
సాక్షి, హైదరాబాద్: ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులు మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. మా జీవితాలతో ఆడుకోవద్దని, మేము లాంగ్‌టర్మ్ కోచింగ్‌కి వెళ్లమని చెప్పారు. నష్టపోయిన విద్యార్థుల్లో తెలంగాణ వారు కూడా ఉన్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జోక్యం చేసుకోవాలని ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థులు కోరారు.
ఎవరో చేసిన తప్పుకు మమ్మల్ని శిక్షించడం చాలా బాధాకరమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కనీస వసతులు లేని కారణంగా ఫాతిమా ప్రైవేటు వైద్య కళాశాలకు అనుమతి ఇవ్వలేమని, 2014-15 బ్యాచ్‌కు చెందిన విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తున్నట్లు భారత వైద్య మండలి ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment