
సాక్షి, వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కడప ఫాతిమా కాలేజీ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. 2015లో ఇబ్బందులు పడిన 46 మంది ఫాతిమా కాలేజీ మెడికల్ విద్యార్థులకు ఫీజుల కింద రూ.9.12 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
విద్యార్థుల సమస్యలను డిప్యూటీ సీఎం అంజాద్ భాష.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించారు. దీంతో కాలేజీ ఆవరణలో విద్యార్థులు కేక్ కట్ చేసి, థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment