chaitanya reddy
-
అందరినీ మెప్పించేలా 'డార్లింగ్'.. ఆసక్తిగా ట్రైలర్
ప్రియదర్శి, నభా నటేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. హనుమాన్ సినిమా తర్వాత ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై డార్లింగ్ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య విడుదల చేస్తున్నారు.ప్రియదర్శి, నభా నటేష్ జంటగా అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రేమ కథతో 'డార్లింగ్' చిత్రాన్ని తెరకెక్కించినట్లు శ్రీమతి చైతన్య తెలిపారు. విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్ ఉన్న యువ జంట కథతో వస్తున్నందున ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని భావించారు.పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్ కోసం పారిస్‌కు వెళ్లాలని ఏకైక లక్ష్యంతో హీరో ఉంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యకు స్ల్పిట్ పర్సనాలిటీ అనే జబ్బు ఉందని తేలుతుంది. దీంతో ఆమె ఆపరిచితుడులోని విక్రమ్ మాదిరి పలు రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దీని గురించి అసలు విషయం తెలియక ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారనేదే డార్లింగ్ చిత్రంలో చూపించనున్నారు. నభా నటేశ్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుంది. జులై 19న ఈ చిత్రం విడుదల కానుంది. -
హను–మాన్ మాకు ఓ వరం: నిర్మాత చైతన్య
‘‘మా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థలో నిర్మించే సినిమాలకు కథే హీరో. ‘డార్లింగ్’ సినిమాకూ అంతే. ఈ చిత్రంలో ప్రియదర్శి, నభా నటేశ్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పక కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత చైతన్య. ప్రియదర్శి, నభా నటేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది.ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చెతన్య మాట్లాడుతూ– ‘‘డార్లింగ్ కథను నిరంజన్రెడ్డిగారే ఓకే చేశారు. మాది ప్రేమ వివాహం. దర్శకుడు రామ్ అశ్విన్‌ది కూడా ప్రేమ వివాహం. సో.. ప్రేమ నేపథ్యంలో రామ్ చెప్పిన ‘డార్లింగ్’ సినిమా పాయింట్‌కు నిరంజన్ కనెక్ట్ అయ్యారు. సింపుల్‌గా ఉండే అబ్బాయి పాత్రలో ప్రియదర్శి, కొంచెం హైపర్ యాక్టివ్‌గా ఉంటూ స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి పాత్రలో నభా కనిపిస్తారు.ఇక ‘హను–మాన్’ సినిమా మాకు ఓ వరంలా లభించింది. సంక్రాంతి సమయంలో విడుదల కావడం, అంత పెద్ద హిట్ కావడం అనేది ఆ హనుమంతుడి దయ వల్లే జరిగిందని భావిస్తున్నాం. ‘హను–మాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ ప్రీప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నావరకైతే ‘జై హనుమాన్’లో చిరంజీవి, రామ్‌చరణ్‌గార్లు అయితే బాగుంటుందని అనుకుంటున్నా. సాయితేజ్‌గారితో ఓ సినిమా ప్రకటించాం. ఇంకో పది సినిమాలుప్రోడక్షన్లో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో మా బేనర్ నుంచి పది సినిమాలు రిలీజ్ అవుతాయి’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘రెండు మాస్టర్స్ డిగ్రీలు చేశాను. టెక్నికల్ సపోర్ట్ ఉంది. సో.. బిజినెస్‌ను నేను బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఇందుకు మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది’’ అన్నారు. -
నిర్మాత చైతన్య రెడ్డి (ఫోటోలు)
-
‘వివేకా’ కేసు.. బాబు ప్రయోజనాల కోసమే..
కడప కార్పొరేషన్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగపడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కడపలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో రీజనల్ కో–ఆర్డినేటర్ కె. సురేష్‌బాబు, డా. చైతన్యరెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యం నీచ రాజకీయాలు చేయడమే చంద్రబాబు సంస్కృతి అని, అన్ని వ్యవస్థలను ధ్వంసంచేసి తనకు అనుకూలంగా మలుచుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. లక్ష్మీపార్వతిని సాకుగా చూపి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడమేగాక, ఆయన మరణానికి కూడా బాబు కారణమయ్యారన్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఒక కొత్త కూటమి ఏర్పాటుచేయడం బాబుకు అలవాటుగా మారిందన్నారు. 2014లో నరేంద్ర మోదీ, పవన్‌కళ్యాణ్‌తో.. 2019లో లోపాయికారిగా జనసేనతో, ఇప్పుడు బీజేపీ, జనసేనతో పాటు కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన అందరి కుటుంబాల్లో చిచ్చుపెడతారన్నారు. ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ కేసును పక్కదారి పట్టిస్తున్నారని రమేష్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రెండు చానెళ్లు, రెండు పత్రికలైతే అదేపనిగా సీఎం జగన్, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలపై బురదజల్లుతూ తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. వైఎస్ వివేకా కేసు కోసం రూ.వందల కోట్లు ఖర్చుచేశారని, కోట్ల రూపాయలు వెచ్చించి లూథ్రా అనే ఖరీదైన న్యాయవాదిని నియమించుకున్నారన్నారు. ఇక ‘వివేకం’ అనే సినిమాలో క్యారెక్టర్లను చాలా నీచంగా చూపించడం దారుణమన్నారు. అవినాశ్ ఎలాంటివారో షర్మిల, సునీతలకు తెలీదా? ఇక అవినాశ్ ఎలాంటి వారో షర్మిల, సునీత ఇద్దరూ చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు కదా, వారికి తెలీదా.. ఎప్పుడైనా ఆయనలో నేరప్రవృత్తి గమనించారా.. దౌర్జన్యాలు, రాజకీయ హత్యలు, ఫ్యాక్షన్ గొడవలతో ఆయనకు సంబంధం ఉందేమో గుండెలపై చేయివేసుకుని చెప్పాలన్నారు. నిష్కళంకమైన జీవితం గడుపుతున్న అవినాష్‌రెడ్డిపై దుష్ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. వైఎస్ జగన్ ప్రజాసేవ చేయాలని ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చారని.. ఏ రకమైన ఫ్యాక్షన్‌ను, గొడవలను ఆయన ప్రేరేపించలేదన్నారు. చంద్రబాబుది క్రిమినల్ బ్రెయిన్ అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిని ఓడించేందుకు రూ.కోట్లు ఖర్చుచేసి చార్టెర్డ్ ఫ్లయిట్లు పెట్టి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కొనుగోలు చేశారని రమేష్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో సుమారు 40 సీట్లను రూ.వందల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. కడప జిల్లాలో కూడా చాలామంది డబ్బులిచ్చి టికెట్లు కొన్నారన్నారు. మరోవైపు.. షర్మిల, సునీత న్యాయపోరాటం చేస్తున్నారో, రాజకీయ పోరాటం చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. రాజకీయ పోరాటమైతే కోర్టు తీర్పు వచ్చేవరకూ దయచేసి నోరు విప్పవద్దని ఆయన సూచించారు. ఇక చంద్రబాబు చెబుతున్న ‘సూపర్ సిక్స్’ ఒక ఫ్లాప్సిక్స్ అని రమేష్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీకి ఓటేస్తే కాంగ్రెస్, బీజేపీలకు వేసినట్లేనని తెలిపారు. సునీతవి అర్థంలేని ఆరోపణలు డా. చైతన్యరెడ్డి మాట్లాడుతూ.. డాక్టరేట్ పొందిన సునీత అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్య జరిగిన రోజు రాత్రి ఏ–1 ఎర్ర గంగిరెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి వాట్సాప్ కాల్స్ చేసుకున్నారని చెప్పడం అబద్ధమన్నారు. సీబీఐ చార్జిషీట్లో వాట్సాప్ చాట్‌లో ఉన్నారని చెప్పిందే తప్పా వాట్సాప్ కాల్స్ అని ఎక్కడా చెప్పలేదన్నారు. ఎన్నికల సమయం కాబట్టి వాట్సాప్‌కు మెసేజ్‌లు వస్తూ ఉంటాయని, ఫోన్ ఆన్‌చేసి ఉంచితే ఎవరి వాట్సాప్ అయినా యాక్టివ్‌లో ఉన్నట్లేనని చెప్పారు. ఇక గూగుల్ టేకౌట్‌కు శాస్త్రీయతలేదని, దాన్ని గూగుల్ కంపెనీ దానిని సర్టిఫై చేయలేదని, న్యాయమూర్తి కూడా అంగీకరించలేదన్నారు. కోర్టులో నేరం రుజువు కాకుండా ఆరోపణలు చేయడం సరికాదని షర్మిల, సునీతకు చైతన్యరెడ్డి హితవు పలికారు. -
దస్తగిరి కుమ్మక్కు డ్రామాలు
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి కట్టుకథ పథకం ప్రకారమే తెరపైకి వచ్చిందని ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనయుడు డాక్టర్ చైతన్యరెడ్డి స్పష్టం చేశారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఆ కట్టుకథను నిజం చేయాలనే కుట్రతో వ్యవహరిస్తున్నారని, సీబీఐ సైతం ఆరోపణలకు తగిన ఆధారాలు సేకరించలేదన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, డాక్టర్ నర్రెడ్డి సునీత ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం పదే పదే వివేకా హత్యను ప్రస్తావిస్తున్నారని చెప్పారు. తన తండ్రి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో పాటు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్రతిష్టకు భంగం వాటిల్లేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. వివేకాను చంపినట్లు నేరం ఒప్పుకున్న దస్తగిరిని సీబీఐ విడిచిపెట్టడం వెనుక తిరకాసు ఉందన్నారు. డాక్టర్ సునీత ఆరోపణలు, సీబీఐ దర్యాప్తులో లోపాలపై సోమవారం కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముందస్తు బెయిల్ లభించాకే అప్రూవర్‌గా.. డ్రైవర్ దస్తగిరి 2021 ఆగస్టు 25న 161 సీఆర్పీసీ స్టేట్మెంట్ ఇవ్వగా ఆగస్టు 31న మేజిస్ట్రేట్ ఎదుట 164 స్టేట్మెంట్ ఇచ్చాడు. దీని ప్రకారం దస్తగిరి స్వయంగా వివేకాను చంపినట్లు ఒప్పుకున్నాడని చైతన్యరెడ్డి గుర్తుచేశారు. అదే ఏడాది అక్టోబర్ 7న ముందస్తు బెయిల్ కోసం దస్తగిరి దరఖాస్తు చేసుకోగా అక్టోబర్ 22న మంజూరైంది. దస్తగిరి బెయిల్‌కు అటు సీబీఐ, ఇటు సునీత ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అప్రూవర్‌ను అరెస్టు చేస్తే కేసు పూర్తయ్యేవరకు బెయిల్ లభించే అవకాశం లేదు కాబట్టి ముందస్తు బెయిల్ లభించిన తర్వాత దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. ఈ వ్యవహారం వెనుక డాక్టర్ నర్రెడ్డి సునీత, అప్పటి సీబీఐ అధికారి రాంసింగ్ ఉన్నారు. అసలు విషయం అక్కడే ఉంది.. వివేకా హత్యకు గురైన ప్రదేశంలో క్లూస్ టీమ్‌కు లభించిన ఆధారాలు, అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్టేట్మెంట్ పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. క్లూస్ టీమ్ ఫొటోల ప్రకారం తలుపుల సేఫ్టీ లాక్, టవర్ బోల్ట్ బద్ధలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దస్తగిరి మాత్రం తన వాంగ్మూలంలో ఎర్ర గంగిరెడ్డి లోపలి నుంచి తలుపు గడియ తీయడంతో తాము ఇంట్లోకి ప్రవేశించామని చెప్పాడు. అది శుద్ధ అబద్ధం. నర్రెడ్డి సునీత దంపతులు తలుపుల లాక్‌లకు మరమ్మతులు చేయించారు. సేప్టీలాక్, టవర్ బోల్ట్ బద్దలైన విషయాన్ని సీబీఐ దృష్టికి తీసుకెళ్లకుండా దాచి పెట్టారు. అక్కడే అసలు విషయం దాగి ఉంది. తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వచ్చాÆý‡న్న విషయం బహిర్గతం అయితే దస్తగిరి కట్టుకథ తేలిపోతుందని జాగ్రత్త పడ్డారు. క్లూస్‌టీమ్ సేకరించిన ఐదు వేలి ముద్రలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులవి కాదు. అవి ఎవరివో ఇప్పటికీ సీబీఐ నిగ్గు తేల్చలేదు. పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వివేకా హత్యకు గురయ్యారు. ఇంట్లో ఉన్న వారే హత్య చేసినట్లు నాడు తేల్చారు. ఇంటి ఉత్తరం వైపు తలుపు నుంచి ముగ్గురు బయటికి వచ్చారని, కొద్ది సేపటికి బయటకు వచి్చన ఎర్రగంగిరెడ్డిని ఏమైందని అడగ్గా కోపంగా తోసేయడంతో కింద పడ్డానని ప్రత్యక్ష సాక్షి రంగన్న చెప్పాడు. దస్తగిరి తూర్పు వైపు ఉన్న మెయిన్ డోర్ గుండా బయటికి వచి్చనట్లు చెబుతుండగా ప్రత్యక్షసాక్షి రంగన్న మాత్రం ఉత్తరం వైపు డోర్ నుంచి వచ్చారని చెబుతూ పరస్పర విరుద్ధంగా వాంగ్మూలాలు ఇచ్చారు. గూగుల్ టేకౌట్ పేరిట దుష్ప్రచారం వైఎస్ వివేకా, వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇళ్ల మధ్య 300 మీటర్లు మాత్రమే దూరం ఉంటుంది. ఒక వర్గం మీడియా హత్యకు ముందు నిందితులంతా వైఎస్ భాస్కరరెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా తెలిసిందంటూ ప్రచారం చేసింది. గూగుల్ టేకౌట్‌కు ప్రామాణికత లేదని సీబీఐనే వెల్లడించింది. ఆ అవసరం ఎవరికి ఉంది? వివేకా హత్య అనంతరం రౌండ్ సీల్ ఉన్న దస్తావేజులు తీసుకెళ్లినట్లు దస్తగిరి చెబుతున్నాడు. రౌండ్ సీళ్లు ఉన్నాయంటే అవి నోటరీ అఫిడవిట్లు లేదా వీలునామా కావచ్చు. బెంగళూరు స్థలానికి చెందిన డాక్యుమెంట్లు అన్నది శుద్ధ అబద్ధమని సీబీఐ దర్యాప్తులో తేలింది. వీలునామా దస్తావేజులు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? దీన్నిబట్టి వివేకా రెండో భార్య షమీమ్, వారసుడు షహెన్షా పేరుతో ఉన్న విల్లును దొంగిలించినట్లు తెలుస్తోంది. అసలు ఎర్ర గంగిరెడ్డి నేరస్తులతో కలిసి లేరని దర్యాప్తు ఆధారంగా రూఢీ అవుతోంది. అంటే దస్తగిరి వాంగ్మూలం అంతా కట్టుకథేనని స్పష్టమవుతోంది. దస్తగిరి అప్రూవర్‌గా మారడం ఒక నాటకమే. ఎర్రగంగిరెడ్డి చెప్పాడని నా తండ్రి శివశంకర్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి పేర్లను కేసులో చేర్చడం పథకంలో భాగమే. ఆ కట్టుకథ ఆధారంగా బాబు, షర్మిల, సునీత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. కోర్టు దర్యాప్తు అధికారిని తప్పించినా కింది స్థాయి సిబ్బందిని అలాగే కొనసాగించడంతో సీబీఐ అసలు హంతకులను వదిలేసి సంబంధం లేని వ్యక్తులపై నిందలు మోపింది. సాక్ష్యాధారాలు సేకరించడంలో విఫలమైంది. -
షర్మిల, సునీత అసత్య ప్రచారాలు మానుకోవాలి: రమేష్ రెడ్డి
సాక్షి, కడప: వివేకా కుమార్తె సునీతను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ రాష్ట అదికార ప్రతినిధి రమేష్ రెడ్డి మండిపడ్డారు. క్రిమినల్ బ్రెయిన్ తో ప్రవర్తించే వ్యక్తి చంద్రబాబని నిప్పులు చెరిగారు. కుంటుంబాల్లో చిచ్చు పెట్టడమే చంద్రబాబు పని అని విమర్శించారు. ఎల్లో మీడియాతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి సాయంతో బురద జల్లిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నాయని రమేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి ఎంపీగా గెలవాలని వివేకానందరెడ్డి కూడా ప్రచారం చేశారన్నారు. అయితే వివేకా కేసును బాబు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎవరిపై కక్ష సాధించేందుకు షర్మిల ఏపీ వచ్చారని ప్రశ్నించారు. షర్మిల, సునీత అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. అవసరం తీరాకా తిట్టడం ‘చంద్రబాబుది నీచ రాజకీయం. వ్యవస్దలను ధ్వంసంచేసి అనుకూలంగా వాడుకునే వ్యక్తి. లక్ష్మీపార్వతిని ఉపయోగించి ఎన్టీఆర్‌ను వెన్నుపొటు పొడవటమే కాకుండా అయన మరణానికి కారకుడై పార్టీని అక్రమించి కుటుంబ పార్టీగా మలచుకున్నాడు. ప్రతిసారి కూటమి ఏర్ఫాటు చెయ్యడం, అవసరం తీరాకా అదే పార్టీలను తిట్టడం అలవాటు. అందుకే నేడు షర్మిల పీసీసీ అద్యక్షురాలైంది. కేసును పక్కదారి పట్టిస్తున్నాడు చంద్రబాబు సృష్టించిన వ్యవస్దల ద్వారా కేసును పక్కదారి పట్టిస్తున్నాడు. కేసు కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వివేకం సినిమాను ఎంతో నీచంగా చిత్రీకరించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని చిన్నప్పటి నుంచి షర్మిల, సునీతలు చూశారు. ఎనాడైనా నేరప్రవర్తన కనపడిందా? స్దానికంగా ఫ్యాక్షన్‌తో సంబంధం ఏమైనా ఉందా? కేవలం వైఎస్ జగన్‌ను ఎదుర్కొనేందుకే షర్మిల, సునీతను పావులుగా వాడుకుంటున్నారు. షర్మిల, సునీత రాజకీయ పోరాటం కోసం వచ్చారా? న్యాయపోరాటం చేసేటప్పుడు రాజకీయ పోరాటం అపాలి. ? లేదంటే తప్పుడు సంకేతాలు పోతాయి’ అని అన్నారు. వివేకా హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్ధాలే వివేకా హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్దాలేనని, దస్తగిరి వాంగ్మూలాన్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి. సీబీఐ వద్ద దస్తగిరి స్టేట్ మెంట్ తప్ప ఏ ఒక్క ఆధారం లేదన్నారు. సునీత దస్తగిరిని అడ్డంపెట్టుకుని ఓ బూటకం ఆడుతుందని మండిపడ్డారు. ఇంటి తలుపులు బద్దలైతే అన్నీ బాగున్నాయని సీబీఐకి చెప్పిందని గుర్తు చేశారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టారనేది విడిచిపెట్టి ఇంట్లో వాళ్లే చంపారని సునీత ప్రస్తావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంపినప్పుడు లెటర్ రాశాడన్నారు, చేతి వేళ్లు నరికితే రక్తపు మరకలు ఉండవా.. అసలు ఎలా రాయగలడు? - దస్తగిరి, రంగన్న చెప్పిన సమాచారం పూర్తి విరుద్ధంగా ఉంది. రెండో భార్య సమీమ్‌కు ఆస్తి గొడవలున్నాయి. ఆస్తి పత్రాలు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంది? దీన్ని కూడా సీబీఐ పట్టుకోలేకపోయింది’ అని చైతన్యరెడ్డి మండిపడ్డారు. -
‘దస్తగిరిని అడ్డంపెట్టుకుని సునీత నాటకమాడుతోంది’
సాక్షి, వైఎస్సార్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత చెప్పేవన్నీ అబద్ధాలేనని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘దస్తగిరి వాంగ్మూలాన్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతుంది. సీబీఐ వద్ద దస్తగిరి స్టేట్మెంట్ తప్ప ఏ ఒక్క ఆధారం లేదు. సునీత దస్తగిరిని అడ్డంపెట్టుకుని ఓ బూటకం ఆడుతుంది. ఇంటి తలుపులు బద్దలైతే అన్నీ బాగున్నాయని సీబీఐకి చెప్పింది. ఇంటి తలుపులు బద్దలు కొట్టారనేది విడిచిపెట్టి ఇంట్లో వాళ్లే చంపారని సునీత ప్రస్తావిస్తోంది. చంపినప్పుడు లెటర్ రాశాడన్నారు, చేతి వేళ్లు నరికితే రక్తపు మరకలు ఉండవా.. అసలు ఎలా రాయగలడు?. దస్తగిరి, రంగన్న చెప్పిన సమాచారం పూర్తి విరుద్ధంగా ఉంది. రెండో భార్య సమీమ్‌కు ఆస్తి గొడవలున్నాయి. ఆస్తి పత్రాలు దొంగిలించాల్సిన అవసరం ఎవరికి ఉంది?. దీన్ని కూడా సీబీఐ పట్టుకోలేకపోయింది’ అని డాక్టర్ చైతన్యరెడ్డి తెలిపారు. -
పథకం ప్రకారమే మాపై దుష్ప్రచారం
సాక్షి ప్రతినిధి, కడప: ‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మొదటి నుంచి పథకం ప్రకారం మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. చిన్న ఆధారం దొరికితే దానిచుట్టూ కట్టుకథ అల్లుతున్నారు. అలాంటి కట్టుకథే ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని జైలుకెళ్లి బెదిరించానని చెప్పడం’.. అని వైఎస్సార్సీపీ నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనయుడు డాక్టర్ దేవిరెడ్డి చైతన్యరెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని శంకర్ ఆసుపత్రిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను జైలుకెళ్లి దస్తగిరిని బెదిరించానని, రూ.20 కోట్లు ఆఫర్ ఇచ్చామని చెబుతున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవంలేదన్నారు. కడప సెంట్రల్ జైలులో మెడికల్ క్యాంపు నవంబరులో నిర్వహించారని.. అది అంతకు మూడు నెలల ముందు ఖరారైందన్నారు. క్యాంపు ప్రారంభం నుంచి జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, పది మంది జైలు అధికారులు తమతోనే ఉన్నారని, సహచర వైద్యులు ఖైదీల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని చికిత్స అందించాక తాము బయటికి వచ్చేశామన్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ఓ పెద్ద కట్టుకథ అల్లారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సెంట్రల్ జైలులో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. జైలు అధికారులు ఉంటారు.. అంత పటిష్ట రక్షణ ఉన్న ప్రాంతంలోకి బుద్ధి ఉన్నవారు ఎవరైనా వెళ్లి బెదిరిస్తారా? అలాచేస్తే రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోరా? వెంటనే ఫిర్యాదుచేస్తే సీసీ ఫుటేజీ అధారంగా చర్యలు తీసుకుంటారు కదా.. నేను నిజంగానే బెదిరించి ఉంటే దస్తగిరి అప్పుడే జైలు అధికారులకుగానీ, జిల్లా లీగల్ సెల్ అథారిటీ వారికిగానీ, ఎందుకు ఫిర్యాదు చేయలేదు? రిమాండ్ ఖైదీగా పలుమార్లు కోర్టుకు హాజరైన దస్తగిరి న్యాయమూర్తులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? మూడునెలల తర్వాత మీడియా ముందుకు రావడమేమిటి? ఇంకొన్నినెలలు గడిస్తే సీసీ ఫుటేజీ దొరకదని పక్కా క్రిమినల్ మైండ్‌తో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. బెయిల్ పిటిషన్ వేయగానే.. ఇక ఈ దుష్ప్రచారం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. మా నాన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ వేయగానే తెరపైకి కట్టుకథలు వస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే సీబీఐ అధికారి డ్రైవర్‌ను బెదిరించినట్లు కుట్ర చేశారు. పోలీసు అధికారులు విచారిస్తే అలాంటి ఘటన ఎక్కడా చోటుచేసుకోలేదన్నారు. ప్రస్తుతం హైకోర్టులో బెయిల్ పిటిషన్ నడుస్తున్నందున దాన్ని అడ్డుకోవడానికే ఇలా కొత్త కారణాలు సృష్టిస్తున్నారు. దస్తగిరి ఏదో ఒక ఆరోపణ చేయడం, ఆ వెంటనే నర్రెడ్డి సునీత కోర్టులో అఫిడవిట్ వేయడం క్రమం తప్పకుండా జరుగుతోంది. నర్రెడ్డి సునీత డైరెక్షన్లో అప్రూవర్ దస్తగిరి యాక్షన్ చేస్తున్నాడు. ఏకంగా ఎంపీ, సీఎం స్థాయి వారిని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడంటే అతని దురుద్దేశం అర్థమవుతోంది కదా. అప్రూవర్‌గా మారడమే వింత.. నిజానికి.. నేరానికి పాల్పడిన వ్యక్తి అప్రూవర్‌గా మారడం భారత న్యాయవ్యవస్థలో తొలిసారి ఈ కేసులోనే చోటుచేసుకుంది. తాను చేసింది తప్పు అని పశ్చాత్తాపం పడినప్పుడే ఒక వ్యక్తి అప్రూవర్‌గా మారతాడు. కానీ, కేసులో తనకెలాంటి సంబంధంలేదని దస్తగిరి ముందే ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేశాడు. అందుకు నర్రెడ్డి సునీతగానీ, సీబీఐ వారుగానీ అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్ వచ్చిన వెంటనే దస్తగిరి అప్రూవర్‌గా మారిపోయాడు. కానీ, వాస్తవాలు పరిశీలిస్తే.. అంతకుముందు ఆగస్టులోనే వివేకానందరెడ్డిని నరికి చంపామని మీడియాతో దస్తగిరి మాట్లాడుతాడు.. ముందస్తు బెయిల్ పిటిషన్లో తనకేమి తెలీదని కోర్టుకు చెబుతాడు.. అయినప్పటికీ నర్రెడ్డి సునీత అభ్యంతరం చెప్పరు. దీన్నిబట్టి.. సీబీఐ, సునీత, దస్తగిరి మధ్య కుదిరిన ఒప్పందం మేరకే ఆరోపణలు చేస్తున్నారని అర్థమవుతోంది. హత్యచేసిన వ్యక్తి అప్రూవర్‌గా మారడం సరైంది కాదని మేం పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు సైతం అంగీకరించింది. కరెక్ట్ పర్సన్ వచ్చి ఈ పిటిషన్ వేయాలని జడ్జి అభిప్రాయపడ్డారు. సునీత, దస్తగిరి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కావడంవల్లే దానిని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంలేదు. ఇంత ఘోరంగా ఈ హత్య కేసులో నర్రెడ్డి సునీత, దస్తగిరి కుమ్మకై వ్యవహరిస్తున్నారు. రంగన్న ప్రత్యక్ష సాక్షిగా ఉన్నా.. ఇక వాచ్‌మన్ రంగన్న ప్రత్యక్ష సాక్షిగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నలుగురిని గుర్తుపట్టి వారి పేర్లు చెప్పాడు. అయినప్పటికీ నలుగురిలో ఒకరిని అప్రూవర్‌గా తీసుకొస్తారు. ఇదంతా ప్రణాళికబద్ధంగా చేస్తున్నారని ఇట్టే అర్థమవుతుంది. హత్యలో స్వయంగా పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకెళ్తే సీబీఐ నో అబ్జెక్షన్ చెబుతోంది. కోర్టులో ఎవరు బెయిల్ పిటిషన్ వేసినా ఇంప్లీడ్ అయ్యే నర్రెడ్డి సునీత, దస్తగిరి ముందస్తు బెయిల్పట్ల మౌనం వహిస్తుంది. అప్రూవర్ ముసుగులో అత్యున్నతస్థాయి కోర్టును కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవాలకు మసిబూసి..మరోవైపు.. ఘటన స్థలంలో లెటర్ ఉందని పీఏ కృష్ణారెడ్డి చదివి వినిపిస్తే దాచిపెట్టమని వారే చెబుతారు. రక్తగాయాలు ఉన్నాయని చెప్పినా, హార్ట్ అటాక్ కారణంగా కింద పడినప్పుడు దెబ్బలు తగిలి ఉంటాయని ఊహించామని ఆమె చెబుతోంది. అసలు హార్ట్అటాక్ అనే ప్రచారం నర్రెడ్డి సునీత కుటుంబం నుంచే మొదలైంది. అలాగే, వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి మొదట మీడియా ముందుకొచ్చి చెబుతారు. మరోవైపు.. హత్యచేసిన వ్యక్తులు పరారీ కాకుండా డాక్యుమెంట్ల కోసం వెతికామని దస్తగిరి స్వయంగా వెల్లడించాడు. వీటన్నింటినీ నిగ్గు తేల్చాల్సిందిగా నర్రెడ్డి సునీత కోరకపోవడంలోనే అసలు కుట్ర దాగి ఉంది. చివరి ఛార్జిషీట్ దాఖలుచేసి ఏడు నెలలవుతున్నా.. ఈ కేసు చివరి ఛార్జీషీట్ దాఖలుచేసి ఏడు నెలలవుతోంది. మోస్ట్ ఎఫెక్టెడ్గా ఉన్న మా కుటుంబం ఏనాడు మీడియా ముందుకురాలేదు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ కోర్టులో ఉండగా, కొత్తగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టే రావాల్సి వచ్చింది. మరోవైపు.. నర్రెడ్డి సునీత గూగుల్ టేకౌట్ గురించి, ఎంపీ వాట్సాప్ గురించి చెబుతోంది. నెట్ ఆన్‌లో ఉంటే వాట్సాప్ ఆటోమేటిక్‌గా యాక్టివ్‌గా ఉంటుంది కదా.. ముందు గూగుల్ టేకౌట్ పేరుతో మభ్యపెడుతూ వచ్చారు. తర్వాత పొరపాటు పడ్డామని స్వయంగా సీబీఐ కోర్టుకు విన్నవించారు. గూగుల్ టేకౌట్ అనేది కిలోమీటర్ పరిధిలో ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించి దుష్ప్రచారం చేశారు. ఎంపీ కాకముందు, రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి, మా నాన్న ఇద్దరూ ప్రతిరోజు కలిసి తిరగడమే కాక నిత్యం ఫోన్లో టచ్‌లో ఉంటారు. ఆ రోజు మాత్రమే ఫోన్లో మాట్లాడినట్లు చెప్పుకొస్తున్నారు. అసలు.. వివేకా హత్యతో అవినాష్‌రెడ్డి కుటుంబానికి, మా కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదు. కాకపోతే పథకం ప్రకారం పన్నిన కుట్రలో ఇరుక్కున్నాం. చెయ్యని తప్పుకు మా నాన్న జైల్లో ఉన్నారు. -
ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి.. తెలంగాణ క్యాడర్‌కు చైతన్యరెడ్డి
నూతనకల్: నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బొక్క చైతన్యరెడ్డి తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యారు. బొక్క సంజీవరెడ్డి–వినోద దంపతుల కుమార్తె చైతన్యరెడ్డి 2022లో ప్రకటించిన యూపీఎస్సీ పరీక్షలో 161ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికై న విషయం విదితమే. హైదరాబాద్‌లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. తండ్రి జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్‌గా వరంగల్‌లో పనిచేస్తుండడంతో అక్కడే స్థిరపడ్డారు. చైతన్యరెడ్డి వరంగల్‌లోని ఎన్ఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. నీటిపారుదల శాఖలో ఏఈగా విధులు నిర్తహిస్తూనే సివిల్స్ వైపు దృష్టిసారించారు. ఆరు సార్లు ప్రయత్నించి విఫలమైనా పట్టువదల కుండా ఆత్మవిశ్వాసంతో ఏడో ప్రయత్నంలో అనుకున్న లక్ష్యం సాధించారు.సొంత రాష్ట్రం క్యాడర్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉందని చైతన్యరెడ్డి అన్నారు. స్వరాష్ట్ర ప్రజలకు సేవలు అందించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. -
" ఐటీకి ఏమైంది ".. సీనియర్ HR ప్రొఫెషనల్ చైతన్య రెడ్డి తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
అభిరత్, చైతన్య సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ సౌత్‌జోన్ పురుషుల అండర్–23 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు బోణీ చేసింది. తొలి మ్యాచ్‌లో కేరళ చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్... రెండో మ్యాచ్‌లో గోవాపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. చెన్నైలోని ఎంఆర్ఎఫ్ పచియప్పస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ అభిరత్ రెడ్డి (97 బంతుల్లో 110 నాటౌట్; 14 ఫోర్లు, ఒక సిక్స్) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా, పీఎస్ చైతన్య రెడ్డి (73 బంతుల్లో 101; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడైన శతకంతో కదం తొక్కాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గోవా 49.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. సుయశ్ ప్రభు దేశాయ్ (102 బంతుల్లో 92; 9 ఫోర్లు, ఒక సిక్స్) కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. వీజీ కహ్లాన్ (81 బంతుల్లో 60; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 118 పరుగుల్ని జోడించి జట్టుకు ఓ మోస్తరు స్కోరును అందించారు. హైదరాబాద్ బౌలర్లలో టి. రవితేజ 3 వికెట్లు దక్కించుకున్నాడు. కార్తికేయ, వై. శ్రవణ్ కుమార్, తనయ్ త్యాగరాజన్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం హైదరాబాద్ 254 పరుగుల లక్ష్యాన్ని 34.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిరత్ రెడ్డి, చైతన్య రెడ్డి బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 163 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ బుద్ధి (15), ఎ. వరుణ్ గౌడ్ (22 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. గోవా బౌలర్లలో ఫెలిక్స్, వీఏ నాయక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో హైదరాబాద్ ఖాతాలో 4 పాయింట్లు చేరాయి. బుధవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో కర్ణాటకతో హైదరాబాద్ తలపడుతుంది. -
ప్రకృతిని పలకరిస్తూ!
విభిన్నం ఈ లోకంతో సంబంధం లేనట్లుగా, నాలుగు గోడల మధ్య ఇరుకిరుకుగా వ్యాయమాలు చేస్తుంటాం. ఇలా కాకుండా కాస్త కొత్తగా ఆలోచించాడు హైదరాబాద్‌కు చెందిన చైతన్యరెడ్డి. హైదరాబాద్ రగ్బీ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న చైతన్య సరికొత్త ‘ఫిట్నెస్ ఫిలాసఫీని’ కనిపెట్టాడు. ‘‘వ్యాయామం అంటే నాలుగు గోడల మధ్య, కృత్రిమ వాతావరణం మధ్య చేసేది కాదు. విశాలమైన ప్రకృతిని చూస్తూ, దాంట్లో మమేకం అవుతూ చేసేది’’ అంటుంది ఆయన ఫిలాసఫీ. విశేషం ఏమిటంటే, వ్యాయామానికి ఉపయోగించే సంప్రదాయ పరికరాలు ఆయన దగ్గర సరికొత్త రూపంలో, అంటే చెట్ల మొద్దుల రూపంలో కనిపిస్తుంటాయి. వెయిట్ ట్రైనింగ్‌ను చెట్ల దుంగలతో చేస్తున్నాడు చైతన్య. ప్రకృతి మధ్య చేసే ఈ వ్యాయామానికి ‘మోవంట్’ అని పేరు పెట్టాడు చైతన్య. ‘మోవంట్’ గురించి వివరించడానికి యూట్యూబ్‌లో ఛానల్ కూడా ప్రారంభించాడు. ‘‘సహజమైన పద్ధతిలో శారీరకదృఢత్వాన్ని కాపాడుకోవడమే మోవంట్’’ అంటున్న చైతన్య వ్యాయామాన్ని ‘వ్యాయామశాల’ నుంచి ప్రకృతిమధ్యకు తీసుకువెళ్లే పనిలో ఉన్నాడు. ‘‘ఏసీలు, కృత్రిమ వెలుగులు, క్యూబికల్‌లు మనకు సహజమైపోయాయి. నిజానికవి అసహజమైనవి. యోగాను స్టూడియోలలో, నాలుగు గోడల మధ్య చేయడం లేదనే విషయాన్ని గ్రహించాలి’’ అంటున్నాడు చైతన్య. మనకున్న బిజీ షెడ్యూల్లో రోజూ ప్రకృతి మధ్య వ్యాయామం కుదరకపోయినా, వారానికి కనీసం రెండుసార్లయినా చేయాలని, ప్రకృతికి దగ్గర కావాలని సూచిస్తున్నాడు చైతన్య. -
హైదరాబాద్ 562/6
సాక్షి, హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌తో జరుగుతున్న కూచ్ బెహర్ ట్రోఫీలో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. చైతన్య రెడ్డి (239 బంతుల్లో 181; 24 ఫోర్లు, 3 సిక్సర్లు), తన్మయ్ అగర్వాల్ (217 బంతుల్లో 106; 19 ఫోర్లు), అనిరుధ్ (233 బంతుల్లో 136; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో జింఖానాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మంగళవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 149 ఓవర్లలో 6 వికెట్లకు 562 పరుగులు చేసింది. ప్రణీత్ రెడ్డి (130 బంతుల్లో 71 బ్యాటింగ్; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా షాట్లు ఆడారు.