సాక్షి, హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌తో జరుగుతున్న కూచ్ బెహర్ ట్రోఫీలో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. చైతన్య రెడ్డి (239 బంతుల్లో 181; 24 ఫోర్లు, 3 సిక్సర్లు), తన్మయ్ అగర్వాల్ (217 బంతుల్లో 106; 19 ఫోర్లు), అనిరుధ్ (233 బంతుల్లో 136; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో జింఖానాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మంగళవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 149 ఓవర్లలో 6 వికెట్లకు 562 పరుగులు చేసింది.
ప్రణీత్ రెడ్డి (130 బంతుల్లో 71 బ్యాటింగ్; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా షాట్లు ఆడారు.
హైదరాబాద్ 562/6
Published Wed, Dec 11 2013 12:33 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement