నంగునూరు, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే తొమ్మిది జిల్లాల ప్రజలను ఏకం చేసి తెలంగాణను స్తంభింపజేస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. 12 సంవత్సరాలు శాంతియుతంగా పోరాడి కేసీఆర్ తె లంగాణ తెస్తే.. సీమాంధ్రలో కొందరు నాయకులు అల్లర్లు సృష్టించడానికి డబ్బులిచ్చి కేసీఆర్ బొమ్మలు తగలబెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నంగునూరులో పలు పార్టీలకు చెందిన వంద మంది బుధవారం హరీష్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యూపీఏ ఇస్తామన్న తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్రులు కుట్రలు పన్నుతున్నారన్నారు. చంద్రబాబు, లగడపాటి, కేవీపీలు డబ్బులు పెట్టి ఉద్యమాల పేరిట అల్లర్లు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు.
అందరు మనవారే అభివృద్ధికి పాటు పడండి
తెలంగాణ కోసం పోరాడిన ప్రజలు గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని హరీష్‌రావు పిలుపు నిచ్చారు. ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తెలంగాణ వారేననీ, విభేదాలు పక్కన పెట్టి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పార్టీలకు అతీతంగా పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో రమేశ్‌గౌడ్, మల్లయ్య, సారయ్య, వెంకట్‌రెడ్డి, రాజనర్సు, రవీందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, తుంగ కనుకయ్య, మణిచారి, కనుకయ్య, రాంరెడ్డి, దేవులపల్లి రాజమౌళి, బడే రాజయ్య పాల్గొన్నారు.
తేడా వస్తే తెలంగాణను స్తంభింపజేస్తాం
Published Thu, Aug 8 2013 2:29 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement
Advertisement