ఈ సోలార్ సెల్స్ సూపర్
వాషింగ్టన్: స్మార్ట్ వాచ్‌లు, మెడికల్ సెన్సార్‌ల చార్జింగ్ కోసం సైజులో చిన్నగా ఉంటూ ప్రభావ వంతంగా పనిచేసే ‘సోలార్ సెల్స్’ను శాస్త్రవేత్తలు రూపొందించారు. మామూలుగా మనం ఇళ్ల మీద ఉంచే సోలార్ ప్లేట్ల కంటే అధిక సామర్థ్యంతో ఇవి విద్యుత్‌ను సంగ్రహిస్తాయి. ఇందులో ఎలక్ట్రోడుల అమరిక విభిన్నంగా ఉంటుంది. దీని కారణంగా ఇవి సంప్రదాయ సౌర విద్యుత్ సంగ్రహ పరికరాల కంటే ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సోలార్ ప్లేట్లు మొత్తం సౌరశక్తిలో 1.8 శాతాన్ని మాత్రమే విద్యుత్ రూపంలోకి మార్చగలవు. కానీ వీరు రూపొందించిన పరికరం 5.2 శాతాన్ని మార్చగలదు. భవిష్యత్తులో వీటి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తామని వీరు తెలిపారు.