పాపన్నపేట: ఈనెల 20వ తేదిన సంగారెడ్డిలో జరుగనున్న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్‌కు ప్రతి మండలం నుంచి 10 మంది విద్యార్థులు, ఒక గైడ్ టీచర్‌ను ఎంపిక చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి నజిమొద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు సంగారెడ్డిలోని విద్యాశాఖాధికారి కార్యాలయంలో మద్యాహ్నం 1.30 గంటలకు ‘ఆహార భద్రత కోసం పప్పుదినుసుల ఆవశ్యకత, ప్రస్తుత సమస్యలు’ అనే అంశంపై సెమినార్ ఉంటుందన్నారు. పాల్గొనదలచినవారు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో రావాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఎంపికైనవారు రాష్ట్రస్థాయి సెమినార్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.