తార్నాక,న్యూస్‌లైన్: ఎనర్జీ సేవ్ సైన్స్ ఫెయిర్ అందర్ని ఆకట్టుకుంది. తార్నాకలోని ఐఐసిటిలో మంగళవారం పాఠశాల విద్యార్థులతో ఏర్పాటైన సైన్స్ సదస్సు ఎంతగానో ఆలోచింప జేసింది. ఈ సందర్భంగా పలువురు పర్యావరణ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రకృతికి హాని కల్గని విధంగా సోలార్ ఎనర్జీని భవిష్యత్ తరాలు ఉపయోగించుకొనే పద్ధతుల్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. విద్యార్థులే భావి శాస్త్రవేత్తలుగా నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు.
విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తిని పెంచుకుని పరిశోధనల వైపు రావాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమమైన ఎగ్జిబిట్లతో ప్రదర్శన నిర్వహించారు. ఇందులో ఉత్తమమైన ప్రదర్శనకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు వికాస్‌గోయల్, ఐఐసిటి సైంటిస్టు రామానుజం, వివిధ పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
బహుమతుల ప్రదానం...
స్నెయిదర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు గత జూన్ నుంచి డిసెంబర్ వరకు నగరంలో ఎంపిక చేసుకున్న 30 పాఠశాలలో విద్యార్థులకు విద్యుచ్ఛక్తి పొదుపు-పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ఎనర్జీ వృథాను అరికట్టే పద్ధతులు, సోలాల్ ఎనర్జీ వినియోగం, పర్యావరణానికి హాని కలుగకుండా శక్తిని ఉత్పత్తి చేసే పద్ధతులపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం విద్యార్థుల ఉత్తమమైన ప్రదర్శనను ఎంపిక చేశారు. ఇందులో నగరంలోని మదర్స్ ఇంటిగ్రల్ స్కూల్‌కు చెందిన టి. హర్షిత రూపొందించిన గ్రీన్ చాంపియన్-2013కు ఉత్తమ స్థానం లభించింది.
దీంతో పాటుగా బెస్ట్ స్కూల్ ఆఫ్ ఇయర్‌గా కూడా ఎంపికైంది. స్నెయిదర్ ఎలక్ట్రిక్ ఇండియా స్టేట్ గ్రీన్ అంబాసిడర్ స్థానంలో ఉప్పల్‌లోని లిటిల్ ప్లవర్ స్కూల్ నిలిచింది. ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయం ఫౌండేషన్ ఎనర్జీ స్టార్ టీచర్ కో-ఆర్డినేటర్ స్థానాన్ని దక్కించుకుంది. స్నెయిదర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ ఎనర్జీ స్టార్ స్కూల్‌గా గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఎంపికైంది.
సైన్స్ ఫెయిర్ అదుర్స్
Published Wed, Dec 18 2013 6:21 AM | Last Updated on Mon, Oct 22 2018 8:25 PM
Advertisement