ప్రకృతిని శోధించి.. మేథస్సును మదించి.. నిరంతర పరిశోధనలతో.. బాల శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రదర్శనలకు వేదికగా మారబోతుంది మెదక్ పట్టణంలోని గోల్‌బంగ్లా. బాల్యం నుంచే శాస్త్రీయ భావనలు పెంపొందించి, అమాయక బాలలను అసమాన శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్‌స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ జిల్లాలో ఈ యేడు మొదటగా మంగళవారం మెదక్ పట్టణంలోని వెస్లీ ఉన్నత పాఠశాల(గోల్ బంగ్లా)లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇందుకు 16 కమిటీలతో 160 మంది సిబ్బందితో విద్యాశాఖ అధికారులు విస్త ృత ఏర్పాట్లు చేశారు. ఈ ప్రదర్శనలను తిలకించడానికి మూడు రోజుల్లో సుమారు 15 వేల మంది వస్తారని భావిస్తున్నారు. ఇందులో మెదక్, జోగిపేట డివిజన్లలోని 15 మండలాలకు చెందిన 428 ప్రదర్శనలలను ప్రదర్శించనున్నారు.
ఆకట్టుకునేలా ఏర్పాట్లు..
ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్ ఆరంభ కార్యక్రమాన్ని ఆకట్టుకునేలా నిర్వహించేందుకు డీఈఓ రమేశ్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, శాసనసభ్యులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రారంభ కార్యక్రమం అదిరిపోయే రీతిలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. గోల్‌బంగ్లా ఆవరణ మొత్తాన్ని శాస్త్రవేత్తల కటౌట్లతో పరిశోధనల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడకు వచ్చే ప్రతి విద్యార్థిలో శాస్త్రీయ భావనలు బలపడేలా వాతావరణాన్ని తయారు చేస్తున్నారు.
16 కమిటీలతో పర్యవేక్షణ..
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా 160 మంది ఉపాధ్యాయులతో 16 కమిటీలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఆరు కౌంటర్లు, ప్రదర్శనల కోసం 550 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సీఎస్‌ఐ బాలికల హాస్టల్‌లో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. బాలికలకు కేజీబీవీ, వెలుగు పాఠశాలల్లో, బాలుర కోసం చర్చి దగ్గర ఉన్న పిలిగ్రిమేజ్ సెంటర్‌లో వసతి కల్పిస్తున్నారు. ఏర్పాట్లలో లోపాలపై సలహాలు, సూచనల కోసం ఎగ్జిబిషన్ ప్రాంగణంలో సలహా బాక్సులు ఏర్పాటు చేశారు.
పలు విభాగాలకు ఇన్‌చార్జీలు..
సైన్స్ ఎగ్జిబిషన్‌కు వచ్చే విద్యార్థుల అవసరాల కోసం పలు అంశాలకు ఇన్‌చార్జీలను నియమించారు. ఇన్విటేషన్-రిసెప్షన్ ఇన్‌చార్జిగా సాయిబాబా (9392011409), రిజిస్ట్రేషన్‌కు జి.శ్రీనివాస్(9440201965), విద్యుత్ సౌకర్యం - పి.రాములు (9618897770), భోజన వసతికి - నీలకంఠం(9440967306), ఫర్నిచర్‌కు సుదర్శనమూర్తి (9492827089), బాలికల వసతి కోసం స్వరూపారాణి(9494058793), ఆరోగ్యం, శానిటేషన్ కోసం డయాన డార్కస్(7842357845), క్రమశిక్షణ కమిటీకి బాలేశ్వర్‌గౌడ్(9491330892), జడ్జిమెంట్ కమిటీ- రమేశ్‌బాబు (9440257682), గదుల ఇన్‌చార్జిగా బి.కరుణాకర్(9989174560)లను ఇన్‌చార్జీలుగా నియమించారు.
నేటి నుంచి సైన్స్ ఫెయిర్
Published Tue, Aug 6 2013 12:34 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement
Advertisement