కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ/ యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): రాష్ట్ర ప్రభుత్వం, ఫాతిమా మెడికల్ కాలేజీ యజమాన్యం తీరుతో రోడ్డునపడ్డ 100 మంది వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ఆర్యోగ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. వారిని ఇతర వైద్య కాలేజీల్లో చేర్పించి (రీలొకేట్) ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వెంటనే కేంద్ర మంత్రిని కలసి విద్యార్థుల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీ మిథున్‌రెడ్డిని ఆదేశించారు. దీంతో ఆయన సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌తో భేటీ అయ్యారు. అలాగే ఈ అంశంపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జయశ్రీ మెహతాకు కూడా ఎంపీ మిథున్‌రెడ్డి లేఖ రాశారు. కాగా, ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం జరిగేలా చొరవ తీసుకోవాలని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ పార్టీ ఏపీ నేతలు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment