సాక్షి, అమరావతి : ఫాతిమా కాలేజ్ విషయంలో సాంకేతికంగా ఉన్న ఇబ్బందులు అధిగమించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. సీఎంను కలిసేందుకు సోమవారం అసెంబ్లీకి వచ్చిన ఫాతిమా కాలేజ్ విద్యార్థులు అసెంబ్లీ లాబీల్లో మంత్రి కామినేనిని కలుసుకున్నారు.
ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన విద్యార్థులకు వివరించారు. తమ చేతుల్లో ఏమీ లేదని, అన్ని ప్రయత్నాలు చేశామని కామినేని చెప్పారు. కాలేజీ మోసంపై సీఐడీ విచారణ జరుపుతామన్నారు. ప్రభుత్వం చాలా చేసింది.. ప్రత్యేకంగా లాయర్ ను పెట్టింది అని కూడా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment