సాక్షి, కడప: వివేకా కుమార్తె సునీతను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట అదికార ప్రతినిధి రమేష్ రెడ్డి మండిపడ్డారు. క్రిమినల్ బ్రెయిన్ తో ప్రవర్తించే వ్యక్తి చంద్రబాబని నిప్పులు చెరిగారు. కుంటుంబాల్లో చిచ్చు పెట్టడమే చంద్రబాబు పని అని విమర్శించారు. ఎల్లో మీడియాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి సాయంతో బురద జల్లిస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రతిపక్షాలు వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నాయని రమేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి ఎంపీగా గెలవాలని వివేకానందరెడ్డి కూడా ప్రచారం చేశారన్నారు. అయితే వివేకా కేసును బాబు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎవరిపై కక్ష సాధించేందుకు షర్మిల ఏపీ వచ్చారని ప్రశ్నించారు. షర్మిల, సునీత అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు.
అవసరం తీరాకా తిట్టడం
‘చంద్రబాబుది నీచ రాజకీయం. వ్యవస్దలను ధ్వంసంచేసి అనుకూలంగా వాడుకునే వ్యక్తి. లక్ష్మీపార్వతిని ఉపయోగించి ఎన్టీఆర్‌ను వెన్నుపొటు పొడవటమే కాకుండా అయన మరణానికి కారకుడై పార్టీని అక్రమించి కుటుంబ పార్టీగా మలచుకున్నాడు. ప్రతిసారి కూటమి ఏర్ఫాటు చెయ్యడం, అవసరం తీరాకా అదే పార్టీలను తిట్టడం అలవాటు. అందుకే నేడు షర్మిల పీసీసీ అద్యక్షురాలైంది.
కేసును పక్కదారి పట్టిస్తున్నాడు
చంద్రబాబు సృష్టించిన వ్యవస్దల ద్వారా కేసును పక్కదారి పట్టిస్తున్నాడు. కేసు కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వివేకం సినిమాను ఎంతో నీచంగా చిత్రీకరించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని చిన్నప్పటి నుంచి షర్మిల, సునీతలు చూశారు. ఎనాడైనా నేరప్రవర్తన కనపడిందా? స్దానికంగా ఫ్యాక్షన్‌తో సంబంధం ఏమైనా ఉందా? కేవలం వైఎస్ జగన్‌ను ఎదుర్కొనేందుకే షర్మిల, సునీతను పావులుగా వాడుకుంటున్నారు. షర్మిల, సునీత రాజకీయ పోరాటం కోసం వచ్చారా? న్యాయపోరాటం చేసేటప్పుడు రాజకీయ పోరాటం అపాలి. ? లేదంటే తప్పుడు సంకేతాలు పోతాయి’ అని అన్నారు.
వివేకా హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్ధాలే
వివేకా హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్దాలేనని, దస్తగిరి వాంగ్మూలాన్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి. సీబీఐ వద్ద దస్తగిరి స్టేట్ మెంట్ తప్ప ఏ ఒక్క ఆధారం లేదన్నారు. సునీత దస్తగిరిని అడ్డంపెట్టుకుని ఓ బూటకం ఆడుతుందని మండిపడ్డారు. ఇంటి తలుపులు బద్దలైతే అన్నీ బాగున్నాయని సీబీఐకి చెప్పిందని గుర్తు చేశారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టారనేది విడిచిపెట్టి ఇంట్లో వాళ్లే చంపారని సునీత ప్రస్తావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంపినప్పుడు లెటర్ రాశాడన్నారు, చేతి వేళ్లు నరికితే రక్తపు మరకలు ఉండవా.. అసలు ఎలా రాయగలడు? - దస్తగిరి, రంగన్న చెప్పిన సమాచారం పూర్తి విరుద్ధంగా ఉంది. రెండో భార్య సమీమ్‌కు ఆస్తి గొడవలున్నాయి. ఆస్తి పత్రాలు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంది? దీన్ని కూడా సీబీఐ పట్టుకోలేకపోయింది’ అని చైతన్యరెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment