‘వైఎస్సార్ చనిపోయాక ఆయనపై కుట్రలు చేసింది ఎవరు?, మహానేత వైఎస్సార్ పేరు ఛార్జ్‌షీట్‌లో పెట్టింది ఎవరు?, వైఎస్సార్ కుటుంబాన్ని అణగదొక్కాలని కుట్రలు పన్నింది ఎవరు?, వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన వీరా వైఎస్సార్ వారసులు.., కాంగ్రెస్‌కు వైఎస్సార్ అభిమానులు ఏనాడో సమాధి కట్టారు..’ అంటూ వైఎస్సార్ కడప జిల్లా ఎన్నికల ప్రచార సభ వేదికగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్సార్ పేరును సమాధి చేయాలని కాంగ్రెస్ చూస్తోందని, రాజకీయ స్వలాభం కోసం, ఇన్నేళ్ల తర్వాత ఎన్నికల సమయంలో నాన్న సమాధి దగ్గరకు వెళ్తారంట అంటూ ధ్వజమెత్తారు. వైఎస్సార్ మరణం తర్వాత తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని, తనను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారని పేర్కొన్నారు.
నోటా ఓట్లు కూడా రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. మన కళ్లను మనం పొడుచుకున్నట్లేనని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. టీడీపీని గెలిపించడమేనని పేర్కొన్నారు. వైఎస్సార్ వారసులని వస్తున్న వారి కుట్రలను చూస్తున్నామన్న వైఎస్ జగన్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మనిషేనని తెలిపారు. పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో బాబు కాపురం చేస్తాడని మండిపడ్డారు. చంద్రబాబు కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందని దుయ్యబట్టారు.
సీఎం జగన్ పూర్తి ప్రసంగం
వచ్చే ఎన్నికలు అయిదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేవి.
మరో మూడు రోజుల్లో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా?
ఈ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరగుతున్న ఎన్నికలు కావు.. రాబోయే అయిదేళ్ల ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి.
ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటికి అభివృద్ధి, పేదవాడి భవిష్యతుకు భరోసా.
చంద్రబాబు ఓటేస్తే పథకాలన్నింటికి ముగింపు, మళ్లీ మోసపోవడమే.
చంద్రబాబుకు ఓటేయడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే
59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తాడు.
మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం
99 శాతం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చాం
రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకొచ్చాం
వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు.
అక్కాచెల్లెమ్మలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు.
2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం.
అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ.2లక్షల 70 వేల కోట్లు అందించాం.
నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం
3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు
ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన
బడులు తెరిచే నాటికే విద్యాకానుక, గోరుముద్ద
అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మార్పులు
విద్యారంగంలో మేం చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా?
అక్కాచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం
అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ,చేయూత.
అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం
అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం
అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?
అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్
ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలు
సకాలంలో ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నాం
విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం
గతంలో రైతన్నకు ఇంత మంచి జరిగిందా?
పెట్టుబడి సాయంతో రైతన్నకు తోడుగా ఉన్నాం
రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం
గ్రామస్థాయిలోనే రైతులను చేయి పట్టుకొని నడిపించే ఆర్‌బీకే వ్యవస్థ
స్వయం ఉపాధికి అండగా వాహనమిత్ర, నేతన్న నేస్తం,మత్స్యకార భరోసా
న్యాయవాదులకు లా నేస్తంజగనన్న తోడు, చేదోడుతో చిరువ్యాపారులకు అండగానిలిచాం
గతంలో ఈ పథకాలు ఉన్నాయా?
నాడు-నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మార్చాం
ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షల వరకు పెంచాం
పేషెంట్ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం
ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్
విలేజ్ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాం
గతంలో ఇంత అభివృద్ధి జరిగిందా
పేదవాడి ఆరోగ్యం కోసం ఇంతగా పరితపించిన ప్రభుత్వం ఉందా?
14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశాడు?
చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?
6 వందల సేవలు అందిస్తున్న గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ
అవ్వాతాతలకు ఇంటింటికీ అందుతున్న పెన్షన్, ఇంటి వద్దకే రేషన్,
చంద్రబాబుది ఊసరవెళ్లి రాజకీయం
చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారు.
మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నాడు.
ఆరునూరైనా ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే.
NRC, CAA అంశాల్లోనూ మైనార్టీలకు అండగా ఉంటాం
మోదీ సభలో చంద్రబాబు ఇలా చెప్పగలడా?
మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పిన బాబు.. ఇంకా ఎందుకు ఎన్డీయేలో కొనసాగుతున్నారు?
ముస్లింలకు మతప్రాతిపదికన 4శాతం రిజర్లేషన్లు ఇవ్వలేదు.
వెనుకబాటుతనం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు
మైనార్టీల మనోభావాలకు అండగా మీ బిడ్డ తోడుగా ఉంటాడు.
రాజకీయం కోసం వారి జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమేనా?
మైనార్టీ సోదరి శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా కూడా ఉంది.
175 స్థానాల్లో మైనార్టీలకు ఏడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చాం.
నలుగురికి ఎమ్మెల్యేలు,నలుగురు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాం.
కడప రాజకీయాల్లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు
కడప జిల్లాలో ఉన్న రాజకీయ చైతన్యం ఏపీలో అతికొద్ది జిల్లాల్లోనే ఉంటుంది
వైఎస్సార్ చనిపోయిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టింది.
అదే సమయంలో నేనుు ఎంపీగా నిలబడినప్పుడు నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు.
నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన ద్రోహులతో ప్రజలు జతకట్టాలా?
రాజకీయంగా వైఎస్సార్ కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలోని అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించిన వారితో కలిసిపోయి అదే కాంగ్రెస్, అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్సార్ అనే పేరే కనపడకుండా చేయాలనే కుట్ర జరుగుతోంది.
వైఎస్ అవినాష్ రెడ్డి నాకన్న 13 ఏళ్లు చిన్నవాడు .
ఈయన భవిష్యత్తును నాశనం చేయడానికి ఈనాడు, చంద్రబాబు, ఆంధ్రజ్యోతి నుంచి కుట్రలు వేస్తున్నారు. వీళ్లంతా మనుషులేనా?
అవినాష్ ఎలాంటి వాడో నాకు, మీ అందరికి తెలుసు.
గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా
2014లో ఆయన చేసిన మోసాలు గుర్తున్నాయా?
రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా?
ఆడబిడ్డ పుడితే రనూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?
ఇంటింటికీ జాబు.. లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?
పేదలకు 3 సెంట్ల స్థలం అన్నాడు. సెంటు స్థలమైనా ఇచ్చాడా?
సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?
ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?
మళ్లీ ఇప్పుడు కొత్త కొత్త మోసాలతో వస్తున్నారు..నమ్ముతారా?
చంద్రబాబు సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నాడు, నమ్ముతారా?
ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. నమ్ముతారా?
బాబు జీవితమంతా అబద్దాలు, మోసాలు, కుట్రలు.
చంద్రబాబు చేసింది.. దోచుకోవడం, దాచుకోవడం.
చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బులు దండిగా ఉన్నాయి.
చంద్రబాబు డబ్బులు ఇస్తే వద్దనకండి.. తీసుకోండి.
ఓటేసే ముందు మీకు ఎవరి వల్ల మంచి జరిగిందోదో ఆలోచన చేయండి.
వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‌పై నొక్కాలి.
పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి.
175కు 175 అసెంబ్లీ, 25కు, 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment