7లోగా వివరాలివ్వండి | MIC directions to medical colleges | Sakshi
Sakshi News home page

7లోగా వివరాలివ్వండి

Published Mon, Oct 5 2015 12:53 AM | Last Updated on Tue, Oct 9 2018 6:57 PM

7లోగా వివరాలివ్వండి - Sakshi

7లోగా వివరాలివ్వండి

వైద్య కళాశాలలకు ఎంసీఐ ఆదేశాలు
 సాక్షి, హైదరాబాద్: ఈ నెల 7లోగా ఎంబీబీఎస్ అడ్మిషన్ల వివరాలు, అభ్యర్థుల పేర్లు ఇవ్వాలని భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) అన్ని రాష్ట్రాల మెడికల్ కాలేజీలనూ ఆదేశించింది. ఏవైనా సవరణలుంటే ఈ లోగానే చేసుకోవాలని అక్టోబర్ 7 తర్వాత ఇలాంటి సవరణలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. అలాగే అక్టోబర్ 15లోగా ప్రింట్ కాపీలు కూడా పంపించాలని కోరింది. సూపర్ స్పెషాలిటీ సీట్లకు సంబంధించిన అడ్మిషన్ల వివరాలు ఈ నెల 5లోగానే పంపించాలని ఎంసీఐ అన్ని కళాశాలలనూ కోరింది.

 ఆ రెండు కళాశాలలు అనుమతి తెచ్చుకోవాలి..
 భారతీయ వైద్యమండలి నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30తో అడ్మిషన్లకు గడువు ముగిసింది. ఆ తర్వాత ఫాతిమా, మల్లారెడ్డి కాలేజీలు అడ్మిషన్లకు ఢిల్లీ హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నాయి. కానీ వాళ్లు సుప్రీంకోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుందని, ఈ అనుమతిని బట్టే అడ్మిషన్లు జరిపే అవకాశం ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ డా.రవిరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement