలు ఎస్ఐల వరకు రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది. వీటిపై సమావేశంలో చర్చ జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫార్మసిస్టులు, టెక్నీషియన్ పోస్టుల వరకు తొలుత భర్తీ చేసే అవకాశముంది. ఆ వివరాలతో పాటు కొత్త పీహెచ్‌సీలు, అప్‌గ్రేడ్ అయిన పీహెచ్‌సీల్లో ఉన్న ఖా ళీల వివరాలను అందించాలని సీఎస్ సూచిం చారు. దాదాపు వెయ్యి పోస్టుల వరకు తక్షణం భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు బదులిచ్చారు. 50 వేలకు చేరిన ఖాళీలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేసే సమయంలో 17,960 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఫైలు సిద్ధం చేసింది. 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం చెప్పటంతో ఆర్థిక శాఖ అందుకు సన్నాహాలను ముమ్మరం చేసింది. సీఎస్ రాజీవ్ శర్మ అన్ని విభాగాల కార్యదర్శులతో సమావేశమై ఆగమేఘాలపై ఖాళీల వివరాలను అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఖాళీల సంఖ్య దాదాపు 50 వేలకు చేరినట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. అందులో ఏ పోస్టులను ముందు భర్తీ చేయాలి... వీటిలో వేటిని టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్ చేయాలి, ఏ పోస్టులను డిపార్టుమెంటల్ బోర్డుల ద్వారా చేపట్టాలి, జిల్లా స్థాయి సెలెక్షన్ కమిటీకి వేటిని అప్పగించాలనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విభాగాల వారీగా అధికారులతో సమావేశమై తక్షణ ప్రాధాన్యంగా భర్తీ చేయాల్సిన పోస్టులు, వాటికి అర్హతలు, ఎంపిక విధానంపై చర్చిస్తున్నారు. ప్రతిపాదనలన్నీ సిద్ధమయ్యాక ఉద్యోగాల భర్తీ ఫైలును సీఎంకు నివేదించనున్నారు. -
తమ్ముళ్లకు ఝలక్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని ప్రముఖ ఆలయాల కమిటీల నియామకానికి సంబంధించి ప్రభుత్వ వైఖరిపై తెలుగుతమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. ఓ వైపు పదవుల పందేరం చేస్తామంటూ రాష్ట్రస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీ నేతలు ఊదరగొడుతున్న విషయం తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది. నియామకాలకు సంబంధించిన సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా నేతలు బూటకపు మాటలు చెబుతున్నారని తమ్ముళ్లు వాపోతున్నారు. జిల్లాలో వెంగమాంబ ఆలయం (నర్రవాడ), కామాక్షమ్మ ఆలయం (జొన్నవాడ), చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం (సూళ్లూరుపేట), ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం (తూర్పుకనుకూరు), రాజరాజేశ్వరి దేవస్థానం (నెల్లూరు), తల్పగిరి రంగనాథ దేవాలయం (నెల్లూరు), శ్రీపెనుశిల నరసింహస్వామి దేవస్థానం (పెంచలకోన) ఆలయాలకు కమిటీలను నియమించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో ఐదు ప్రధాన ఆలయాలకు కొత్తగా ట్రస్టుబోర్డుల నియామకానికి కోర్టు వివాదాలు అడ్డొస్తున్నాయి. ఈ వివాదాలను పరిష్కరించకుండా ఏకంగా కమిటీల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో తమ్ముళ్లు సంబరపడ్డారు. అయితే కోర్టు వివాదాల తేలేవరకు కమిటీల నియామకం జరిగే అవకాశం లేదని తెలుసుకున్న టీడీపీ నాయకులు అధిష్టానంపై మండిపడుతున్నారు. పదవులు ఆశిస్తున్న ఆశావాహులు ఆగ్రహంతో ఉన్నారని తెలుసుకున్న జిల్లా ముఖ్యనేతలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. దేవాదాయమంత్రి మాణిక్యాలరావును కలిసి గడువు పొడిగించమని కోరినట్లు సమాచారం. ఒక్క నెల్లూరు జిల్లాను దృష్టిలో ఉంచుకుని గడువు పొడిగించటం వీలుకాదని మంత్రి తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆలయ కమిటీల నియామకం కోసం దరఖాస్తు సమయం నవంబర్ 10తో ముగియటంతో ఆశాఖ అధికారులు అప్పటివరకు వచ్చిన ఆశావాహుల జాబితాను ప్రభుత్వానికి పంపారు. అయితే రాజరాజేశ్వరి, రంగనాథ ఆలయాలకు మాత్రమే కమిటీల నియామకానికి అడ్డంకులు లేవని తెలుస్తోంది. -
బలోపేతం
సాక్షి, చెన్నై: పార్టీ బలోపేతం లక్ష్యంగా సిద్ధం చేయాల్సిన కార్యాచరణపై డీఎంకే అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. పార్టీలో ప్రక్షాళన లక్ష్యంగా సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. ఇందులో ఆరుగురికి చోటు కల్పించింది. ఇక, తన వ్యూహాలకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి పదును పెట్టే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం డీఎంకేను వెంటాడుతోంది. వరుస ఓటములతో డీఎంకే శ్రేణులు డీలా పడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఆ పార్టీ అధిష్టానాన్ని ఆలోచనలో పడేసింది. ఓటమికి కారణాలెన్ని ఉన్నా, రానున్న రోజుల్లో పార్టీలో సరికొత్త మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఉన్నారు. ఎన్నికల్లో అనేక జిల్లాల నేతలు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని పరిగణనలోకి తీసుకుని అక్కడి నేతలను సాగనంపేందుకు సిద్ధమవుతున్నారు. ఇందు కోసం జిల్లా స్థాయిలో కమిటీలను రద్దు చేసి, సరి కొత్తగా అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు, కార్పొరేషన్ల స్థాయిలో కమిటీల ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు. ఈ కమిటీల ద్వారా ఆయా అసెంబ్లీ, లోక్ సభ, కార్పొరేషన్ల పరిధుల్లోని కుగ్రామాలు, పంచాయతీలు, వార్డుల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి కింది స్థాయి నుంచి పార్టీలో సమూల మార్పులకు నిర్ణయించినట్టు సమాచారం. ఈనెల రెండో తేదీన రాష్ట్ర పార్టీ కార్యాలయం అన్నా అరివాళయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనూ పై అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరుగురితో కమిటీ: ఉన్నత స్థాయిసమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీలో సమూల మార్పు, సరికొత్త తరహాలో కమిటీల ఏర్పాటుకు సంబంధించిన తీర్మానం డీఎంకే అధిష్టానం చేసింది. అయితే, ఎలాంటి పద్ధతిలో సమూల మార్పు, సరికొత్త తరహా అంశాలను బయటకు పొక్కనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ సమావేశంలో తీసుకున్న మార్పు నిర్ణయాలు, సరికొత్త అంశాల గురించి జిల్లాల వారీగా చర్చించి పార్టీ బలోపేతానికి ఆయా జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యల గురించి పరిశీలనకు ప్రత్యేక కమిటీని రంగంలోకి దించారు. తన వ్యూహాల అమలు లక్ష్యంగా, వాటికి పదును పెట్టడంతో పాటుగా సరికొత్తగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా ఈ కమిటీని కరుణానిధి గురువారం ప్రకటించారు. ఈ కమిటీలో పార్టీ నేతలు తిరు వెంగడం, టీఎస్ కల్యాణ సుందరం, రాజమాణిక్యం, తంగం తెన్నరసు(ఎమ్మెల్యే), కేఎస్ రాధాకృష్ణన్, సచ్చిదానందన్‌కు చోటు కల్పించారు. ఈ కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించ నున్నది. ఎక్కడక్కడ పార్టీ బలహీనంగా ఉన్నదో పరిశీలించి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను ఆరా తీయనుంది. అన్ని ప్రాంతాల్లో పార్టీల ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపి, వారి అభిప్రాయాలు సేకరించనుంది. పూర్తి స్థాయిలో పరిశీలన ప్రక్రియను ముగించినానంతరం నివేదికను పార్టీ అధిష్టానానికి ఈ కమిటీ సమర్పించనుంది. -
జిల్లాస్థాయి చెస్ పోటీలు
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: కింగ్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక నల్లగొండ పబ్లిక్ స్కూల్లో జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. పోటీలను తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధాశక్తిని, ఓపిక, సహనాన్ని పెంపొం దించే చెస్‌ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. క్రీడల నిర్వహణకు ట్రస్మా సహకరిస్తుందని తెలిపారు. ఉత్తమ క్రీడాకారుడి పేరు చిరస్థాయిగా ఉంటుందని, మరుగునపడిపోని గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజర్లు ఎం.విశ్వప్రసాద్, వి.మట్టయ్య, జరీఫొద్దీన్ పాల్గొన్నారు. కాగా జిల్లాలోని వివిధ ప్రాం తాల నుంచి 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. మొదటి 10 స్థానాల్లో రవికుమార్(హుజూర్నగర్), పీవీ ఎస్ అరవింద్(మిర్యాలగూడ), బి.సత్యనారాయణ(కోదాడ) వి.మట్టయ్య(నల్లగొండ), బి.సంజయ్‌భార్గవ్(మిర్యాలగూడ), మేడం పవన్‌తేజ(నల్లగొండ), బి.భానుమహేశ్(సూర్యాపేట), సిహెచ్.మహేశ్(నల్లగొండ), ఎస్కె.బర్షిత్(హాలియా) పి.మధుసూదన్(నల్లగొండ) నిలిచారు. అలాగే బెస్ట్ మహిళా విజేతగా ఎం.అలేఖ్య(నల్లగొండ), అండర్గ్రూప్స్లో మరో 20 మంది బాల, బాలికలకు బహుమతులు, మెమోం టోలు అందజేశారు.