బాలల మేధకు ప్రతిబింబంగా..
-
ప్రారంభమైన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
భానుగుడి (కాకినాడ) :
పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఉపకరణాలు, ఆదర్శ గ్రామాలు, స్వచ్ఛభారత్, నూతన సాగు పద్ధతులు, రీసైక్లింగ్ ప్రాసెస్.. ఇలా వినూత్న వైజ్ఞానిక ఆవిష్కరణలకు జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన (ఇ¯ŒSస్పైర్–2016) వేదికగా నిలిచింది. కాకినాడ ఏఎంజీ పాఠశాలలో ఇన్‌స్పైర్–2016ను ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబులు గురువారం ప్రారంభించారు. అనంతరం ఇన్‌స్పైర్ లోగోను, పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న ప్రపంచ స్థితిగతులను అంచనా వేస్తూ నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేలా విద్యార్థుల ఆలోచనలకు ఉపాధ్యాయులు పదును పెట్టాలని అన్నారు. తొలుత జిల్లా ఖ్యాతిని కీర్తిస్తూ కళా ఉత్సవ్‌కు ఎంపికైన ఎంఎస్‌ఎ¯ŒS ఛార్టీస్ ఎయిడెడ్ పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యరూపకం, గాంధీనగర్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు చేసిన కోలాటం, గీతం శాంతినికేతన్, ఎస్‌ఆర్ ఉన్నత పాఠశాల విద్యార్థుల శాస్త్రవేత్తల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. 25 మండలాల నుంచి 560 ప్రాజెక్టులు ఈ ప్రదర్శనకు వచ్చాయి. సోలార్ సిస్టమ్స్‌పై నమూనాలను ఎక్కువమంది విద్యార్థులు ప్రదర్శించారు. ప్రతి ప్రాజెక్టూ విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టేలా ఉంది. రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం ఈ ప్రాజెక్టులకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 14 కమిటీల సభ్యులు ఈ ప్రాజెక్టులను స్క్రూట్నీ చేశారు. కార్యక్రమంలో డీఈవో ఆర్.నరసింహరావు, ఆర్జేడీ భార్గవ్, డీసీఎంఎస్ చైర్మ¯ŒS సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వసతులు లేక విలవిల
ఈ కార్యక్రమంలో వసతుల లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది.తొలిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకూ విద్యార్థులకు భోజనాలు వడ్డిస్తూనే ఉన్నారు. ఆలస్యంతోపాటు, అన్నం ఉడకకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై వారివెంట ఉన్న ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. బాత్‌రూములు దుర్వాసన రావడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా బాత్‌రూములు కేటాయించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రాజెక్టుల ప్రదర్శనకు విద్యార్థులకు గదుల కేటాయింపులో కూడా తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ప్రాజెక్టులతో విద్యార్థులు గంటల తరబడి గదుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కానీ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో ప్రదర్శనకు రాలేదు. రాత్రి బస కోసం కేటాయించిన గదుల్లో దోమలు అధికంగా ఉండడం, ఎక్కువమందికి ఒకే గదిని కేటాయించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలు తెలిసి కూడా తెలియనట్టుగా అధికారులు వదిలేయడంపై పలువురు ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేశారు.