Science Fair
-
'ప్రతిభ ప్రతిబింబించేలా'.. సైన్స్ ప్రయోగాలకు బీజం!
జగిత్యాల: విద్యార్థి దశ నుంచి సైన్స్‌పై ఆసక్తి కలిగించడం, శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో భారతీయుల కృషి తెలియజేసే ఉద్దేశమే విద్యార్థి విజ్ఞాన్ మంథన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సంయుక్తంగా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఏటా ఆన్లైన్ వేదికగా ప్రతిభ పరీక్ష నిర్వహిస్తోంది. పరిశోధన సంస్థల సందర్శన.. ► పలు జాతీయ ప్రయోగశాలల సందర్శనతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందుకునే అరుదైన అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తోంది. ► ఇందులో డీఆర్డీవో, బార్క్, సీఎస్ఐఆర్ వంటి ప్రఖ్యాత పరిశోధన సంస్థలున్నాయి. వాటిని సందర్శించే అవకాశంతో పాటు మూడు వారాలు ఇంటర్న్‌షిప్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహిస్తోంది. ► ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆ ప్రయోగశాలల సందర్శనతో కొత్త స్ఫూర్తి పొందే అవకాశముంది. 2024 సంవత్సరానికి సంబంధించి జాతీయస్థాయి పరీక్ష మే 18, 19న నిర్వహించనున్నారు. ► నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 6 నుంచి 11వ తరగతి (ఇంటర్ ప్రథమ సంవత్సరం) విద్యార్థులకు ఆన్లైన్ వేదికగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ► 6 నుంచి 8వ తరగతి వరకు జూనియర్లుగా, 9 నుంచి 11 వరకు సీనియర్లుగా పరిగణిస్తారు. ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, రాష్ట్ర బోర్డు విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష.. అక్టోబరు 1న నమూనా పరీక్ష ఉంటుంది. అదే నెల 29 లేదా 30న జిల్లాస్థాయిలో పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. సీనియర్, జూనియర్ విభాగంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. గణితం, సామాన్య శాస్త్ర పాఠ్య పుస్తకాల నుంచి 50 శాతం, విజ్ఞానశాస్త్రం రంగంలో దేశ కృషిపై 20 శాతం, లాజిక్ రీజనింగ్‌కు 10 శాతం, శాస్త్రవేత్త బీర్బల్ సహానీ జీవిత చరిత్రకు 20 శాతం బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. జిల్లాస్థాయిలో ఇలా.. జిల్లాలో ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు ప్రతి తరగతిలో ప్రతిభచూపిన మొ దటి ముగ్గురు చొప్పున మొత్తం 18 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ఆన్లైన్లో అందిస్తారు. రాష్ట్రస్థాయిలో.. పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభచూపిన మొదటి 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం 120 మందిని రాష్ట్రస్థాయికి పంపుతారు. అత్యంత ప్రతిభకనభర్చిన 18 మందిని రాష్ట్రస్థాయి విజేతగా ప్రకటిస్తారు. వారిలో మొదటి ముగ్గురికి రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేల చొప్పున నగదు ప్రోత్సహకాలిస్తారు. జాతీయ స్థాయిలో.. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనభర్చినవారి నుంచి 18 మందిని జాతీయ స్థాయి ప్రతిభావంతులుగా గుర్తిస్తారు. వీరిని హిమాలయన్స్ అంటారు. వారికి రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు నగదు ప్రోత్సాహకాలు ఇస్తారు. వీటితో పాటు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాది పాటు ఉపకారవేతనం అందిస్తారు. దరఖాస్తు ఇలా.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ ద్వారా విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోటీలు పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో నిర్వహిస్తారు. www. vvm. org. in వెబ్సైట్లో రూ.200 ఫీజు ఆన్లైన్లో చెల్లించి ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 1న నమూనా పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, హిందీ, ఆంగ్లం విభాగాల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థులకు మంచి అవకాశం.. విద్యార్థుల విజ్ఞానానికి మంచి అవకాశం. పరీక్షను విద్యార్థులు వ్యక్తిగతంగా, పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సైన్స్ ప్రయోగాలకు బీజం పాఠశాల స్థాయి నుంచే కలగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటా దీన్ని నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అభిరుచి కలిగించడం, వారిలోని నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికితీయడం ఈ పరీక్ష ఉద్దేశం. వీవీఎం పరీక్షలో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. – బి.రవినందన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి, పెద్దపల్లి -
టెక్నాలజీ అంటే ఇష్టం.. రూ.13వేల ఖర్చు, పాత ఇనుప సామగ్రితో బైక్!
సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఆ యువకుడికి మహా ఇష్టం. ఆసక్తికి ఆలోచనలు తోడయ్యాయి. ఆవిష్కరణలు ఆరంభమయ్యాయి. డ్రైవర్‌లేని కార్లు, డబుల్ మైలేజీ ఇచ్చే బైక్‌లు, ఇ–బైక్‌లను తక్కువ ఖర్చుతో తయారుచేస్తూ అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో డేటా సైన్స్ విద్యను పూర్తిచేసిన గెంబలి గౌతమ్‌కు చిన్నప్పటి నుంచి సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కొత్తకొత్త ఆవిష్కరణలు చేయడం మహా సరదా. ఆదే అలవాటుగా మారింది. మైక్రో ఆర్ట్ నుంచి వినూత్న వాహనాల తయారీ వరకు వినూత్నంగా సాగిపోతున్నాడు. రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ.. పెట్రోల్ లేకుండా బ్యాటరీతో నడిచే వాహనాలను సొంతంగా తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయన ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఏ ఆవిష్కరణ అయినా ఔరా అనాల్సిందే. అతి తక్కువ ఖర్చుతో నడిచే స్కూటర్‌ను చూస్తే వావ్ అంటాం. తనకు నచ్చిన రంగులతో విభిన్నమైన ఆలోచనలతో దూసుకెళ్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. డబుల్ మైలేజ్.. డబుల్ ధమాకా.. ► పెట్రోల్ భారం తగ్గేలా గౌతమ్ సరికొత్త డివైజ్‌ను రూపొందించాడు. చైనాకు చెందిన హజ్ మోటారు వినియోగించి, బైక్‌లో కొన్ని మార్పులు చేశాడు. ఇప్పుడు లీటరు పెట్రోల్‌తో గతంలో నడిచిన దానికంటే డబుల్ మైలేజ్ వస్తోంది. ► ఇంట్లో ఉండే పాత ఇనుప సామగ్రిని వినియోగించి కేవలం రూ.13వేల ఖర్చుతో రెయిన్ బో స్కూటర్‌ను రూపొందించాడు. లిథియం బ్యాటరీ, మూలకు చేరిన కొన్ని వాహనాల పరికరాలను వినియోగించి దీనిని తయారు చేశాడు. తన మామయ్య కోరిక మేరకు దీనిని తీర్చిదిద్దానని, ఎంతోమందికి నచ్చడంతో ఈ తరహా బైక్స్ తయారు చేయాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని గౌతమ్ చెబుతున్నాడు. ► దివ్యాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి స్టీరింగ్ లెస్ కారును తయారుచేసి దాన్ని రోడ్లపై నడుపుతూ గౌతమ్ అబ్బుర పరిచాడు. ఆయన రూపొందించిన కారుకు స్టీరింగ్ ఉండదు. కేవలం రూ.32 వేల ఖర్చుతో డిజైన్ చేసిన కారులో 350 వోల్టుల సామర్థ్యం కలిగిన 2 మోటార్లు, లిథియం బ్యాటరీ, కొంత ఐరన్ వినియోగించాడు. సోలార్‌తో పాటు బ్యాటరీతో నడిచేలా కారును తయారు చేశాడు. కాళ్ల వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా ఆపరేట్ అవుతుంటుంది. చేతులు లేని విభిన్న ప్రతిభావంతులను దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ రూపొందించినట్టు గౌతమ్ చెబుతున్నాడు. జీపీఆర్ఎస్ సిస్టమ్, బ్లూ టూత్ వంటి సదుపాయాలు ఈ కారు సొంతం. దీనికి లైసెన్స్‌తో పనిలేదు. గతంలో అంతర్జాతీయ సైన్స్దినోత్సవం సందర్భంగా ఈ కారుని చూసిన జపాన్ బృందం యువకుడి ప్రతిభను మెచ్చుకుంది. ప్రశంసల వర్షం కురిపించింది. విశాఖపట్నంలోని ఇద్దరు దివ్యాంగులకు రెండు కార్లు ప్రత్యేకంగా తయారు చేసి అందజేశాడు. పంటలకు పురుగుమందులు పిచికారీ చేసే స్ప్రేలను వినూత్నంగా తయారుచేసి రైతులకు అందజేస్తున్నాడు. 15 గంటల్లోనే ఈ బైక్ తయారీ తన స్నేహితుడైన వెల్డర్ జానకి సహాయంతో కేవలం 15 గంటల్లో ఈ–బైక్ రూపొందించాడు. దానిని రెండు గంటల పాటు చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని రుజువు చేశాడు. వాహనం తయారీకి పాత ఇనుప సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, స్కూటీ టైర్లు, బీఎల్డీసీ మోటార్, లిథియం బ్యాటరీని వినియోగించాడు. యాక్సిలేటర్, ఆటో గేర్ సిస్టం, హ్యాండ్‌బ్రేక్ ఉపయోగించాడు. రాత్రి కూడా సునాయసంగా ప్రయాణించేందుకు వీలుగా బైక్‌కు ఫ్లడ్ లైట్ అమర్చాడు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జల్దు వినయ్ ఎలక్ట్రికల్ పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో తన ప్రయోగం వేగంగా పూర్తిచేసినట్టు యువకుడు తెలిపాడు. ఏ ఆలోచన వచ్చినా .. ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకూ స్టీరింగ్ లెస్ కారుతోపాటు రెయిన్ బో స్కూటర్, రెండింతలు మైలేజీ వచ్చేలా బైక్ డిజైన్‌లో మార్పులు చేశాను. సరికొత్త బైక్ తయారీకి ప్రయత్నిస్తున్నాను. రెయిన్ బో స్కూటర్ చాలా మందికి నచ్చడంతో ఇప్పటికే కొంత మంది డిజైన్ చేసి ఇచ్చారు. చిన్నప్పటి నుంచి సరికొత్తగా ఆలోచించడం, ఏదో ఒకటి చేయాలన్న తపనతో అనేక విషయాలను నేర్చుకోవడం మొదలు పెట్టాను. చిన్నప్పుడు పిల్లలకు కరెంట్ వైర్లతో వెరైటీ ఐటెమ్స్ చేసి ఇవ్వడం, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులకు సహకారాన్ని అందించడం వంటివి చేశాను. అప్పుడే కొత్త ఆవిష్కరణల దిశగా నా అడుగులు పడ్డాయి. – జి.గౌతమ్, పార్వతీపురం చదవండి: ఉదయాన్నే జాగింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా.. ఈ గ్యాడ్జెట్ మీకోసమే! -
సైన్స్ సంబరాలను ప్రారంభించిన మంత్రి ఆదిమూలపు సురేష్
-
హైదరాబాద్: అనాథ అక్కాచెల్లెళ్లను కలిపిన ‘సైన్స్ ఫేర్’ ఫోటో
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వారిలో పెద్దవారు ఇద్దరిని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించారు. చిన్న అమ్మాయి వారి నానమ్మతాతయ్యల దగ్గర ఉంటుంది. కానీ దురదృష్టం కొద్ది వారు కూడా చనిపోవడంతో.. ఆ బాలిక వీధుల వెంబడి భిక్షాటన చేస్తూ కాలం గడపసాగింది. ఈ క్రమంలో తన అక్కలను చేరదీసిన అనాథాశ్రమం వారే ఆ బాలికను కూడా అక్కున చేర్చుకున్నారు. అయితే వేరే బ్రాంచ్‌లో ఆ చిన్నారిని చేర్పించారు. చివరకు సైన్స్ ఫేర్ ఫోటోలో చెల్లెని గుర్తించిన అక్కలు తన గురించి హోమ్ నిర్వహకులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లును ఒకే చోటకు చేర్చారు. అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారిని ఆ చిన్నారులు.. కనీసం అందరం ఒకే చోట ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల అమ్మ వారి చిన్నతనంలోనే చనిపోగా.. తండ్రి మూడేళ్ల క్రితం చనిపోయాడు. ఈ క్రమంలో పెద్దమ్మాయి(14), మరో అమ్మాయి(12)ని నగరంలోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్చారు. ఇక అందరికంటే చిన్నదైన బాలిక తన తాతనానమ్మల దగ్గర ఉండేది. కానీ దురదృష్టం కొద్ది కొన్ని నెలల క్రితం వారు కూడా మృతి చెందారు. అప్పటి నుంచి బాలిక వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవించసాగింది. బాలిక గురించి సమాచారం తెలిసిన అనాథాశ్రమం వారు ఆ చిన్నారిని చేరదీశారు. విచిత్రం ఏంటంటే చిన్నారి అక్కలిద్దరూ ఇదే ఆశ్రమంలో ఉంటున్నారు. కాకపోతే వేరే బ్రాంచ్‌లో. ఇక దీని గురించి ఆ అక్కాచెల్లెళ్లలకు ఏమాత్రం సమాచారం తెలీదు. ఈ క్రమంలో ఓ రోజు వేర్వేరు అనాథశ్రమాల్లో నిర్వహించిన సైన్స్ ఫేర్ ఫోటోలను బాలిక అక్కలు చూశారు. ఆ ఫోటోలో ఉన్న తమ చెల్లిని గుర్తించారు. ఇక దీని గురించి ఆశ్రమం అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు.. ముగ్గురు బాలికలకు డీఎన్ఏ టెస్ట్ చేసి.. వారంతా తోబుట్టువులే అని తేల్చారు. అనంతరం ముగ్గురిని ఒకే చోటకు చేర్చారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఆ అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్క చోట కలిసి ఉండే అవకాశం లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి అకేశ్వర్ రావు మాట్లాడుతూ.. ‘‘మన రాష్ట్రంలో ఉన్న పలు అనాథాశ్రమాల్లో అధికారులు, కౌన్సిలర్లు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించి.. పిల్లలు వాటిలో పాల్గొనేలా ప్రోత్సాహిస్తారు. అలానే సైన్స్ ఫేర్ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాం. ఈ సందర్భంగా తీసిన ఫోటో ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లును ఒక్కచోటకు చేర్చింది’’ అన్నారు. -
బాల మేధావులు భళా !
సాక్షి, ఆదిలాబాద్ : విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలు చూసి నివ్వరపోయేలా చేసింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, రోడ్డు ప్రమాదాల నివారణ, వ్యర్థాలతో అర్థాలు, విద్యుత్, నీటి ఆదా, తదితర ప్రదర్శనలు తయారు చేశారు. భావితర శాస్త్రవేత్తలుగా నమూనాలను తయారు చేసి ఆలోచింపజేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా వైజ్ఞానిక సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని 700లకు పైగా పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రయోగాలను ప్రదర్శించారు.కలెక్టర్ దివ్యదేవరాజన్, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, జిల్లా విద్య శాఖాధికారి డాక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి తిలకించారు. వీరితో పాటు మార్కెట్ కమిటీ మెట్టు ప్రహ్లాద్, తదితరులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, అకాడమిక్ కోఆర్డినేటర్ నారాయణ, ఎంఈఓ జయశీల, శ్రీహరిబాబు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఓపెన్‌స్కూల్ కోఆర్డినేటర్ అశోక్, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు.. పర్యావరణ కాలుష్యంతో గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ఫ్యాక్టరీలతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యమై రోగాలు ప్రబలుతున్నాయి. సెల్ టవర్ల కారణంగా పిచ్చుకలు చనిపోతున్నాయి. పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటడడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలి. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసుకోవాలి. – నవీన, ప్రతిభ, కేజీబీవీ, ఆదిలాబాద్ గాలి ద్వారా వంట.. గాలిద్వారా వంట చేసుకోవచ్చు. ఇందుకోసం పెట్రోల్, నీరు అవసరం ఉంటుంది. రెండు వేర్వేరు బాటిళ్లలో నీళ్లు, పెట్రోల్ పోసి పైపులను అమర్చుకోవాలి. పెట్రోల్ బాటిల్‌కు ఒక పైపును ఏర్పాటు చేసి గాలిని పంపాలి. ఆ గాలి పెట్రోల్లోకి వెళ్లి గ్యాస్లీన్ వాయువు తయారవుతుంది. దానిద్వారా వంట చేసుకోవచ్చు. పెట్రోల్ అలాగే ఉంటుంది. ఎలాంటి ఖర్చు లేకుండా వంట చేసుకోవచ్చు. పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. – తృప్తి, ఝాన్సీరాణి, జెడ్పీఎస్ఎస్, ఇచ్చోడ విషజ్వరాలు సోకకుండా.. ప్రస్తుతం దోమలతో జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రజలు డెంగీ, మలేరియా, విషజ్వరాలు సోకుతున్నాయి. దోమల నివారణ కోసం తులసీ, బంతి, సజ్జల మొక్కలను ఇంట్లో పెంచితే దోమలు వృద్ధి చెందవు. గడ్డి చామంతి, వేప ఆకులను ఎండబెట్టి పొగపెడితే దోమలు ఉండవు. వేప నూనె, కొబ్బరి నూనె చర్మానికి రాసుకుంటే కుట్టవు. బ్యాక్టీరియా దరిచేరదు. – వర్ష, కృష్ణవేణి, జెడ్పీఎస్ఎస్, మావల సహజ వనరుల వినియోగం సహజ వనరుల వినియోగంతో అనేక లాభాలు పొందవచ్చు. వర్షాకాలంలో ట్యాంకుల్లో నీరు నిల్వ ఉంచుకొని వర్షాలు లేనప్పుడు వాటిని డ్రిప్ ద్వారా వినియోగించుకుంటే పంటలు పండుతాయి. పశువుల పెంపకంతో గోబర్ గ్యాస్ తయారు చేసుకోవచ్చు. సౌర శక్తితో విద్యుత్‌ను తయారు చేసుకోవచ్చు. ఎలాంటి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను వినియోగించకుండా సహజసిద్ధమైన ఎరువులను తయారు చేసి వాడాలి. – యశశ్విని, దుర్గా, అరుణోదయ పాఠశాల, ఆదిలాబాద్ దోమలు వృద్ధి చెందకుండా.. దోమలు మురికి కాల్వలు, నిల్వ నీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయి. దోమలను లార్వ దశలోనే నివారించేందుకు ఇంట్లో వాడిన మంచినూనె, రంపం పొట్టు, గుడ్డలను తీసుకోవాలి. రంపం పొట్టును గుడ్డలో కట్టి నూనెలో ముంచి మురికి కాల్వల్లో పారవేయాలి. ఆయిల్ పైకివచ్చి దోమల లార్వలకు ఆక్సిజన్ అందకుండా నూనె పైకితేలుతూ అవి నశించేలా చేస్తాయి. – దీపాలి, మారుతి, జెడ్పీఎస్ఎస్, మన్నూర్ సైన్స్ ప్రదర్శనలను తిలకిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యేలు చల్లని, వేడి గాలిచ్చే కూలర్.. తక్కువ ఖర్చుతో వేడి, చల్లని గాలినిచ్చే కూలర్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాటరీ, ఫ్యాన్, స్విచ్, బెండ్ పైపు, వైర్ అవసరం ఉంటుంది. బ్యాటరీతో పనిచేస్తుంది. వేసవి కాలంలో చల్లని నీటిని అందులో పోస్తే చల్లని గాలి వస్తుంది. చలికాలంలో వేడి నీళ్లు పోస్తే వేడి గాలిలో గది వెచ్చగా ఉంటుంది. కాలానికి అనుగుణంగా దీనిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. – అవంతిక, ఆర్యభట్ట పాఠశాల, ఆదిలాబాద్ ద్రియ సాగు.. బహుబాగుసేం ప్రస్తుతం రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులతో పంటలు పండించడంతో ఆహార పదార్థాలు విషహారంగా మారుతున్నాయి. దీంతో అనేక రోగాలు వస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయ వల్ల సహజమైన పంటలు లభిస్తాయి. ఆవులు, గేదెల ద్వారా స్వచ్ఛమైన పాలు లభించడంతోపాటు వాటి పేడతో ఎరువులు, గోబర్‌గ్యాస్ తయారు చేసుకోవచ్చు. – కె.అంకిత, విశ్వశాంతి పాఠశాల, ఆదిలాబాద్ -
ప్రోత్సాహం ఏదీ?
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలికి తీయాలి. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి. నిరంతరం పుస్తకాలతో కుస్తీ సరికాదు. అందుకు అనుగుణంగా ఆనందవేదిక... నోబ్యాగ్ డే వంటివాటిని సర్కారు ఎంతగానో ప్రోత్సహిస్తోంది. కానీ కేంద్రమా నవ వనరుల శాఖ చేపడుతున్న ఇన్స్పైర్ సైన్స్ ప్రదర్శన పోటీలపై మాత్రం పాఠశాలలనుంచి ప్రోత్సాహం కరువవుతోంది. గత ప్రభుత్వ హయాంలోనే దానిపై చిత్తశుద్ధి కొరవడింది. ఇప్పుడు ప్రోత్సహించే సర్కారు ఉన్నా... వాటిని వినియోగించుకోవడంలో ఎందుకో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. విజయనగరం అర్బన్: తరగతి గదిలోని విద్యార్థి ఆలోచనకు గుర్తింపు తేవాలంటే ఉపాధ్యాయుల ప్రోత్సాహం తప్పనిసరి. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల ప్రేరణ తోడయితే వారు రూపొందించే ఆవిష్కరణలకు కేంద్ర మానవ వనరుల శాఖ చేపడుతున్న ఇన్స్పైర్ సైన్స్ ప్రదర్శనల జాతీయ స్థాయిలో పోటీలపై జిల్లా పాఠశాల నిర్వాహకులు శ్రద్ధ చూపటం లేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా నుంచి ఈ పోటీలకు ప్రతి ఉన్నత, ప్రాధమికోన్నత పాఠశాల నుంచి నమూనాలు రావాలనే నిబంధన పాటించడంలో జిల్లా విద్యాశాఖ విఫలమయింది. అందుకే గత రెండేళ్లుగా అత్యల్ప సంఖ్యలో జిల్లా నుంచి పోటీలకు వెళ్లాల్సివస్తోంది. ప్రస్తుత సర్కారు ప్రోత్సహిస్తున్నా... విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను వెలికి తీయడానికి ప్రస్తుత ప్రభుత్వ అధికంగా ప్రాధాన్యమిస్తోంది. అందులో భాగంగానే పాఠశాల విద్యలో పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. ఆనందవేదిక, బ్యాగ్‌కు సెలవు, అలా, రా (ఆర్‌ఏఏ), ఇన్స్పైర్ సైన్స్ ప్రదర్శన వంటి పోటీలు పాఠ్యాంశాలతో పాటు ప్రవేశ పెట్టారు. చిన్నారుల్లో మొలకెత్తిన ఆలోచనలు సాకారం చేసుకునే వేదికే ‘ఇన్స్పైర్’. ఏటా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సమాజానికి భావి శాస్త్రవేత్తలను అం దించే గురుతర బాధ్యత పడకేసింది. ఎంతో ఉ న్నత ఆశయంతో చేపట్టిన ఈ ప్రక్రియపైప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయుల్లో నిర్లక్ష్యంనెలకొం ది. ఫలితంగా విద్యార్థుల శాస్త్ర విజ్ఞాన ఆలోచనలు నాలుగు గోడలకే పరిమితం అవుతున్నాయి. వేలల్లో అర్హులు... వందల్లోనే ప్రతిపాదనలు.. జిల్లాలోని అన్ని యాజమాన్య పరిధిలోని 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు నమూనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలో ఉన్న 3,441 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 920 ఉన్నత, ప్రాధమికోన్న పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో లక్ష 30 వేల మంది విద్యార్థులు 6 నుంచి 10వ తరగతి చదువుతున్నారు. స్కూల్‌కి ఐదు నమూనాలతో సుమారు 5 వేల మంది విద్యార్థుల వివరాలు నమోదు చేయాల్సి ఉన్నా... ఈ ఏడాదికి ఇప్పటివరకు 308 స్కూళ్ల నుంచి కేవలం 1,205 మంది వివరాలు మాత్రమే నమోదు చేశారు. గత రెండేళ్లలో కూడా ఇదే నిర్లక్ష్యంతో గడువు చివరి తేదీలలో 1,250, 1,600 సంఖ్యలో విద్యార్థులు నమూనాలు అన్లైన్లో పంపారు. అయితే వాటిలో తొలి ఏడాది 54, గత ఏడాది 48 నమూనాలు మాత్రమే పోటీ ప్రదర్శనలకు ఎంపికయ్యాయి. జాతీయ స్థాయిలో జరిగే ఈ ఎంపిక ప్రక్రియలో ప్రకటన వెలువడిన తొలి తేదీల్లో వచ్చినవాటికే ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో జిల్లా నుంచి చివరి తేదీల్లో నమోదు కావడం కారణంగా ఎంపిక సంఖ్య తగ్గిందనే వాదన లేకపోలేదు. గత నెల 31వ తేదీలోగా ఇన్‌స్పైర్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఉపాధ్యాయుల నుంచి జాతీయ స్థాయిలో స్పందన లభించకపోవడంతో ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచారు. అయినా ఫలితం కన్పించడం లేదు. ప్రతి నమూనాకు రూ.10 వేలు.. ఉపాధ్యాయులు విద్యార్థుల ఆలోచనకు తమ వంతు సహకారం అందించి ఆన్లైన్లో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంది. ఎంపికైన ప్రతి ప్రాజెక్టుకు రూ.10 వేలు మంజూరవుతుంది. ఆ నిధులతో నమూనాకు అవసరమైన పరికరాలు సమకూర్చుకోవచ్చు. జిల్లా స్థాయిలో నిర్వహించే ఇన్స్పైర్ పోటీ ప్రదర్శనకు హాజరుకావడానికి అవసరమైన చార్జీలు వెచ్చించుకునే వెసులు బాటు ఉంది. విద్యార్థుల ఆలోచనల ఆవిష్కరణను ‘ఇన్స్పైర్అవార్డ్స్డీఎస్టీ.జీఓవి’వెబ్ సైట్లో నమోదు చేస్తే ఎంపికైన ప్రతి ప్రాజెక్టుకు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయి. పెంచిన గడువు వినియోగించుకోవాలి.. జిల్లాలో ఇంతవరకు 308 స్కూళ్ల నుంచి 1,205 మంది విద్యార్థులు నమూనాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. గతేడాది 1,250 మంది నమోదు చేసుకుంటే కేవలం 54 మాత్రమే ప్రదర్శన పోటీకి ఎంపికయ్యా యి. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే క్షేత్రస్థాయిలో సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కలిగించాం. ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఉపాధ్యాయులు దానిని ఉపయోగించుకోవాలి. – కె.సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ కో–ఆర్డినేటర్ -
సైన్స్ ఫెయిర్: ఆకట్టుకున్న విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్స్
-
బాల బాహుబలి
తల్లి చేయాల్సిన అభిషేకం కోసం ఏకంగా శివలింగాన్నే పెళ్లగించి జలపాతం కింద ఉంచాడు సినీ బాహుబలి! తల్లిదండ్రులు ధాన్యం మూటగట్టడానికి పడే కష్టాన్ని తాను కనిపెట్టిన యంత్రంతో తేలిక చేశాడు ఈ బాల బాహుబలి!! అతడు కనిపెట్టిన పరికరం ధాన్యాన్ని సులువుగా నింపి, ఒక చోట నుంచి మరో చోటకు సునాయాసంగా మోసుకెళ్లడానికి వీలుకల్పిస్తుండటంతో జాతీయ అవార్డే వరించింది. ఈ ఆవిష్కరణ జాతీయ స్థాయిలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహించిన ఇన్స్పైర్ అవార్డుల పోటీలో మూడో బహుమతిని గెల్చుకుంది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ పరికరాన్ని ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉపయోగించడానికి సిద్ధమవుతోంది. మన వాళ్ల ఆవిష్కరణలను వెలుగులోకి వచ్చిన వెంటనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం అపూర్వం. గొప్ప ప్రారంభం. ప్రభుత్వం ఇదే మాదిరిగా దృష్టి సారించాల్సిన అద్భుత గ్రామీణ ఆవిష్కరణలు తెలుగు రాష్ట్రాల్లో బోలెడు మూలనపడి ఉన్నాయి. వాటిలో కొన్నిటికైనా గుర్తింపు వస్తుందని, ఆవిష్కర్తలకూ మంచిరోజులొస్తాయని ఆశిద్దాం.. పద్నాలుగు సంవత్సరాల మర్రిపల్లి అభిషేక్ రైతు బిడ్డ. 8వ తరగతి చదువుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజిపేట అతని స్వగ్రామం. ఆ ఊళ్లోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి. తండ్రి లక్ష్మీరాజం వ్యవసాయ పనులు చేస్తూ, తల్లి రాజవ్వ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు. సెలవు రోజుల్లో ఇంటివద్ద ఏదో ఒక వస్తువు తయారు చేయడానికి అభిషేక్ ప్రయత్నిస్తుండేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. గత వేసవిసెలవుల్లో సిరంజీలు, కాటన్ బాక్స్‌లతో వాటర్ ప్రెషర్ ద్వారా నడిచే పొక్లెయినర్‌ను తయారు చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ ఓ రోజు తన తండ్రితో కలసి వేములవాడలోని మార్కెట్‌యార్డుకు వెళ్లాడు. అక్కడ కార్మికులు ధాన్యాన్ని సంచుల్లోకి నింపుతున్నారు. ఒకరు ఖాళీ సంచిని పట్టుకొని నిలబడుతుంటే, మరొకరు ధాన్యాన్ని కిందినుంచి ఎత్తి సంచిలో నింపుతున్నారు. ధాన్యం నింపిన బస్తాను మరో ఇద్దరు తీసుకెళ్లి పక్కన పెడుతున్నారు. ఈ పనిని అభిషేక్ శ్రద్ధగా గమనించాడు. ఒక ధాన్యం సంచిని నింపడానికి నలుగురు పనిచేయాలా? ఈ కష్టాన్ని తగ్గించడానికి ఏమీ చేయలేమా? అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఈ ఆలోచనే తక్కువ శ్రమతో చక్కగా పనిచేసే ఓ పరికరం రూపకల్పనకు దారితీసింది. ఈ పరికరంలో 2 నిమిషాల్లో ధాన్యం బస్తాను నింపి, బరువు ఎంతో తెలుసుకునే ఏర్పాటు కూడా ఉంటుంది. అతనికి వచ్చిన కొత్త ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి, జాతీయ స్థాయి బహుమతిని పొందడానికి హన్మాజిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి, సైన్స్టీచర్ వెంకటేశం ప్రోత్సాహం తోడ్పడింది. గొప్ప ఆలోచన.. రూ. 5 వేల ఖర్చు.. ధాన్యాన్ని సంచిలోకి సులువుగా ఎత్తే పరికరం (ప్యాడీ ఫిల్లింగ్ మిషన్)ను తయారు చేస్తే బాగుంటుందన్న తన ఆలోచనను పాఠశాల ఉపాధ్యాయులకు అభిషేక్ తెలియజేశాడు. జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ ఆలోచనకు ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత గైడ్ టీచర్ వెంకటేశ్ సూచనలు, సహకారంతో ఐరన్ షీట్లు, రాడ్లు, బరువు తూచే మిషన్‌ను కొనుగోలు చేసి.. వారం రోజులపాటు వెల్డింగ్ షాపులో శ్రమించి తను ఆశించిన విధంగా అభిషేక్ పరికరాన్ని ఆవిష్కరించాడు. ఇందుకోసం రూ. 5 వేల వరకు ఖర్చయింది. ఈ పరికరంతో ఒక్కరే అత్యంత సులభంగా కేవలం రెండు నిమిషాల్లోనే ధాన్యాన్ని బస్తాలోకి నింపుకోవచ్చు. ఈ పరికరంలో రెండు భాగాలుంటాయి. ట్రాలీ వంటిది ఒకటి, ధాన్యాన్ని తీసుకొని సంచిలోకి పోసే పరికరం ఒకటి. సంచిని నింపిన తర్వాత ఈ రెంటిని విడదీసి, ట్రాలీ ద్వారా ధాన్యం బస్తాను గోదాములోకి తీసుకెళ్లి భద్రంగా పెట్టుకోవచ్చు. నలుగురు చేసే పనిని ఒక్కరే రెండునిమిషాల్లో పూర్తిచేయడానికి ఈ పరికరం దోహదపడుతోంది. ఈనెల 14, 15 తేదీల్లో ఢిల్లీ ఐఐటీలో జరిగిన జాతీయ స్థాయి ‘ఇన్స్పైర్ అవార్డ్స్–మనక్’ ఎగ్జిబిషన్– 2019లో వివిధ రాష్ట్రాలకు చెందిన 60 మంది విద్యార్థులు తమ అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన విద్యార్థి తయారు చేసిన ఆటోమేటిక్ వాష్‌రూమ్ క్లీనర్‌కు మొదటి బహుమతి, అండమాన్ నికోబార్‌కు చెందిన విద్యార్థి తయారుచేసిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఓపెనర్‌కు రెండో బహుమతి వచ్చింది. అభిషేక్ తయారు చేసిన ప్యాడీ ఫిల్లింగ్ మిషన్‌కు మూడవ స్థానం వచ్చింది. ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ డా. రాంగోపాల్‌రావు చేతుల మీదుగా రూ. పదివేల నగదు బహుమతితోపాటు ల్యాప్‌టాప్ లభించింది. పిన్నవయసులోనే చక్కటి పరికరాన్ని రూపొందించిన అభిషేక్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వెన్నుతట్టి రూ. 1.16 లక్షల చెక్కు ఇచ్చి అభినందించారు. అభిషేక్ రూపొందించిన పరికరాన్ని మరింత మెరుగుపరచి ఈ రబీ సీజన్లోనే ప్రయోగాత్మకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వినియోగించడంతోపాటు, ‘వరి అభిషేక్’ పేరిట పేటెంట్ కోసం దరఖాస్తు చేయడానికి తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకుల్ సబర్వాల్ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. రూ. పదివేల నగదు ప్రోత్సాహాన్ని అభిషేక్‌కు అందించారు. వచ్చే ఏడాది నాటికి ఈ పరికరాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చే వీలుందని అభిషేక్ గైడ్ టీచర్ వెంకటేశం(85008 65263) తెలిపారు. ఏమిటీ ‘ఇన్స్పైర్’ అవార్డు? కేంద్ర శాస్త్ర – సాంకేతిక శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ‘ఇన్స్పైర్ అవార్డ్స్– మనక్’ పోటీలను నిర్వహిస్తున్నాయి. 2020 నాటికి శాస్త్రవిజ్ఞాన రంగంలో మొదటి 5 దేశాల్లో మన దేశాన్ని నిలపాలన్న లక్ష్యంతో పాఠశాల విద్యార్థుల్లో పరిశోధన, ఆవిష్కరణాభిలాషకు ప్రేరణ కలిగించడానికి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. 6–10వ తరగతుల (10–15 ఏళ్ల వయసు) ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మకతను, వినూత్న ఆలోచనలను గుర్తించడం ద్వారా ప్రజల జీవితాలను సులభతరం చేసే కొత్త ఆలోచనలు, ఉపాయాలను రేకెత్తించడమే లక్ష్యం. ఈ ఆలోచనలు సొంతవి, సాంకేతికతకు సంబంధించినవి అయి ఉండాలి. రోజువారీ సమస్యలను పరిష్కరించేటటువంటి ఒక యంత్రాన్నో, వస్తువునో మెరుగుపరిచేదిగా లేదా కొత్తదానిని సృష్టించేవిగా ఉండే సొంత ఆలోచనలై ఉండాలి. దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి పది లక్షల వినూత్న ఆలోచనలను సేకరిస్తారు. వాటిలో ఉత్తమమైన వాటిని జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన మెరుగైన ఆలోచనల ప్రకారం యంత్ర పరికరాల నమూనాలను తయారు చేయడానికి రూ. పది వేల చొప్పున గ్రాంటును మంజూరు చేస్తారు. దేశవ్యాప్తంగా గరిష్టంగా వెయ్యి ఆవిష్కరణలను ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో బహుమతులు పొందిన ఆవిష్కరణలకు స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శాస్త్ర సాంకేతిక సంస్థల ద్వారా సాంకేతిక, ఆర్థిక తోడ్పాటును అందించి, ఆయా ఆవిష్కరణలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షన్నర పాఠశాలల నుంచి 2.88 లక్షల వినూత్న ఆలోచనలను సేకరించి వడపోసిన తర్వాత 60 ఆవిష్కరణలు ఢిల్లీకి చేరాయి. అందులో మూడోస్థానాన్ని తెలుగు విద్యార్థి అభిషేక్ దక్కించుకోవడం విశేషం. ఇంత పేరు తెస్తాడనుకోలేదు! నా కొడుకు తయారు చేసిన వడ్ల మిషన్కి ఇంత పేరు వస్తుందని నాకు తెలియదు. బడి లేని రోజుల్లో ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాడు. కానీ తను తయారు చేసిన ఈ పరికరం ఇంత పేరు తెస్తుందని అనుకోలేదు. ఢిల్లీలో నా కొడుకు అవార్డు తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. – మర్రిపల్లి రాజవ్వ, అభిషేక్ తల్లి, హన్మాజిపేట మరిన్ని పరికరాలు తయారు చేస్తా ఉపాధ్యాయులతో పాటు నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ పరికరాన్ని తయారు చేయగలిగా. నాకు ఏదైనా తయారు చేయాలనే ఆలోచన కలిగినప్పుడల్లా వెంకటేశం సారు, ఇతర టీచర్లు ప్రోత్సహించారు. ఇంటివద్ద అమ్మ, అక్కలు కూడా సహాయం చేసేవారు. నా పరికరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై, మూడో బహమతి పొందడం ఆనందంగా ఉంది. ఇకముందు మరిన్ని కొత్త యంత్రాలను తయారుచేస్తా. ఐఏఎస్ అధికారి కావాలన్నది నా లక్ష్యం. – మర్రిపల్లి అభిషేక్, 8వ తరగతి విద్యార్థి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హన్మాజిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా ఢిల్లీ ఐఐటీలో ‘ఇన్స్పైర్’ పోటీల్లో తన పరికరంతో అభిషేక్ – పాదం వెంకటేశ్, సాక్షి, సిరిసిల్ల ఫొటోలు: పుట్టపాక లక్ష్మణ్ -
ట్రిపుల్‌ఐటీలో ముగిసిన వైజ్ఞానిక మేళా
బాసర(ముథోల్) : బాసర ట్రిపుల్‌ఐటీలో గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న వైజ్ఞానిక మేళా గురువారం రాత్రి ముగిసింది. దాదాపు 221 మందికి పైగా విద్యార్థులు వివిధ ప్రయోగాలను ప్రదర్శించారు. గురువారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ముగింపు సమావేశానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, తెలంగాణ యూనివర్సిటీ సాంబయ్య, ఎ¯Œఆర్ఎస్ఏ డైరెక్టర్ సూజాత గోశ్, పాలమూరు యూనివర్శిటీ వైస్ ఛాన్సులార్ రాజరత్నం, వీసీ డాక్టర్ అశోక్‌కుమార్, ముఖ్య అథితులుగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను ఆకస్తిగా తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ట్రిపుల్ఐటీ ఉండడం అదృష్టమన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న వైజ్ఞానిక దృష్టి కోణాన్ని బహిర్గతం చేయడానికి విజ్ఞాన ప్రదర్శన ఉపయోగపడిందన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏవో వెంకటస్వామి, అకాడమిక్ డీన్ రణదీర్ సాగీ, టెక్ ఫెస్టు కన్వీనర్ స్వప్నిల్, నాగరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వినువీధిలోకి విజ్ఞాన శిఖరం
లండన్: విశ్వవిఖ్యాత ఖగోళ, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (76) తనువు చాలించారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వ విద్యా లయం సమీపంలోని తన ఇంట్లో బుధవారం తెల్లవారుజామున ఆయన ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘మా నాన్న మరణం మమ్మల్ని తీవ్ర వేదనకు గురిచేస్తోంది. ఆయన గొప్ప శాస్త్ర జ్ఞుడు. అంతకుమించి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి. ఆయన పరిశోధనలు, ఆవిష్క రణలను రాబోయే తరతరాలు గుర్తుంచుకుం టాయి. ఆయన ధైర్యం, మేధస్సు, హాస్యం ప్రపంచంలో అనేక మందిలో స్ఫూర్తి నింపాయి. నాన్న మరణం మా కుటుంబానికే కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు’ అని హాకింగ్ ముగ్గురు పిల్లలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హాకింగ్ మృతికి నివాళిగా కేంబ్రిడ్జి వర్సిటీ కాలేజ్‌లో జెండాను అవనతం చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు హాకింగ్‌కు నివాళులర్పించారు. 21ఏళ్ల వయసుకే అత్యంత అరుదైన ‘అమియోట్రోపిక్ లాటరల్ స్లె్కరోసిస్’ (ఏఎల్ఎస్) అనే వ్యాధి బారిన పడి వీల్‌చైర్‌కే పరిమితమైన హాకింగ్.. పట్టుదలతో తన శారీరక లోపాలను అధిగమించి విశ్వ రహస్యాలను ఛేదించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది అల్బర్ట్ ఐన్‌స్టీన్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తల సరసన చోటు సంపాదించుకున్నారు హాకింగ్. ‘మెదడు బాగా పనిచేస్తున్న తరుణంలో అవయవ లోపాలు ఉన్నంత మాత్రాన మనుషులు తమ సామర్థ్యాలకు పరిమితి విధించుకోవాల్సిన అవసరం లేదని నేను ప్రపంచానికి చాటాలనుకున్నాను’ అని హాకింగ్ గతంలో అన్న మాటలు ఆయన ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రముఖుల నివాళులు బ్రిటన్ ప్రధాని థెరెసా మే, భారత ప్రధాని మోదీ సహా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు హాకింగ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘తన తరం శాస్త్రవేత్తల్లో స్టీఫెన్ హాకింగ్ మహోన్నతమైన వారు. ఆయన కృషిని ప్రపంచం ఎన్నటికీ మరిచిపోదు. స్టీఫెన్ మెదడు అత్యద్భుతం. సంకల్పం, హాస్యం, ధైర్యాల మేళవింపు అయిన ఆయన జీవితం రాబోయే తరాల్లోనూ ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయం’ అని థెరెసా మే అన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా హాకింగ్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ రోజు మనం గొప్ప మనిషిని కోల్పోయాం. విజ్ఞానశాస్త్రానికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’ అని సత్య పేర్కొన్నారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా బ్రిటన్ ప్రజలు ఓటేసిన అనంతరం ఓ రోజు హాకింగ్‌కు బ్రిటన్ ప్రభుత్వం ‘ప్రైడ్ ఆఫ్ బ్రిటన్’ పురస్కారాన్ని అందజేసింది. థెరెసా మే హాజరైన ఆ సభలో హాకింగ్ మాట్లాడుతూ ‘ఎంతో కష్టమైన గణిత సమస్యలను నేను రోజూ పరిష్కరిస్తుంటాను. కానీ బ్రెగ్జిట్ లెక్కలు చేయమని మాత్రం నన్ను దయచేసి అడగొద్దు’ అని అనడంతో సభలోని వారు నవ్వు ఆపుకోలేకపోయారు. యంత్రాల సాయంతో మాట్లాడుతున్నా ఇలాంటి చలోక్తులతో హాకింగ్ ఎప్పుడూ చుట్టుపక్కల వారిని ఉల్లాసంగా ఉంచేవారు. ఆయన స్ఫూర్తిప్రదాత ప్రధాని నరేంద్ర మోదీ స్టీఫెన్ హాకింగ్ మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, శరీరం సహకరించకపోయినా అంతరిక్ష శాస్త్రం అధ్యయనానికి ఆయన చూపిన పట్టుదల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. హాకింగ్ గొప్ప శాస్త్రవేత్త, విద్యావేత్త అని తన ట్వీటర్ సందేశంలో పేర్కొన్నారు. చెరగని ముద్ర: రాహుల్ స్టీఫెన్ మృతికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సంతాపం ప్రకటించారు. తర్కం, ప్రజ్ఞ, శాస్త్రీయ జిజ్ఞాసలో ఆయన ప్రపంచానికే మార్గదర్శకుడని అన్నారు. ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేశారని ట్వీటర్లో పేర్కొన్నారు. శారీరకంగా ఎన్ని అవరోధాలెదురైనా ఆధునిక భౌతిక శాస్త్రంలో ఆయన అత్యంత ప్రముఖుడిగా నిలిచారని తెలిపారు. సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మరణం పట్ల తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భౌతిక శాస్త్రంలోని అనేక విషయాలపై అధ్యయనం చేసిన హాకింగ్.. మానవాళికి విలువైన సమాచారాన్ని అందించారని కొనియాడారు. శరీరం సహకరించకున్నా, తన మేధోశక్తితో అద్భుత ఆవిష్కరణలు చేసిన హాకింగ్ ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని కేసీఆర్ అన్నారు. ఓ మేధావిని కోల్పోయాం: వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ప్రపంచం ఓ మేధావిని కోల్పోయిందని సంతాప సందేశంలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. మరణం తర్వాత జీవితం లేదనీ, స్వర్గం అనేది ఓ కట్టుకథ అన్న హాకింగ్ నమ్మకాన్ని, ఆయన రాసిన ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం’ (కాలం కథ) అనే రచనను జగన్ గుర్తుచేశారు. అనారోగ్యంతో బాధపడుతూ, వీల్‌చైర్‌కే పరిమితమైనప్పటికీ సరికొత్త మేధో కోణాన్ని ఆవిష్కరించేందుకు హాకింగ్ చేసిన సేవలను జగన్ కొనియాడారు. ఆయన ప్రతీ కదలికలో ధైర్యం, కృతనిశ్చయం కనిపించేదన్నారు. విజ్ఞాన శాస్త్ర అవధులను తాకిన ఆయన మేధో సంపత్తికి ఘన నివాళి అర్పించారు. ఇంకొన్నాళ్లే అన్నా చదువు కొనసాగించారు.. ఏఎల్ఎస్ వ్యాధి సాధారణంగా ప్రాణాంతకమైనది. 21 ఏళ్ల వయసులో హాకింగ్‌కు ఈ వ్యాధి ఉందని బయటపడినప్పుడు ఆయన ఇంకొన్నేళ్లు మాత్రమే బతుకుతాడని వైద్యులు చెప్పారు. అయినా ఆయన దాని గురించి ఆలోచించకుండా కేంబ్రిడ్జిలో చదువు కొనసాగించారు. ఏఎల్‌ఎస్‌తో హాకింగ్ వీల్‌చైర్‌కి పరిమితమయ్యారు. ఒక చేతిలోని కొన్ని వేళ్లను మాత్రమే ఆయన కదపగలిగేవారు. ఇతరులు లేదా యంత్రాల సాయం లేకుండా కనీసం మాట్లాడటం సహా ఏ చిన్న పనీ చేసుకోలేని స్థితి. కానీ యంత్రాల సాయంతోనే ఆకట్టుకునేలా మాట్లాడుతూ సంకల్ప బలానికి, ఆసక్తికి ఓ చిహ్నంలా నిలిచారు హాకింగ్. 1970లో రోజర్ పెన్రోస్తో కలసి కృష్ణ బిలాలపై హాకింగ్ చేసిన పరిశోధనలు తొలిసారి ఆయనకు గుర్తింపును తెచ్చిపెట్టాయి. వ్యాధి సోకినట్లు కనుగొన్న తొలినాళ్లలో భార్యతో... నోబెల్ మినహా.. ఎన్నో అవార్డులు శాస్త్ర రంగంలో చేసిన పరిశోధనలకుగానూ హాకింగ్కి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. అల్బర్ట్ ఐన్‌స్టీన్ అవార్డు, వోల్ఫ్ ప్రైజ్, ద కోప్లీ మెడల్, ద ఫండమెంటల్ ఫిజిక్స్ ప్రైజ్, కమాండర్ ఆఫ్ మోస్ట్ ఎక్స్లెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, గోల్డ్ మెడల్ ఆఫ్ రాయల్ అస్ట్రోనామికల్ సొసైటీ తదితర పురస్కారాలు ఆయనను వరించాయి. హాకింగ్ బ్రిటిష్ పౌరుడై నప్పటికీ 2009లో ఒబామా అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’తో ఆయనను సత్కరించారు. తనకు ఏఎల్సీ వ్యాధి ఉందని తెలిసినప్పుడు తన ఆలోచన ఎలా ఉండేదో 2013లో ఆయన ఓ సారి చెప్పారు. ‘నాకు ఇలా జరగడం చాలా అన్యాయమని నేను బాధపడ్డాను. నా జీవితం ఇక అయిపోయిందనీ, నాలోని శక్తి సామర్థ్యాలు వృథా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు, 50 ఏళ్ల తర్వాత, నా జీవితంతో నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను’ అని ఆయన పేర్కొన్నారు. 2014లో స్టీఫెన్ హాకింగ్ జీవితంపై ‘ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్’ అని సినిమా కూడా తీశారు. ఈ సినిమాలో స్టీఫెన్ పాత్ర పోషించిన రెడ్‌మేన్‌కు ఆస్కార్ అవార్డు లభించింది. మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌తో సత్కరిస్తున్న ఒబామా నోబెల్ మాత్రం అందలేదు భౌతిక శాస్త్రం మౌలిక సూత్రాలతో విశ్వాంతరాళంలోని వస్తువులు, వాటి ఉనికిపై విశేష పరిశోధనలు చేసిన స్టీఫెన్ హాకింగ్‌కు నోబెల్ బహుమతి అందని ద్రాక్షగానే మిగిలింది. జీవితంలో ఒక్కసారైనా పొందాలని శాస్త్రవేత్తలు కలలు గనే ఆ అరుదైన గౌరవం హాకింగ్‌కు ఎందుకు దక్కలేదు? కృష్ణ బిలాలు అంతరించిపోతాయన్న ఆయన ప్రతిపాదన నిరూపణ కాకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. అయితే కృష్ణ బిలాలపై హాకింగ్ పరిశోధనలను ప్రస్తుతం సైద్ధాంతిక భౌతికశాస్త్రంలో ఆమోదిస్తున్నారు. -
చిన్నారులతో ఐటెమ్ సాంగ్స్‌కు డ్యాన్సులు
-
విజ్ఞాన ప్రదర్శనలతో.. వెలుగులోకి సృజనాత్మక శక్తి
కొరాపుట్ : విద్యార్థుల సృజనాత్మక శక్తి విజ్ఞాన ప్రదర్శనల ద్వారా వ్యక్తమవుతుందని జిల్లా విద్యాధికారి మర్కట కేసరి రాయ్ అన్నారు. జిల్లా విద్యావిభాగం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఏర్పాటు చేసిన కొన్ని విజ్ఞాన ప్రదర్శనలు ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార సూచనలుగా ఉన్నాయని ప్రశంసించారు. ప్రతి విద్యార్థి విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొనే విధంగా అందరి విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా సైన్స్ సూపర్వైజర్ శివ పట్నాయక్ మాట్లాడుతూ ఆన్లైన్లో పోటీపడిన 382 ప్రాజెక్టులలో 42 ప్రాజెక్టులను పోటీలో పాల్గొనేందుకు ఎంపిక చేసి ప్రదర్శనకు ఆహ్వానించినట్లు చెప్పారు. వాటిలో 34 ప్రాజెక్టులు ప్రదర్శనలో పాల్గొన్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొన్న వాటిల్లో 4 ప్రాజెక్టులను ఎంపిక చేసి భువనేశ్వర్‌లో రాష్ట్రస్థాయిలో ఈ నెల 12,13 తేదీలలో జరగనున్న విజ్ఞాన ప్రదర్శనలకు పంపనున్నామన్నారు. కార్యక్రమంలో సునాబెడ ఏఈఎఫ్ కళాశాల అధ్యాపకుడు ఉదయనాథ్ సామల్, కొరాపుట్ కళాశాల అధ్యాపకులు దీపక్ పట్నాయక్, తపన్ కుమార్ బెహర, కొరాపుట్ ప్రభుత్వ బాలల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వికాస్చంద్ర సర్కార్ పాల్గొన్నారు. -
సికింద్రాబాద్‌లో ప్రారంభమైన సైన్స్ ఫెయిర్
-
‘సర్కారీ’ విద్యార్థులు సూపర్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. డిసెంబర్ 21 నుంచి 23 వరకు వరంగల్‌లోని మడికొండలో జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 40 మంది విద్యార్థులు, టీచర్లు తమ సృజనాత్మక ప్రదర్శనలతో ప్రథ మ స్థానంలో నిలిచారు. వీరు ఈ నెల 8 నుంచి 12 వరకు సికింద్రాబాద్ సెయింట్ ప్యాట్రిక్ హైస్కూల్లో నిర్వహించే సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో తమ ప్రదర్శనలను ఉంచబోతున్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల ప్రదర్శనలు ఎగ్జిబిషన్లో ఉంటా యి. ఇందులో ఉత్తమ ప్రదర్శనలను జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక చేయనున్నారు. ఒక్కో రాష్ట్రం నుంచి 50 ఆవిష్కరణలకు సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శనకు అవకాశం ఇచ్చామని, మొత్తం గా 300 ప్రదర్శనలు ఉంటాయని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్ బి.శేషుకుమారి తెలిపారు. 40 ప్రదర్శనలు ప్రభుత్వ పాఠశాలలవే.. సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో రాష్ట్రం నుంచి పాల్గొనే 50 ప్రదర్శనల్లో 40 ప్రదర్శనలు ప్రభుత్వ పాఠశాలలకు చెందినవి ఉండగా 10 ప్రదర్శనలు మాత్రమే ప్రైవేటు పాఠశాలలకు చెందినవి ఉన్నా యి. అలాగే 15 గ్రూపు ఎగ్జిబిట్స్‌లో 13 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులవే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలే మెరుగు..: బి.శేషుకుమారి ప్రైవేటు స్కూళ్లకంటే ప్రభుత్వ పాఠశాలలే మెరుగైనవని మరోసారి నిరూపితమైందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం కడియం.. ఈ నెల 8 నుంచి నిర్వహించే సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ ప్రారంభ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరవుతారని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ తెలిపారు. 12న జరిగే ముగింపు కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్‌కు హాజరుకావాలనుకునే పాఠశాలలు హైదరాబాద్ డీఈవోను సంప్రదించాలన్నారు. -
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం కొత్త పుంతలు
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం శాస్త్ర, సాంకే తిక రంగాల్లో కొత్త పుంతలు తొక్కుతోందని, సామాన్యుల కష్టాలను తీర్చే దిశగా పరిశోధన లు పురోగతి సాధిస్తున్నాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ అన్నారు. తమిళనాడులోని చెన్నై లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) శుక్రవారం ప్రారంభమైంది. సమాజంలోని అసమానతలను రూపుమా పేందుకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలే అత్యుత్తమ మార్గమని తమ ప్రభుత్వం నమ్ముతోందని చెప్పారు. దేశంలోని వేర్వేరు పరిశోధన సంస్థలను ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. కేంద్ర బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక రంగాలకు కేటాయింపులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. నానో టెక్నాలజీ రంగంలో దేశం ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 1,200 ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థల్లో సీఎస్ఐఆర్ గతేడాది 12వ స్థానంలో ఉండగా.. తాజాగా 9వ స్థానానికి చేరుకుం దని అన్నారు. సీఎస్ఐఆర్ వంటి సంస్థలు ఇప్పుడు అన్ని రంగాల్లో సామాన్యుల సమ స్యలకు ప్రత్యేక ప్రాజెక్టుల ద్వారా పరిష్కా రాలు కనుక్కునే ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. వివిధ రంగాల్లో జరుగుతున్న పరిశోధనలను విద్యార్థులకు తెలియజేసే లక్ష్యంతో ఐఐఎస్ఎఫ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన చెప్పారు. సాంకేతికతతో సమస్యల పరిష్కారం: సుజనా చౌదరి గ్రామీణ భారత ప్రజల అనేక సమస్యలకు శాస్త్ర, సాంకేతికత ద్వారా పరిష్కారాలు కనుగొనేందుకు కేంద్రం ప్రాముఖ్యం ఇస్తోందని కేంద్ర మంత్రి సుజనాచౌదరి పేర్కొన్నారు. గ్రామీణ సమస్యలకు ఆ ప్రాంతాల సృజనశీలురు ఎన్నో వినూత్నమైన పరిష్కారాలు ఆవిష్కరించారని వీటన్నింటినీ ప్రజలకు చేరువ చేసేందుకు ఐఐఎస్‌ఎఫ్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అఫ్గానిస్తాన్ మంత్రి అబ్దుల్ లతీఫ్ రోషన్, విజ్ఞాన భారతి అధ్యక్షుడు విజయ్ భట్కర్, తమిళనాడు మంత్రి అన్బలగణ్, కేంద్ర భూశాస్త్ర విభాగ కార్యదర్శి రాజీవన్ పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశంలోని వేర్వేరు పరిశోధన సంస్థలు తమ పరిశోధన వివరాలను ప్రదర్శిస్తున్నాయి. భారత్‌కు రుణపడి ఉన్నాం: బంగ్లాదేశ్ మంత్రి తమ దేశం పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి విముక్తమయ్యేందుకు సాయం చేసిన భారత్‌కు బంగ్లాదేశ్ ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆ దేశానికి చెందిన మంత్రి యశ్ ఉస్మాన్ అన్నారు. ఆసియా రీజియన్‌కు భారత్ నేతృత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత్, బంగ్లాదేశ్‌లు అన్ని రంగాల్లో కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. -
దాశరథి సైన్స్ గీతం
సరిగ్గా ఒక పక్షం రోజుల క్రితం ఒక మిత్రుడు తణుకులో కలసినప్పుడు ఒక క్యాలెండర్ బహూకరించాడు. అది సైన్స్ సభ; క్యాలెండర్లో సైన్సూ, చరిత్ర కలగలసిన కవిత. నాకు మహదానందం కలిగింది. నిజానికి ఆ కవిత లేదా ఆ పాట కొత్తది కాదు, పాతి కేళ్లుగా అలాంటి వేదికలమీద వింటూనే ఉన్నా. అయినా క్యాలెండర్‌గా చూసినప్పుడు, కలకాలం గోడమీద మరెందరికో అవగాహనా, స్ఫూర్తీ కలిగిస్తుందని ఆశ. ఆ ఆనందం ఇంకా తాజాగా ఉండగానే, ఆ పాట రచయిత జన్మదినం నవంబరు 22 అని కూడా అదే క్యాలెండర్ చెబుతోంది. ఇంతకీ ఆ పాట ఏమిటి? ఆ కవి ఎవరు? ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంత? ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో– అని మొద లయ్యే ఈ గీతానికి రచయిత దాశరథి కృష్ణమాచా ర్యులు. అద్భుతమైన ఎత్తుగడ, లోతైన భావం, తీక్షణ మైన చూపుతో రూపొందిన ఈ గీతం... తర్వాతి చరణం ఇలా ఉంటుంది. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో జరిగిన నర కంఠాలెన్నో కుల మతాల సుడిగుండాలకు బలిౖయెన పవిత్రులెందరో విశ్వాంతరాళంలో మహా విస్ఫోటనం జరిగిన తర్వాతే భూమి రూపొందిందనేదీ, మనిషి ప్రస్తుత ఆకారం ధరించడానికి చాలా పరిణామక్రమం ఉందనేదీ శాస్త్ర విజ్ఞానం. వీటిని గొప్పగా స్ఫురింపజేస్తూ మన చరిత్ర తీరును వివరిస్తారు కవి. గతాన్ని హేతుబద్ధంగా అక్షరీకరించి, వర్తమాన పోకడల గురించి మరింతగా కవితా చిత్రిక పడతారు. మానవ కల్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపుకోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఈ గీత ప్రస్తావన ఇదివరకు చెప్పిన విషయమే అయినా, నడుస్తున్న చరిత్ర తీరు అదే కాబట్టి.. మరో పోలికతో మరింత స్పష్టంగా అంటాడు. ఎందుకంటే ఆ దోపిడీ, దౌష్ట్యం, దుర్మార్గం అలా సాగుతోంది మరి. ఇక పరిష్కారం ఎలా ఉండాలి? అదే ఈ కవితగా ముగిసిన భవిత కల. అన్నార్తులు అనాథలు అని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంత గాయపడిన కవిగుండెలలో రాయబడని కావ్యాలెన్నో? అని ముగిస్తాడు ఆ పాటను దాశరథి కృష్ణమా చార్యులు. పాతికేళ్లుగా ఈ గీతాన్ని పాడించి, ప్రచారంలోకి తెచ్చిన జన విజ్ఞాన వేదిక ఇటీవల క్యాలెండర్‌గా ముద్రించడం మరింత కొత్తగా దాశరథిని మనల్ని చూడమంటోంది. తండ్రి దగ్గర సంస్కృతం, తల్లి దగ్గర తెలుగు, గురువు దగ్గర ఉర్దూ నేర్చుకున్న తర్వాత– జీవితం పేదరికాన్నీ, నిజాంపాలన కష్టాన్నీ నేర్పాయి. ఇంటా, బయటా దాశరథి కృష్ణమాచార్యులు ఎదుర్కొన్న ఇడు ములు ఇన్నీ అన్నీ కావు. తిరగబడి ఉద్యమంలా సాగాడు, తెగబడి సాహిత్యం సృజించాడు. పద్యంతో, పాటతో చిరంజీవిగా మిగిలిపోయాడు. ‘‘లోకం నిండా విరివిగా శాంతి పంచే రీతిని కొత్త రకం విత్తనాల్ని కనిపెట్టే వీలు’’ గురించి శోధించి, సాధించిన సాహితీ శాస్త్రవేత్త దాశరథి కృష్ణమాచార్యులు (22.7.1925 – 5.11.1987) (నేడు దాశరథి కృష్ణమాచార్యులు జయంతి సందర్భంగా) వ్యాసకర్త సంచాలకులు, ఆకాశవాణి, తిరుపతి మొబైల్ : 94929 60868 -
ఎస్సై ఫలితాలు మరింత జాప్యం!
మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ కొనసాగుతుండటం వల్లే... సాక్షి, హైదరాబాద్: గతేడాది నవంబర్‌లో జరిగిన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) తుది పరీక్ష ఫలితాల విడుదలపై సందిగ్ధత నెలకొంది. మొత్తం 539 ఎస్సై, ఫైర్ ఆఫీసర్ పోస్టులకు తుది పరీక్ష జరగ్గా ఫలితాలపై ఇప్పటివరకు రిక్రూట్మెంట్ బోర్డు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. అయితే రాష్ట్ర పోలీసు అకాడమీలో ప్రస్తుతం 2,800 మందికిపైగా మహిళా కానిస్టేబుళ్లు శిక్షణలో ఉన్న నేపథ్యంలో ఎస్సై ఫలితాలు ప్రకటిస్తే కొత్తగా వచ్చే 539 మంది ఎస్సై, ఫైర్ ఆఫీసర్లకు ఒకే సమయంలో శిక్షణ ఇవ్వడం సాధ్యంకాదని పోలీసు ట్రైనింగ్ విభాగం భావిస్తోంది. మొత్తం 9 నెలల కానిస్టేబుళ్ల శిక్షణను ప్రస్తుతం రెండు సెమిస్టర్లుగా విభజించారు. అందులో భాగంగా మొదటి మూడున్నర నెలలు శిక్షణ ముగిస్తేనే ఎస్సై ఫలితాలపై కొంత ముందుకెళ్లే అవకాశం ఉందని శిక్షణ విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. ఒకేసారి రెండు విభాగాలకు శిక్షణ ఇవ్వడం కుదరదని శిక్షణ విభాగం తేల్చిచెప్పడంతో రిక్రూట్మెంట్ బోర్డు ఫలితాలపై వెనక్కి తగ్గిందన్న వాదన వినిపిస్తోంది. కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభమై దాదాపు నెలన్నరకాగా మరో నెలన్నర దాటితేగానీ ఎస్సై ఫలితాలు రావన్నది పోలీసుశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు కానిస్టేబుల్ ఫలితాల్లో రిజర్వేషన్ అమలు తీరు, కటాఫ్ వంటి అంశాలపై 143 మంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లడం, కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థుల ఎంపికకు ఒకే రకమైన విధానాలుండటంతో ఈసారి రోస్టర్, కటాఫ్, రిజర్వేషన్ తదితరాలను పకడ్బందీగా అమలు చేసి ఫలితాలు ప్రకటించాలని బోర్డు భావిస్తున్నట్లు తెలిసింది. -
పాలమూరు ప్రతిభ
⇒ వినికిడి యంత్రాన్ని రూపొందించిన లక్ష్మి ⇒ మార్చి 3న రాష్ట్రపతి భవన్లో సైన్స్ ప్రదర్శనకు పిలుపు మహబూబ్‌నగర్ విద్యావిభాగం: పట్టుదల ఉంటే పేదరికం అడ్డురాదని నిరూపించింది మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎన్మన్‌గండ్లకు చెందిన పేద విద్యార్థిని లక్ష్మి.. వినికిడి యంత్రాన్ని రూపొందించి అందరిచేత భళా అనిపించుకుంది. మార్చిలో ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగే సైన్స్ ఇన్ స్పైర్ ప్రదర్శనకు హాజరుకావాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి పిలుపు అందుకుంది. రంగారెడ్డి జిల్లా మహ్మదాబాద్‌కు చెందిన బాలమణికి ఇద్దరు కూతుళ్లు. లక్ష్మి మొదటి సంతానం. తండ్రి లక్ష్మయ్య చనిపోవడంతో ఆమె కూలీ పనులు చేస్తూ కుమార్తెలను చదివిస్తోంది. లక్ష్మి నవాబ్‌పేట మండలం ఎన్మన్గండ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఎన్మన్ గండ్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుండగా గతేడాది వినికిడి యంత్రాన్ని తయారుచేసి నాగర్‌కర్నూల్‌లో జరిగిన సైన్స్‌ప్రదర్శనలో ప్రదర్శించగా రెండోస్థానం దక్కింది. గత డిసెంబర్ 10, 11వ తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో ఇది ఉత్తమప్రదర్శనగా ఎంపి కైంది. కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చేతు ల మీదుగా అవార్డును అందుకుంది. దీంతో మార్చి 3న రాష్ట్రపతి భవన్లో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనకు రావాలని పిలుపు అందింది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడు తున్న లక్ష్మి ఢిల్లీకి వెళ్లేందుకు ఆర్థికసాయం కోసం ఎదురు చూస్తోంది. సాయం చేసే వారు టీచర్ శ్రీధర్ 9490140477 నంబర్‌కు సంప్రదించవచ్చు. -
శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి
జిల్లా చెకుముకి సై¯Œ్స సంబరాల్లో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కొత్తపేట : విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే శాస్రీ్తయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సూచించారు. జిల్లా స్థాయి చెకుముకి సై¯Œ్స సంబరాలు–2016 (సై¯Œ్స ప్రతిభా పరీక్ష) జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కొత్తపేట కాంతిభారతి హైస్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. జేవీవీ మండల శాఖ అధ్యక్షుడు బండారు శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి ఆదివారపుపేట వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు తోట వెంకటేశ్వరరావు–కాంతిభారతి విద్యా సంస్థల కరస్పాండెంట్ టి సత్యవాణి పర్యవేక్షణలో జేవీవీ జిల్లా అధ్యక్షుడు కేఎంఎంఆర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉదయం జాతీయ పతాకాన్ని ఎమ్మెల్సీ ఆర్ఎస్, జేవీవీ పతాకాన్ని ఆ సంస్థ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సీహెచ్ స్టాలి¯ŒS ఆవిష్కరించారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ చెకుముకి సై¯Œ్స ప్రతిభా పరీక్షలు భవిష్యత్‌లో గ్రామీణ విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ముందుకు వచ్చిన కాంతిభారతి యాజమాన్యాన్ని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అభినందించారు. ఎమ్మెల్సీ ఆర్ఎస్ మాట్లాడుతూ ఈ దేశభవిష్యత్తు గురువులు, విద్యార్థులపైనే ఆధారపడి ఉందన్నారు. అనాగరికత నుంచి నాగరికతలోకి, చీకటి నుంచి వెలుగులోకి వచ్చామంటే దాని వెనుక సై¯Œ్స హస్తం ఉందన్నారు. ఎందరో శాస్త్రవేత్తల మేధస్సుతో సై¯Œ్స తద్వారా దేశం ఎంతగానో అభివృద్ధి చెందాయన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు దర్నాల రామకృష్ణ, రాష్ట్ర వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జేవీవీ జిల్లా గౌరవాధ్యక్షుడు ఈఆర్ సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి ఎండీ ఖాజామొహిద్దీన్, కళాసాహితి అధ్యక్షుడు పెన్మెత్స హరిహరదేవళరాజు, ఎంఈఓ వై. సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.అనంతరం విద్యార్థులకు పరీక్షలు, క్విజ్ పోటీలు నిర్వహించారు. -
విజ్ఞానం.. వికాసం
-
మెరిసిన ఆలోచన.. విరిసిన సృజన
ఏలూరు సిటీ : జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏలూరు కస్తూరిభా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి పీతల సుజాత వైజ్ఞానిక ప్రదర్శనలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. జెడ్పీ ఛైర్మన్ బాపిరాజు మాట్లాడుతూ విద్య కేవలం ఉద్యోగం కోసమే కాకుండా సమాజంలోని అనేక రంగాల్లో ఉన్నతస్థితికి చేరుకునేందుకు ఉపయోగపడతుందన్నారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ సైన్సు అభివృద్ధి చెందటం ద్వారా నేడు అనేక భయంకర వ్యాధుల నుంచి విముక్తి లభించిందన్నారు. డీఈవో మధుసూధనరావు మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు శాస్త్రవేత్తలు వినూత్నంగా ఆలోచించటమే కారణమన్నారు. విద్యార్థులు తార్కిక విధానంలో ఆలోచిస్తూ, తమలోని సృజనాత్మకతను జోడించాలని కోరారు. నగర మేయర్ నూర్జహాన్, ఏఎంసీ చైర్మన్ కురెళ్ళ రాంప్రసాద్, కార్పొరేటర్ చోడే వెంకటరత్నం, వైజ్ఞానిక ప్రదర్శనల కన్వీనర్ డీవీ రమణ పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ’ప్రస్తుత సమాజంలో నగదు రహిత చెల్లింపుల పాత్ర’ అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకునేలా ఉన్నాయి. న్యూటన్ గమన నియమం న్యూటన్ 3వ గమన నియమం వినియోగించి శక్తి సూత్రం ద్వారా యంత్రం ఎలా ముందుకు వెళుతుందో ప్రయోగం చేశాను. వ్యతిరేక దిశలో శక్తి వినియోగించినప్పుడు గమన నియమం వర్తిస్తుంది. శాస్త్రవేత్తలు ప్రయోగించే రాకెట్స్లోనూ ఇదే శక్తి సూత్రాన్ని పాటిస్తారు. కేడీవీ ప్రసాద్ వర్మ, జెడ్పీహెచ్ఎస్, ఎన్ఆర్పీ అగ్రహారం ఆయిల్ స్కిమ్మర్ యంత్రం ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్‌ను నౌకల్లో రవాణా చేస్తారు. కొన్నిసార్లు ఆయిల్ నౌకలు దెబ్బతిని సముద్రంలో ఆయిల్ పడిపోతుంది. దీంతో సముద్రజలాలు కాలుష్యమవుతున్నాయి. ఈ ఆయిల్ స్కిమ్మర్ యంత్రం ద్వారా ఆయిల్‌ను వెలికితీయవచ్చు. కె.శివలలిత, జెడ్పీహెచ్ఎస్, దెందులూరు రైల్ వైబ్రేషన్స్‌తో విద్యుత్ ప్రయాణిస్తోన్న రైలు వైబ్రేషన్స్ ద్వారా విద్యుత్‌ను తయారు చేసే అవకాశం ఉంది. రైలు పైన సిం«థటిక్ క్రిస్టల్స్‌తో పరికరాన్ని ఏర్పాటు చేయాలి. దానిపై ఒత్తిడి చేస్తూ, రైలు వైబ్రేషన్స్‌తో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఈ విద్యుత్‌ను రైలు లోపల లైట్లు, ఫ్యాన్లకు వినియోగించుకోవచ్చు. ఎం.రవిశంకర్, ఎస్సీబీఎంహెచ్ఎస్, పాలకొల్లు వ్యర్థ జలాల శుద్ధీకరణ వ్యర్థ జలాలను శుద్దిచేస్తే రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. వ్యర్థజలాలు సముద్రాల్లోకి వదిలివేయటం ద్వారా జలాలు కలుషితం అవుతున్నాయి. ప్రభుత్వాలు వ్యర్థనీటిని శుద్ది చేయాలి. తొమ్మిది దశల్లో శుద్ధి చేస్తే సాధారణ అవసరాలకు సమస్య ఉండదు. జి.గీతిక, శర్వాణీ పబ్లిక్ స్కూల్, ఏలూరు కొల్లేరును కాపాడుకుందాం సహజసిద్ధ మంచినీటి సరస్సు కొల్లేరును భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. అక్కడి ప్రకృతి సంపదను, మత్స్యసంపద, పక్షి సంపదను కాపాడుకోవాలి. రసాయనాల వినియోగాన్ని తగ్గించి సహజపద్ధతిలో చేపల వేట చేయాలి. కొల్లేరును మనం భద్రం చేసి ఉంచాలి. సీహెచ్ గాయత్రి, కస్తూరిభా స్కూల్, ఏలూరు గోల్డెన్ రైస్ గోల్డెన్ రైస్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బయోటెక్నాలజీ అభివృద్ధి చెందిన దశలో మన రాష్ట్రంలోనూ తక్కువ ధరకే, తక్కువ నీటిని వినియోగించి గోల్డెన్ రైస్‌ను ఉత్పత్తి చేయవచ్చు. దీనిలో బీటా కెరోటిన్, బీ కెరోటిన్, విటమిన్స్ ఉన్నాయి. ఎస్.భాస్కర్ ప్రభాత్, సెయింట్ అలోషియస్, ఆకివీడు -
సైన్స్ కాంగ్రెస్‌కు శ్రీ నలంద విద్యార్థిని ఎంపిక
సిద్దవటం: సిద్దవటం లోని శ్రీ నలండ ఉన్నత పాఠశాలకు చెందిన కె. లక్ష్మిప్రసన్న అనే విద్యార్థిని రాష్ట్ర స్థాయి 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కు ఎంపికైయారని ఆ పాఠశాల కరస్పాండెంట్ బాలుగారి వెంకటసుబ్బయ్య తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి కడప లోని సైన్స్ మ్యూజియంలో జరిగిన 24వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలో తమ పాఠశాలకు విద్యార్థిని లక్ష్మిప్రసన్న ఆహారం మరియు వ్యవసాయం అనే అంశంపై సెమినార్లో పాల్గొని చక్కటి ప్రతిభను కనపరచడంతో న్యాయనిర్ణేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు. డిశంబర్ 3,4, తేదీలలో విజయవాడలో జరిగే రాష్ఠ్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆ విద్యార్థికి గైడ్ ఉపాధ్యాయుడుగా నరసింహబాబు వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో గురువారం లక్ష్మిప్రసన్న ను ప్రధానోపాధ్యాయుడు లోకేష్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
19 నుంచి జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలు
ప్రదర్శనలో 525 నమూనాలు డీఈఓ రామలింగం నెల్లూరు (టౌన్): ఈ నెల 19 నుంచి 21 వరకు జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహించనున్నట్లు డీఈఓ మువ్వా రామలింగం తెలిపారు. సుబేదార్‌పేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో బుధవారం అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలు సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో జరగనున్నాయని వెల్లడించారు. సైన్స్ ఫెయిర్‌లో మొత్తం 525 నమూనాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి రోజుకు 10 వేల నుంచి 15 వేల మంది విద్యార్థులు సందర్శించే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేసేందకు 18 కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో నమూనాకు రూ.5 వేలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగ సలహాదారుడు సతీష్‌రెడ్డి హాజరవుతారని వివరించారు. ముగింపు రోజున మంత్రి నారాయణ హాజరవుతారని తెలిపారు. డిప్యూటీ డీఈఓలు షా అహ్మద్, మంజులాక్షి, యస్దానీ అహ్మద్, జిల్లా సైన్స్ అధికారి రాధారాణి, తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రవిజ్ఞానం వైపు ప్రోత్సహించాలి
విద్యార్థుల్ని ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి ఎంపీ తోట నరసింహం ముగిసిన సై¯Œ్స పండుగ భానుగుడి(కాకినాడ) : విద్యార్థుల సృజనకు అద్దం పట్టే మరిన్ని విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలకు రూపకల్పన చేయాలని ఎంపీ తోట నరసింహం సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారు శాస్త్ర విజ్ఞానం వైపు అడుగులు వేసేలా చూడాలని కోరారు. మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన శనివారంతో ముగిసింది. స్థానిక ఏఎంజీ పాఠశాలలో నిర్వహించిన ముగింపు సభలో ఎంపీ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రస్తుతం పాఠశాలల్లో నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం అమలులో ఉందని, దీని ద్వారా పరిశీలనాత్మక విజ్ఞానం పెరుగుతుందన్నారు. తద్వారా విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలు స్ఫూరిస్తాయన్నారు. వారి ఆలోచనలకు ఉపాధ్యాయులు పదునుపెడితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. రాష్ట్ర స్థాయికి 101 ప్రాజెక్టులు ఎంపిక జిల్లాలోని 25 మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. 560 ప్రాజెక్టులు రావాల్సి ఉండ గా 545 ప్రాజెక్టులు ప్రదర్శనకు వచ్చాయి. ఇందు లో 55 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు. రాజమండ్రిలో 511 ప్రాజెక్టులు ప్రదర్శనకు ఉంచగా అందులో 46 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. ఈ ఏడాది జిల్లా నుంచి మొత్తం 101 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు వెళ్ళనున్నాయి. ఇందులో ఎక్కువగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, విద్యుత్‌లేని ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌సిటీ, స్మార్ట్ విలేజ్ అంశాలే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ఎంపికకు సంబం«ధించి ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం, ఎం. ఎం.పాషా, వంకా గణపతిరావుల నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం న్యాయనిర్ణేతలుగా వ్యవహరించింది. చివరి రోజు వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రదర్శనను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డీఈవో ఆర్.నరసింహారావు, డీవైఈవో వాడపల్లి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బాలల మేధకు ప్రతిబింబంగా..
ప్రారంభమైన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన భానుగుడి (కాకినాడ) : పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఉపకరణాలు, ఆదర్శ గ్రామాలు, స్వచ్ఛభారత్, నూతన సాగు పద్ధతులు, రీసైక్లింగ్ ప్రాసెస్.. ఇలా వినూత్న వైజ్ఞానిక ఆవిష్కరణలకు జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన (ఇ¯ŒSస్పైర్–2016) వేదికగా నిలిచింది. కాకినాడ ఏఎంజీ పాఠశాలలో ఇన్స్పైర్–2016ను ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబులు గురువారం ప్రారంభించారు. అనంతరం ఇన్స్పైర్ లోగోను, పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మారుతున్న ప్రపంచ స్థితిగతులను అంచనా వేస్తూ నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేలా విద్యార్థుల ఆలోచనలకు ఉపాధ్యాయులు పదును పెట్టాలని అన్నారు. తొలుత జిల్లా ఖ్యాతిని కీర్తిస్తూ కళా ఉత్సవ్‌కు ఎంపికైన ఎంఎస్ఎ¯ŒS ఛార్టీస్ ఎయిడెడ్ పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యరూపకం, గాంధీనగర్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు చేసిన కోలాటం, గీతం శాంతినికేతన్, ఎస్ఆర్ ఉన్నత పాఠశాల విద్యార్థుల శాస్త్రవేత్తల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. 25 మండలాల నుంచి 560 ప్రాజెక్టులు ఈ ప్రదర్శనకు వచ్చాయి. సోలార్ సిస్టమ్స్‌పై నమూనాలను ఎక్కువమంది విద్యార్థులు ప్రదర్శించారు. ప్రతి ప్రాజెక్టూ విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టేలా ఉంది. రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం ఈ ప్రాజెక్టులకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 14 కమిటీల సభ్యులు ఈ ప్రాజెక్టులను స్క్రూట్నీ చేశారు. కార్యక్రమంలో డీఈవో ఆర్.నరసింహరావు, ఆర్జేడీ భార్గవ్, డీసీఎంఎస్ చైర్మ¯ŒS సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వసతులు లేక విలవిల ఈ కార్యక్రమంలో వసతుల లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది.తొలిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకూ విద్యార్థులకు భోజనాలు వడ్డిస్తూనే ఉన్నారు. ఆలస్యంతోపాటు, అన్నం ఉడకకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీనిపై వారివెంట ఉన్న ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. బాత్రూములు దుర్వాసన రావడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా బాత్రూములు కేటాయించకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రాజెక్టుల ప్రదర్శనకు విద్యార్థులకు గదుల కేటాయింపులో కూడా తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ప్రాజెక్టులతో విద్యార్థులు గంటల తరబడి గదుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కానీ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో ప్రదర్శనకు రాలేదు. రాత్రి బస కోసం కేటాయించిన గదుల్లో దోమలు అధికంగా ఉండడం, ఎక్కువమందికి ఒకే గదిని కేటాయించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలు తెలిసి కూడా తెలియనట్టుగా అధికారులు వదిలేయడంపై పలువురు ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేశారు. -
చిట్టిమెదళ్లు... పెద్ద ఆలోచనలు!
అనంతలో రెండు రోజుల సైన్స్‌ఫేర్ చిట్టి మెదళ్లలో పెద్ద ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు ధీటుగా మన బుల్లి శాస్త్రవేత్తలు పోటీ పడుతున్నారు. కొత్తకొత్త ఆవిష్కరణలతో ఆలోచింపజేస్తున్నారు. మట్టిలో మాణిక్యాలు లాగా గ్రామీణ విద్యార్థులు తమలో దాగివున్న సజనాత్మకకు పదును పెడుతున్నారు. అవకాశం ఇస్తే జాతీయస్థాయిలో కూడా రాణిస్తామంటూ నిరూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల పరిశోధనలకు వేదికగా మారింది అనంతపురంలోని కేఎస్ఆర్ బాలికల పాఠశాల. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా శుక్రవారం నుంచి రెండ్రోజుల జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 40 నమూనాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. కార్యక్రమాన్ని ఆర్‌ఎంఎస్‌ఏ ఏడీ శ్రీరాములు, సైన్స్ సెంటర్ క్యూరేటర్ వెంకటరంగయ్య, కోఆర్డినేటర్ కె. ఆనందభాస్కర్‌రెడ్డి, నిర్వహణ కమిటీ సభ్యులు పక్కీరప్ప, రాము, మదన్‌మోహన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– వాయిస్ కంట్రోల్ వీల్‌చైర్ రోబో దివ్యాంగుల కోసం మొబైల్ కంట్రోల్‌తో తయారు చేసిన కదిలే కుర్చీ. ముందుగా మొబైల్లో ఏఎంఆర్ వాయిస్ కంట్రోల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. నాలుగు చక్రాల చెక్కకు అమర్చిన కుర్చీ కిందిlభాగంలో డివైజ్ బ్యాటరీ ఏర్పాటు చేసుకోవాలి. మొబైల్లో బ్లూటూత్ ఆన్మోడ్లో ఉంచి డివైజ్ బ్లూటూత్‌ను పెయిరింగ్ చేయాలి. అయితే యాప్‌కు అనుసంధానం చేసి ఉండడంతో ఏఎంఆర్ వాయిస్ స్పీకర్ వద్ద లెఫ్ట్, రైట్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అని పలికితే చాలు అందుకనుగుణంగా వీల్‌చైర్ కదులుతుంది. దీనివల్ల ఎవరి సాయం లేకుండానే దివ్యాంగులు పనులు చేసుకోవచ్చు. – పి. సాయిమహేష్ (విద్యార్థి), మహేంద్రరెడ్డి(గైడ్ టీచర్), జెడ్పీహెచ్ఎస్, తంగేడుకుంట, ఓడీసీ మండలం ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– ఎకో నర్సరీ సాధారణంగా నర్సరీల్లో ప్లాస్టిక్ కుండీలు, కవర్లు వాడడం వల్ల అవి భూమిలో ఇంకిపోకుండా పర్యావరణ కాలుష్యం జరుగుతోంది. దీన్ని అరికట్టడానికి పరిసరాల్లో వథాగా పడి ఉన్న పేపర్లు, కొబ్బరి బోండం చిప్పలు, గడ్డి, పేడ, కొబ్బరిపీచు, వరిగడ్డి తదితర వాటిని ఉపయోగించి జీవ వ్యర్థ కుండీలను తయారు చేసుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. – ఎం. సుప్రియ (విద్యార్థి), సి. రాజశేఖర్‌రెడ్డి(గైyŠ lటీచర్), జెడ్పీహెచ్ఎస్, పాపంపేట, అనంతపురం రూరల్ ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– కాంతి కాలుష్యం అధికమైన, అనవసరమైన కత్రిమS కాంతినే కాంతికాలుష్యం అంటారు. పెద్దపెద్ద నగరాల్లో ఈ రోజుల్లో కాంతి కాలుష్యం అధికమవుతోంది. దీని ప్రభావంతో మనుషుల్లో నిద్రలేమి, తలనొప్పి, కంటి సమస్యలు అధికమవుతాయి. చికాకు చెందుతుంటారు. రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయి. నిశాచర జీవులకు ఆహార సేకరణ, సంతానోత్పత్తి కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో కాంతి కాలుష్యాన్ని నివారించాలి. రాత్రిపూట అవసరమైన చోట్ల అవసరం మేరకే కాంతి వాడాలి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన లైట్లు ఏర్పాటు చేసుకోవాలి. సైన్‌బోర్డుల లైట్లును తొలిగించాలి. – జె.అనిల్‌కుమార్ (విద్యార్థి), కె.ఎస్.నంజుండప్ప (గైడ్ టీచరు), జెడ్పీహెచ్ఎస్, తపోవనం, అనంతపురం రూరల్ –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– శబ్ధ కాలుష్యాన్నీ కొలవచ్చు శబ్ధ కాలుష్యం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో శబ్ధ కాలుష్యాన్ని కొలిచే పరికరాలు అక్కడక్కడ ఏర్పాటు చేయడం వల్ల, ఫ్యాక్టరీలు తదితర వాటివల్ల ఎంతెంత శబ్ధం వస్తోందో గుర్తింవచ్చు. దీని వల్ల కలిగే అనర్థాలపై ఆయా ప్రాంతాల ప్రజలకు అవగాహ కల్పించి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శబ్ధ కాలుష్యం నుంచి విముక్తులు కావచ్చు. – పి.వంశీ (విద్యార్థి), పి.ఓబుళరెడ్డి(గైడ్ టీచరు), జెడ్పీహెచ్ఎస్, బెళుగుప్ప ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ ఈ ఆటోమేటిక్ స్రీట్లైట్ ప్రాజెక్టు ద్వారా విద్యుత్‌ను వీలైనంత వరకు ఆదా చేయొచ్చు. ఎల్డీఆర్ సిస్టంను ఉపయోగించి సెన్సార్‌ను ఏర్పాటు చేయాలి. సూర్యకాంతి తగ్గిపోగానే ఆటోమేటిక్‌గా లైట్లు ఆన్ అవుతాయి. ఉదయం సూర్యకాంతి పడగానే ఆరిపోతాయి. దీనివల్ల వీధిలైట్లు ఆన్/ఆఫ్ చేసేందుకు ప్రత్యేకంగా మనిషి ఉండాల్సిన పనిలేదు. విద్యుత్ కూడా ఆదా అవుతుంది. – బి.వీరభార్గవి (విద్యార్థి), గైడ్‌టీచరు ఎస్.నాగరాజు (గైడ్ టీచరు), జెడ్పీహెచ్ఎస్, ఖాదర్‌పేట, పామిడి మండలం –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– రక్తదానంపై అవగాహనæ ఓవైపు రక్తగ్రూపు నిర్ధారణ పరీక్షలు చేస్తూనే మరోవైపు రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నారు ఈ విద్యార్థులు. ఉచితంగా రక్తగ్రూపు నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఫలానా గ్రూపు అని నిర్ధారిస్తారు. అనంతరం ఏ, బీ, ఓ, ఏబీ పాజిటివ్, నెగిటివ్ గ్రూపుల వారు ఏయే గ్రూపుల వారికి రక్తదానం చేయొచ్చు... ఇలా ఇవ్వడం వల్ల ఒనగూరే లాభాల గురించి తెలియజేస్తున్నారు. వీలైనంత మందికి రక్తగ్రూపు నిర్ధారణలు చేసి రక్తదానంపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. – విద్యార్థినిలు ప్రసన్నలక్ష్మీ, కళ్యాణి, నఫీసా, హరిణి, భవిష్య, గైడ్ టీచరు ఎస్.గౌసియా, వికాస్ మోడల్ స్కూల్, అనంతపురం -
విద్యా విధానం ప్రక్షాళన
నాగర్‌కర్నూల్ : విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకుగాను ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని లిటిల్‌ఫ్లవర్ ఉన్నత పాఠశాల ఆవరణలో మూడు రోజులుగా కొనసాగుతున్న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ మంగళవారం ముగిసింది. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చేసిన ప్రయోగాలు జిల్లా, రాష్ట్రస్థాయిలో గుర్తింపునిచ్చేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివి గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగిన అబ్దుల్ కలాంను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం సైన్స్ ఫెయిర్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు మణెమ్మ, ఎంపీపీ శాంతమ్మ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి, డీఈఓ విజయలక్ష్మీబాయి, డిప్యూటీ ఈఓలు సుబ్రమణ్యేశ్వరశర్మ, రవీందర్ పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌కలాం చిత్రపటానికి పూలమాలలు వేశారు. అలాగే యూరీలో భారత సైనికుల మతికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. -
చిట్టి బుర్రలు.. గొప్ప ఆవిష్కరణలు
- ఆకట్టుకున్న జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ - అద్భుత సైన్స్ ప్రాజెక్టులతో విద్యార్థులు అదుర్స్ జంగారెడ్డిగూడెం : ‘భవిష్యత్తులో సాధించబోయే విజయాలకు సజనాత్మకత అనేది తాళం చెవిలాంటిది.. ప్రాథమిక దశలోనే విద్యార్థులలోని సజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికితీయాలి.’ అని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారు. ఆ దిశగా సాగే ప్రయత్నాల్లో భాగంగానే విద్యాశాఖ విద్యార్థుల్లో సజనను వెలికితీసేందుకు ఏటా సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తోంది. సైన్స్‌లో వినూత్నమైన ప్రయోగాలతో విద్యార్థులూ తమలోని సజనాత్మకతను చాటుకుంటున్నారు. జంగారెడ్డిగూడెంలో శుక్రవారం ప్రారంభమైన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో వివిధ రకాల ప్రాజెక్టులతో విద్యార్థులు ఇలా ఆకట్టుకున్నారు. పవనం.. శక్తిదాయకం పవనాల ద్వారా చేంజ్ ఆఫ్ ఎనర్జీ నమూనా ప్రదర్శించాడు శనివారపు పేట హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి కె.ప్రవీణ్. పవనాల ద్వారా విండ్ ఎనర్జీని, మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా తయారు అవుతుందో వివరించారు. పవనాల ద్వారా మెకానికల్ ఎనర్జీ సష్టించి భూగర్భ జలాలను వెలికి తీసుకురావచ్చని అలాగే విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని నిరూపించాడు. – పవనాల ద్వారా చేంజెస్ ఆఫ్ ఎనర్జీ ప్రాజెక్టు నమూనా తయారుచేసిన విద్యార్థి ప్రవీణ్, ఉపాధ్యాయుడు –––––––––––––––––––––– వరద ముప్పునకు ఆటోమేటిక్ చెక్ వరదలు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా డ్యామ్ గేట్లు ఎత్తివేసే ప్రదర్శన ఇది. కె.గోకవరం హైస్కూల్ విద్యార్థిని నిట్టా ఉదయప్రియ ఈ నమూనాను ప్రదర్శించింది. వరదలు సంభవించిన సమయంలో జలాశయం గేట్లు ఎత్తకపోతే కాలువగట్లు, చెరువు గట్లు తెగిపోయే ప్రమాదం ఉన్నందున జలాశయంలోకి నీరు చేరగానే సెన్సార్ల ద్వారా ఆటోమేటిక్‌గా జలాశయం గేట్లు ఎత్తుకుంటాయని వివరించింది. తద్వారా వరదముంపును అరికట్టవచ్చని చెబుతోంది. – వరదల సమయంలో ఆటోమేటిక్‌గా జలాశయం గేట్లు ఎత్తివేసే ప్రదర్శన –––––––––––––––––––––––––––––––––– చెత్త నుంచి సంపద ఉత్పత్తి వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసుకోవడం ద్వారా పునర్ వినియోగం ఎలా చేసుకోవాలి, పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అనే అంశంపై భీమడోలు డిపాల్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థిని ఎన్.జ్యోత్సS్న ప్రాజెక్టు తయారు చేసింది. వథా నీరు శుద్ధి చేయడం, వివిధ రకాల వస్తువుల వినియోగం తరువాత పడవేయకుండా వస్తువులుగా మలచడాన్ని ప్రయోగాత్మకంగా వివరించింది. – వథా నీరు, వ్యర్థ పదార్థాలను రీ సైక్లింగ్ చేసే విధానాన్ని వివరిస్తున్న విద్యార్థిని ––––––––––––––––––––––––– పంటను జంతువు తాకగానే సైరన్‌మోత అటవీ ప్రాంతంలో గిరిజనులు సాగుచేసే పోడు వ్యవసాయంలో పంటలను ఎలా రక్షించుకోవాలో నమూనాను ప్రదర్శించాడు ఈస్ట్ యడవల్లి హైస్కూల్ విద్యార్థి ఎం.కిశోర్‌బాబు. పంటలను అటవీ ప్రాంతంలోని జంతువులు తాకగానే సెన్సార్ల ద్వారా సైరన్ మోగే విధంగా నమూనాను ప్రదర్శించాడు. సైరన్ నుంచి వచ్చే శబ్దం కారణంగా జంతువులు పారిపోతాయని, తద్వారా పంటను రక్షించుకోవచ్చని వివరించాడు. – పోడు వ్యవసాయాన్ని రక్షించుకునే వి«ధానం తెలిపే నమూనాతో విద్యార్థి –––––––––––––––––––––––––––– మా ఊరు.. సమస్యల సుడిగుండం తమ గ్రామ సమస్యలను గ్రామ నమూనా తయారుచేసి కళ్లకు కట్టేలా ప్రదర్శించాడు పెదపాడు మండలం వడ్డిగూడెం ఎంపీయూపీ స్కూల్ విద్యార్థి ఎం.సుధీర్. తమ గ్రామంలో చేపల పెంపకం సానుకూల అంశం అని, అయితే అపరిశుభ్రత, డ్రైన్లు, రవాణా సౌకర్యం లేక అభివద్ధికి నోచుకోవడం లేదని వివరించాడు. సౌకర్యాలు కల్పించాలని నమూనాలో ప్రదర్శించాడు. – మా ఊరు సమస్యల సుడిగుండం అంటూ గ్రామ నమూనా ప్రదర్శిస్తున్న వడ్డిగూడెం విద్యార్థులు ఇంజిన్‌ఆయిల్ ద్వారా విద్యుదుత్పత్తి వాహనాల్లో వినియోగించి, తొలగించే ఇంజన్ ఆయిల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని నిరూపించాడు కామవరపుకోట హైస్కూల్ విద్యార్థి ఎ.వెంకన్న. వ్యర్థ ఇంజిన్ ఆయిల్‌ను బాయిల్ చేయడం ద్వారా ఆవిరి ఉత్పత్తి అవుతుందని, ఆ ఆవిరికి నీటిని సంయోగపరిచి కెమికల్ ఎనర్జీని సష్టించడం ద్వారా విద్యుత్ శక్తిగా మార్చవచ్చని నిరూపించాడు. – మోటార్వాహనాల్లోని తీసివేసిన ఇంజిన్ ఆయిల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి తయారుచేసే ప్రాజెక్టును ప్రదర్శిస్తున్న విద్యార్థి, ఉపాధ్యాయుడు -
సృజనను వెలికితీసేందుకే ‘ఇన్స్పైర్’
జంగారెడ్డిగూడెం : విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏటా ప్రతిష్టాత్మకంగా ఇన్‌సె్పౖర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు డీఈవో డి.మధుసూదనరావు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంచేందుకు వివిధ రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఇక్కడ నిర్వహించే సైన్స్ ఫెయిర్‌కు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు హాజరవుతారని, అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. సైన్స్‌ఫెయిర్‌ను రాష్ట్రమంత్రి పీతల సుజాత ప్రారంభిస్తారన్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా విద్యా డివిజన్లు ఎప్పుడు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించాలో షెడ్యూల్ ఇచ్చామని, అందరూ వారికిచ్చిన షెడ్యూల్ ప్రకారం సైన్స్‌ఫెయిర్‌లో హాజరుకావాలన్నారు. సైన్స్‌ఫెయిర్‌ను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన వక్తృత్వ, వ్యాసరచన పోటీలు , 18వ తేదీన క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. మూడు రోజులూ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 18వ తేదీ సాయంత్రం నిర్వహించి ముగింపు ఉత్సవంలో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని వివరించారు. ఈ నెల 29న టీఎల్ఎం ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్‌వాష్ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఆ రోజు సైన్స్ ఉపాధ్యాయులంతా విధిగా విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. కంప్యూటర్ విద్య ప్రారంభిస్తున్నాం జిల్లాలోని ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ప్రారంభిస్తున్నామని, కంప్యూటర్ విద్య బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గ్రాడ్యుయేషన్‌లో ఒక సబ్జెక్టు కంప్యూటర్ విద్య పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. డీఈవోడబ్ల్యూజీ డాట్ ఆర్గ్ వెబ్సైట్లో ఈ నెల 19లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 20వ తేదీన దరఖాస్తులు పరిశీలించి అదే రోజు నియామకాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో డీవైఈవో ఎం.తిరుమలదాసు, ఎంఈవోలు ఆర్.రంగయ్య, డి.సుబ్బారావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
సృజనను వెలికితీసేందుకే ‘ఇన్స్పైర్’
జంగారెడ్డిగూడెం : విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏటా ప్రతిష్టాత్మకంగా ఇన్‌సె్పౖర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు డీఈవో డి.మధుసూదనరావు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంచేందుకు వివిధ రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఇక్కడ నిర్వహించే సైన్స్ ఫెయిర్‌కు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు హాజరవుతారని, అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. సైన్స్‌ఫెయిర్‌ను రాష్ట్రమంత్రి పీతల సుజాత ప్రారంభిస్తారన్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా విద్యా డివిజన్లు ఎప్పుడు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించాలో షెడ్యూల్ ఇచ్చామని, అందరూ వారికిచ్చిన షెడ్యూల్ ప్రకారం సైన్స్‌ఫెయిర్‌లో హాజరుకావాలన్నారు. సైన్స్‌ఫెయిర్‌ను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన వక్తృత్వ, వ్యాసరచన పోటీలు , 18వ తేదీన క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. మూడు రోజులూ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 18వ తేదీ సాయంత్రం నిర్వహించి ముగింపు ఉత్సవంలో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని వివరించారు. ఈ నెల 29న టీఎల్ఎం ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్‌వాష్ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఆ రోజు సైన్స్ ఉపాధ్యాయులంతా విధిగా విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. కంప్యూటర్ విద్య ప్రారంభిస్తున్నాం జిల్లాలోని ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ప్రారంభిస్తున్నామని, కంప్యూటర్ విద్య బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గ్రాడ్యుయేషన్‌లో ఒక సబ్జెక్టు కంప్యూటర్ విద్య పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. డీఈవోడబ్ల్యూజీ డాట్ ఆర్గ్ వెబ్సైట్లో ఈ నెల 19లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 20వ తేదీన దరఖాస్తులు పరిశీలించి అదే రోజు నియామకాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో డీవైఈవో ఎం.తిరుమలదాసు, ఎంఈవోలు ఆర్.రంగయ్య, డి.సుబ్బారావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
16 నుంచి జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు)లో ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్టు డీవైఈవో ఎం.తిరుమదాసు చెప్పారు. మంగళవారం హైస్కూల్లో కొయ్యలగూడెం విద్యాకమిటీ పరిధిలోని ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. సైన్స్ ఫెయిర్ నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతం చేయడానికి కృషిచేస్తున్నట్టు చెప్పారు. సైన్స్ ఫెయిర్‌కు జిల్లాస్థాయిలో విద్యార్థులు తమ ఎగ్జిబిట్స్‌తో వస్తారని, ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా సైన్స్ ఫెయిర్ నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కమిటీల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు అప్పగించామన్నారు. రిజిస్ట్రేషన్ కమిటీకి బుట్టాయగూడెం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం జె.సురేష్‌బాబు, ఫుడ్‌కమిటీకి జంగారెడ్డిగూడెం జెడ్పీ హెచ్ఎస్ (బాలురు) స్కూల్ అసిస్టెంట్ ఎల్.నాగేశ్వరరావు, ప్రెస్ అండ్ పబ్లిసిటీ కమిటీకి జి.పంగిడిగూడెం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఏడీ శిఖామణి, కల్చరల్ కమిటీకి రేగులకుంట జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం కె.నాగేశ్వరరావు, డిసిప్లిన్ కమిటీకి రెడ్డిగణపవరం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బి.రాముడు బాధ్యులుగా వ్యవహరిస్తారన్నారు. మొత్తంగా 20 కమిటీలు నియమించామన్నారు. జంగారెడ్డిగూడెం ఎంఈవో ఆర్.రంగయ్య, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
విశ్వంలో మరో గ్రహవ్యవస్థ..
వాషింగ్టన్: రెండు నక్షత్రాలు, మూడు భారీ గ్రహాలతో కూడిన సరికొత్త గ్రహ వ్యవస్థను కార్నెగీ ఇన్స్టిట్యూషన్ ఫర్ సైన్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ గ్రహ వ్యవస్థ ఆవిష్కరణ ద్వారా మన సౌర కుటుంబం పుట్టుక, పరిణామానికి సంబంధించి మరింత సమాచారం లభించనుందని, భవిష్యత్‌లో భూమిని పోలిన గ్రహాలను గుర్తించడంలోనూ ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మన సూర్యుడిని పోలిన నక్షత్రాలు రెండు ఉన్న గ్రహ వ్యవస్థలు విశ్వంలో చాలా ఉన్నాయి. అయితే కొత్తగా గుర్తించిన వ్యవస్థ తాలూకూ నక్షత్రాలు కేవలం 360 ఆస్ట్రనామికల్ యూనిట్స్ (భూమి నుంచి సూర్యుడికి ఉన్న దూరం ఒక ఆస్ట్రనామికల్ యూనిట్) అంతరం మాత్రమే ఉండటం విశేషం. మిగిలిన నక్షత్రాల మాదిరిగా వీటిల్లో ఇనుము, ఆక్సిజన్ వంటివి లేవు. అధిక భాగం హైడ్రోజన్, హీలియం వాయువులే ఉన్నాయి. గురుగ్రహం పరిమాణంలో సగం ఉన్న ఒకటి, ఒకటిన్నర రెట్లు ఉన్న మరో గ్రహం నక్షత్రం చుట్టూ తిరుగుతుంటే.. దాదాపు 2.5 రెట్లు ఎక్కువ సైజున్న గ్రహం రెండో నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఏర్పడిన తొలి నాళ్లలోనే ఈ నక్షత్రాలు తమ పరిసరాల్లోని చిన్న చిన్న గ్రహాలను తనలోకి లాగేసుకుని ఉంటుందని జొవానా టెస్కే చెబుతున్నారు. -
సైన్స్ మేళా.. భళా
సృజన చాటిన ప్రదర్శనలు వర్గల్ నవోదయలో రీజియన్ స్థాయి ఎగ్జిబిషన్ ప్రారంభించిన అదనపు జేసీ వెంకటేశ్వర్లు వర్గల్: ఓ ఆలోచన సరికొత్త ఆవిష్కరణలకు బాటలు వేస్తుంది. అందుబాటులో వనరులు, ప్రోత్సహించే వారుంటే ఆ ఆలోచనలు మరింత పదునెక్కుతాయి. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్ఫథం పెంపొందుతుంది. నిత్యజీవితంలో మానవాళికి ఉపయుక్తంగా నిలిచే కొంగొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయి. వర్గల్ నవోదయ వేదికగా దక్షిణాది రాష్ట్రాల నవోదయ విద్యార్థుల రీజియన్ స్థాయి సైన్స్ మేళాను మంగళవారం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రెండు రోజులపాటు కొనసాగే ఈ సైన్స్మీట్లో అత్యుత్తమంగా నిలిచిన 12 ప్రదర్శనలను జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారని విద్యాలయ ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. ఈ ప్రదర్శనలో తెలంగాణతోపాటు కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, యానామ్ ప్రాంతాల నవోదయ విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ఆకట్టుకున్నారు. సేంద్రియ సాగు, పర్యావరణ పరిరక్షణ, మానవరహిత రైల్వే క్రాసింగ్ వ్యవస్థ, సురక్షిత ప్రయాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆసక్తికరంగా గణితం నేర్చుకునే విధానం, సులభ పద్ధతిలో త్రికోణమితి, నిర్మాణాల్లో పైథాగరస్ సిద్ధాంతం, వృథా వస్తువులతో చక్కని ఆకృతుల తయారీ.. ఇలా ఎన్నో నిత్య జీవితంతో ముడిపడిన 98 అంశాలతో సందర్శుకులను అబ్బురపరిచారు. తొలిరోజు సందర్శకులను అనేక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యఅతిథి అదనపు జేసీ వాసం వెంకటేశ్వర్లు ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు కొన్ని.. ఊహా గణితంపై ఆదిలాబాద్ నవోదయకు చెందిన ఆకాంక్షరెడ్డి ప్రదర్శన ఆకట్టుకుది. తన ప్రయోగం ద్వారా స్థలం్వృథాకాకుండా ఎలాంటి ఆకృతి దోహదపడుతుందో వివరించింది. పైథాగరస్ సిద్ధాంతం ద్వారా తక్కువ స్థలంలో ఎత్తయిన కట్టడాలు ఎలా చేపట్టవచ్చో రంగారెడ్డి జిల్లా నవోదయ విద్యార్థి పి.వినయ్‌కుమార్ వివరించాడు. సులభంగా త్రికోణమితి నేర్చుకునే విధానాన్ని కర్ణాటకలోని చిక్మగళూర్ నవోదయ విద్యార్థి కేఎన్ జయంత్ తన ప్రయోగం ద్వారా నిరూపించాడు. పూసలతో వివిధ ఆకర్షణీయ వస్తువులు తయారు చేసుకోవచ్చని సూచిస్తూ నిజామాబాద్ విద్యార్థిని ఆర్.సహన పలు వస్తువులు ప్రదర్శించింది. వృథా వస్తువులను వినియోగించి విలువైన వస్తువులను తయారు చేసే చక్కని ప్రదర్శనను కేరళ రాష్ట్రం అలప్పీ విద్యార్థి ఎస్.వివేక్ ఏర్పాటు చేశాడు. వాడి పడేసిన పెన్నులతో పెన్ హౌస్, కాగితాలతో గుర్రపు బొమ్మలను తీర్చిదిద్దాడు. కాగితాలు, గుండీలు తదితర వస్తువులతో ఆకర్షణీయమైన రీతిలో చెవి దిద్దులు, ఆభరణాలు ఎలా తయారు చేయవచ్చో వెస్ట్ గోదావరి విద్యార్థిని కె.భారతి తన ప్రదర్శన ద్వారా చూపింది. గణితం ఆసక్తికరంగా నేర్చుకునే విధానాన్ని చూపుతూ అనంతపురం విద్యార్థి వీపీ వంశీకృష్ణ ప్రదర్శన ఆకట్టుకున్నది. -
20న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్
పాపన్నపేట: ఈనెల 20వ తేదిన సంగారెడ్డిలో జరుగనున్న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్‌కు ప్రతి మండలం నుంచి 10 మంది విద్యార్థులు, ఒక గైడ్ టీచర్‌ను ఎంపిక చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి నజిమొద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు సంగారెడ్డిలోని విద్యాశాఖాధికారి కార్యాలయంలో మద్యాహ్నం 1.30 గంటలకు ‘ఆహార భద్రత కోసం పప్పుదినుసుల ఆవశ్యకత, ప్రస్తుత సమస్యలు’ అనే అంశంపై సెమినార్ ఉంటుందన్నారు. పాల్గొనదలచినవారు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో రావాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఎంపికైనవారు రాష్ట్రస్థాయి సెమినార్లో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. -
సైన్స్‌ఫెయిర్ లో పేలుడు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సైన్స్ ఫెయిర్ లో ఏర్పాటు చేసిన పెట్రోల్ పరికరాన్ని చూస్తున్న సమయంలో అది అకస్మాత్తుగా పేలింది. దీంతో 10 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని ప్రొద్దుటూరు ఆంధ్రకేసరిరోడ్డులో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు సైన్స్‌ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అదే పాఠశాలకు చెందిన ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులు ప్రదర్శనను తిలకిస్తున్న సమయంలో పెట్రోల్‌తో తయారు చేసిన ఓ పరికరం పేలింది. దీంతో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు తీవ్రంగా గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. -
ఆవిష్కరణలతోనే సాంకేతిక అభివృద్ధి: రమేష్ రావు
కొత్త ఆవిష్కరణలతోనే శాస్త్ర సాంకేతికత అభివృద్ధి సాధ్యపడుతుందని వరంగల్ జేఎస్ఎమ్ విద్యా సంస్థల చైర్మన్ రమేష్ రావు అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా కరీమాబాద్‌లోని ఉర్సు హైస్కూలులో 'సైన్స్‌ఫేర్' రమేష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ... విద్యార్థి దశ నుంచే టెక్నాలజీలో వచ్చే మార్పును గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. శాస్త్రీయ అంశాల గురించి తెలుసుకోవడానికి సైన్స్ఫేర్లు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థులకు చెప్పారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన 242 నూతన ఆవిష్కరణల్ని ఇందులో ఏర్పాటు చేశారు. -
రాకెట్ కంటే స్పీడుగా...
ఒకరికిమించిన ఆలోచనలు మరొకరివి... అందరి ఆలోచల్ని కలిపితే... ఇంకేముంది దిమ్మతిరిగే ప్రదర్శనలే...! చిన్నారులే కదా అంటే కుదరదు... రంగం ఏదైనా తక్కువ కాదు అనిపించుకుంటున్నారు. పేట్ బషీరాబాద్ సెయింట్ ఆన్స్ స్కూల్లో మంగళవారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులు దాదాపు 300 అంశాలపై నమూనాల ప్రదర్శన నిర్వహిచారు. నమూనాల గురించి వివరిస్తూ ఓరా అనిపించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ సత్తాచాటారు. - కుత్బుల్లాపూర్, ఎస్ఆర్ డిజి స్కూల్లో... తార్నాకలోని ఎస్ఆర్ డిజి హైస్కూల్లో స్వచ్ఛ భారత్ థీమ్ పేరుతో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఆలోచింపజేసింది. పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇరిగేషన్, సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ నమూనా, సానిటేషన్‌లో అవలంభించాల్సిన నూతన పద్ధతులు, వేస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్, ఫింగర్ ప్రింట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తదితర విషయాలపై విద్యార్థులు నమూనాలు తయారు చేసి ప్రదర్శించారు. వృక్షాలను నరకొద్దని చెప్పే పప్పెట్ షో ఆకట్టుకుంది. లాలాగూడ పోలీసు స్టేషన్ ఇన్చార్జి సీఐ వంశీకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గీర్వాణీ, ఎస్సై క్రాంతికుమార్, ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ రీసెర్చ్ స్కాలర్ దునుకు వేలాద్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. - తార్నాక ఆటోమేటిక్ రైల్వే గేట్ రామంతాపూర్ జేఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్యాంపస్‌లో విద్యార్థులు మంగళవారం ప్రదర్శించిన ఆటోమేటిక్ రైల్వేగేటు నమూనా విశేషంగా ఆకట్టుకుంది. లెక్చరర్ బి.రాజా మాట్లాడుతూ పరిశోధనలు నిరంతరం కొనసాగిస్తే వాటితో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేటలో జరిగిన దుర్ఘటనతో చలించి విద్యార్థులు ఆటోమేటిక్ రైల్వేగేటు తయారు చేశారన్నారు. కేవలం రూ.5వేలతో మూడు నెలల్లో విద్యార్థులు జశ్వంత్శ్రీ, బీమ్రాజు, రమ్య, అరవింద్, శ్రవణ్‌కుమార్, శ్రీనాధ్, శిరీషా, రాజు తయారు చేశారన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి.శ్యాంసుందర్‌రెడ్డి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ హెచ్ఓడీ కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -రామంతాపూర్ -
బతుకమ్మ వచనం
అయ్యయ్యొ ఓ రామ ఉయ్యాలో.. బాల్యమే పండుగ... జీవితపు గాఢత అప్పుడు తప్ప మరెప్పుడూ అనుభవంలోకి రాదు... కీసరగుట్ట స్కూల్లో ఉన్నప్పుడు వచ్చిందీ సమస్య. వరంగల్లు సైన్స్ ఫెయిర్ సరిగ్గా దసరా సెలవుల్లో పెట్టారు. ఇప్పుడు ‘మా’ పరిస్థితి ఏమిటి? ఫెయిర్‌కు వెళ్తే సెలవుల్లో కోత పడుతుంది. ‘తప్పనిసరిగా వెళ్లాల్సిందే’ అంటారేమోనని గుండెల్లో బస్సులు పరుగెడుతున్నాయి. అప్పటికింకా రైలు ఎక్కలేదుగా నేను! దోస్తులందరూ బ్యాగులు సర్దుకుంటున్నారు. బై చెప్పడం తెలియదు కాబట్టి చేతులు కలుపుకుంటున్నారు. వెళ్తూ వెళ్తూ ‘రాధిక’లోనో ‘ఆరాధన’లోనో చూడాల్సిన సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు. రమేష్గాడు మోహన్‌బాబు చొక్కా టక్ చేశాడు. రాజశేఖర్గాడు గ్యాంగ్‌లీడర్ షర్టును లూజుగా వదిలేశాడు. చివరికి నాదీ, అరవిందుదీ వాడిపోయిన ముఖాలు చూసి భీష్మాచారి సర్ ‘ఫర్లేదు లె’మ్మని చెప్పేసరికి పోతున్న ప్రాణం తిరిగొచ్చింది. దసరా సెలవులు మిస్సవ్వడమే! చలో నర్సింగాపురం! మాటవరసకు దసరా సెలవులు అంటున్నానేగానీ నా వరకు అవి బతుకమ్మ సెలవులే. నిజానికి దసరా మగవాళ్ల పండుగ, బతుకమ్మ ఆడవాళ్ల పండుగ. ఆడవాళ్ల పండుగ అంటే కుటుంబ పండుగ. అప్పటికి నేనింకా అమ్మ పార్టీయే కాబట్టి పిల్లల పండుగ కూడా. అందరూ తలో పూవు వేస్తేనే కదా బతుకమ్మ! రేపు ‘సద్దుల బతుకమ్మ’ అనంగా సాయంత్రం కిందిచేన్లో అమ్మ మోపెడు గునుగు కోసుకొస్తుంది. అంతకుముందే జరిగిన నిర్ణయం ప్రకారం బాపు వేములవాడ నుంచి రంగులు తెచ్చి పెట్టి వుంటాడు. ఎరుపు, ఆకుపచ్చ. గునుక్కు రంగు అద్దకపోతే తెలుపు. ‘మూడు రకాలూ’ సమకూరినట్టే! ఇక, ఏ రొట్టో తొందరగా తినేసి, పెద్దచాపలో గునుగును పొతం చేయడానికి కూర్చుంటాం. ఆకులు తెంపి, వరుసగా పేర్చి, అమ్మ చేతికి అందిస్తుంటాం నేనూ, తమ్ముడూ. తలల్ని, తోకల్ని పద్ధతిగా ఈలపీటతో కోస్తుంటుంది అమ్మ. గుప్పెడుకో కట్ట చిటచిటా దారంతో కడుతుంటుంది చెల్లె. బాపు ప్రవేశం అప్పటికి జరగదు. పెద్దపీట మీద విలాసంగా నడుంవాల్చి బీడీ కాల్చుకుంటుంటాడు. ‘ఒక్క కథ జెప్పు బాపూ’ అని బాగా బతిమాలించుకున్నాక, లేచి, పటపటమనేలా నడుం విరుచుకుని, మా దగ్గర కూర్చుని, ‘ఆంజనేయుడు- కరక్కాయ ఇత్తు’ చెప్పడానికి పూనుకుంటాడు. అట్లాంటి రెండు మూడు కథలయ్యేసరికి, అడ్డగుల్ల నిండుగా గునుగు కట్టలు! రేపు వీటిదే పెద్దవాటా! అయితే, అప్పటికి, నన్ను త్వరగా పడుకొమ్మని అమ్మ తొందరపెడుతుంది. మబ్బుల్నే పెద్దబాపుతో తంగేడు పువ్వుకు పోవాలి కదా! తెల్లారి, ముఖమైనా కడగకుండా బయల్దేరతాం. గుట్ట, చెట్టు, పుట్ట అన్నీ తిరిగి, చెరో గంపెడు సంపాదిస్తాం. ఈ మధ్యలో చింతోట గురించో, గుర్రాలనూతి గురించో నాకు తెలియని స్థలపురాణాలేవో తెలుస్తాయి. పొద్దుపొడిచి, ఎండ చురుక్కుమంటున్నప్పుడు, పండ్లపుల్ల వేసుకుని తిరిగి వస్తుండగా, ‘పువ్వు మంచిగనే దొరికింది’ అని అభిమానపూర్వక ఈర్ష్యను ప్రదర్శిస్తుంది మరాటోళ్ల శోభమ్మ. మేము వచ్చేసరికి పొలంకాడి నుంచి బాపు బంతిపువ్వులు, పట్నపుబంతులు తెంపుకొచ్చివుంటాడు. శీలమోళ్ల పెరట్లో గుమ్మడి చెట్టుందన్న జాడ తీసుకొని, అమ్మ వాటి ఆకులు, పువ్వు తెచ్చిపెట్టి వుంటుంది. స్నానాలు, భోజనాలయ్యాక, మిట్టమధ్యాహ్నం, బతుకమ్మ పేర్చుడు కార్యక్రమానికి బాపు నడుంకు తువ్వాలు బిగిస్తాడు. ఇత్తడి తాంబూళం అంచుల వరకూ మెత్తగా గుమ్మడి ఆకులు, మీద పసుప్చచ్చటి తంగేడు పువ్వు... తర్వాత ఆకుపచ్చ రంగు అద్దిన గునుగు పెడదామా? తెల్లటిదా? తెలుపే సహజమైంది కాబట్టి, ముందు దానికే స్థానం. మధ్యలో ‘కడుపులోకి’ పొతంచేసిన ఆకులు, పువ్వుల తునకలు... రంగులుగా, వరుసలుగా, పైన సమతలం ఉన్న బుజ్జిగుట్ట మాదిరిగా బతుకమ్మ ఊపిరి పోసుకుంటూ వుంటుంది. తాజాగా తెంపాలి కాబట్టి చింతకుంటోళ్ల ఎనుగుకో, బండారోళ్ల కొట్టానికో పూసిన ఎర్రకట్లపూలు, పచ్చకట్లపూలు చెల్లి మెల్లిగా కొన్ని పట్టుకొస్తుంటే మరోవైపు ‘ఓ పద్మా, మీకు పోకబంతిపూలున్నాయే? లేకపోతే ఇన్నన్ని కొంచవోయే’ అని పంచిపెడుతూ అమ్మ... ‘పెద్దబాపోళ్లది పెద్దగున్నదా? మనదా?’ అని అటూయిటూ వెళ్తూ వస్తూ తమ్ముడు... వాళ్లది మాకన్నా ఎప్పుడూ పెద్దదే ఎప్పుడూ ముందే! అందాజాగా నాలుగవుతుండగా మాదీ పూర్తవుతుంది. గుమ్మడి గౌరమ్మ మధ్యలో కిరీటంలా కుదురుకుంటుంది. ఈలోపు మిగిలిన పూలతో సిబ్బిలో చెల్లె ‘చిన్న బతుకమ్మ’ పేర్చుకుంటుంది. రెంటినీ జాగ్రత్తగా అర్రలో కూరాడి, నీరాడి దగ్గర పెడతారు. ఈలోపు పల్లె మీంచి డప్పు చప్పుడు వినబడుతుంది. బాపు ఎడ్లను కొట్టుకురావడానికి పొలానికి వెళ్తాడు. మేము కాళ్లూముఖాలూ కడుక్కుని తయారవుతూ ఉంటాం. వరి, నువ్వు, పెసర, మక్క సత్తుపిండులు... ‘ఐదు తీర్లకు ఒక్కటి తక్కువుంది.’ అంజక్క సాయానికి వస్తుంది. మలీద ముద్దలు పిసుకుతుంటుంది. కొత్తోళ్ల మణెక్క బతుకమ్మ ఎత్తుకుని వస్తూనే వుంటుంది. ‘జప్పన కానీ బిడ్డా’... పసుపు గౌరమ్మ కూడా పూర్తయింది. వాకిట్లోకి వెళ్లిపోయాయి బతుకమ్మలు. మూడుబజార్ల దగ్గర కొందరు దింపుతారు. కొందరు నేరుగా మర్రి కిందకు వెళ్తారు. చివరగా ఎల్లమ్మ కాడ... ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’... పడుచులు, యువతులు, అమ్మలు, వదినలు, అత్తలు, ఆడబిడ్డలు, పాతబడటం వల్ల తప్పనిసరిగా పుట్టింటికి వెళ్లే అర్హత కోల్పోయిన కొత్త కోడళ్లు... చప్పట్లతో చప్పట్లను, భుజాలతో భుజాల్ని కలిపి, పెదాలు ఆడిస్తూనే చూపుల్తోనే పలకరించుకుని, గుండ్రంగా, నెమ్మదిగా, ఏకలయగా, అలలాగా, ముందుకూ వెనక్కీ ఊగుతూ... కదిలే జడల్తో, తలలో పూవుల్తో, నవ్వుల్తో, నగల్తో, కొత్త చీరల్తో, పాటల్తో, పసుపు కుంకుమల్తో... పొద్దుగూకింది. బతుకమ్మలు తలలకెక్కాయి. వరుసగా, వరదగా, పూలే నడుస్తున్నట్టు, దీపాలై వెలుగుతున్నట్టు... ‘లచ్చక్కా, బాగున్నవా?’ ‘చెయ్యి ఇడిసిపెట్టద్దు బిడ్డా’ ‘చెరువుల ఏసేటప్పుడు పైలం’ ‘ఆ అండ్లున్నయి ఇంతపొడువు నీళ్లని...’ ముందువేసినవాళ్లు ఖాళీ తాంబూళాలతో తిరుగుముఖమై... ‘ఏమేమి పువ్వప్పుడే గౌరమ్మ, ఏమేమి కాయప్పుడే గౌరమ్మ’ అని పెద్దబాపు వీడ్కోలు పాడుతుండగా... మరెక్కడో లక్ష్మీదేవక్క గొంతు... నేను ఏ జన్మ స్మృతులు రాస్తున్నాను? ఒకప్పుడు బతుకమ్మను తలుచుకోగానే వెన్నులోకి ఆనందం ప్రవేశించేది, మనసు నర్తించేది, పండుగ నాలోనే జరిగిపోయేది. జరిగిపోయేది అంటున్నానంటే, ఇప్పుడు పండుగ లేదా? పండుగ ఉంది; నేను అందులో లేను. సంపూర్ణంగా మమేకమై పాల్గొనడానికి కావాల్సినదేదో నాలో లోపించింది. దానికి వయసును మాత్రమే నిందించగలనా? నా బాల్యం హాస్టల్లో గడిచింది. నాన్నో, మామో వచ్చి తీసుకెళ్తారన్న ఆశ ఉండేది. ఇప్పుడు నాకు జీవితమే హాస్టల్ అయిపోయింది. నేనే నాన్ననూ, మామనూ అయిపోయాక, ఇందులోంచి నన్ను బయటపడేసేవాళ్లెవరు? అప్పుడు తెలియలేదుగానీ బాల్యమే పండుగ! జీవితపు గాఢత అప్పుడు తప్ప మరెప్పుడూ అనుభవంలోకి రాదు. అప్పుడు అర్థం కాకుండా అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది కానీ అనుభవంలోకి రాదు. ముందున్నది విముక్తి అనుకుని వెనకదాన్ని జాడించి వచ్చేశాను. ఇక నాకు మిగిలివున్నదల్లా నా చిన్ని కుమారుల రెండు జతల కుతూహలపు కళ్లలో చూపుగా మారిపోవడమే! - పూడూరి రాజిరెడ్డి 9912347926 -
ఆ జ్ఞాపకాలు నన్నెప్పుడూ వెంటాడుతుంటాయి!
సింగీతం శ్రీనివాసరావు... మైండ్‌లోనే టైమ్ మెషీన్ ఉన్న సూపర్ జీనియస్! క్లాసూ... మాసూ... ఫ్యాంటసీ... సైన్స్ ఫిక్షనూ... జానపదం... పౌరాణికం... రియల్ లైఫ్ స్టోరీలూ, రీల్ లైఫ్ ఎక్స్పరిమెంట్లూ... యానిమేషన్లూ... ఇలా ఏ జానర్‌కైనా ఆయన ఆనర్ తీసుకొస్తారు. సెల్యులాయిడ్ సైంటిస్ట్... సింగీతం! నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న సింగీతం శ్రీనివాసరావు స్పెషల్ ఇంటర్వ్యూలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం!! నా కెరీర్లో టాప్ 5 సినిమాల గురించి చెప్పమంటే... కొద్దిగా కష్టమే. కానీ, ఇష్టమైన కొన్ని మైలురాళ్ళను ప్రస్తావిస్తా... సింగిల్ కాలమ్ న్యూస్ నుంచి పుట్టిన ‘మయూరి’... ఓ చిన్న వార్త నుంచి సినిమా పుడుతుందంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ ‘మయూరి’ (1984)ని చూస్తే మీరు నమ్మాల్సిందే. నిర్మాత రామోజీరావు, సుధాచంద్రన్ గురించి సింగిల్ కాలమ్ వార్త చదివి ఇన్స్పైర్ అయ్యి, నా దర్శకత్వంలో సినిమా చేద్దామనుకున్నారు. సుధాచంద్రన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు కొంత ఫిక్షన్ జత చేసి ‘మయూరి’ కథ అల్లుకున్నాం. ఎవరైనా హీరోయిన్‌తో ఈ సినిమా చేసి, ఆఖర్లో సుధాచంద్రన్ క్లోజప్ చూపిద్దామని మొదట అనుకున్నాం. సుధాచంద్రన్ దగ్గర మరిన్ని సంఘటనలు తెలుసుకుందామని కలిసినప్పుడు, ఆమె కళ్లల్లోని ఇంటెన్సిటీ నన్ను ఆకట్టుకుంది. ఆమెతోనే ఈ సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాం. మొదట ఆమె చేయనంటే, ఒప్పించాం. ఇలాంటి సినిమాలో డ్యూయట్లు పెట్టాలా? వద్దా? అనే విషయంలో డైలమా. అప్పుడు నేను ‘కన్నడ’ రాజ్‌కుమార్ షూటింగ్లో ఉన్నా. ఆయన్ను అడిగితే అద్భుతమైన సలహా చెప్పారు. అదేమిటంటే -‘‘సినిమాలో 10 రీళ్లు అద్భుతంగా ఉండి, ఆఖరి 2 రీళ్లు యావరేజ్‌గా ఉంటే, అది యావరేజ్ సినిమా అయిపోతుంది. అలాగే 10 రీళ్లు యావరేజ్‌గా ఉండి, ఆఖరి 2 రీళ్లు అద్భుతంగా ఉంటే ఆ సినిమా హిట్ కింద లెక్క. మీ సినిమా క్లైమాక్స్ అద్భుతం అంటున్నారు కాబట్టి, ముందు డ్యూయెట్లు పెట్టినా ఫరవాలేదు’’. అవార్డులు, అన్ని భాషల్లో జయకేతనాలు... ఇవన్నీ కాదు. అంగవైకల్యం ఉన్నా అందలమెక్కవచ్చని ఈ సినిమా ఎంతోమందికి ఇచ్చిన స్ఫూర్తి చాలు దర్శకునిగా నేను పూర్తిస్థాయి సంతృప్తిని ఆస్వాదించడానికి. రాజ్కపూర్కైతే విపరీతంగా నచ్చేసింది! సినిమా అంటేనే డైలాగులు పేలాలి అనుకునే కాలంలో - మూకీ సినిమా చేయడమంటే చాలామందికి సాహసం, కొంతమందికి చాదస్తం కింద లెక్క. కేవీ రెడ్డిగారి దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఉన్నప్పటి నాటి కోరిక అది. ఆ తర్వాత సినిమాల హడావిడిలో పడి మర్చిపోయా. కానీ ఓ రోజు బాత్రూమ్లో స్నానం చేస్తుండగా సడన్‌గా మూకీ తీద్దామని ఆలోచనొచ్చింది. రెండు వారాల్లో స్క్రిప్టు రెడీ. కమల్‌కి చెబితే ఎక్స్లెంట్ అన్నాడు. కానీ ఒక్క నిర్మాత కూడా ముందుకు రాలేదు. దాంతో కథని మనసు లాకర్లో పెట్టేశా. దేనికైనా కాలం, ఖర్మం కలిసి రావాలి కదా. కొన్నేళ్లకు అదే జరిగింది. బెంగళూరులో ఓ హోటల్లో ఉన్నా. ‘కన్నడ’ రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ చేసొచ్చి, రెస్ట్ తీసుకోవడానికి రెడీ అవుతుంటే, ‘శృంగార్ ఫిలింస్’ నాగరాజ్ వచ్చారు. ఆయన నటుడు. దానికన్నా ప్రధానంగా సినిమా షూటింగ్స్‌కి ఫారిన్ కో ఆర్డినేటర్. ఏదో కబుర్లు చెప్పుకుంటూ యథాలాపంగా ఆ కథ చెప్పా. ఆయన ఫ్లాట్ అయిపోయాడు. మనం తీద్దామన్నాడు. కమల్ కూడా ఓకే అన్నాడు. అలా ‘పుష్పక విమానం’(1984) యాత్ర మొదలైంది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వారి అవార్డు ఫంక్షన్లో వ్యాఖ్యానం చేసిన ఓ అమ్మాయి నవ్వు, కళ్లు నన్ను ఆకట్టుకున్నాయి. ఆమెను చూస్తుంటే. ‘రోమన్ హాలిడే’ అనే హాలీవుడ్ సినిమాలో చేసిన ఆర్డ్రే హెప్బర్న్ గుర్తొచ్చింది. వెంటనే కథానాయికగా తీసేసుకున్నాం. ఆమె ఎవరో కాదు? అమల. హోటల్ ప్రొప్రయిటర్ పాత్రకు గుమ్మడి గారిని అనుకున్నాం. అప్పుడే ఆయన భార్యకు వంట్లో బాగోకపోవడంతో, చేయడం కుదర్లేదు. వేరే కన్నడ ఆర్టిస్టుతో చేయించేశాం. ఇక ముష్టివాడి పాత్రను పీఎల్ నారాయణతోనే చేయించాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ముంబైలో షో వేస్తే, రాజేంద్ర కుమార్, రాజ్‌కపూర్, ఆర్డీ బర్మన్ లాంటి హేమాహేమీలు మెచ్చుకున్నారు. రాజ్కపూర్కైతే ‘డెడ్‌బాడీ రొమాన్స్’ సీన్ విపరీతంగా నచ్చేసింది. నేనెన్ని ప్రయోగాలు చేసినా, ‘పుష్పక విమానం’ మోసుకొచ్చినంత పేరు ప్రఖ్యాతులు, జాబ్ శాటిస్ఫాక్షన్ ఇంకేదీ ఇవ్వలేదు. మొదట మరుగుజ్జు ప్రేమకథ అనుకున్నాం... ‘‘కమల్‌హాసన్ లాంటి గ్లామర్ హీరో ఓ మరుగుజ్జుగా కనిపిస్తే ఏం బాగుంటుంది? అందుకే అందరూ వద్దన్నారు. ఇది కమల్‌కి పుట్టిన ఆలోచనే. నాకు చెప్పగానే, నేను వెంటనే ఉద్వేగానికి గురయ్యా. నేను, కమల్, రచయిత క్రేజీ మోహన్ కలిసి ఓ కథ తయారు చేశాం. మరుగుజ్జు ప్రేమకథ అన్నమాట. ఐదారు రోజులు షూటింగ్ చేశాక, మాకే కథపై సందేహాలు మొదలయ్యాయి. నిర్మాత పంజు అరుణాచలం కథలు బాగా జడ్జ్ చేయగలరు. ఆయన్ను పిలిచి కథ వినిపిస్తే, పగ నేపథ్యంలో డ్యూయల్ రోల్‌తో చేయమని సలహా ఇచ్చారు. అలా స్క్రీన్‌ప్లే మార్చితే ‘విచిత్ర సోదరులు’(1989) కథ తయారైంది. ఇందులో తండ్రి పాత్రకు మొదట ప్రేమ్‌నజీర్ అనుకున్నాం. అస్వస్థతగా ఉండటంతో ఆయన చేయలేనన్నారు. ఎలాగో కవలలుగా చేస్తున్నారు కాబట్టి, తండ్రి వేషం కూడా మీరే చేయండని నేను కమల్‌తో చెబితే, ఆయన సరేనన్నారు. విలన్‌గా అమ్రీష్పురిలాంటి వాళ్లను తీసుకోవచ్చు కానీ, ఎవ్వరూ ఊహించని వ్యక్తితో చేయిస్తే, ప్రేక్షకులు థ్రిల్ అవుతారనిపించింది. అందుకే హాస్యనటుడు నాగేశ్‌ని విలన్‌గా తీసుకున్నాం. ఇక మేకింగ్ విషయానికొస్తే - మరుగుజ్జు కమల్ సీన్లు తీయడానికి చాలా శ్రమించాం. ఎందుకంటే ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేవు. మానిటర్లు లేవు. మిఛెల్ కెమెరాతోనే అద్భుతాలు చేయాలి. అసలు కమల్ని పొట్టివాడిగా ఎలా చూపించారన్నది అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. కమల్ మోకాళ్లకు స్పెషల్లీ డిజైన్డ్ షూస్ తొడిగాం. 18 అంగుళాల గొయ్యిలు రెండు తవ్వించి, ఒక దాంట్లో కమల్ని, మరొక దాంట్లో కెమెరాను పెట్టి ఒకే లెవెల్లో ఉండేలా చిత్రీకరణ జరిపేవాళ్లం. గోతిలో దిగిన కమల్ మోకాళ్లకి షూస్ తొడిగి నడిపిస్తూ ఉంటే, మరుగుజ్జు కమల్ నడుస్తున్నట్టే అనిపిస్తుంది. అలాగే ఓ సీన్లో మరుగుజ్జు కమల్ కూర్చుని కాళ్లు కదుపుతారు కదా. అదెలా తీశామో తెలుసా? అవి కమల్ కాళ్లు కావు. ఆర్టిఫీషియల్ లెగ్స్. కమల్ కాళ్లను మడిచి కూర్చుంటే, రైల్వే సిగ్నల్స్ టెక్నిక్‌లో ఆర్టిఫీషియల్ కాళ్లతో సీన్ షూట్ చేశాం. ఆడియో క్యాసెట్లు తయారు చేసే పారిశ్రామికవేత్త సహదేవన్ ఈ విషయంలో మాకు బాగా సహకరించారు. ఇంకో ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పకపోతే అది పాపమే అవుతుంది. జపాన్ అనే సెట్‌బాయ్ ఈ గోతుల్ని కరెక్ట్‌గా తవ్వి, మాకు బోలెడంత టైమ్ కలిసొచ్చేలా చేశాడు. కమల్ నిర్మాత కాబట్టే ఈ సినిమాను 90 రోజుల్లో తీయగలిగాం. ఇంకెవరైనా అయ్యుంటే బడ్జెట్ పెరిగిపోయేది. షూటింగ్ డేసూ పెరిగేవి. అసలు ఈ సినిమా మేకింగ్ గురించి డాక్యుమెంటరీ తీద్దామని నేనూ, కమల్ ఎన్నాళ్లనుంచో అనుకుంటున్నాం. కుదరడం లేదు. ఎప్పటికైనా చేయాలి. నా ఇతర సినిమాల్ని మళ్లీ రీమేక్ చేయొచ్చేమో కానీ, దీన్ని మళ్లీ తీయడం మాత్రం అసాధ్యమే. ఎంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా సరే! నాగేశ్లాంటి ఆర్టిస్టులు... ఇలాంటి బలమైన స్క్రిప్టు మళ్లీ దొరకవు. నా లైఫ్‌లో ఎప్పటికీ ఓ మెమరీ ఇది. విమానంలో కథ చెబితే థ్రిల్ అయిపోయారు! టైమ్ మెషీన్ ఎక్కి మనకు నచ్చిన కాలానికి వెళ్లిపోతే ఎంత బాగుంటుంది? అది గతమైనా కావచ్చు. భవిష్యత్తు అయినా కావచ్చు. 18వ శతాబ్దంలోనే హెచ్‌జి వెల్స్ రాసిన ‘టైమ్ మెషీన్’ కథను కాలేజీ రోజుల్లో చదివి నేను తెగ థ్రిల్ ఫీలయ్యా. అప్పుడు అనుకోలేదు... ఆ నేపథ్యంలో సినిమా తీస్తానని. ఓ రోజు నేను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విమానంలో కలిసి వెళ్తున్నాం. సరదాగా తనకు టైమ్ మెషీన్ నేపథ్యంలో కథ గురించి చెప్పా. ‘అద్భుతం’ అన్నాడాయన. అక్కడితో ఊరుకోలేదు. తనకు తెలిసిన వాళ్లందరికీ గొప్పగా చెప్పేశాడు. కానీ ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. శివలెంక కృష్ణప్రసాద్ అనే కొత్త నిర్మాత మాత్రం రెడీ అన్నాడు. టైమ్ మెషీన్ ఎపిసోడ్లో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్లడం ఉంటుంది. ఆ పాత్రను చేయగల ఒకే ఒక్క హీరో బాలకృష్ణ. అందుకే ఆయనకు ఈ కథ చెబితే, వెంటనే ఓకే అన్నారు. ఈ సినిమాకు ముగ్గురు ఛాయాగ్రాహకులు పనిచేశారు. మొదట పీసీ శ్రీరామ్ వర్క్ చేశారు. ఆయనకు కడుపులో సమస్య రావడంతో, శ్రీకృష్ణ దేవరాయల ఘట్టాలను వీఎస్సార్ స్వామి తీశారు. ఇక ఫ్యూచర్ ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రిక్ ఫొటోగ్రఫీని కబీర్‌లాల్ తీసి పెట్టారు. ఇళయరాజా మ్యూజిక్కే ఈ సినిమాకు ప్రాణం. ‘ఆదిత్య 369’ (1991) సినిమా చూస్తుంటే - నాక్కూడా టైమ్‌మెషీన్ ఎక్కి ఆ రోజుల్లోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. వెంటనే దీనికి సీక్వెల్ చేయాలన్న ఆలోచనా పుడుతుంది. ‘మాయాబజార్’లో వదిలేసిన బాణీని వాడా! కేవీ రెడ్డిగారు తీసిన కళాఖండం ‘మాయాబజార్’కి పనిచేసినవాణ్ణి. ఆ సినిమా అంటే ప్రాణం నాకు. యానిమేషన్ సినిమా చేద్దామని నిర్మాత వినోద్ ప్రపోజల్ తెచ్చినపుడు, నాకు ‘మాయాబజార్’లోని ఘటోత్కచుడి పాత్ర మెదిలింది. ఆ పాత్రను బాల్యం నుంచి మొదలుపెట్టి తీద్దామనిపించింది. అప్పటికి తెలుగులో పూర్తి స్థాయిలో ఎవరూ యానిమేషన్ సినిమా చేయలేదు. నాకంతకు ముందు ఇంగ్లీషులో ‘సన్ ఆఫ్ అల్లాడిన్’ చేసిన అనుభవం ఉంది. ‘ఘటోత్కచుడు’ (2008) ఏడు భాషల్లో తీశాం. సంగీత దర్శకత్వమూ నేనే చేశా. ‘వివాహ భోజనంబు’ పాటను మాత్రం అలాగే ఉంచాం. ఆ పాటను అన్ని భాషల్లోనూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారితోనే పాడించాం. కేవీరెడ్డిగారి ‘మాయాబజార్’ కోసం సాలూరు రాజేశ్వరరావుగారు నాలుగు బాణీలిచ్చారు. ‘కుశలమా ప్రియతమా’ అనే బాణీని ఆ సినిమాలో వాడలేదు. దాన్నే తీసుకుని ‘ఘటోత్కచుడు’లో ఉపయోగించా. కైరో ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఎంపికైందీ సినిమా. నేను తీసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే, ఇదొక్కటీ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే నేను కూడా చిన్నపిల్లాణ్ణయిపోయి, తీసిన చిన్నపిల్లల సినిమా కదా! నా కెరీర్లో మరపురాని ఈ ఐదు సినిమాల జ్ఞాపకాలు నన్నెప్పుడూ వెంటాడుతుంటాయి! - పులగం చిన్నారాయణ -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
నిజామాబాద్ అర్బన్ : విద్యార్థులు చక్కని ప్రతిభను కనబరిచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని నగర మేయర్ ఆకుల సుజాత ఆకాం క్షించారు. గురువారం కంఠేశ్వర్‌లోని ఎంఎస్ఆర్ హైస్కూల్లో జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్ ప్రదర్శన ప్రారంభించారు. ఆమె ముఖ్యఅతిథి హా జరై మాట్లాడారు. విద్యార్థులు విద్యాబోధనతో పాటు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ స్వార్ధం లేనివాడే సైం టిస్టు అవుతాడని అన్నారు. దేశానికి ఎందో అందించాలని ఉన్నా, వనరులను ఉపయోగించుకొని కొత్త విధానంను కనుక్కోవాలని సైంటిస్టు పాటుపడతాడని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, దానికి అనుగుణంగా విద్యాబోధన చేయాలన్నారు. తల్లిదండ్రుల తరువాత గురువే ప్రధానమైన వ్యక్తి అని అన్నారు. జిల్లా వ్యవసాయ ప్రాంతమని, ఈ రంగంలో విద్యార్థులు కొత్త ఒరవడి, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలని సూచించారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం ఇన్‌సై్పర్ ప్రదర్శన జిల్లా విద్యార్థులకు ఎంతో దోహదపడుతుందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వర్రావు అన్నారు. వారిలో ఉన్న ప్రతి భను వెలికితీసేందుకు వారిని శాస్త్రవేత్తలు గా తీర్చిదిద్దడానికి మేలు జరుగుతుందన్నారు. ఇది ప్రతి విద్యార్థికి చక్కని అవకాశం అన్నారు. అలాగే ఇతర విద్యార్థులు కూడా ఇలాంటి ప్రదర్శనలను తిలకించాలన్నారు. ఉత్సాహం, ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలి అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలన్నారు. వి దేశాల నుంచి పెట్రోలియం దిగుమతి చేసుకుం టున్నామని, మనదగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకొని శాస్త్రవేత్తలను ఉపయోగించుకుంటే ఇక్కడే అన్ని లభిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని విద్యార్థులు నూతన పద్ధతులను కనుక్కోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ శ్రీనివాసచారి, డిప్యూటీ ఈఓలు పో చాద్రి, పద్మనాభం, అసిస్టెంట్ పరీక్షల వి భాగం అధికారి నాగేశ్వరరావు , డీసీఈబీ సెక్రటరీ చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘం నాయకులు కమలాకర్‌రావు, సురేష్, మాడవేటి వినోద్‌కుమార్, దేవిసింగ్ పాల్గొన్నారు. -
జాక్.. ఒక జెమ్..!
స్కూల్, కాలేజీ స్థాయి సైన్స్ ఫెయిర్లలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూనే ఉంటారు. మాస్టార్ల పర్యవేక్షణల్లో చదువుకొచ్చిన సిద్ధాంతాల ఆధారంగా ప్రయోగపూర్వకంగా ప్రతిభను చాటుతూ ఉంటారు.. ఇలాంటి నేపథ్యమే ఉన్న హైస్కూల్ స్టూడెంట్ జాక్ పాల్గొన్నది కూడా సైన్స్ఫెయిరే! అయితే దానికి పర్యవేక్షకుడు అమెరికన్ అధ్యక్షుడు. జాక్ ప్రయోగం చేస్తున్నది వైట్‌హౌస్ లాన్లో... కొన్ని వందల మంది తలపండిన ప్రొఫెసర్ల మధ్య... మరి అంత చిన్నోడి కి అంత పెద్ద కష్టం ఏమొచ్చింది! అంత పెద్ద పరీక్ష ఎందుకు? అంటే.. అది కష్టమూ కాదు, అతడికి పరీక్ష కాదు. అతడు ఆవిష్కరించిన అద్భుతానికి రుజువు ఆ కార్యక్రమం! అప్పటికే కొన్ని వందల ప్రయోగశాలల చుట్టూ తిరిగాడతను. అలాగే, తన ఆలోచన గురించి అనేకమంది ప్రొఫెసర్లకు చెప్పి చూశాడు. అయితే అందరూ అతడి వయసు, చదువు గురించి ఆలోచించారు కానీ.. అతడి థియరీలోని సత్తా గురించి ఎవ్వరూ ఆలోచించినట్టు లేదు. అమెరికాలోని మేరీలాండ్కు చెందిన జాక్ ఆండ్రకాకు ఇలాంటి అనుభవాలెన్నో ఎదురయ్యాయి. అతడి థియరీని ప్రయోగపూర్వకంగా నిరూపించమని కూడా ఆ మహానుభావులెవరూ అడగలేదంటే... వారికి ఇతడు చెబుతున్న విషయం ఎంత అసంబద్ధంగా అనిపించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పటికీ నిరాశ చెందక అతడు కొనసాగించిన ప్రయత్నమే క్లోమానికి సంబంధించిన క్యాన్సర్ల గుర్తింపులో కీలకావిష్కరణకు దారి తీసింది. అతడికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును, అనేక అవార్డులను తెచ్చిపెట్టింది. మనిషిని చాలా తొందరగా మృత్యుముఖానికి తీసుకెళ్లే క్యాన్సర్లలో ఒకటి క్లోమగ్రంథికి వచ్చే క్యాన్సర్. తొలిదశలోనే దీన్ని గుర్తించకపోతే మరణానికి సిద్ధపడిపోవడం తప్ప ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. ఇటువంటి క్యాన్సర్‌తోనే మరణించాడు జాక్ వాళ్ల అంకుల్. తను అమితంగా అభిమానించే ఆయన మరణానికి కారణం గురించి తెలుసుకొన్న అతడికి నిద్రపట్టలేదు. అప్పుడతనికి నిండా పదిహేనేళ్లు కూడా లేవు. అయితేనేం ప్యాంక్రియాట్రిక్ క్యాన్సర్ గురించి పరిశోధించాడు. ఇంకా హైస్కూల్ చదువు కూడా పూర్తికాకపోయినా.. వైద్యరంగ పరిశోధకుడిగా మారిపోయాడు. రక్తంలో ప్యాంక్రియాట్రిక్ క్యాన్సర్ కారకాలను గుర్తించే సెన్సర్‌ను రూపొందించాడు. మరి మహా వైద్య పరిశోధకులకే సవాలుగా మారిన ఆ వ్యాధి గురించి ఈ హైస్కూల్ విద్యార్థి వివరిస్తే ఎవరు వింటారు? ఆ వ్యాధిని తాను ప్రాథమిక దశలోనే గుర్తించగలనని అంటే ఎవరు నమ్ముతారు?! ఇలాంటి అహం చాలామంది పరిశోధకులను ఆ కుర్రాడి థియరీ ని జోక్‌గా తీసుకొనేలా చేసింది. అతడు చెబుతున్న విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించమని కూడా అడగకుండా అనేక మంది పొమ్మన్నారు. అయినప్పటికీ జాక్ నిరాశపడలేదు. దాదాపు వందమంది ప్రొఫెసర్ల చుట్టూ తిరిగినా.. ఏ ఒక్కరూ ప్రయోగానికి కూడా ఆతడికి అవకాశం ఇవ్వలేదు. అప్పటికీ జాక్ వెనుదిరగలేదు, వెనక్కు తగ్గలేదు. వయసుతో ఉన్న ఉత్సాహమో, తన ఆలోచనపై ఆత్మవిశ్వాసంతోనో కానీ అనేక పరిశోధనాలయాల అడ్రస్‌లు వెదికిపట్టుకొని తన థియరీని వివరించాడు. చివరకు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వాళ్లు జాక్ ఐడియాను గుర్తించారు. ప్రయోగపూర్వకంగా థియరీని నిరూపించడానికి అవకాశం ఇచ్చారు! తొలిదశలోని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ఇప్పటివరకూ ఉన్న సెన్సర్లతో పోలిస్తే వందశాతం కచ్చితంగా గుర్తించే విధానాన్ని ఆవిష్కరించి చూపాడు జాక్. పెద్ద పెద్ద వైద్యపరిశోధకులే ఆశ్చర్యపోయారు! ఆ ఆశ్చర్యానికి రెండు కారణాలు.. వైద్యవిధానంలో నవ్యమైన ఆవిష్కరణ చూడటం ఒకటైతే.. ఒక హైస్కూల్ స్టూడెంట్ దాన్ని రూపొందించడం మరోటి. హాప్కిన్స్ యూనివర్సిటీ పరిశోధనశాల మొదలు... వైట్‌హౌస్‌లో ప్రెసిడెంట్ ఒబామా ముందు జాక్ ప్రతిభను ప్రదర్శించడానికి ఏర్పాటు చేసిన ప్రయోగశాల వరకూ.. అనేకసార్లు ఈ టీనేజర్ సెన్సర్‌కు సంబంధించిన థియరీని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. మొదట్లో ఇతడి థియరీని ఏమాత్రం పట్టించుకోని పరిశోధకులు కూడా తర్వాత జాక్‌ను వేనోళ్ల ప్రశంసించారు. ఇతడు రూపొందించిన సెన్సర్ అత్యంత వేగవంతంగా పనిచేయడమే కాక, అతి చౌకగా అందుబాటులో ఉంటుందని ధ్రువీకరించారు. ఇంటెల్ ఇంజనీరింగ్ ఫెయిర్-2012లో జాక్ ప్రతిభను మెచ్చి 75 వేల డాలర్ల గిఫ్ట్‌ను కూడా ఇచ్చారు నిర్వాహకులు. ప్రస్తుతం 17 ఏళ్ల వయసు వాడైన జాక్ ఐడియాకు ఇంతకుమించిన పురస్కారం ఏమిటంటే... అతడు రూపొందించిన సెన్సర్‌ను ఇప్పుడు అనేక ఆసుపత్రుల్లో వినియోగిస్తున్నారు. మరి టీనేజ్‌లో ఇంతకుమించిన సాఫల్యం ఏముంటుంది! తొలిదశలోని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను ఇప్పటి వరకూ ఉన్న సెన్సార్లతో పోలిస్తే వందశాతం కచ్చితంగా గుర్తించే విధానాన్ని ఆవిష్కరించి చూపాడు జాక్. పెద్ద పెద్ద వైద్యపరిశోధకులే ఆశ్చర్యపోయారు! -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి వైజ్ఞానిక పోటీలు
-
సైన్స్ ఫెయిర్ అదుర్స్
తార్నాక,న్యూస్‌లైన్: ఎనర్జీ సేవ్ సైన్స్ ఫెయిర్ అందర్ని ఆకట్టుకుంది. తార్నాకలోని ఐఐసిటిలో మంగళవారం పాఠశాల విద్యార్థులతో ఏర్పాటైన సైన్స్ సదస్సు ఎంతగానో ఆలోచింప జేసింది. ఈ సందర్భంగా పలువురు పర్యావరణ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రకృతికి హాని కల్గని విధంగా సోలార్ ఎనర్జీని భవిష్యత్ తరాలు ఉపయోగించుకొనే పద్ధతుల్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విద్యార్థులే భావి శాస్త్రవేత్తలుగా నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తిని పెంచుకుని పరిశోధనల వైపు రావాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమమైన ఎగ్జిబిట్లతో ప్రదర్శన నిర్వహించారు. ఇందులో ఉత్తమమైన ప్రదర్శనకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు వికాస్గోయల్, ఐఐసిటి సైంటిస్టు రామానుజం, వివిధ పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. బహుమతుల ప్రదానం... స్నెయిదర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు గత జూన్ నుంచి డిసెంబర్ వరకు నగరంలో ఎంపిక చేసుకున్న 30 పాఠశాలలో విద్యార్థులకు విద్యుచ్ఛక్తి పొదుపు-పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ఎనర్జీ వృథాను అరికట్టే పద్ధతులు, సోలాల్ ఎనర్జీ వినియోగం, పర్యావరణానికి హాని కలుగకుండా శక్తిని ఉత్పత్తి చేసే పద్ధతులపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం విద్యార్థుల ఉత్తమమైన ప్రదర్శనను ఎంపిక చేశారు. ఇందులో నగరంలోని మదర్స్ ఇంటిగ్రల్ స్కూల్‌కు చెందిన టి. హర్షిత రూపొందించిన గ్రీన్ చాంపియన్-2013కు ఉత్తమ స్థానం లభించింది. దీంతో పాటుగా బెస్ట్ స్కూల్ ఆఫ్ ఇయర్‌గా కూడా ఎంపికైంది. స్నెయిదర్ ఎలక్ట్రిక్ ఇండియా స్టేట్ గ్రీన్ అంబాసిడర్ స్థానంలో ఉప్పల్‌లోని లిటిల్ ప్లవర్ స్కూల్ నిలిచింది. ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయం ఫౌండేషన్ ఎనర్జీ స్టార్ టీచర్ కో-ఆర్డినేటర్ స్థానాన్ని దక్కించుకుంది. స్నెయిదర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ ఎనర్జీ స్టార్ స్కూల్‌గా గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఎంపికైంది. -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
గజ్వేల్‌రూరల్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంత విద్యార్థుల నైపుణ్యం ప్రదర్శించేందుకు సైన్స్ఫెయిర్లు వేదిక కావాలని రిటైర్ట్ పరిశ్రమల శాఖ డిప్యూటీ డెరైక్టర్ అధికారి మాణయ్య అన్నారు. గురువారం గజ్వేల్ మండలం రిమ్మనగూడ ప్రొకడెన్స్ ఫార్మసీ కళాశాలలో సైన్స్ ఫెయిర్, యువశాస్త్రవేత టాలెంట్ అవార్డు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు ఇలాంటి వేదికలు ఎంతగానే తోడ్పడతాయన్నారు. విద్యార్ధులు ఉపాధ్యాయులు చెప్పిన విషయలను అర్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్ధికి ఏదో ఓ రంగంపై ఆసక్తి ఉంటుందని దాని గుర్తించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని కోరారు. విద్యార్ధుల తల్లిదండ్రులు వారిలోని ప్రతిభను గుర్తించాలన్నారు. ప్రతి విషయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పిన విషయలను ఆకళింపు చేసుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు శాస్త్రవేత్తలుగా గుర్తింపు పొందాలంటే సైన్స్‌ఫెయిర్ ఓ వేదికగా ఉపయోగపడుతుందన్నారు. మేనేజింగ్ కమిటీ చైర్మన్ హరిత మాట్లాడతూ ప్రొకడెన్స్ కళాశాలలో ప్రతి ఏడాది సైన్స్‌ఫెయిర్ నిర్వహిస్తామన్నారు. కళాశాల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా నుంచి వందల సంఖ్యలో విద్యార్ధులు పాల్గొంటారన్నారు. మరో రెండు రోజుల పాటు సైన్స్‌ఫెయిర్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో డెరైక్టర్ జయంతి, ప్రిన్సిపాల్ జస్వంత్, ఎస్ఓ నరేష్‌రెడ్డి, ఎంఓ రాయప్పరెడ్డి పాల్గొన్నారు. -
సైన్స్ పండుగకు సర్వం సిద్ధం
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: రాష్ట్ర స్థాయి ప్రేరణ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు మెదక్ జిల్లా వేదికైంది. శనివారం నుంచి మూడు రోజులపాటు ఈ ప్రదర్శనను కొండాపూర్ మండలం గిర్మాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నారు. ఈ ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఫెయిర్‌ను ప్రారంభించనున్నారు. ఈ వేడుకలకు మంత్రులు జె.గీతారెడ్డి, వి.సునీతారెడ్డి, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తదితరులు కూడా హాజరుకానున్నారు. ఇది రాష్ట్ర స్థాయి ప్రదర్శన అయినప్పటికీ సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల 11 జిల్లాలకు చెందిన విద్యార్థులు మాత్రమే పాల్గొంటున్నట్టు సమాచారం. ప్రారంభోత్సవానికి మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ హాజరుకావటం లేదని తెలిసింది. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థులు మాత్రమే పాల్గొంటున్నారు. ఇందులో మొత్తం 620 మంది విద్యార్థులు పాలుపంచుకోనున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ఎగ్జిబిట్ చొప్పున మొత్తం 620 నమూనాలను ప్రదర్శించనున్నారు. తరలివచ్చిన విద్యార్థులు.. ఆయా జిల్లాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం రాత్రి వరకు గిర్మాపూర్‌లోని గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. ప్రదర్శనలో పాల్గొనేందుకు వీలుగా విద్యార్థులు తమపేరు, ప్రదర్శన పేర్లను నమోదు చేసుకున్నారు. పదిమంది ప్రొఫెసర్లు ఈ ప్రదర్శనకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. వచ్చే నెల 8న ఢిల్లీలోని ప్రగతిమైదానంలో జాతీయస్థాయి ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఇందుకుగాను రాష్ట్రం తరఫున 50 అత్యుత్తమమైన ఎగ్జిబిట్స్ను, విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. సైన్స్‌ఫెయిర్‌కు అంతా సిద్ధం.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. బాలురకు గురుకుల పాఠశాల హాస్టల్ భవనంలో, బాలికలకు సంగారెడ్డి మండలం కంది సమీపంలోని కేశవరెడ్డి స్కూల్ హాస్టల్లో వసతి ఏర్పాట్లు చేశారు. ఆర్జేడీ గోపాల్‌రెడ్డి, డీఈఓ రమేశ్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాకు గర్వకారణం: రమేశ్, డీఈఓ రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫెయిర్‌ను జిల్లాలో నిర్వహించడం ఎంతో గర్వకారణమని డీఈఓ రమేశ్ అన్నారు. అవసరమైన అన్ని ఏర్పాట్ల కోసం 11 కమిటీలు వేసినట్టు చెప్పారు. ఈ వేడుకలో జిల్లాకు చెందిన 89 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. సైన్స్‌ఫెయిర్‌ను విజయవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకువస్తామని చెప్పారు. -
ఆటపై ప్రేమే పేరు తెచ్చింది!
పర్వతగిరి, న్యూస్‌లైన్: క్రికెట్‌పై తనకు ఉన్న అభిమానంతోనే ఆటలో ఎదగగలిగానని, అదే తనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిందని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఆర్డీఎఫ్) ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలను లక్ష్మణ్ శనివారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న సైన్స్‌ఫెయిర్, బాల మేళాలో ఆయన చిన్నారులతో ముచ్చటించారు. ఆసక్తి ఉన్న రంగంలో శ్రమిస్తే మంచి స్థాయికి చేరుకోవచ్చని ఆయన విద్యార్థులతో అన్నారు. తాను చదివిన పాఠశాలలో ఉపాధ్యాయుల ప్రోత్సాహం, క్రమశిక్షణ వల్లే తాను ఈ స్థాయికి చేరానని, ఆర్డీఎఫ్ పాఠశాలను చూస్తే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. విద్యార్థి దశలో సమయపాలన పాటిస్తూ చదువుపై శ్రద్ధపెట్టి చేర్చుకుంటే భవిష్యత్‌లో మరింతగా రాణించవచ్చని చెప్పారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న ఆర్డీఎఫ్ పాఠశాల సిబ్బందిని లక్ష్మణ్ ప్రశంసించారు. చిన్న రాష్ట్రమైన జార్ఖండ్‌నుంచి వచ్చిన ఎంఎస్ ధోని ఇప్పుడు గొప్ప క్రికెటర్‌గా ఎదిగాడని, గ్రామీణ విద్యార్థులు కూడా అతడిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని ఈ దిగ్గజ క్రికెటర్ మార్గదర్శనం చేశాడు. -
విద్యార్థులకు అందని ఇన్స్పైర్ విజ్ఞానం
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడానికి, వారిని ప్రతి భావంతులను చేయడానికి, సైన్స్ పరిజ్ఞానాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం 2010-11లో ఇన్స్పైర్ వైజ్ఞానిక మేళాను ప్రవేశపెట్టింది. ఈ మేళాలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులు ఒక్కో పాఠశాల నుంచి ఒక్కరు, ఇద్దరు పాల్గొనాలి. ఒక్కొక్క ప్రదర్శనకు రూ.5వేల చొప్పున ఉపాధ్యాయుడు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో జమచేస్తారు. మూడు నెలలపాటు పాఠశాలలోని ఉపాధ్యాయుడు, విద్యార్థి కలిసి మానవ జీవితానికి ఉపయోగపడే ప్రయోగం తయారు చేసి మేళాలో ప్రదర్శించాలి. ఇవి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. ప్రదర్శనల లక్ష్యయమేమిటో షాట్లపై స్పష్టంగా పేర్కొనాలి. వాటివల్ల కలిగే దుష్పరిణామాలు, నివారణ మార్గాలు ప్రదర్శించాలి. పర్యావరణం, సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సాంకేతిక శాస్త్ర అభివృద్ధి ప్రధానంగా ఉండాలి. కానీ ఇవేమి కానరావడం లేదు. 90 శాతం ప్రదర్శనలు ఏమిటీకి ఉపయోగపడేలా లేవు. సోమవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, మంచిర్యాల పట్టణాల్లో ఇన్‌స్సైర్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్‌లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఉపవిద్యాధికారి పరిధిలోని 29 మండలాలకు సంబంధించిన 431 మంది విద్యార్థులు, మంచిర్యాలలోని ఆర్బీహెచ్వీ ఉన్నత పాఠశాలలో477 మంది విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలు ప్రదర్శించాల్సి ఉంది. ఇందులో కొన్ని పాతవే ప్రదర్శించడం కొసమెరుపు. నిధులు వృథా.. 2010-11 సంవత్సరానికి గాను 1190 మంది విద్యార్థులకు రూ.5.09 కోట్లు, 2011-12 సంవత్సరానికి గాను 1090 మంది విద్యార్థులకు రూ.5.04 కోట్లు, 2012-13 సంవత్సరానికి గాను 908 మంది విద్యార్థులకు రూ.2.01 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులను విద్యార్థుల, ఉపాధ్యాయుల జాయింట్ అకౌంట్లలో మేళాకు సంబంధించిన డబ్బులను జమ చేస్తారు. అయితే పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రొత్సహించకుండా సమయం దగ్గర పడడం, అధికారుల ఒత్తిడి వల్ల మేళాలలో ఏదో ఒక ప్రదర్శనను తయారు చేసి తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ఆ డబ్బులను వాడుకొని ఏదో ఒకటి తీసుకువెళ్లాలని చెప్పడంతో ఈ తతంగం జరుగుతుందని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పలువురు పేర్కొంటున్నారు. కొందరు మొక్కుబడిగా తక్కువ ఖర్చుతో తయారు చేసిన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో విద్యార్థులకు పరిజ్ఞానం మరింత దూరమవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు ప్రదర్శనలు తిలకించేందుకు వస్తున్న విద్యార్థులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిధులు వృథా అవుతున్నాయి. అధికారులు మంచి ప్రదర్శనలు, సమాజానికి ఉపయోగపడే ప్రదర్శనలు. -
నేటి నుంచి సైన్స్ ఫెయిర్
ప్రకృతిని శోధించి.. మేథస్సును మదించి.. నిరంతర పరిశోధనలతో.. బాల శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రదర్శనలకు వేదికగా మారబోతుంది మెదక్ పట్టణంలోని గోల్‌బంగ్లా. బాల్యం నుంచే శాస్త్రీయ భావనలు పెంపొందించి, అమాయక బాలలను అసమాన శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ జిల్లాలో ఈ యేడు మొదటగా మంగళవారం మెదక్ పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాల(గోల్ బంగ్లా)లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇందుకు 16 కమిటీలతో 160 మంది సిబ్బందితో విద్యాశాఖ అధికారులు విస్త ృత ఏర్పాట్లు చేశారు. ఈ ప్రదర్శనలను తిలకించడానికి మూడు రోజుల్లో సుమారు 15 వేల మంది వస్తారని భావిస్తున్నారు. ఇందులో మెదక్, జోగిపేట డివిజన్లలోని 15 మండలాలకు చెందిన 428 ప్రదర్శనలలను ప్రదర్శించనున్నారు. ఆకట్టుకునేలా ఏర్పాట్లు.. ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ఆరంభ కార్యక్రమాన్ని ఆకట్టుకునేలా నిర్వహించేందుకు డీఈఓ రమేశ్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, శాసనసభ్యులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రారంభ కార్యక్రమం అదిరిపోయే రీతిలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. గోల్‌బంగ్లా ఆవరణ మొత్తాన్ని శాస్త్రవేత్తల కటౌట్లతో పరిశోధనల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడకు వచ్చే ప్రతి విద్యార్థిలో శాస్త్రీయ భావనలు బలపడేలా వాతావరణాన్ని తయారు చేస్తున్నారు. 16 కమిటీలతో పర్యవేక్షణ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా 160 మంది ఉపాధ్యాయులతో 16 కమిటీలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఆరు కౌంటర్లు, ప్రదర్శనల కోసం 550 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సీఎస్ఐ బాలికల హాస్టల్లో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. బాలికలకు కేజీబీవీ, వెలుగు పాఠశాలల్లో, బాలుర కోసం చర్చి దగ్గర ఉన్న పిలిగ్రిమేజ్ సెంటర్లో వసతి కల్పిస్తున్నారు. ఏర్పాట్లలో లోపాలపై సలహాలు, సూచనల కోసం ఎగ్జిబిషన్ ప్రాంగణంలో సలహా బాక్సులు ఏర్పాటు చేశారు. పలు విభాగాలకు ఇన్చార్జీలు.. సైన్స్ ఎగ్జిబిషన్‌కు వచ్చే విద్యార్థుల అవసరాల కోసం పలు అంశాలకు ఇన్చార్జీలను నియమించారు. ఇన్విటేషన్-రిసెప్షన్ ఇన్చార్జిగా సాయిబాబా (9392011409), రిజిస్ట్రేషన్‌కు జి.శ్రీనివాస్(9440201965), విద్యుత్ సౌకర్యం - పి.రాములు (9618897770), భోజన వసతికి - నీలకంఠం(9440967306), ఫర్నిచర్‌కు సుదర్శనమూర్తి (9492827089), బాలికల వసతి కోసం స్వరూపారాణి(9494058793), ఆరోగ్యం, శానిటేషన్ కోసం డయాన డార్కస్(7842357845), క్రమశిక్షణ కమిటీకి బాలేశ్వర్‌గౌడ్(9491330892), జడ్జిమెంట్ కమిటీ- రమేశ్‌బాబు (9440257682), గదుల ఇన్చార్జిగా బి.కరుణాకర్(9989174560)లను ఇన్‌చార్జీలుగా నియమించారు.