కడప మెడికల్ కాలేజిలో భారీ స్కాం
కడప మెడికల్ కాలేజిలో భారీ స్కాం
Published Thu, Dec 22 2016 12:14 PM | Last Updated on Tue, Oct 9 2018 6:57 PM
అసలు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి కూడా లేకుండానే అడ్మిషన్లు ఇచ్చేసి.. వైఎస్ఆర్ జిల్లా కడపలోని ఫాతిమా మెడికల్ కాలేజి భారీ స్కాంకు పాల్పడింది. ఇలా వందమంది విద్యార్థులకు అనుమతి లేకుండా అడ్మిషన్లు ఇవ్వడంతో.. వాళ్లంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. వారు పరీక్షలు రాసేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనుమతి ఇవ్వలేదు. ఒక్కో విద్యార్థి వద్ద రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఫాతిమా మెడికల్ కాలేజి వసూలు చేసినట్లు బాధిత విద్యార్థులు చెబుతున్నారు.
దీనిపై విజయవాడలోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ గోడు చెప్పుకొందామని విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు కూడా వచ్చినా.. అక్కడ ఆయన అపాయింట్‌మెంట్ మాత్రం దొరకడంలేదు. దీంతో మూడు రోజులుగా ఆ విద్యార్థులంతా విజయవాడలోనే పడిగాపులు కాస్తున్నారు. తమ భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement