మెదక్: జిల్లాస్థాయి ఫుట్‌బాల్ సెలెక్షన్స్ బుధవారం మెదక్ పట్టణంలో జరిగాయి. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెలెక్షన్స్‌లో జహీరాబాద్, సంగారెడ్డి, బీహెచ్‌ఈఎల్, రామాయంపేట, మెదక్, నర్సాపూర్‌ల నుంచి 72మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 5న మెదక్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పి.శ్రీనివాస్‌రెడ్డి, పీఈటీలు నాగరాజు, మధు, శ్రీనివాస్, గోపాల్, సభ్యులు గోపాల్‌గౌడ్, శ్రీనివాస్, అనంద్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాస్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక
Published Wed, Sep 21 2016 7:25 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
Advertisement
Advertisement