ఏపీలో ఎంబీబీఎస్ చదివిన ఇతర రాష్ట్రాల వాళ్లంతా మన రాష్ట్రంలో స్థానికులేనట
వర్సిటీ అనాలోచిత నిబంధనతో రాష్ట్ర విద్యార్థులకు తీరని నష్టం
మెడికోలు, తల్లిదండ్రుల ఆందోళన
ఇంకా మెరిట్ లిస్ట్ ఇవ్వనందున ఈ నిబంధనను మార్చాలని డిమాండ్
సాక్షి, అమరావతి: తమ పీజీ వైద్య విద్య అవకాశాలకు రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతోందని ఎంబీబీఎస్ పూర్తయిన విద్యార్థులు మండిపడుతున్నారు. ఏపీలోని మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ చదివిన వారంతా రాష్ట్రంలో స్థానికులుగా గుర్తించి పీజీ మెడికల్ అడ్మిషన్లు చేపడుతుండటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎంబీబీఎస్ చదివిన ఉత్తరాది సహా పక్కనున్న తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళకు చెందిన మెడికోలకు స్థానికత కల్పించడం ఏంటని, ఒకటి నుంచి ఎంబీబీఎస్ వరకు మన రాష్ట్రంలో చదివిన మెడికోలు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే అడ్మిషన్‌ల ప్రక్రియ మొదలైందని, నిబంధనలు సవరించ డం కుదరదని ప్రభుత్వం చేతులు ఎత్తేయడం పట్ల మండి పడుతున్నారు. జీవో 646ను అనుసరించి ఇలా చేయాల్సి వస్తోందని ఎన్‌టీఆర్ వర్సిటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నెలతో రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. ఈ మేరకు విభజన చట్టం ప్రకారం సిద్ధార్థ వైద్య కళా శాలలో తెలంగాణాకు ఎంబీబీఎస్, పీజీ సీట్ల కేటాయింపును రద్దు చేశారు. అయినప్పటికీ పీజీ తెలంగాణ వారికి పీజీ సీట్లు కేటాయించడం ఏ లెక్కన సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
646 జీవోకు ఎందుకు సవరణ చేయలేదని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఇంకా మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఈ జీవోకు సవరణ చేయా ల్సిందేనని మెడికోలు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తు న్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకో వాలని కోరుతున్నారు. కాగా, ఈ ఏడాది కొత్త కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా.. వద్దంటూ లేఖ రాసి గండికొట్టిన ప్రభుత్వం.. తాజాగా పీజీ విద్య విషయంలోనూ క్షమార్షం కాని తప్పిదం చేసిందంటున్నారు.
మెడికోల వాదన ఇలా..
రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివిన ఏ రాష్ట్రానికి చెందిన వారినైనా పీజీ మెడికల్ ప్రవేశాల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయం స్థానికులుగా పరిగణిస్తోంది. రాష్ట్ర కోటా సీట్లలో వారికి రిజర్వేషన్ కల్పిస్తోంది. ఉదాహరణకు రాష్ట్రంలో 460కి పైగా ఆల్ ఇండియా, 600 మేర సీ కేటగిరి, బీ కేటగిరిలోనే బీ1 కింద 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ సీట్లలో పెద్ద ఎత్తున అడ్మి షన్‌లు పొంది ఎంబీబీఎస్ చదువుతుంటారు.
అలాగే కన్వీనర్ కోటా కింద గత ఏడాది వరకు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో తెలంగాణ విద్యార్థులు 40 శాతం మంది ఎంబీబీఎస్ చదివారు. ఇలా ఇక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఇతర రాష్ట్రాల వారందరికీ స్థానికత కల్పించడంతో వందల సంఖ్యలో పీజీ సీట్లు రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారు. మరోవైపు పక్కనున్న తెలంగాణా రాష్ట్రం పీజీ అడ్మిషన్‌ల నిబంధనలను సవరించింది.
మన వాళ్లు ఎక్కడ చదివినా స్థానికత కల్పించాలి
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర ఎంబీబీఎస్ చది విన వారికి స్థానికత కల్పించే విధానాన్ని రద్దు చేయాలి. ఏపీ విద్యార్థులు ఆల్ ఇండియా కోటా కింద ఏ రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినా పీజీలో మన దగ్గరే స్థానికత కల్పించాలి.
మన విద్యార్థులకు పక్క రాష్ట్రాలు స్థానికత ఇవ్వ నప్పుడు, ఇతర రాష్ట్రాల వారికి మనం స్థానికత ఇవ్వడం సరికాదు. ఆ మేరకు నిబంధనలు సవరించాలి. లేదంటే మన విద్యార్థులకే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ప్రెసిడెంట్, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment