fathima medical college
-
ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు సాయమందించిన సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కడప ఫాతిమా కాలేజీ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. 2015లో ఇబ్బందులు పడిన 46 మంది ఫాతిమా కాలేజీ మెడికల్ విద్యార్థులకు ఫీజుల కింద రూ.9.12 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థుల సమస్యలను డిప్యూటీ సీఎం అంజాద్ భాష.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించారు. దీంతో కాలేజీ ఆవరణలో విద్యార్థులు కేక్ కట్ చేసి, థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చదవండి: (TDP Drama: ఛీ..ఛీ.. మరీ ఇంత అన్యాయమా!) -
మా జీవితాలతో ఆడుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులు మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. మా జీవితాలతో ఆడుకోవద్దని, మేము లాంగ్‌టర్మ్ కోచింగ్‌కి వెళ్లమని చెప్పారు. నష్టపోయిన విద్యార్థుల్లో తెలంగాణ వారు కూడా ఉన్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జోక్యం చేసుకోవాలని ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులు కోరారు. ఎవరో చేసిన తప్పుకు మమ్మల్ని శిక్షించడం చాలా బాధాకరమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కనీస వసతులు లేని కారణంగా ఫాతిమా ప్రైవేటు వైద్య కళాశాలకు అనుమతి ఇవ్వలేమని, 2014-15 బ్యాచ్‌కు చెందిన విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తున్నట్లు భారత వైద్య మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఎవరో చేసిన తప్పుకు మమ్మల్ని శిక్షించకండి
-
బాబు, పవన్ ఇద్దరు తోడు దొంగలే: కత్తి
సాక్షి, హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుపై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఫాతిమా కళాశాల విషయంపై లేఖ రాశారు, దీంతోపాటు పవన్ ట్వీట్ కూడా చేశారు. ఈ విషయంపై కత్తి మహేష్ తన ఫేస్బుక్ వేదికగా ‘మొత్తానికి ఫాతిమా కాలేజ్ విషయంలో ఇంతకాలానికి చంద్రబాబు ఒకే అన్నాడన్నమాట. ఈరోజు పవన్ కళ్యాణ్ ట్విట్ చేశాడు. తోడుదొంగలు గేమ్ బాగానే ఆడుతున్నారు.’ అని కామెంట్ చేశారు. -
ఆ విద్యార్థులను రీలొకేట్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ/ యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): రాష్ట్ర ప్రభుత్వం, ఫాతిమా మెడికల్ కాలేజీ యజమాన్యం తీరుతో రోడ్డునపడ్డ 100 మంది వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ఆర్యోగ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ను వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. వారిని ఇతర వైద్య కాలేజీల్లో చేర్పించి (రీలొకేట్) ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వెంటనే కేంద్ర మంత్రిని కలసి విద్యార్థుల సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీ మిథున్‌రెడ్డిని ఆదేశించారు. దీంతో ఆయన సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి అనుప్రియ పటేల్‌తో భేటీ అయ్యారు. అలాగే ఈ అంశంపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జయశ్రీ మెహతాకు కూడా ఎంపీ మిథున్‌రెడ్డి లేఖ రాశారు. కాగా, ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం జరిగేలా చొరవ తీసుకోవాలని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ పార్టీ ఏపీ నేతలు విజ్ఞప్తి చేశారు. -
'మా చేతుల్లో ఏమీ లేదు.. '
సాక్షి, అమరావతి : ఫాతిమా కాలేజ్ విషయంలో సాంకేతికంగా ఉన్న ఇబ్బందులు అధిగమించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. సీఎంను కలిసేందుకు సోమవారం అసెంబ్లీకి వచ్చిన ఫాతిమా కాలేజ్ విద్యార్థులు అసెంబ్లీ లాబీల్లో మంత్రి కామినేనిని కలుసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన విద్యార్థులకు వివరించారు. తమ చేతుల్లో ఏమీ లేదని, అన్ని ప్రయత్నాలు చేశామని కామినేని చెప్పారు. కాలేజీ మోసంపై సీఐడీ విచారణ జరుపుతామన్నారు. ప్రభుత్వం చాలా చేసింది.. ప్రత్యేకంగా లాయర్ ను పెట్టింది అని కూడా వివరించారు. -
అందులో మా తప్పేం లేదు: కామినేని
సాక్షి, విజయవాడ : గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో కడప ఫాతిమా మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు, ఒక విద్యార్థి తండ్రి గుణదలలోని సెల్ టవర్ ఎక్కడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఆందోళన నేపథ్యంలో ఏపీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న స్టూడెంట్స్ కు గవర్నమెంట్ కళాశాలలో సీట్లు ఇవ్వడానికి అభ్యంతరం తెలిపిందన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధనను సుప్రీంకోర్టు కొట్టివేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఫాతిమా విద్యార్ధుల విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ లెటర్ రాసినట్లు తెలిపారు. ఫాతిమా కళాశాల విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాని, ప్రమేయం గాని లేదని.. కాలేజీ యాజమాన్యమే తప్పు చేసిందని మంత్రి కామినేని ఆరోపించారు. ఫాతిమా విద్యార్ధుల సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి జె.పి.నడ్డాతో, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుధాన్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు మంత్రి కామినేని శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. ఫాతిమా మెడికల్ కళాశాల సమస్యలపై ఈ నెల 29,30న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. విద్యార్ధుల అభ్యర్ధన మేరకే వారి సమస్యలపై విద్యార్ధుల ముందే ఫాతిమా కళాశాల యాజమాన్యంతో మాట్లాడాం తప్ప, అంతకు మించి యాజమాన్యంతో ఇతర విషయాలు చర్చించలేదని మంత్రి కామినేని చెబుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలపై తమకు నమ్మకం పోయిందని బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల ఉపఎన్నిక సమయంలో సీఎం చంద్రబాబు తమకు వేరే కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు విద్యార్థులు, ఒక విద్యార్థి తండ్రి తమకు న్యాయం చేయాలని కోరుతూ గుణదలలో సెల్ టవర్ ఎక్కారు. -
సెల్‌టవర్‌పై ఆరుగురు.. గుణదలలో టెన్షన్.. టెన్షన్
సాక్షి, విజయవాడ: కడప ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళన కొత్త మలుపు తిరిగింది. గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఫాతిమా మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు, ఒక విద్యార్థి తండ్రి గుణదలలోని సెల్ టవర్ ఎక్కడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇవ్బకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలపై తమకు నమ్మకం పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల ఉపఎన్నిక సమయంలో సీఎం చంద్రబాబు తమకు వేరే కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. రేపు (సోమవారం) సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామంటూ కలెక్టర్ లక్ష్మీకాంతం వారికి నచ్చజెప్పినా విద్యార్థులు వినడం లేదు. తక్షణం వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సెల్ టవర్ వద్దకు వచ్చి మీడియా సమక్షంలో తమ సమస్య పరిష్కారంపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు గంటలుగా విద్యార్థులు సెల్‌టవర్‌పై ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించక పోవడం సిగ్గుచేటని అక్కడికి చేరుకున్న వైఎస్ఆర్ సీపీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఇప్పటివరకూ నాలుగుసార్లు సీఎం చంద్రబాబును కలిసినా ప్రయోజనం లేకపోయిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే వైఎస్ జగన్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కు లేఖ రాశారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు సెల్ టవర్ ఎక్కారని తెలిపారు. విద్యార్థులకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అసలు వివాదం ఏంటంటే.. 'ఫాతిమా కాలేజీ 2015-16 బ్యాచ్ విద్యార్థుల అడ్మిషన్లను సరైన వసతులు లేని కారణంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎమ్సీఐ) రద్దు చేసింది. తొలి రెండు దశల్లో నిర్వహించిన కౌన్సెలింగులో విద్యార్థుల చేరికకు ఎమ్సీఐ అనుమతి ఇవ్వలేదు. కాలేజీ యాజమాన్యం హైకోర్టు ఉత్తర్వులతో మూడో దశ కౌన్సెలింగులో 100 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. అనంతరం ఈ విద్యార్థుల సీట్లను ఎమ్సీఐ రద్దు చేసింది. దీంతో ఆ విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగిపోయింది. తమకున్న సీట్లలోని వంద సీట్లను ఏపీ ప్రభుత్వం ఇవ్వడానికి నిరాకరించడంతో ఇతర కాలేజీల్లో చేర్చాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. -
సెల్ టవర్ ఎక్కిన ఫాతిమా విద్యార్థులు
సాక్షి, విజయవాడ: ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆందోళన కొత్త దోవ పట్టింది. గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులు గుణదల ప్రాంతంలో సెల్ టవర్ ఎక్కారు. ఐదుగురు విద్యార్థులు, ఓ విద్యార్థి తండ్రి గుణదలలోని సెల్ టవర్ ఎక్కారు. తమకు ప్రభుత్వం నుంచి న్యాయం చేస్తాననే హామీ ఇవ్వకపోతే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సెల్ టవర్ దిగేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. సెల్ టవర్ ఎక్కిన వారికి నచ్చజెప్పి కిందకు దించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులతో కలెక్టర్ లక్ష్మీకాంతం చర్చలు జరుపుతున్నారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ సీపీ నేత మేరుగ నాగార్జున, విద్యార్థి విభాగం నేత అంజిరెడ్డి, పలువురు ప్రజా సంఘాల నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
'ఫాతిమా'విద్యార్థుల సమస్యపై కేంద్ర మంత్రికి వైఎస్ జగన్ లేఖ
-
కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు వైఎస్ జగన్ లేఖ
సాక్షి, హైదరాబాద్: కడప ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్యపై జోక్యం చేసుకోవాలని, కాలేజీ యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు బుధవారం లేఖ రాశారు. 'ఫాతిమా కాలేజీ 2015-16 బ్యాచ్ విద్యార్థుల అడ్మిషన్లను సరైన వసతులు లేని కారణంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎమ్సీఐ) రద్దు చేసింది. తొలి రెండు దశల్లో నిర్వహించిన కౌన్సెలింగులో విద్యార్థుల చేరికకు ఎమ్సీఐ అనుమతి ఇవ్వలేదు. కాలేజీ యాజమాన్యం హైకోర్టు ఉత్తర్వులతో మూడో దశ కౌన్సెలింగులో 100 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. అనంతరం ఈ విద్యార్థుల సీట్లను ఎమ్సీఐ రద్దు చేసింది. దీంతో ఆ విద్యార్థుల చదువు మధ్యలోనే ఆగిపోయింది. తమకున్న సీట్లలోని వంద సీట్లను ఏపీ ప్రభుత్వం ఇవ్వడానికి నిరాకరించడంతో ఇతర కాలేజీల్లో చేర్చాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కాలేజీ యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారు. ఎన్నో ఆశలతో మెడిసిన్ పూర్తి చేయాలనుకున్న వారి కలలు కల్లలయ్యాయి. ఇతర కాలేజీల్లో ఫాతిమా విద్యార్థులకు అవకాశమివ్వండి. విద్యార్థులకు న్యాయం జరగాలంటే మీరు జోక్యం చేసుకోవాలని' వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. @JPNadda ji, urging your intervention on Fathima Medical college students' plight, to save their future. pic.twitter.com/OixkJJRacl — YS Jagan Mohan Reddy (@ysjagan) 15 November 2017 -
మానవీయకోణంలో చూడండి
'సాక్షి, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ‘‘ఫాతిమా కళాశాల విద్యార్థుల సమస్యను దయచేసి రాజకీయకోణంలో చూడవద్దు. మానవీయకోణంలో చూడండి. విద్యార్థుల గోడు అర్థం చేసుకోండి. విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించండి. వారికి కచ్చితంగా న్యాయం చేయాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం విజయవాడ అలంకార్ సెంటర్లో ఫాతిమా కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల దీక్షకు మద్దతు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. మూడేళ్లుగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం మాయమాటలతో తమను మోసం చేసిందని వాపోయారు. వారిని అవినాశ్‌రెడ్డి ఓదార్చారు. ధైర్యం కోల్పోవద్దని, వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సరైన రీతిలో కౌంటర్ దాఖలు చేస్తే సమస్య వచ్చి ఉండేది కాదన్నారు. వచ్చే ఏడాది తాము వంద సీట్లు వదులుకుంటామని కౌంటర్ దాఖలు చేసి ఉంటే నష్టపోయిన ఫాతిమా కళాశాల విద్యార్థులకు న్యాయం జరిగేదన్నారు. సీఎం ఎంసీఐ అధికారులతో స్వయంగా మాట్లాడితే గంటలో సమస్య పరిష్కారమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీక్షా శిబిరంలో పార్టీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బి.భవకుమార్, పార్టీ నేత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
రివిజన్ పిటిషన్ పేరుతో మరో మోసం
సాక్షి, అమరావతి : వంద మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి తమ నిర్లక్ష్యాన్ని చాటుకున్న సర్కారు మరోసారి కోర్టుకు వెళుతున్నామంటూ వారిని మభ్యపెడుతోందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో సర్కారు కొత్త డ్రామాకు తెరతీసింది. 2015లో ఫాతిమా వైద్య కళాశాలలో చేరిన విద్యార్థుల సీట్లు రద్దు కాగా.. అప్పట్నుంచీ చలించని సర్కారు ఇక అవకాశమే లేనప్పుడు ముందుకొచ్చి వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ వేస్తున్నామని ప్రకటించింది. ఇది కేవలం కంటితుడుపు చర్యేనని సచివాలయంలోని కొందరు అధికారులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రివిజన్ పిటిషన్ వేస్తే సుప్రీం ధర్మాసనం తీసుకోదని సుప్రీంకోర్టుకు చెందిన కొంతమంది న్యాయవాదులు ఇప్పటికే సూచించారన్నారు. ఫాతిమా విద్యార్థుల ఆందోళనలను తాత్కాలికంగా నిలిపి వేయించడానికే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని చెబుతున్నారు. ఒకసారి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక ఇలాంటి కేసులో రివిజన్ పిటిషన్లు, స్పెషల్ లీవ్ పిటిషన్లను స్వీకరించదని న్యాయవాదులు స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. అన్ని దారులూ మూసుకుపోయాక ప్రభుత్వం స్పందించిందని అధికారులు విశ్లేషించారు. 2008లో ఇలాగే జరిగినప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం స్పందించి వారం రోజుల్లోనే వంద మంది విద్యార్థులను వివిధ ప్రభుత్వ కళాశాలల్లో చదివించిందని, కానీ ఇక్కడ అలాంటి చర్యలు చేపట్టలేకపోయారని అధికార వర్గాలు చెప్పాయి. ఏమాత్రం వీలున్నా న్యాయం జరిగేలా చూస్తా.. కాగా ఒక్క శాతం అవకాశమున్నా న్యాయం జరిగేలా చూస్తామని ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు సీఎం చంద్రబాబు హామీఇచ్చారు. న్యాయంకోసం ఆందోళన చేస్తున్న ఫాతిమా వైద్య విద్యార్థులను బుధవారం వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సీఎం వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించేందుకు తొమ్మిది మందితో కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. -
మాకు ఆత్మహత్యలే శరణ్యం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఫాతిమా కళాశాల యాజమాన్యం విద్యార్థులను మోసగించిందని, ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం మాయమాటలు నమ్మి మోసపోయామంటూ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్‌లో మంగళవారం వారు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు వైఎస్సార్సీపీతోపాటు కాంగ్రెస్, సీపీఐ, విద్యార్థి సంఘాలు వైఎస్సార్ ఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్ మద్దతు ప్రకటించాయి. విద్యార్థులు మాట్లాడుతూ నంద్యాల ఉపఎన్నిక సమయంలో సీఎం చంద్రబాబు తమకు వేరే కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్ ఫాతిమా కాలేజీ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కోర్టులో తప్పుడు అఫిడవిట్ సమర్పించినందునే తాము రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్.అర్షాద్, అజ్మతుల్లా, రహీంబాషా మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం తమ వద్ద రూ.లక్షల రూపాయలు వసూలు చేసి, అనుమతుల్లేకుండా అడ్మిషన్లు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఎంసీఐతో సంప్రదింపులు జరిపి పిల్లల భవిష్యత్‌ను కాపాడాలని కోరారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని వారిని శిక్షించాలని కోరారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో ఫాతిమా మెడికల్ కాలేజి విద్యార్థుల నిరసన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్తాం.. దీక్షలో వైఎస్సార్సీపీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు మాట్లాడుతూ నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కామినేని శ్రీనివాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. విద్యార్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ మంత్రి కామినేని వారానికో ప్రకటన చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చొరవచూపాలన్నారు. నిరసన దీక్షలో కళాశాల విద్యార్థులు, కాంగ్రెస్ నేత ఆకుల శ్రీనివాస్, సీపీఐ నేత దోనేపూడి శంకర్, కొలనుకొండ శివాజీ, విద్యార్థి సంఘం నాయకులు రవిచంద్ర, విశ్వనాథ్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్య సీట్లలో జాతీయ పూల్‌కు వెళ్తున్నాం: కామినేని సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ వైద్య సీట్ల విషయంలో జాతీయ పూల్‌లోకి వెళ్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో 27,710 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, వీటిలో 15 శాతం సీట్ల చొప్పున మనమిచ్చే సీట్లతో కలిపి 4,442 సీట్లలో పోటీపడవచ్చునన్నారు. మన రాష్ట్రం నుంచి కేవలం 285 సీట్లు మాత్రమే జాతీయ పూల్‌లోకి వెళ్తాయన్నారు. పీజీ సీట్ల విషయంలో మన రాష్ట్రం 415 సీట్లు ఇస్తే మన విద్యార్థులు దేశ వ్యాప్తంగా 6,665 సీట్లలో పోటీ పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫాతిమా కాలేజీ విద్యార్థుల విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పడం సరైంది కాదని, ప్రభుత్వ పరంగా వారికి చేయాల్సిందంతా చేశామని చెప్పారు. వచ్చే ఏడాది ఫాతిమా కాలేజీలో మొత్తం సీట్లను రద్దు చేసి, 2015–16 బ్యాచ్‌లో మోసపోయిన విద్యార్థులను చేర్చుకునే ప్రతిపాదన చేసినప్పటికీ భారతీయ వైద్యమండలి అంగీకరించలేదన్నారు. -
రోడ్డెక్కిన ఫాతిమా కాలేజీ విద్యార్ధులు
-
ఆ 99 మంది విద్యార్థుల భవిష్యత్ ఏంటి ?
-
న్యాయం జరిగే వరకూ విజయవాడ విడిచి వెళ్లం
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): మా పిల్లలకు న్యాయం జరిగే వరకూ విజయవాడ నగరం విడిచి వెళ్లేది లేదని ఫాతిమా కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమగోడు చెప్పుకొందామని వస్తే ఆయన ఆపాయింట్మెంట్ లభించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఇర్షాద్, ఆర్ అబ్దుల్లా మాట్లాడారు. మా పిల్లలకు న్యాయం చేస్తామని నంద్యాల ఎన్నికల సభలో చంద్రబాబు హామీ ఇచ్చారని, ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల 2015–16 బ్యాచ్‌కు చెందిన 99 మంది విద్యార్థులకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రవేశం కల్పిస్తామని చంద్రబాబే స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కూడా తమ పిల్లల భవిష్యత్తుపై హామీ ఇచ్చారని.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం స్పందించడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. సమస్య పరిష్కరించే వరకూ తాము నగరంలోనే ఉంటామని స్పష్టం చేశారు.. అవసరమైతే ధర్నాకు దిగుతామని చెప్పారు. -
‘ఫాతిమా’ కేసులో ఎంసీఐ, ఏపీకి నోటీసులు
-
‘ఫాతిమా’ కేసులో ఎంసీఐ, ఏపీకి నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: కడప ఫాతిమా మెడికల్ కళాశాల కేసు విచారణ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఫాతిమా కాలేజీ విద్యార్థులను ఇతర కళాశాల్లోకి సర్దుబాటు చేసే పరిస్థితి ఉందా అని న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రశ్నించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాది సమాధానం ఇస్తూ 13 ప్రభుత్వ, ప్రయివేట్ కాలేజీల్లో విద్యార్థులను సర్ధుబాటు చేస్తామని తెలిపారు. తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది. మరోవైపు సుప్రీంకోర్టు నోటీసులపై ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులను ఏవిధంగా రీ లోకేట్ చేసేది... వారం రోజుల్లో న్యాయస్థానానికి తెలుపుతామన్నారు. విద్యార్థులకు నష్టం లేకుండా చూస్తామని, అలాగే ఫాతిమా కాలేజీపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని తెలిపారు. కాగా కనీస వసతులు లేని కారణంగా ఫాతిమా ప్రైవేటు వైద్య కళాశాలకు అనుమతి ఇవ్వలేమని, 2014-15 బ్యాచ్‌కు చెందిన విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తున్నట్లు భారత వైద్య మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. కళాశాల యాజమాన్యం తప్పిదానికి తమ భవిష్యత్తును ఫణంగా పెట్టడం బాధాకరమని, తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
కడప మెడికల్ కాలేజిలో భారీ స్కాం
-
కడప మెడికల్ కాలేజిలో భారీ స్కాం
అసలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి కూడా లేకుండానే అడ్మిషన్లు ఇచ్చేసి.. వైఎస్ఆర్ జిల్లా కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజి భారీ స్కాంకు పాల్పడింది. ఇలా వందమంది విద్యార్థులకు అనుమతి లేకుండా అడ్మిషన్లు ఇవ్వడంతో.. వాళ్లంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. వారు పరీక్షలు రాసేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనుమతి ఇవ్వలేదు. ఒక్కో విద్యార్థి వద్ద రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఫాతిమా మెడికల్ కాలేజి వసూలు చేసినట్లు బాధిత విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై విజయవాడలోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ గోడు చెప్పుకొందామని విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు కూడా వచ్చినా.. అక్కడ ఆయన అపాయింట్మెంట్ మాత్రం దొరకడంలేదు. దీంతో మూడు రోజులుగా ఆ విద్యార్థులంతా విజయవాడలోనే పడిగాపులు కాస్తున్నారు. తమ భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.