ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడానికి, వారిని ప్రతి భావంతులను చేయడానికి, సైన్స్ పరిజ్ఞానాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం 2010-11లో ఇన్‌స్పైర్ వైజ్ఞానిక మేళాను ప్రవేశపెట్టింది. ఈ మేళాలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులు ఒక్కో పాఠశాల నుంచి ఒక్కరు, ఇద్దరు పాల్గొనాలి. ఒక్కొక్క ప్రదర్శనకు రూ.5వేల చొప్పున ఉపాధ్యాయుడు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో జమచేస్తారు. మూడు నెలలపాటు పాఠశాలలోని ఉపాధ్యాయుడు, విద్యార్థి కలిసి మానవ జీవితానికి ఉపయోగపడే ప్రయోగం తయారు చేసి మేళాలో ప్రదర్శించాలి. ఇవి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. ప్రదర్శనల లక్ష్యయమేమిటో షాట్లపై స్పష్టంగా పేర్కొనాలి.
వాటివల్ల కలిగే దుష్పరిణామాలు, నివారణ మార్గాలు ప్రదర్శించాలి. పర్యావరణం, సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సాంకేతిక శాస్త్ర అభివృద్ధి ప్రధానంగా ఉండాలి. కానీ ఇవేమి కానరావడం లేదు. 90 శాతం ప్రదర్శనలు ఏమిటీకి ఉపయోగపడేలా లేవు. సోమవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, మంచిర్యాల పట్టణాల్లో ఇన్‌స్సైర్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్‌లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఉపవిద్యాధికారి పరిధిలోని 29 మండలాలకు సంబంధించిన 431 మంది విద్యార్థులు, మంచిర్యాలలోని ఆర్‌బీహెచ్‌వీ ఉన్నత పాఠశాలలో477 మంది విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలు ప్రదర్శించాల్సి ఉంది. ఇందులో కొన్ని పాతవే ప్రదర్శించడం కొసమెరుపు.
నిధులు వృథా..
2010-11 సంవత్సరానికి గాను 1190 మంది విద్యార్థులకు రూ.5.09 కోట్లు, 2011-12 సంవత్సరానికి గాను 1090 మంది విద్యార్థులకు రూ.5.04 కోట్లు, 2012-13 సంవత్సరానికి గాను 908 మంది విద్యార్థులకు రూ.2.01 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులను విద్యార్థుల, ఉపాధ్యాయుల జాయింట్ అకౌంట్లలో మేళాకు సంబంధించిన డబ్బులను జమ చేస్తారు.
అయితే పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రొత్సహించకుండా సమయం దగ్గర పడడం, అధికారుల ఒత్తిడి వల్ల మేళాలలో ఏదో ఒక ప్రదర్శనను తయారు చేసి తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ఆ డబ్బులను వాడుకొని ఏదో ఒకటి తీసుకువెళ్లాలని చెప్పడంతో ఈ తతంగం జరుగుతుందని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పలువురు పేర్కొంటున్నారు. కొందరు మొక్కుబడిగా తక్కువ ఖర్చుతో తయారు చేసిన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో విద్యార్థులకు పరిజ్ఞానం మరింత దూరమవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు ప్రదర్శనలు తిలకించేందుకు వస్తున్న విద్యార్థులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నిధులు వృథా అవుతున్నాయి. అధికారులు మంచి ప్రదర్శనలు, సమాజానికి ఉపయోగపడే ప్రదర్శనలు.
విద్యార్థులకు అందని ఇన్‌స్పైర్ విజ్ఞానం
Published Tue, Aug 13 2013 3:40 AM | Last Updated on Sat, Sep 15 2018 7:30 PM
Advertisement
Advertisement