- విద్యార్థుల్ని ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి
- ఎంపీ తోట నరసింహం
- ముగిసిన సై¯Œ్స పండుగ
శాస్త్రవిజ్ఞానం వైపు ప్రోత్సహించాలి
Published Sat, Nov 5 2016 10:10 PM | Last Updated on Sat, Sep 15 2018 7:30 PM
భానుగుడి(కాకినాడ) :
విద్యార్థుల సృజనకు అద్దం పట్టే మరిన్ని విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలకు రూపకల్పన చేయాలని ఎంపీ తోట నరసింహం సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారు శాస్త్ర విజ్ఞానం వైపు అడుగులు వేసేలా చూడాలని కోరారు. మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన శనివారంతో ముగిసింది. స్థానిక ఏఎంజీ పాఠశాలలో నిర్వహించిన ముగింపు సభలో ఎంపీ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రస్తుతం పాఠశాలల్లో నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం అమలులో ఉందని, దీని ద్వారా పరిశీలనాత్మక విజ్ఞానం పెరుగుతుందన్నారు. తద్వారా విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలు స్ఫూరిస్తాయన్నారు. వారి ఆలోచనలకు ఉపాధ్యాయులు పదునుపెడితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
రాష్ట్ర స్థాయికి 101 ప్రాజెక్టులు ఎంపిక
జిల్లాలోని 25 మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. 560 ప్రాజెక్టులు రావాల్సి ఉండ గా 545 ప్రాజెక్టులు ప్రదర్శనకు వచ్చాయి. ఇందు లో 55 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు. రాజమండ్రిలో 511 ప్రాజెక్టులు ప్రదర్శనకు ఉంచగా అందులో 46 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. ఈ ఏడాది జిల్లా నుంచి మొత్తం 101 ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు వెళ్ళనున్నాయి. ఇందులో ఎక్కువగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, విద్యుత్‌లేని ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌సిటీ, స్మార్ట్ విలేజ్ అంశాలే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ఎంపికకు సంబం«ధించి ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం, ఎం. ఎం.పాషా, వంకా గణపతిరావుల నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం న్యాయనిర్ణేతలుగా వ్యవహరించింది. చివరి రోజు వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రదర్శనను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, డీఈవో ఆర్.నరసింహారావు, డీవైఈవో వాడపల్లి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement