చిట్టిమెదళ్లు... పెద్ద ఆలోచనలు! | science fair in anantapur | Sakshi
Sakshi News home page

చిట్టిమెదళ్లు... పెద్ద ఆలోచనలు!

Published Fri, Oct 28 2016 10:23 PM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM

చిట్టిమెదళ్లు... పెద్ద ఆలోచనలు! - Sakshi

చిట్టిమెదళ్లు... పెద్ద ఆలోచనలు!

అనంతలో రెండు రోజుల సైన్స్‌ఫేర్‌
చిట్టి మెదళ్లలో పెద్ద  ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు ధీటుగా మన బుల్లి శాస్త్రవేత్తలు పోటీ పడుతున్నారు. కొత్తకొత్త ఆవిష్కరణలతో ఆలోచింపజేస్తున్నారు. మట్టిలో మాణిక్యాలు లాగా గ్రామీణ విద్యార్థులు తమలో దాగివున్న సజనాత్మకకు పదును పెడుతున్నారు. అవకాశం ఇస్తే జాతీయస్థాయిలో కూడా రాణిస్తామంటూ నిరూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల పరిశోధనలకు వేదికగా మారింది అనంతపురంలోని కేఎస్‌ఆర్‌ బాలికల పాఠశాల. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ), పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా శుక్రవారం నుంచి రెండ్రోజుల జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 40 నమూనాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. కార్యక్రమాన్ని ఆర్‌ఎంఎస్‌ఏ ఏడీ శ్రీరాములు, సైన్స్‌ సెంటర్‌ క్యూరేటర్‌  వెంకటరంగయ్య, కోఆర్డినేటర్‌  కె. ఆనందభాస్కర్‌రెడ్డి, నిర్వహణ కమిటీ సభ్యులు పక్కీరప్ప, రాము, మదన్‌మోహన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
వాయిస్‌ కంట్రోల్‌ వీల్‌చైర్‌ రోబో
దివ్యాంగుల కోసం మొబైల్‌ కంట్రోల్‌తో తయారు చేసిన కదిలే కుర్చీ. ముందుగా  మొబైల్‌లో ఏఎంఆర్‌ వాయిస్‌ కంట్రోల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. నాలుగు చక్రాల చెక్కకు అమర్చిన  కుర్చీ కిందిlభాగంలో డివైజ్‌ బ్యాటరీ ఏర్పాటు చేసుకోవాలి.  మొబైల్‌లో బ్లూటూత్‌ ఆన్‌మోడ్‌లో ఉంచి డివైజ్‌ బ్లూటూత్‌ను పెయిరింగ్‌ చేయాలి. అయితే యాప్‌కు అనుసంధానం చేసి ఉండడంతో ఏఎంఆర్‌ వాయిస్‌ స్పీకర్‌ వద్ద లెఫ్ట్, రైట్, ఫార్వర్డ్, బ్యాక్‌వర్డ్‌ అని పలికితే చాలు అందుకనుగుణంగా వీల్‌చైర్‌ కదులుతుంది. దీనివల్ల ఎవరి సాయం లేకుండానే దివ్యాంగులు పనులు చేసుకోవచ్చు.
– పి. సాయిమహేష్‌ (విద్యార్థి), మహేంద్రరెడ్డి(గైడ్‌ టీచర్‌), జెడ్పీహెచ్‌ఎస్, తంగేడుకుంట, ఓడీసీ మండలం
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ఎకో నర్సరీ
సాధారణంగా నర్సరీల్లో ప్లాస్టిక్‌ కుండీలు, కవర్లు వాడడం వల్ల అవి భూమిలో ఇంకిపోకుండా పర్యావరణ కాలుష్యం జరుగుతోంది.  దీన్ని అరికట్టడానికి పరిసరాల్లో వథాగా పడి ఉన్న పేపర్లు, కొబ్బరి బోండం చిప్పలు, గడ్డి, పేడ, కొబ్బరిపీచు, వరిగడ్డి తదితర వాటిని ఉపయోగించి జీవ వ్యర్థ కుండీలను తయారు చేసుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు.
– ఎం. సుప్రియ (విద్యార్థి), సి. రాజశేఖర్‌రెడ్డి(గైyŠ lటీచర్‌), జెడ్పీహెచ్‌ఎస్, పాపంపేట, అనంతపురం రూరల్‌
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
కాంతి కాలుష్యం
అధికమైన, అనవసరమైన కత్రిమS కాంతినే కాంతికాలుష్యం అంటారు. పెద్దపెద్ద నగరాల్లో ఈ రోజుల్లో కాంతి కాలుష్యం అధికమవుతోంది.  దీని ప్రభావంతో మనుషుల్లో నిద్రలేమి, తలనొప్పి, కంటి సమస్యలు అధికమవుతాయి. చికాకు చెందుతుంటారు. రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయి. నిశాచర జీవులకు ఆహార సేకరణ, సంతానోత్పత్తి కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో కాంతి కాలుష్యాన్ని నివారించాలి. రాత్రిపూట అవసరమైన చోట్ల అవసరం మేరకే కాంతి వాడాలి. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన లైట్లు ఏర్పాటు చేసుకోవాలి. సైన్‌బోర్డుల లైట్లును తొలిగించాలి.
– జె.అనిల్‌కుమార్‌ (విద్యార్థి), కె.ఎస్‌.నంజుండప్ప (గైడ్‌ టీచరు), జెడ్పీహెచ్‌ఎస్, తపోవనం, అనంతపురం రూరల్‌
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
శబ్ధ కాలుష్యాన్నీ కొలవచ్చు
శబ్ధ కాలుష్యం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో శబ్ధ కాలుష్యాన్ని కొలిచే పరికరాలు అక్కడక్కడ ఏర్పాటు చేయడం వల్ల, ఫ్యాక్టరీలు తదితర వాటివల్ల ఎంతెంత శబ్ధం వస్తోందో గుర్తింవచ్చు.  దీని వల్ల కలిగే అనర్థాలపై ఆయా ప్రాంతాల ప్రజలకు అవగాహ కల్పించి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శబ్ధ కాలుష్యం నుంచి విముక్తులు కావచ్చు.
– పి.వంశీ (విద్యార్థి), పి.ఓబుళరెడ్డి(గైడ్‌ టీచరు), జెడ్పీహెచ్‌ఎస్, బెళుగుప్ప
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ఆటోమేటిక్‌ స్ట్రీట్‌ లైట్‌
ఈ  ఆటోమేటిక్‌ స్రీట్‌లైట్‌ ప్రాజెక్టు ద్వారా విద్యుత్‌ను వీలైనంత వరకు ఆదా చేయొచ్చు. ఎల్‌డీఆర్‌ సిస్టంను ఉపయోగించి సెన్సార్‌ను ఏర్పాటు చేయాలి. సూర్యకాంతి  తగ్గిపోగానే ఆటోమేటిక్‌గా లైట్లు ఆన్‌ అవుతాయి. ఉదయం సూర్యకాంతి పడగానే ఆరిపోతాయి. దీనివల్ల వీధిలైట్లు ఆన్‌/ఆఫ్‌ చేసేందుకు ప్రత్యేకంగా మనిషి ఉండాల్సిన పనిలేదు. విద్యుత్‌ కూడా ఆదా అవుతుంది.
– బి.వీరభార్గవి (విద్యార్థి), గైడ్‌టీచరు ఎస్‌.నాగరాజు (గైడ్‌ టీచరు), జెడ్పీహెచ్‌ఎస్, ఖాదర్‌పేట, పామిడి మండలం
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
రక్తదానంపై అవగాహనæ
ఓవైపు రక్తగ్రూపు నిర్ధారణ పరీక్షలు చేస్తూనే మరోవైపు రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నారు ఈ విద్యార్థులు. ఉచితంగా రక్తగ్రూపు నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఫలానా గ్రూపు అని నిర్ధారిస్తారు. అనంతరం ఏ, బీ, ఓ, ఏబీ పాజిటివ్, నెగిటివ్‌ గ్రూపుల వారు ఏయే గ్రూపుల వారికి రక్తదానం చేయొచ్చు... ఇలా ఇవ్వడం వల్ల ఒనగూరే లాభాల గురించి తెలియజేస్తున్నారు. వీలైనంత మందికి రక్తగ్రూపు నిర్ధారణలు చేసి రక్తదానంపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని చెబుతున్నారు.
– విద్యార్థినిలు ప్రసన్నలక్ష్మీ, కళ్యాణి, నఫీసా, హరిణి, భవిష్య,  గైడ్‌ టీచరు ఎస్‌.గౌసియా, వికాస్‌ మోడల్‌ స్కూల్, అనంతపురం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement